అరుణాచల యాత్ర ( అష్ట లింగాల దర్శనం ) //
HTML-код
- Опубликовано: 5 фев 2025
- అరుణాచలం లేదా " తిరువన్నమలై ఈ క్షేత్రం " తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ - ఎర్రని, అచలం - కొండ. ఎర్రని కొండ అని అర్థము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని తాత్పర్యము. తమిళంలో "తిరువణ్ణామలై" అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తినొసగే క్షేత్రం. ఈ అరుణాచల క్షేత్రం. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే ఊరు నిర్మింపబడినదనీ పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణంలో తెలియజేయబడింది. ఇది తేజోలింగం గనుక అగ్ని క్షేత్రమంటారు.
ఈ అరుణాచల కొండ చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదేపదే తెలపడంతో ఈ అరుణాచలం మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ అరుణగిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తే మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణవల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరిప్రదక్షణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కి.మీ. దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరిప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది..... మరిన్ని వీడియోల కోసం శ్రీకరం చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి... మీకు తెలిసిన ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయ వివరాలు సంబంధిత ఫోన్ నెంబర్లు మాకు తెలియజేస్తే ఆ దేవాలయ స్థల పురాణాన్ని కూడా స్వీకరించానల్లో చిత్రీకరించబడుతుంది... మీ సహకారాన్ని ఎల్లవేళల కోరుతూ మీ శ్రీకరం ఛానల్ డివోషనల్... ఫోన్ నెంబర్ 9849298297 #arunachalamadhavi
#tirupatibalajialipirisrivarimettu
#chaganti
#garikapatinarasimharao
#ramanamaharshi #thiruvannamalaitemplelive
#arunachalasiva
#chagantikoteswararao
#sivasongs
#lordshiva
#teluguvideos
#telugu
#devotional
#like
#arunachalam
#giripradakshina
#telugusongs
#trending
#trending_arunachalam
#arunachalam #arunachalamtemple #arunachalashiva #tiruvannamalai #tiruvannamalaiarunachalamtemplelive #pournami #tamilnadu #girivalam #giripradakshina #kpchakrala #oldtemple #ancienttemples #ancienthistory #tamilanadutemples #touristplaces
Supar.ana❤
అరుణాచలం వెళ్లి దర్శనం చేసుకున్నంత అనుభూతి కలుగుతుంది పంతులు 🙏🙏🙏
Thank you very much
Tq సోయే much
Om namah Shivay
Tq
అరుణాచలం అరుణాచలం అరుణాచలం అరుణాచలం అరుణాచలం 🙏🙏
Super Ramanakar Anna. సర్వత్ర విజయోస్తు.
Tq soo much
Ramanaker brother meeru chaala manchiga vivarinchi cheparu 🙏🙏 nenu kuda vellanu
Om Arunachal shivaya namha
Tq సో much
Sir great effort. Thank you🙏🙏🙏
Tq medam
👌రమణ
Tq
Om arunachalya namah
🙏🙏🙏🙏
అరుణాచలం అరుణాచలం🙏🙏😊
Anna super💐💐 కళ్ళకు కట్టినట్టు మేమే దర్శనం చేసుకొన్నట్టు చుపించినవ్ 🙏🙏🙏
Tq anna
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 🙏
Hu
Arunchala siva
🙏🙏🙏🙏