Suvaarta Manjari (సువార్త మంజరి) | Lyrical Song - 158 | Christmas spl | Singer : Brinda
HTML-код
- Опубликовано: 29 дек 2024
- జ్ఞానవాహిని శ్రోతలకు, వీక్షకులకు క్రిస్మస్ సందర్భముగా శుభాకాంక్షలు.
బైబిలు గ్రంథము పూర్తి అరవై ఆరు (66) పాఠములుగా ఉండగా, అందులో 39 పాఠములు పాత నిబంధన గ్రంథముగా, 27 పాఠములు క్రొత్త నిబంధన గ్రంథముగానూ చెప్పబడుచున్నవి. అయితే ఇక్కడ ముఖ్యముగా గమనించవల్సినది ఏమనగా, క్రొత్త నిబంధనలోని మొదటి నాలుగు పాఠములు "సువార్త" అను ప్రత్యేకమైన పేరు కలిగియుండి, అవి ఏసు జీవితములో మాత్రము చెప్పబడిన జ్ఞానమును బోధించుచున్నవి.
సువార్తలుగా పేరులేని 62 పాఠములలో దేవుని జ్ఞానమే ఉన్నా, అది మనుషుల చేతగానీ, దేవదూతల చేతగానీ చెప్పబడిన జ్ఞానముగాయున్నది. కేవలము, నాలుగు (మత్తయి, మార్కు, లూకా, యోహాను) సువార్త పాఠములలో మాత్రమే స్వయముగా ఏసు చెప్పిన మాటలు కలవు. కనుక అవి ప్రత్యేకమైనవి.
పరిశుద్ధాత్మ ధరించిన "ఏసుక్రీస్తు వారి జీవితము" వలన ఈ ధరణిపై కాలము...క్రీస్తుపూర్వము, క్రీస్తు, క్రీస్తుశకము... అను మూడు భాగములుగా మారియున్నది.
ఏసు ప్రత్యక్షముగా జ్ఞానబోధచేసిన ఆ "క్రీస్తుకాలము" ఎలా ప్రత్యేకమో, అలాగే బైబిలులోని మూడు భాగములలో సువార్తలే ప్రత్యేకము. కావున సర్వులూ సువార్తయే ముఖ్యముగా చదివి ఆచరించవలెను.
ఈ సువార్త ఎవరికి తెలియబడుతుంది అని కూడా నిగూఢముగానే చెప్పబడియున్నది:
ఉదాహరణకు: మత్తయి సువార్త, 9వ అధ్యాయము, 12, 13వ వచనములను గమనించిన యెడల...
(12) రోగులకేగానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర లేదు కదా!
(13) నేను పాపులను పిలువ వచ్చితిని గానీ నీతివంతులను పిలువ రాలేదు.
దేవుడు భూమిమీదికి అప్పుడప్పుడు ధర్మసంస్థాపన కొరకై వచ్చి తన సువార్తను తెలియచేయును. పాపులు అనగా ఇక్కడ జ్ఞానము తెలియని అజ్ఞానులని అర్థము చేసుకోవలెను. అలాగే నీతివంతులు అనగా జ్ఞానము తెలిసినవారని అర్థము. అజ్ఞానము అను అనారోగ్యము గల వారికి మాత్రమే జ్ఞానము అను మందు ఇచ్చి వాని రోగమును పోగొట్టుటకు దేవుడు బోధకుడు అను వైద్యుని రూపములో భూమిమీదికి వచ్చి అజ్ఞాన రోగమును లేకుండా చేయును. ముందే "మేము జ్ఞానులము" అను "అహము" కలిగియున్నవారికి తాను బోధచేయడు.
తమకు అజ్ఞానమనే రోగము వ్యాపించియున్నదని గ్రహించు మనుషులందరూ రోగులయినప్పుడు, దేవుడు భూమిమీదకి అట్టి వారికోసమే అవతరించి తన ధర్మములను మందునిచ్చి అజ్ఞానులుగాయున్న వారిని జ్ఞానులుగా మార్చివేయును. దేవుడు వైద్యునిగా అవతరించకపోతే లోకమంతా అజ్ఞానమను అనారోగ్యమై పోవును. అందువలన దేవుడు అవతరించి తన జ్ఞానమును అట్టి అజ్ఞానులకు తెల్పును.
దైవసువార్తను గ్రహించగల్గు అట్టివారెవరనగా...
గ్రుడ్డివారు: అనగా, ప్రాపంచికముగా చూపు లేక దైవిక చూపుయే కావాలనుకునేవారు
చెవిటివారు : అనగా, పాంచభౌతిక విషయములు వినక, దైవ జ్ఞానమునే వినాలనుకునే వారు
కుంటివారు: అనగా తాము గుణములనే కుంటులో ఇక ఉండవద్దు అనుకునేవారు
కుష్టురోగులు: అనగా తాము ఇక కర్మలనే రోగములో ఉండవద్దు అనుకునేవారు
బీదవారు: అనగా తమను తాము అజ్ఞానులమని గ్రహించి జ్ఞాన ధనముకై గురువును వేడుకొనే వారు
సర్వ లోకముల వారు: అనగా తాము తామస, రాజస, సాత్విక అను గుణాలోకములలో మునిగి బాధపడుతున్నామని తెలిసి, ఆత్మలోకమును కోరువారు
కర్మయనే పాపములో, మాయయనే రోగమును అనుభవిస్తున్న మాకు, తన ధర్మమనే జ్ఞానముతో, త్రైతమనే యోగమును ముందుగా అందించ వెలసిన... అదరణకర్తయైన "మా ఆనంద గురువుకు" ఇవే మా ఆత్మపూర్వక వందనములు.
విశేషము:
డిసెంబర్ 25 - సువార్త ప్రకటన చేయు ప్రభు అవతరణ దినము
ఖమ్మం లో (సువార్త మంజరి గా) విడుదల 9:30 PM
TEAM:
Lyricist - Siva Krishna Kogili
Singer - Brinda
Music - Nagesh
Video Composition - Saleem
Production & Presented By - Gnanavaahini Channel
సాకీ:
సువార్త మంజరీ .. సువార్త మంజరీ
ఆత్మ జ్ఞాన సెలయేరై ... పారేటి ... జీవ జల ఝరి
సువార్త మంజరీ .. సువార్త మంజరీ
గురు గాన జలధారై ... ఊరేటి ... త్రైత జ్ఞాన లాహిరి ... ప్రభు ప్రాణ ప్రసారి
సువార్త మంజరీ .. సువార్త మంజరీ
పల్లవి:
సువార్త మంజరీ .. సువార్త మంజరీ
జ్ఞానుల ఆర్తిని తీర్చే ... జీవ జల ఝరి
సువార్త మంజరీ .. సువార్త మంజరీ
త్రైతుల భక్తిని చాటే .. దైవ నిల ధరి
సువార్త మంజరీ .. సువార్త మంజరీ
ప్రభు పదముల ప్రవచించే ... జ్ఞాన లాహిరి ...
గురు గురుతును చూపించే ... నిజ గ్రంథ ప్రసారి
సువార్త మంజరీ .. సువార్త మంజరీ
జ్ఞానుల ఆర్తిని తీర్చే ... జీవ జల ఝరి
సువార్త మంజరీ .. సువార్త మంజరీ ...
చ1:
ఆదియందు ఆకాశము అందించినదీ వాణి ... ఆత్మజ్ఞాన ప్రబోధమై పుట్టెను ధరణి
ఆదికర్త ఆజ్ఞలనే అవని చేర్చి ఆ వేణి ... త్రైతజ్ఞాన సువార్తయై నిలిచె జీవని
జీవుని జన్మల బాటను నశము చేయబూని .. దేవుని రాజ్యము చాటే ధర్మమా ధ్వని
గుణముల బంధము ద్రుంచే గానమందుకోని... గురు నిబంధనాన్ని దెల్పు జ్ఞానవాహిని
అజ్ఞాన తరములనే అంతమొందగా జేసి ... సుజ్ఞాన తరంగముల పంచు సారిణి
ప్రభు ఏసు వార్తలతో పరమునందగాజేసి ... శుభమైన రక్తమునే చిందు శ్రావణి
సత్యాన్ని చూపేటి సాక్ష్యరూపిణి ... మార్గాన్ని చేర్చేటి మోక్షదాయిని ... విమోక్షప్రదాయిని ...
సువార్త మంజరీ .. సువార్త మంజరీ
జ్ఞానుల ఆర్తిని తీర్చే ... జీవ జల ఝరి
సువార్త మంజరీ .. సువార్త మంజరీ
త్రైతుల భక్తిని చాటే .. దైవ నిల ధరి
సువార్త మంజరీ .. సువార్త మంజరీ
చ2:
అంధులైనవారియందు వెలుగు నింపునీ గీత ... చెవిటివారి చెవుల చేరి చెలగు సువార్త
వ్యాధిగ్రస్తులైన వారి రోగమణచు నీ వాత ... బీదవారి బాధ దీర్చు దివ్య ప్రబోధ
కర్మల తీర్పును మార్చి రాసి తిరుగువ్రాత ... ధర్మపు దీపము పంచే జ్ఞాన ప్రదాత
మందిరమందున చేరిన సమాజమునకంతా ... ఇందూబోధగ చాటే రాజ్య సువార్త
తన సప్త నాడులలో ఘన చైతన్యము చేత ... ప్రబలముగా ప్రవచించే వాక్యపు మోత
తన గుప్త గ్రంథులలో ప్రేరణ పంతము చేత ... అంతముకై రచియించే సంచల రాత
ద్వాపరమున ధ్వనియించిన ఈ గురుగీత ... త్రైతముగా తిరిగొచ్చిన శ్రీ ప్రభురాత... ఇది ఆ దైవ సువార్త
సువార్త మంజరీ/2
జ్ఞానుల ఆర్తిని తీర్చే ... జీవ జల ఝరి
సువార్త మంజరీ/2
త్రైతుల భక్తిని చాటే .. దైవ నిల ధరి
సువార్త మంజరీ/2
ప్రభు పదముల ప్రవచించే ... జ్ఞాన లాహిరి ...
గురు గురుతును చూపించే ... నిజ గ్రంథ ప్రసారి ..
సువార్త మంజరీ/4a