Dhanyathalu (ధన్యములైనవి ప్రభువా !!) | Video Lyrical Song - 156 | Margasira Pournami & Christmas Spl

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025
  • TEAM:
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Nandini chaitanya
    Composed by : Nandini chaitanya
    Keys and arranged by : Rex prakash,N.R.Chaitanya kumar
    Mix and Master by ; Rex prakash hyd
    Strings; Chennai strings
    Solo violin: Balaji Chennai
    Flute : Ramesh Chennai
    Bass : Rex
    Chorus: Gayathri, Manjula, Raji, Saradha
    Recording at: Sound Town Studio's Chennai, Chaitanya studio's,
    Dop,Editing - Uday, Cherry, Chaitanya studio's
    thraithashakam...
    thraithashakam...
    thraithashakam...
    మత్తయి సువార్తయందు 5వ అధ్యాయములో ప్రభువువారు "ధన్యతలు" గూర్చి తెలిపియున్నారు. కానీ, అక్కడ "ఎవరు ధన్యులగుదురో యని" నిగూఢముగా చెప్పియున్న జ్ఞాన సమాచారము మతాభిమానము, మాయాభిమానము కలిగియున్న వారికి సరిగా అర్థము కాలేదనియే చెప్పవచ్చును.
    అక్కడ ప్రభువువారు తన ముఖతా ప్రకటించిన ప్రతి వాక్యము "జ్ఞానములో ధన్యతను" గూర్చి చెప్పినదేనని తెలియవలెను. బిల్ అనగా ధనము కాగా, ద్వితీయ దైవగ్రంథమైన "సువార్త బైబిల్" లో ఆత్మజ్ఞాన ధనమును గూర్చియే చెప్పియున్నారు, కానీ ప్రాపంచిక ధనమును గూర్చి ఏమాత్రమూ చెప్పలేదు. అట్టి దైవజ్ఞానము కొరకే ఆరాతీయుటే "ఆరాధన", అట్టి ప్రత్యేకమైన గురుజ్ఞానమును అర్థించుటయే "ప్రార్థన". ఆ పరిశుద్ధమైన ధనమును కోరుకొనువారే నిజమైన "ధన్యులు".
    "ధన్యత" అన్న పదమును విడదీసిన యెడల , "ధన+యత" అని చెప్పవచ్చును. ధనముకొరకు పడు యాతనయే ధన్యత యగును. నిజమైన ధనము "దేవుని జ్ఞానమే" కావున అట్టి జ్ఞానము కొరకు "యాతన"పడుటయే నిజమైన ధన్యత.
    గురుజ్ఞాన మార్గములో ప్రయాణించు శిష్యునిపై త్రిగుణాత్మకమైన మాయ లేక సాతాను సంధించు, ఘోరమైన శ్రమలకు ఓర్చి, ప్రభువు ఆచరించి అందించిన జ్ఞానపథములో తన సిలువను తాను ఎత్తుకొని ఆ ప్రభువునే వెంబడించువాడు తప్పక "ధన్యుడే"యగును. అట్టి ధన్యుని ఆదరించుటకై సాక్షాత్ ఆ ప్రభువే, ఆదర్శకర్తయై తప్పక ఆ భక్తునికి దర్శనమిచ్చును, సాక్షాత్ ఆ గురువే ఆదరణకర్తయై తప్పక తన వాణిని ఆ శిష్యునికి వినిపించును.
    సంపూర్ణ ధర్మ సంస్థాపనకై ... నేటి త్రైతశకమున, ప్రభువు యొక్క రెండవ రాకడగా అవతరించి, మమ్ములను తన త్రైత జ్ఞానముతో ఆదరించి ధన్యులను చేసిన ... మా "ఆనంద గురువుకు" ఇవే మా సజీవమైన సంసమాధి స్థాపనలు.
    ప్రభువు మాటలు అందరిలో వ్యాపించాలి ... ప్రభువు నిజమైన దేవునిగా తెలియాలి ...!
    పరలోక తండ్రి ప్రభువుగా కనిపించిపోయాడు ... పరలోక తండ్రి ఆదరణకర్తగా కనిపించపోతున్నాడు ...!
    విశేషము:
    -------
    మృగశిర నక్షత్రం - శిరములో శ్రమలు కల్గించు ప్రభావళికి గుర్తు
    మార్గశిర పౌర్ణమి - శిరములోనికి మార్గమైన శిలువను అధీష్టించుటకు గుర్తు
    ఆదివారం - జీవ సమాధినుండి పునర్జీవమైన రోజు
    LYRICS:
    ------
    సాకీ:
    ధన్యోస్మి ... ధన్యోస్మి ... ప్రభు యేసు వార్తకు ...ధన్యోస్మి
    ధన్యోస్మి ... ధన్యోస్మి ... గురు యేసు గుర్తుకు ...ధన్యోస్మి
    ధన్యోస్మి ... ధన్యోస్మి ... ప్రబోధ భర్తకు ధన్యోస్మి ... ఆదరణ కర్తకు ... ధన్యోస్మి... ధన్యోస్మి ...ధన్యోస్మి
    పల్లవి:
    ధన్యములైనవి ప్రభువా! ధన్యములైనవి ప్రభువా! ... మా కన్నులు నినుగని కలవరించగా..
    ధన్యములైనవి ప్రభువా! ... మా వీనులు నినువిని వెంబడించగా.. ధన్యములైనవి ప్రభువా!
    గతమున ఎందరో నీతిమంతులు నిను వెతికిరిగానీ ... కనకపోయిరి
    మతమున మునిగి ప్రవక్తలెందరో నిను.. మతియే మారగ ... వినకపోయిరి
    మాదే భాగ్యమో... ఇదియే యోగ్యమో ... నీ శిరమును కన్నాము ... నీ స్వరమును విన్నాము ... ధన్యజీవులము మేమైనాము ... ధన్యజీవులము మేమైనాము ...
    ధన్యములైనవి ప్రభువా! ... మా కన్నుల నినుగని కలవరించగా..
    ధన్యములైనవి ప్రభువా! ... మా వీనుల నినువిని వెంబడించగా..
    మా వీనులు నినువిని వెంబడించగా… ధన్యములైనవి ప్రభువా !
    చరణం 1:
    ఆత్మప్రాప్తికై ఆర్తితో అడిగెడు ... దీనజీవులిక ధన్యులుగా
    సత్తుకోసమై స్వార్ధమునెరిగిన ... సాత్వికాత్ములిక ధన్యులుగా
    ఏ పుణ్యపాపములో వంతు కోరక ... పురుషార్థములు కోరు ధన్యాత్ములే
    ఏ అన్యవిషయముకై చింతచేయక ... ఆత్మార్థమరయును ధన్యాత్ములే
    కని జ్ఞాన సారమ్ము ప్రభు కార్యమే చేయగా ... కనికరమునొందేను ఆ ధన్యులే
    విని త్రైత జ్ఞానమ్ము గురు యోగమే చేయగా ... వినియోగమయ్యేను ఆ ధన్యులే ... సద్వినియోగమయ్యేను ఆ జన్మలే
    ధన్యములైనవి ప్రభువా!... మా కన్నులు నినుగని కలవరించగా..
    ధన్యములైనవి ప్రభువా! ... మా వీనులు నినువిని వెంబడించగా.. ధన్యములైనవి ప్రభువా!
    చరణం 2:
    బుద్ధిశ్రద్ధతో బోధను వినియెడి ... బుద్ధిమంతులిక ధన్యులుగా
    హృదయశుద్ధితో దేవుని కనియెడి... జ్ఞానవంతులిక ధన్యులుగా
    పరిప్రశ్నలకు మారుగ బదులుపొందగ ... ప్రభు పుత్రులుగ మారు ధన్యాత్ములే
    అరిహింసలకు జారక బెదురువీడగ... గురు పాత్రులగు వారు ధన్యాత్ములే
    సాతాను సంశోధనే ఓర్చి పయనించగా... ఓదార్పునొందేను ఆ ధన్యులే
    ఆకర్త సద్బోధనే నేర్చి వరియించగా ... ఆదరణ పొందేను ఆ ధన్యులే ... మహాదరణ పొందేను ఆ జన్మలే
    ధన్యములైనవి ప్రభువా! ధన్యములైనవి ప్రభువా! ... మా కన్నులు నినుగని కలవరించగా..
    ధన్యములైనవి ప్రభువా! ... మా వీనులు నినువిని వెంబడించగా.. ధన్యములైనవి ప్రభువా!
    గతమున ఎందరో నీతిమంతులు నిను వెతికిరిగానీ ... కనకపోయిరి
    మతమున మునిగి ప్రవక్తలెందరో నిను.. మతియే మారగ ... వినకపోయిరి
    మాదే భాగ్యమో... ఇదియే యోగ్యమో ... నీ శిరమును కన్నాము ... నీ స్వరమును విన్నాము ... ధన్యజీవులము మేమైనాము ... ధన్యజీవులము మేమైనాము ...
    ధన్యములైనవి ప్రభువా! ... నీ త్రైతమునే విని తృప్తిజెందగా ...
    ధన్యములైనవి ప్రభువా! ... నీ తత్త్వమునే కని ముక్తినొందగా ...
    ధన్యములైనవి ప్రభువా... ధన్యములైనవి ప్రభువా ... ధన్యములైనవి ప్రభువా!

Комментарии •