కోటిలింగాల వెనకున్న అసలు కథేంటి?

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • కోటి ఇసుక రేణువుల సమూహం.. త్రేతాయుగంలో మునీశ్వరులచే ప్రతిష్టించబడిన సైకత లింగం. శాతవాహనాలు నిర్మించిన పవిత్ర పరమేశ్వరాలయం, శతాబ్దాలు దాటినా చెక్కుచెదరని వైనం. ఇదంతా.. జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల పుణ్యక్షేత్రం గురించే. శాతవాహనుల రాజధానిలో వెలిసిన.. ఆ పురాతన శివాలయం ప్రాశస్త్యం, శివలింగం వెనకున్న చరిత్రపై.. జగిత్యాల జిల్లా పరిధిలోని వెల్గటూర్ మండల పరిధిలో ఉంది కోటిలింగాల.ఆనాడు.. శాతవాహనుల రాజధానిగా ఖ్యాతి గాంచిన కోటిలింగాల.. ఇప్పుడు పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ఈ ప్రాంత చరిత్రకు ఎన్నో ఆధారాలు.. ఈ నేల గర్భంలోనే దాగి ఉన్నాయి. చరిత్రకారుల తవ్వకాల్లో.. కోటిలింగాల విశిష్టతను తెలిపే ఆధారాలెన్నో బయటపడ్డాయి. కోటిలింగాల గ్రామంలో గోదావరి ఒడ్డున కోటేశ్వరస్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు శివుడు.
    మునులు ఇక్కడే ఎందుకు ప్రతిష్టించారు?
    ఇంతటి ఖ్యాతి పొందిన కోటిలింగాల సైకత లింగాన్ని.. మునులు ఇక్కడే ఎందుకు ప్రతిష్టించారు? ఇసుక రేణువులతోనే ఎందుకు లింగాన్ని తయారుచేశారు? ఆలయం వెలుపల.. గోదావరి ఒడ్డున ఉన్న కాశీ లింగం చరిత్రేంటి? ఓవరాల్‌గా కోటిలింగాల వెనకున్న అసలు కథేంటి? త్రేతాయుగం ప్రథమపాదంలో.. కొందరు మునీశ్వరులు కోటిలింగాల సమీపంలోని గుట్టల్లో తపస్సు కోసం వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
    అలా.. తపస్సు కోసం వచ్చిన మునులు.. నిత్యం గోదావరిలో స్నానమాచరిస్తూ.. దగ్గరిలోని గుట్టపై తపస్సు చేసుకుంటూ ఉండేవారట. అలా.. ఓ రోజు కోటిలింగాలలో.. ఓ సుముహూర్తాన శివలింగాన్ని ప్రతిష్టించి.. దానికి పూజలు చేసి.. శివారాధన చేయాలని భావించారట.
    అలా.. అరణ్యం వైపు వచ్చిన ఆంజనేయస్వామిని.. శివలింగాన్ని తీసుకురావాలని కోరినట్లు పురాణాలు చెబుతున్నాయ్. ఆంజనేయస్వామి శివలింగం తీసుకొచ్చేందుకు.. కాశీకి బయల్దేరాడు. ఆంజనేయ స్వామి అక్కడి నుంచి వచ్చేసరికి.. ముహూర్తం దాటిపోతుందని భావించారు.
    అంతలోపే.. శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నారు. మునీశ్వరులంతా కలిసి.. గోదావరిలో స్నానమాచరించి తలో పిడికెడు ఇసుకను తీసుకొచ్చారు. ఈశాన్య దిశలో ఉన్న కోటపై.. కోటి ఇసుక రేణువులతో శివలింగాన్ని రూపుదిద్ది.. సైకత శివలింగాన్ని ప్రతిష్టించారు. కోటీశ్వరస్వామిగా ఆరాధించడం మొదలుపెట్టారు.
    మునీశ్వరులపై ఆంజనేయస్వామి ఆగ్రహం :
    తర్వాత.. మునీశ్వరులు ప్రతిష్టించిన సైకత లింగాన్ని చూసి.. ఆంజనేయస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట. తాను తీసుకొచ్చిన కాశీ విశ్వేశ్వర లింగాన్ని కోపంతో గోదావరిలో పడేసి వెళ్లిపోయాడని ఆలయ చరిత్ర చెబుతోంది. అప్పుడు.. రుషులంతా వెళ్లి.. ఆంజనేయస్వామి దగ్గరికి వెళ్లి.. భవిష్యత్తులో కోటీశ్వర ఆలయాన్ని దర్శించుకునే భక్తులంతా.. కాశీ లింగానికి ముందు పూజలు చేసిన తర్వాత.. సైకత లింగానికి పూజలు చేస్తారంటూ శాంతింపజేశారట. ఇప్పటికీ.. ఆలయ ఆవరణలో ఆంజనేయస్వామి తీసుకొచ్చినట్లు చెబుతున్న శివలింగాన్ని.. అర్చకులు నిత్యం పూజిస్తుంటారు.
    ఇక.. కోటిలింగాల శాతవాహనుల రాజధాని అని, శాతవాహన రాజులు.. ఈ ప్రాంతాన్ని పాలించారని.. చారిత్రక ఆధారాలతో నిరూపితమైంది. వారు నిర్మించిన కట్టడాలే.. ఇప్పుడు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 17వ శతాబ్దంలో.. త్రిముఖుడు.. ఈ కోటీశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లుగా ప్రతీతి. శాతవాహనుల రాజుల్లో గొప్పవాడైన 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి జన్మించిన స్థలం కూడా ఈ కోటిలింగాల ప్రాంతమే.
    యుగాలు మారినా, శతాబ్దాలు దాటినా.. కోటిలింగాల సైకత శివలింగం చెక్కుచెదరకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. లింగం గట్టిపడినప్పటికీ.. లోపల మాత్రం ఇసుక రేణువులు అలానే ఉంటాయట. కోటీశ్వరస్వామిగా పూజలందుకుంటున్న సైకత లింగం .. ఇప్పుడు భక్తులకు కోరికలు నెరవేర్చే ఆరాధ్య దైవం.
    #kotilingeshwaratemple #koti #kotilingeshwara #lordshiva #kotilingeshwara #trending

Комментарии •