విత్తన మేళాకు అపూర్వ స్పందన | Seeds Mela | PJTSAU

Поделиться
HTML-код
  • Опубликовано: 9 июн 2024
  • #raitunestham #farming #seeds
    ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలు... అందుకు అనుగుణంగా ముందే పలకరించిన రుతుపవనాలతో... తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఖరీఫ్ సాగుకి సన్నద్ధం అవుతున్నారు. దుక్కి దున్ని నేలలను పంటకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకి నాణ్యమైన విత్తనాలు అందించేందుకు కృషి చేస్తోంది ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా విత్తన మేళా నిర్వహించింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో విత్తన మేళా ఏర్పాటు చేసి రైతులకి కావాల్సిన నాణ్యమైన విత్తనాలను అందించింది. విశ్వవిద్యాలయం పరిధిలోని జగిత్యాల, పాలెం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో, అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో విత్తన మేళాలు నిర్వహించారు. మొత్తంగా 16 పంటల్లో 67 రకాలకు చెందిన దాదాపు 12 వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకి అమ్మకానికి అందుబాటులో ఉంచారు. వరిలో 27 రకాలు... మెట్ట, అపరాలతో పాటు గడ్డి విత్తనాలను అందించారు. విత్తనాల కోసం అనేక మంది రైతులు హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయానికి వచ్చారు. వరిలో సన్నరకాలపై ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపారు. జనుము, జీలుగ, పశుగ్రాసాల విత్తనాలనూ అనేక మంది రైతులు కొనుగోలు చేశారు. కర్షకుల అవసరాలకు అనుగుణంగా వీలైనంత ఎక్కువ మొత్తంలో విత్తనాలు అందించేందుకు కృషి చేస్తున్నామని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. రైతులకు ఎంతో మేలు చేసే ఇలాంటి విత్తన మేళాలు మరిన్ని నిర్వహించాలని రైతులు కోరారు. నాణ్యమైన విత్తనాలను రైతులకి అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో ఖరీఫ్ సాగుకి కావాల్సిన వివిధ రకాల విత్తనాలను అందుబాటలో ఉంచారు. కేంద్రాల వారీగా విత్తన రకాల లభ్యత, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లను వీడియోలో ద్వారా అందించడం జరిగింది. విత్తనాల గురించి సమాచారం కావాల్సిన వారు సంబంధిత కేంద్రంలోని అధికారులను సంప్రదించగలరు.
    ----------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • నాటు బొప్పాయి విత్తనాల...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

Комментарии • 14

  • @delta5540
    @delta5540 Месяц назад +1

    Hat's off to Telangana government

  • @Universalgardens786
    @Universalgardens786 Месяц назад +1

    Suuuper

  • @raibalreddy339
    @raibalreddy339 Месяц назад

    ✔️✔️🙏🙏🙏🌾🌾🌻

  • @nagallasuresh2124
    @nagallasuresh2124 Месяц назад +1

    విత్తన మేళ last date ఎప్పుడు వరకు

  • @fatehalibaig982
    @fatehalibaig982 Месяц назад +1

    Pl let us know address & phone of centres selling genuine seeds at Guntur/Bapatla. Thanks.

  • @edubillikameswararaoedubil5817
    @edubillikameswararaoedubil5817 Месяц назад +1

    ఏపీలో విజయ నగరం దగ్గరలో పెడితే బాగుండేది.

  • @veerrajumadivi3359
    @veerrajumadivi3359 Месяц назад

    Excellent information sir so Number clear ga ledu sir

  • @purushothampanyala547
    @purushothampanyala547 Месяц назад

    What about middethota seeds availablity

  • @swadeshinaturalspiritual3752
    @swadeshinaturalspiritual3752 Месяц назад

    Yenni rojulu ee programs

  • @jalasathishsathish5058
    @jalasathishsathish5058 Месяц назад

    names and phone numbers kanipinchadam ledhu

  • @sudheerreddydantu5567
    @sudheerreddydantu5567 Месяц назад

    Last date please

  • @santhilkumar1032
    @santhilkumar1032 Месяц назад

    Mention dates sir.

  • @jagadesh2063
    @jagadesh2063 Месяц назад

    Dates

  • @kpchandrika3429
    @kpchandrika3429 Месяц назад

    జనుము, జీలుగ, పిల్లి పెసర, etc., మొదలగు పచ్చి రొట్ట విత్తనాలు terrus garden vaalla kosam amme vaallu unte contact number పెట్టవలెను