Konaseema prabhala theerdham | కోనసీమ ప్రభలతీర్ధం | ఏకాదశ రుద్రులు ఒకేచోట కొలువు

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • Konaseema prabhala theerdham | కోనసీమ ప్రభలతీర్ధం | ఏకాదశ రుద్రులు ఒకేచోట కొలువు@Madanreddyvlogs
    Konaseema is a picturesque region located in the East Godavari district of the Indian state of Andhra Pradesh. Known for its lush greenery, coconut groves, and serene landscapes, Konaseema is often referred to as the "God's Own Creation." The region is dotted with scenic villages, rivers, and cultural attractions, making it a popular destination for tourists seeking a tranquil experience in nature.
    Prabhala Teertham is a sacred pilgrimage site in India, known for its religious significance. It is often visited by devotees seeking spiritual experiences and blessings.
    Konaseema is a picturesque region located in the East Godavari district of the Indian state of Andhra Pradesh. Known for its lush greenery, coconut groves, and serene landscapes, Konaseema is often referred to as the "God's Own Creation." The region is dotted with scenic villages, rivers, and cultural attractions, making it a popular destination for tourists seeking a tranquil experience in nature.
    "Ekadasa Rudrulu" refers to the eleven manifestations or forms of Lord Shiva, who is a major deity in Hinduism. These forms represent various aspects of Shiva's divine nature and are revered by devotees. Each form has its own significance and mythology associated with it. Devotees often worship these forms during specific occasions or festivals dedicated to Lord Shiva.
    #జగ్గన్నతోట #ప్రభల_తీర్థం...
    తెలుగువారికి ముఖ్యమైన పండుగ సంక్రాంతి.
    సంక్రాంతి వేడుకల్లో కోనసీమకొక ప్రత్యేకత ఉంది.
    కోనసీమకే ప్రత్యేకమైన ‘ప్రభల తీర్థం’ ఒకటి.
    కోనసీమలో సంక్రాంతినాడు కొన్ని చోట్ల, కనుమనాడు అనేక చోట్ల ఈ తీర్థాలు నిర్వహిస్తారు.
    అన్నింటిలోనూ ప్రఖ్యాతి పొందింది- జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం.
    #అమలాపురానికి దగ్గరలోని #మొసలపల్లి_ఇరుసుమండ గ్రామాల మధ్య గల ఏడెకరాలను జగ్గన్నతోటగా పిలుస్తారు.
    దేశమంతా జరుపుకునే సంక్రాంతి అందరికీ ఒకటే అయినా ప్రాంతాన్ని బట్టి కొత్త రూపు దిద్దుకుంటుంది.
    కొబ్బరాకుల నడుమనున్న కోనసీమకి సంక్రాంతి తెచ్చే వన్నె వేరు.
    సంక్రాంతికి మాత్రం కోనసీమ పచ్చ పట్టుపరికిణీ కట్టుకున్న పల్లెపడుచులా ముస్తాబవుతుంది.
    ముత్యాల ముగ్గుల నడుమ సంబరంగా నర్తిస్తుంది. ప్రతి ఇంటా సంతోషం మంచు జిల్లై కురుస్తుంది. అక్షరానికందని అదొక వర్ణనాతీత అనుభూతి.
    పురాణాల్లోని ‘ఏకాదశ రుద్రుల’కు ప్రతీకలైనవారు కోనసీమలోని ఇరుగుపొరుగు గ్రామాల్లో కొలువై ఉన్నారంటారు. మొసలపల్లి గ్రామదైవం భోగేశ్వరస్వామి ఆహ్వానం మేరకు వీరందరూ సంవత్సరానికి ఒకసారి సమావేశమై లోక కల్యాణం కోసం చర్చలు సాగిస్తారట.
    అలా 11మందీ ఒకచోట నిర్వహించే సమావేశమే ప్రభల తీర్థం పరమార్థమని భావిస్తారు. వారు:
    వ్యాఘ్రేశ్వరం (విశ్వేశ్వర రుద్ర రూపం) వ్యాఘ్రేశ్వరుడు,
    కృష్ణరాయుడి (కె) పెదపూడి (మహాదేవ రుద్రరూపం) మేనకేశ్వరుడు,
    ఇరుసుమండ-ఆనంద (త్రయంబక రుద్రరూపం) రామేశ్వరుడు,
    వక్కలంక (త్రిపురాంతక రుద్రుడు) విశ్వేశ్వరుడు,
    నేదునూరు (కాలరుద్రుడు) చెన్నమల్లేశ్వరస్వామి.
    అలాగే ముక్కామల (కాలాగ్ని రుద్రుడు) రాఘవేశ్వరుడు,
    మొసలపల్లి (నీలకంఠ రుద్రుడు) భోగేశ్వరుడు,
    పాలగుమ్మి (మృత్యుంజయ రుద్రుడు) చెన్న మల్లేశ్వరుడు,
    గంగలకుర్రు (సర్వేశ్వర అగ్రహారం) వీరేశ్వరుడు,
    గంగలకుర్రు (సదాశివ రుద్ర రూపం) చెన్నమల్లేశ్వరుడు,
    పుల్లేటికుర్రు (శ్రీ మన్మహాదేవ రుద్రరూపం) అభినవ వ్యాఘ్రేశ్వరుడు.
    వీరిలో మొదటివాడైన వ్యాఘ్రేశ్వరస్వామి ప్రభల తీర్థానికి అధ్యక్షత వహిస్తాడంటారు. అందుకే ఆ ప్రభ వచ్చేవరకు భక్తులు మొక్కులు తీర్చుకోకుండా వేచి ఉంటారు.
    తాటి దూలాలకు టేకు చెక్కలు అమర్చి, వెదురు బొంగుల్ని ఒక క్రమపద్ధతిలో గోపురం ఆకారంలో వంచి కడతారు. ఆ మధ్య ఖాళీలను రంగురంగుల నూతన వస్త్రాలతో అల్లికలా తీర్చిదిద్దుతారు. ఎర్రని గుడ్డను వెనక వైపు తెరలా కట్టి ఉంచుతారు. ముందు, వెనక భాగాల్ని జీవాత్మ పరమాత్మల ప్రతీకలుగా పరిగణిస్తారు. పైభాగంలో ఆలయాల్లోని ఇత్తడి కలశాలను బోర్లించి కట్టి- ఆ పైన వరి కంకులు, నెమలి పింఛాలు, పూల దండలు, ఇతర సామగ్రితో అలంకరిస్తారు. వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉంచడానికి వీలుగా గద్దెలు ఏర్పాటుచేస్తారు. వాటిమీద ఆయా గ్రామాల్లోని శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంచడం ఒక సంప్రదాయం.
    అనంతరం మేళతాళాలు,మంగళ వాద్యాలు, వేదమంత్రాల మధ్య వూరేగింపుగా బయలుదేరతారు.
    ప్రభలను మామూలు రహదారుల వెంటగాని, వాహనాల మీదగాని తీసుకు వెళ్లరు. ఎంత దూరమైనా భక్తులు భుజాల మీద మోస్తూ, పంట చేల మధ్య నుంచి వూరేగింపుగా వెళతారు. కొన్ని చోట్ల ఆరడుగుల నీటిలో నుంచి గోదావరి కాలువల్లోకి దిగి, ప్రభల్ని నేర్పుగా ఒడ్డుకు చేరుస్తారు.
    ఈ ప్రభల్ని పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి ‘వీరభద్ర ప్రభలు’గా పిలుస్తారు. పగలంతా పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకుంటారు. రాత్రి సంప్రదాయ నృత్యాలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోనసీమలో జరిగే ఈ ప్రభల తీర్థాన్ని తిలకించడానికి, ఇందులో పాలుపంచుకోవడానికి- రాష్ట్రేతరులే కాక, విదేశాల్లో నివసించేవారూ వస్తారు.
    భక్తిభావాన్ని చాటుకుంటూ, ఆనందాన్ని మూటకట్టుకుని తిరిగి వెళతారు.
    #పుల్లేటికుర్రు
    #madanreddyvlogs
    #ప్రభలతీర్ధం

Комментарии • 9

  • @user-uh6nf6hf9p
    @user-uh6nf6hf9p 7 месяцев назад

    🎉🎉🎉🎉🎉

  • @chantiattha1705
    @chantiattha1705 7 месяцев назад

    👏👏🙏👌

  • @lakshmikumari7505
    @lakshmikumari7505 7 месяцев назад

    Madan Reddy garu your vlog on Prabalateerdham is fantastic and heart touching. Next year we will attend this teerdham. Your explanation on prabalateerdham is very informative Sir. Thank you for sharing detailed programme.

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  7 месяцев назад

      మీలాంటి వాళ్ళ ఇలాంటి మెసేజ్ లే మాకు స్ఫూర్తి.

  • @ganeshvelayudam8252
    @ganeshvelayudam8252 7 месяцев назад

    ఈ సంవత్సరం నుండి ఐనా ఈ రుద్రుల అనుగ్రహం తో క్రైస్తవ మత మార్పిడి ఆగిపోవాలి అని మా శ్రీ కామాక్షి అమ్మ, శ్రీ కపిలేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను...

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  7 месяцев назад +1

      నేనూ అదే కోరుకుంటున్నానండి!

    • @ganeshvelayudam8252
      @ganeshvelayudam8252 7 месяцев назад

      @@Madanreddyvlogs nuvvu కోరుకుంటే అది ఐపోవాల్సిందే..

  • @user-tz1rg3it7e
    @user-tz1rg3it7e 7 месяцев назад

    Memu metho Ravalli anty ela konchum details chypandi

  • @muralibandi3415
    @muralibandi3415 7 месяцев назад

    Vammo mamuluga leduka anna jathara