26-01-2025. 316వ రోజు.... 🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!* 🏵️ నేటి శ్రీమన్మహాభారతసారం - ఆదిపర్వము - పాండవులపై కుట్రలు చేయటం. ప్రసన్నవదనుడైన శ్రీవినాయకస్వామికీ, పరమాత్మయైన శ్రీమన్నారాయణుడికీ, పూజ్యనీయుడైన శ్రీవేదవ్యాసదేవుడికీ, పంచమవేదమైన శ్రీమన్మహాభారత గ్రంథానికీ తలవంచి ప్రణామాలు నమర్పిస్తూ..... పౌరాణికుడైన సూతమహర్షులవారు నైమిషారణ్యంలో శౌనకాదిమహర్షులందరికీ శ్రీమన్మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా అంటున్నాడు "ఓ మహర్షులారా! వేదపండితుడైన వైశంపాయనులవారు జనరక్షకుడైన జనమేజయుడితో ఈ రకంగా అంటున్నాడు "ఓ రాజా! శకుని, కర్ణుడు, దుర్యోధనాదులందరూ కలిసి పాండవులందరినీ సర్వనాశానం చేయాలని మంత్రాంగం చేసే క్రమంలో శకుని ఈ రకంగా అంటున్నాడు "మనమందరం కలిసి పాండవులను నాశనం చేయలేకపోతే నలుగురిలో మనం నవ్వులపాలు అవుతాం! అయితే పాండవులు ప్రస్తుతానికి ద్రుపదుడి ఆశ్రయంలో ఉన్నారు! అ ద్రుపదుడు బలపరాక్రమాలలో గొప్పవాడు కాదనేది నా అభిప్రాయం! ఆ ద్రుపదుడికి ఇతర రాజులెవ్వరూ సహాయపడకముందే మనం పాండవులను చంపటానికి ప్రయత్నం చేయాలి! ఇంతకుమునుపు ఒకసారి మనం చేసిన ప్రయత్నం విఫలమైంది! లక్క ఇంటినుండి వారందరూ బ్రతికి బయటపడ్డారు! ఇప్పుడు కనుక మననుండి ఈ పాండవులు చేజారిపోతే వారి వలన మనకూ కష్టాలే కలుగుతాయి! అందుకే వీరిని తక్షణమే నాశనం చేయాలి! ఇదే మనకు ముఖ్యమైన కర్తవ్యం!" అని శకుని అన్న తరువాత సౌమదత్తి అనే వీరుడు తన అభిప్రాయాన్ని ఈ రకంగా చెబుతున్నాడు "శత్రువు ఎప్పడైతే ఆపదలో ఉంటాడో అప్పుడే మనం ఆ శత్రువుమీద దాడి చేయాలి! పాండవులు ఇప్పుడు మిత్రులతో కలిసి ఉన్నారు! వీరు తమ బలపరాక్రమాలతో ఇతర రాజులందరికీ ఇష్టులైపోయారు! అర్జునుడేమో సహజంగానే అత్యంత అందమైనవాడు! తన నయనములతో అందరి హృదయాలను అర్జునుడు దోచుకున్నాడు! అంతేకాకుండా తన ప్రియకరమైన మాటలతో ఇతర రాజులందరినీ ఇ ఆకర్షించుకున్నాడు! అందరికీ అవసరమైన పనులు చేసి అర్జునుడు అందరినీ తన వారిగా చేసుకున్నాడు! అందులోనూ అర్జునుడి మాటలు సదా సత్యాన్నే పలుకుతుంటాయి! ఆ రకంగా పాండవులందరూ సద్గుణవంతులు! ఇలాంటి వారిని నాశనం చేయగలిగినవారిని నేను ఇంతవరకూ చూడలేదు! పాండుపుత్రులలో మంత్రశక్తి సమృద్ధిగా ఉంది! ఉత్సాహము అధికంగా ఉంది! వారిలో ప్రభుభక్తి కూడా విస్తరించి ఉంది! ఇక ధర్మరాజేమో సామ దాన భేద దండ ప్రయోగాలలో అతను అత్యంత నైపుణ్యం కలిగినటువంటి వాడు! సమయోచితంగా తనలో ఉండేటటువంటి బలాన్నీ, స్నేహితులనూ ప్రయోగించగలిగినటువంటివాడు ధర్మరాజు! రోషాన్ని విడిచేసి శత్రువును జయిస్తాడు! అలాంటి వాడు ధర్మరాజు! ధనముతో శత్రువులనూ, మిత్రులనూ, బలాన్నీ అన్నింటినీ కోనేసి తన ఉనికిని పదిలంగా ఉంచుకొని శత్రువులను సంహరించటంలో ధర్మారాజు దిట్ట! దేవేంద్రాది దేవతలందరూ కలిసిన పాండవులను ఏమీ చేయలేరు! ఎందుకంటే శ్రీకృష్ణబలరాములు ఇరువురూ వారి పక్షాన్నే ఉన్నారు! ఇది నా నిశ్చితమైన అభిప్రాయం!" అంటూ సౌమదత్తి చెబుతున్నాడు!"" అని అంటూ శ్రీవేదవ్యాసమహాముని ప్రధానశిష్యుడైన వైశంపాయనులవారు పరీక్షిన్నరేంద్రుని పుత్రుడైన జనమేజయుడితో అంటున్నాడు...........✍️ *ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!* 🌅🔆🙏🏼🔆🌄
జై శ్రీమన్నారాయణ 🙏ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః 🙏ఓం అస్మద్గురుభ్యో నమః 🙏🌹గురువుగారికి పాదాబివందనములు 🙏🌹
హే కృష్ణా సంరక్షమాఓ🙏🌹సర్వం శ్రీకృష్ణార్పన మస్తు 🙏🌹జై శ్రీమన్నారాయణ 🙏🌹
🙏Jai Srimannarayana,Jai Sri VijayaLakshmi matha ki Jai🙏🙌 Srimannarayana karishye Vachanam thava🙏 thank you so much Guruvu gaaru🙏
Jaisrimannarayana jaisrikrishna jaisriram 🎉namaste 🙏 🎉🎉🎉guruvugariki padabhi vandanamulu namaste 🎉guruvugariki 🎉
Om Asmad Gurubhyo namaha 🙏
Jai Sri ma narayana Jai Sri ma narayana Jai Sri ma narayana Jai Sri ma narayana Jai Sri ma narayana Jai Sri ma narayana Jai Sri ma narayana
🕉️🔱🚩👏🙏ఓం జై శ్రీ శ్రీమన్నారాయణ నమః 🕉️🔱🚩👏🙏
జై శ్రీమన్నారాయణ
🙏🙏🙏🙏🙏Jai Shreemannarayana 🙏🙏🙏🙏🙏
Jai Srimannarayana. Dasoham 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai Srimannarayana 🌺🙏🙏🙏🌺
జై శ్రీమన్నారాయణ 🙏🏻
జై శ్రీరామ్ 🙏🏻
జై శ్రీ కృష్ణ 🙏🏻
జై శ్రీ మాన్ నారాయణ 🙏🌹🙏
26-01-2025.
316వ రోజు....
🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!* 🏵️
నేటి శ్రీమన్మహాభారతసారం - ఆదిపర్వము - పాండవులపై కుట్రలు చేయటం.
ప్రసన్నవదనుడైన శ్రీవినాయకస్వామికీ,
పరమాత్మయైన శ్రీమన్నారాయణుడికీ,
పూజ్యనీయుడైన శ్రీవేదవ్యాసదేవుడికీ,
పంచమవేదమైన శ్రీమన్మహాభారత గ్రంథానికీ తలవంచి ప్రణామాలు నమర్పిస్తూ.....
పౌరాణికుడైన సూతమహర్షులవారు నైమిషారణ్యంలో శౌనకాదిమహర్షులందరికీ శ్రీమన్మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా అంటున్నాడు
"ఓ మహర్షులారా! వేదపండితుడైన వైశంపాయనులవారు జనరక్షకుడైన జనమేజయుడితో ఈ రకంగా అంటున్నాడు
"ఓ రాజా! శకుని, కర్ణుడు, దుర్యోధనాదులందరూ కలిసి పాండవులందరినీ సర్వనాశానం చేయాలని మంత్రాంగం చేసే క్రమంలో శకుని ఈ రకంగా అంటున్నాడు "మనమందరం కలిసి పాండవులను నాశనం చేయలేకపోతే నలుగురిలో మనం నవ్వులపాలు అవుతాం! అయితే పాండవులు ప్రస్తుతానికి ద్రుపదుడి ఆశ్రయంలో ఉన్నారు! అ ద్రుపదుడు బలపరాక్రమాలలో గొప్పవాడు కాదనేది నా అభిప్రాయం! ఆ ద్రుపదుడికి ఇతర రాజులెవ్వరూ సహాయపడకముందే మనం పాండవులను చంపటానికి ప్రయత్నం చేయాలి! ఇంతకుమునుపు ఒకసారి మనం చేసిన ప్రయత్నం విఫలమైంది! లక్క ఇంటినుండి వారందరూ బ్రతికి బయటపడ్డారు! ఇప్పుడు కనుక మననుండి ఈ పాండవులు చేజారిపోతే వారి వలన మనకూ కష్టాలే కలుగుతాయి! అందుకే వీరిని తక్షణమే నాశనం చేయాలి! ఇదే మనకు ముఖ్యమైన కర్తవ్యం!" అని శకుని అన్న తరువాత సౌమదత్తి అనే వీరుడు తన అభిప్రాయాన్ని ఈ రకంగా చెబుతున్నాడు "శత్రువు ఎప్పడైతే ఆపదలో ఉంటాడో అప్పుడే మనం ఆ శత్రువుమీద దాడి చేయాలి! పాండవులు ఇప్పుడు మిత్రులతో కలిసి ఉన్నారు! వీరు తమ బలపరాక్రమాలతో ఇతర రాజులందరికీ ఇష్టులైపోయారు! అర్జునుడేమో సహజంగానే అత్యంత అందమైనవాడు! తన నయనములతో అందరి హృదయాలను అర్జునుడు దోచుకున్నాడు! అంతేకాకుండా తన ప్రియకరమైన మాటలతో ఇతర రాజులందరినీ ఇ
ఆకర్షించుకున్నాడు! అందరికీ అవసరమైన పనులు చేసి అర్జునుడు అందరినీ తన వారిగా చేసుకున్నాడు! అందులోనూ అర్జునుడి మాటలు సదా సత్యాన్నే పలుకుతుంటాయి! ఆ రకంగా పాండవులందరూ సద్గుణవంతులు! ఇలాంటి వారిని నాశనం చేయగలిగినవారిని నేను ఇంతవరకూ చూడలేదు! పాండుపుత్రులలో మంత్రశక్తి సమృద్ధిగా ఉంది! ఉత్సాహము అధికంగా ఉంది! వారిలో ప్రభుభక్తి కూడా విస్తరించి ఉంది! ఇక ధర్మరాజేమో సామ దాన భేద దండ ప్రయోగాలలో అతను అత్యంత నైపుణ్యం కలిగినటువంటి వాడు! సమయోచితంగా తనలో ఉండేటటువంటి బలాన్నీ, స్నేహితులనూ ప్రయోగించగలిగినటువంటివాడు ధర్మరాజు! రోషాన్ని విడిచేసి శత్రువును జయిస్తాడు! అలాంటి వాడు ధర్మరాజు! ధనముతో శత్రువులనూ, మిత్రులనూ, బలాన్నీ అన్నింటినీ కోనేసి తన ఉనికిని పదిలంగా ఉంచుకొని శత్రువులను సంహరించటంలో ధర్మారాజు దిట్ట! దేవేంద్రాది దేవతలందరూ కలిసిన పాండవులను ఏమీ చేయలేరు! ఎందుకంటే శ్రీకృష్ణబలరాములు ఇరువురూ వారి పక్షాన్నే ఉన్నారు! ఇది నా నిశ్చితమైన అభిప్రాయం!" అంటూ సౌమదత్తి చెబుతున్నాడు!""
అని అంటూ
శ్రీవేదవ్యాసమహాముని ప్రధానశిష్యుడైన వైశంపాయనులవారు పరీక్షిన్నరేంద్రుని పుత్రుడైన జనమేజయుడితో అంటున్నాడు...........✍️
*ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!*
🌅🔆🙏🏼🔆🌄
Om Namo Bhagavate Vasudevaya 🙏🙏🙏
Jai sreemannarayana 👣🌺🌺🙏🙏
Jai srimannarayana 🙏🏼🙏🏼
Jaya sree krishana 🙏
ఓం అస్మత్ గురుభ్యో నమః 🙏
🙏🙏🙏🙏🙏🙏
ఓం సర్వం శ్రీ కృష్ణార్పణస్మస్తు
JAI SRIMANNARAYANA JAI SRI RAMANUJA
SRIMATHE RAMANUJAYA 🎉🎉
🙏🙏🙏
Jai Sri mannarayana
ఓం నమో భగవతే వాసుదేవాయ
Jai sreemanaarayana swami 🙏
JAI SREEMANNARAYANAA 🙏🙏🙏
Jai Sri manarayana 🙏🙏
Jai sri ma narayana
Jaya sree krishana 🙏🙏🌹
Jai Srimanarayana 🙏🙏🙏💐