bhadrakali lake mega discovery 2 | భద్రకాళి చెరువు మెగా డిస్కవరీ 2 | aggalayya gutta Discovery

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • అగ్గలయ్య గుట్టపై గగ్గలయ్య గది మిస్టరీ
    డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి
    " చెరువులలో భద్రకాళి చెరువు తలమానికం. అగ్గలయ్య గుట్ట , భద్రకాళి గుట్ట , భైరవ గుట్ట ,
    పద్మాక్షి గుట్టల నడుమ ప్రకృతి సౌందర్యంతో, చారిత్రక వైభవంతో అలరారుతుంది. శిలా యుగం నాటి మానవులకు ఆశ్రయమిచ్చింది. రాష్ట్రకూట రాజులను,చాళుక్య ప్రభువులను ఆకర్షించింది. తొలి కాకతీయులకు రాజధానియై రాజ్యానికంతటికి సాగు నీరు తాగు, నీరు అందించింది. భారతదేశంలో కేవలం ఈ ఒక్క చెరువుకే దారి తీసే స్వాగత తోరణాలు నిర్మించబడినాయనీ చరిత్ర పరిశోధకుడు ,డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి అన్నారు.
    భద్రకాళి చెరువుకు ఆనుకొని ఉన్న పరిసరాలు గుట్టలపై వెలుగులోకి రాని చరిత్రను విశేషంగా పరిశోధిస్తూ పరిశోధకుడు ఎప్పటికప్పుడు విలువైన చరిత్రను వెలుగులోకి తెస్తున్నారు.
    పరిశోధకుడు ఓంకార్, మహేశ్, నితిన్ బృందంతో కలిసి మరోసారి సందర్శించి అనేక నూతన చారిత్రక అంశాలను గుర్తించారు.
    భద్రకాళి చెరువు మత్తడిపై హనుమద్గిరి తటాకాంజనేయ స్వామి దేవాలయం ఎదురుగా పక్క పక్కనే ఉన్న రెండు శిలల మధ్య నుండి చెరువు మత్తడివైపుకు వెళ్లే మార్గం ఉంది . ఈ రెండు ఎత్తైన శిలల శిఖరాగ్రంలో 10 వ శతాబ్దం నాటి తూర్పు మరియు ఉత్తర ముఖంగా చెక్కిన రెండు వినాయక శిల్పాలు ఉన్నాయి.
    అగ్గలయ్య గుట్ట భైరవ గుట్ట మధ్యలో నుండి వెళ్లే దోవ చివరకు చెరువుకు ఆనుకొని శిథిల దేవాలయ ఆనవాళ్లు, పడి ఉన్న ఒక శివలింగం , ఆలయ స్థంబాలు ఉన్నాయి.చెరువు నిండితే నీటిలో మునిగే ఒక శిలకు ఒక వినాయక శిల్పం ఉంది. ఇక్కడే ఒక శిలకు సౌష్టవంగ ,శిల్పకళతో ఉట్టిపడే కాకతీయుల నాటి భైరవ శిల్పం పూజలు అందుకుంటున్నది.
    *రహస్య గగ్గలయ్య గది :
    చెరువుకు అభిముఖంగా సమీపంలో ఉన్న భైరవ శిల్పం మీదుగా ఇరవై అడుగుల ఎత్తులో ఒక నిర్మాణం ఉంది. సుమారుగా పది అడుగుల ఎత్తులో పది అడుగుల వెడల్పు, నలభై అడుగుల పొడవులో ఉన్న ఒక పడగ రాయి కింద, తొలిచిన భారీ శిలలతో ఒక శత్రుదుర్భేద్యమైన నిర్మాణం ఉంది. ఒక్కొక్క శిల కొన్ని టన్నుల బరువు ఉంటుంది. ఈ శిలలను కదిలించడం గాని నిలబెట్టడం గానీ అసామాన్య విషయం.ముఖ ద్వారంగా ఉన్న శిలలు పడిపోయాయి. లోపల ప్రస్తుతం రెండు గదులు కనిపిస్తున్నాయి. ఒక గది నుండి మరో గది లోకి వెళ్ళడానికి, గది వెనుక వైపు వెళ్లడానికి రెండు అడుగుల వెడల్పు, మూడు అడుగుల ఎత్తులో మహా ఇరుకైన రాతి ద్వారాలు ఉన్నాయి. గది వెనుక ఒక రోలు ఉంది. రాతి గోడలకు ఒకప్పుడు వేసిన డంగు సున్నం పొర ఊడిపోయింది. లోపల ఎటువంటి విగ్రహాలు కానీ దేవాలయ ఛాయలు కానీ లేవు.వెలుతురు వచ్చే మార్గం లేదు. ముందు గదిలో ఒక మూల దిగువన చిన్న రంద్రం ఉంది. ఈ రంద్రం వెలుపలి వైపు , గది పై భాగంలో ఎరువు రంగుతో వేసిన అస్పష్టంగా ఉన్న ఒక చిత్రం ఉంది.స్థానికులైన వారిని అడిగితే దానిని గగ్గలయ్య గది అన్నారు.
    అగ్గలయ్య గుట్ట పై నుండి కిందకు దిగి ,చెరువు అంచున ప్రమాదకర కొండ వాలు నుండి పాదాలు పట్టేంత సందుతో రెండు పక్క పక్కనే రెండు దారులు ఉన్నాయి . ఈ దారి ఇరుకైన శిలల మధ్య గుండా సాగి చెరువులోకి వెళుతుంది. ఈ తోవ సమీపంలోనే గగ్గలయ్య గది ఉన్నది. ఈ కారణంగా ఇది సైనిక స్థావరం లేదా ఆయుధ కర్మాగారం గాని ఐ ఉండవచ్చును. లేదా యుద్ధ ఖైదీలను బంధించి ఉండవచ్చును. ఈ గది కిందనే భైరవ శిల్పం ఉంది.
    ఈ గది ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియకుండా ఉంది. దారి పొడవున చిట్టడవి తుమ్మలు, ముళ్ళ పొదలతో నిండి ఉంది.
    భైరవ గుట్ట, అగ్గలయ్య గుట్టలను కలుపుతూ సుమారుగా 30 అడుగుల ఎత్తులో చెరువు కట్ట ఉంది. కట్ట చివరలో భైరవగుట్టకు ఆనుకొని ఎత్తు తక్కువగా ఉన్న పడగ రాయి కింద ఇటుకలతో నిర్మించిన మరొక గది ఉంది. ఈ గదిలో సన్యాసులు ఆవాసంగా చేసుకుని ఉండవచ్చును.
    కట్ట దిగువన అడుగు భాగంలో నిరంతరంగా భద్రకాళి చెరువు నుండి బయటకు వచ్చే భూగర్భ జల రవాణా జరగడానికి రాతి నిర్మాణం ఉంది. ఈ నిర్మాణాన్ని మరమ్మతు చేయవలసి ఉంది. ఇక్కడే చెరువు కట్ట తెగిపోకుండా ఉండడానికి , కట్ట దిగువన నీటి ఒత్తిడిని తగ్గించడానికి పొడవైన తొలిచిన శిలలను వరుసగా పాతి పెట్టారు.
    పురావస్తు శాఖ బృందం పరిశోధిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని పరిశోధకుడు తెలిపారు.
    భద్రకాళి చెరువు దేవాలయం నుండి పడవ మార్గాన్ని ఏర్పాటు చేసి వరుసగా హనుమద్ గిరి వెనుక ఉన్న రాష్ట్ర కూటుల నాటి శిల్ప సంపద , ఐలాండ్ గుట్ట , గగ్గలయ్య గది, భైరవ శిల్పంను చూసుకొని భైరవగుట్ట దిగువన ఉన్న సిద్ధేశ్వర ఆలయానికి చేరుకునేలా పర్యాటక శాఖ అభివృద్ధి చేయవలసి ఉంది.

Комментарии • 43

  • @gangadharthota8797
    @gangadharthota8797 10 дней назад +2

    Hats of to your team for your discovery Reddy garu.

  • @sujathavenkatadepu2007
    @sujathavenkatadepu2007 9 дней назад +1

    అన్నయ్య మీకు ధన్యవాదాలు
    ఎందుకని అంటే మా అత్తగారు ఊరు వరంగల్ కానీ నేను మాత్రం ఎలాంటి దృశ్యాలు చూడలేదు కానీ మీరు ఇంత శ్రమపడి ఈ VIDEO తీశారు మీకు ధన్యవాదాలు నేను ఇంత వరకు చూడనివి మీద్వార చూసాను
    మనకు ఎంత చరిత్ర ఉంది కానీ మనమే చిన్నచూపు చూడటం బాధా కరం ఈ విషయాలు మా లాంటి గృహిణులకు తెలియదు మీకు ధన్యవాదాలు అన్నయ్యా 👏👏👏

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  9 дней назад

      చాలా సంతోషం.మీ అభిప్రాయం తెలుపడమే కాక అన్నయ్య అని అన్నారు.ఇక ఇప్పుడు అందరూ చదువుతున్నారు.. స్కూల్,కాలేజ్ రోజుల్లోనే ఎక్కువ ప్రాంతాలు తిరగాలి.
      లేకపోతే ఒక్క గుడి తప్ప మరేమీ తెలియదు. కొత్తగా అగ్గలయ్య గుట్ట తూర్పు వైపు ఉన్న వరసిద్ధి వినాయక దేవాలయం టూరిస్ట్ ప్లేస్ నీ డిస్కవరీ చేసాను...

  • @gangadharthota8797
    @gangadharthota8797 10 дней назад +1

    Great discovery Ratnakar Reddy garu

  • @sahadevsunchu4485
    @sahadevsunchu4485 14 дней назад +4

    మీ ప్రయత్నాలకు 🙏🙏🙏🕉️👌

  • @saikumarn5840
    @saikumarn5840 3 дня назад +1

    Good job and great discovery anna 🙏

  • @annaramsharief6826
    @annaramsharief6826 12 дней назад +1

    Thanks anna nee dwara chudaleni vishayalu chupincharu

  • @durgabandi1781
    @durgabandi1781 12 дней назад +1

    Super Andi. Teliyani Vishayalu Chala Chepparandi.

  • @shankersingh5476
    @shankersingh5476 15 дней назад +2

    Good discovery gathering very happy🎉🎉

  • @VeereshwarTatikonda
    @VeereshwarTatikonda 14 дней назад +4

    Sodhara, Mee, krushi ananya samaanyamu. Adhbhuthamu

  • @lakshmankumar2592
    @lakshmankumar2592 13 дней назад +1

    Mana chariitra adbhutham.mana samskruthi adbhutam...

  • @manujenderreddy6609
    @manujenderreddy6609 14 дней назад +3

    గత 35 ఏళ్లుగా హన్మాకొండలో ఉంటూ ఉన్నాకూడా ..ఎన్నడూ చూడని ప్రదేశాలగురించి తెలియచేసిన మిత్రుడు రత్నాకర్ రెడ్డికి ధన్యవాదాలు 🙏🏼

  • @annaramsharief6826
    @annaramsharief6826 12 дней назад +1

    Anna rahasya sornga marghalu vunnai kanisam try chei anna wgl lo houses lo madya madyalo bavi lo kanipistai

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  12 дней назад

      అక్కడ తెలిసిన వారు లేరు. ఉంటే వెళ్ళి రావచ్చు

  • @MKINDIATV360
    @MKINDIATV360 14 дней назад +1

    Welldone
    Ratnakar Reddy

  • @Susheel-g9e
    @Susheel-g9e 12 дней назад +1

    Karimnagar Elgandal fort visit chayandi, chala historical ga untadi❤

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  12 дней назад

      అవును. నా కవితా పుస్తకం గుట్టపైనా అవిశరించిన. ఓ 20ఏళ్ల కిందటికన్నా ముందే.చాలా మంది కవులను పైకి ఎక్కించాను.ఐతే ఇప్పుడు మరోసారి చూడాలి.

  • @Hinduvudu
    @Hinduvudu 14 дней назад +6

    శత్రువుల దండయాత్రల సమయంలో ఓడిన పరిస్థితులలో పారిపోయి శత్రువుల కంటబడకుండా ఉండడానికి ఇలా అడవులలో కొండ గృహాలలో నివాసాలు ఉండేవని చెబుతారు. అక్కడనుండి తిరిగి బలం చేకూర్చుకొని రాజ్యస్వాదీనం కోసం ప్రయత్నం చేసేవారు.

  • @prathapecotraveller1992
    @prathapecotraveller1992 15 дней назад +1

    Nice rastrakuta new vinayaka discovery nice

  • @ktespl7135
    @ktespl7135 14 дней назад +4

    మీ కృషి చాలా గొప్పగా ఉంది. ఆర్కియాలజీ, ప్రభుత్వం వారు చొరవతీసుకొని త్రవ్వకాలు చేస్తే చాలా మంచిది.
    మరొక్క మారు మీ కృషికి అభినందనలు.

  • @chigullamahender6141
    @chigullamahender6141 15 дней назад +1

    Nice discovery sir

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  15 дней назад

      Tq

    • @nagalakshmib5652
      @nagalakshmib5652 14 дней назад

      అగ్గలయ్య రాష్ట్ర కూటుల రాజ ప్రతినిధి అంటారు కదా..ఆయన గొప్ప సిద్ధ వైద్యుడు.
      ఆయన ఇక్కుర్తి ప్రాంతంలో పెద్ద ఔషధశాల పెట్టి అనేక గ్రామాల వారికి మందులు ఇచ్చేవారని విన్నాను. అక్కడ ఆది మానవుల సమాధులు రాక్షసి గుళ్లు కూడా ఉన్నాయి.
      వాటిపై కూడా వీడియో చెయ్యండి.

  • @2025Hemanth
    @2025Hemanth 15 дней назад +1

    Great discovery sir