చిత్రావతికి నీళ్ళు తెప్పించిన ఘనత వైయస్ అవినాష్ రెడ్డి దే...

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • 2014లో సొంత నిధులు తో పులివెందుల ప్రాంతాలకి పైప్లైన్ ద్వారా సాగునీరు అందించిన ఘనత వైఎస్ఆర్సిపి దే పులివెందుల రూరల్ బిటెక్ రవి నువ్వు పులివెందుల అసెంబ్లీ రాజకీయాలకు క్రొత్త కావచ్చు మా నాయకుడు అవినాష్ రెడ్డి లింగాల మండలం నుంచే రాజకీయ ఆరంగ్రేటం చేసి రైతుల సమస్యలు తెలుసుకుని చిత్తశుద్ధితో ఆయన ఎంపీ కాకమునుపే నియోజకవర్గం రైతులకు నీళ్లు ఇప్పించాలనే సంకల్పం తో పులివెందుల నుంచి అనంతపురం కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి తుంగభద్ర నుంచి చిత్రావతి కి రైతులకు నీళ్లు తెప్పించిన ఘనత మా నాయకుడిది అలాగే లింగాల కుడికాలువ వద్ద రైతుల కోసం పూడిక తీత, తుంపెర డీప్ కట్ దగ్గర స్వంత నిధులతో రైతుల కోసం షెడ్ నిర్మించి మన నీటి వాటా కోసం తుంపెర డీప్ కట్ దగ్గరే రాత్రి పగలు జాగరణ చేయడానికి ఎంపీ నిధుల ద్వారా షెడ్ నిర్మించడం జరిగింది.ఆవిధంగా నీటిని తెచ్చుకొనే పరిస్థితి నుంచి చిత్రాపతి లోనే 10 టీఎంసీ ల నీరు నిల్వ ఉంచి 365 రోజులు రైతులకు కాలువల ద్వారా నీరు అందించిన ఘనత మా నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గార్లడే గత 2014 మీ ప్రభుత్వం హయాం లో రైతుల కోసం ప్రభుత్వం పూర్తి చేయలేని పైప్ లైన్ పనులను తన స్వంత నిధులతో దాదాపు రెండు కోట్లు ఖర్చు పెట్టి తాతిరెడ్డి పల్లి, కోమసూతల, ఎగువపల్లి, దిగువపల్లి, మురారి చింతల, లోపట్నూతల గ్రామాల రైతులకు పైప్ లైన్ లు వేసి సాగు నీరు అందించిన ఘనత మా నాయకుడిది అరటి రైతులకు 2016 -17 సమయం లోనే టన్ను కు 20 వేలు పై చిలుకు ధర లభించింది, ఎప్పుడైనా రైతు ల వంట మార్కెట్ కు అనుగునంగా ధరలు ఉంటాయి, అరటి కి దీని కి తేడా తెలయని నువ్వు అరటి ధరల గురించి మాట్లాడితే ఎలా, అరటి రైతుల కోసం జగన్ మోహన్ రెడ్డి గారు కోట్లు వెచ్చించి 95 శాతం పనులు చేసి శీతల గిడ్డంగి నిర్మిస్తే ఇంకో 5 శాతం పనులు పూర్తి చేసి దాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురాలేని నువ్వు రైతుల గురించి మాట్లాడటం సిగ్గుచేటు కమిషన్ లు వచ్చే మాట వాస్తవం అయితే ఈ రోజు అరటి కి ఉన్న రేట్ ను అలాగే కొనసాగించి కమిషన్ లు తీసుకోలేదని నిరూపించు, ఎప్పుడైతే వచ్చే నాలుగు సంవత్సరాల కాలం అరటి రేట్ తగ్గితే అప్పుడు నువ్వు కమిషన్ తీసుకున్నట్లే అని ప్రజలు భావించ వలసి వస్తుంది. ఈ సవాలు ను స్వీకరించగలవా. మార్కెట్ రేట్ అనేది డిమాండ్, వంట దిగుబడి మీద ఆధారపడి ఉంటుంది ఇకనైనా కమిషన్ లు అంటూ మాట్లాడటం మానుకో పులివెందుల నియోజకవర్గం లో దీని రైతుల కోసం దీని ధరల రేట్ పై ఉన్న దళారుల చూట్ కూడా లేకుండా చేసి మార్కెట్ యార్డ్ నిర్మించి రైతు లే స్వంతంగా మార్కెటింగ్ చేసుకునేలా చేసిన ఘనత జగన్ సార్, అవినాష్ రెడ్డి సార్ దే నీకు జూదం, కోడి వందేలు, మట్కా దోపిడీ ల పై ఉన్న అవగాహన రైతుల పక్షాన పోరాడటం పైన ఉండదు అన్న మాట అక్షర సత్యంఊరికే అధికారం ఉంది కదా అని కల్లబొల్లి మాటలు అసత్య ఆరోపణలు చేయడం మానుకోని చిత్తశుద్ధి తో పనిచేయాలని హితవు పలికారు కార్యక్రమం లో మండల కన్వీనర్ బాబు రెడ్డి, వెలిదండ్ల సర్పంచ్ మల్లికార్జున రెడ్డి, చిన్నకూడాల సర్పంచ్ నాగేంద్రనాథ్ రెడ్డి, మాజీ సింగిల్ విండో మల్లికేశవా రెడ్డి, రామట్ల పల్లి జగన్ మోహన్ రెడ్డి, పెద్దకుడాల కృష్ణారెడ్డి, ఇంటేపల్లి మధు సూధన్ రెడ్డి మండల యూత్ నాయకుడు మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Комментарии •