BIBLE STUDY//30/01/2025

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • #hebron #aswapuram
    #Psalms(కీర్తనల గ్రంథము) 138:1,2,3
    1.నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవతల యెదుట నిన్ను కీర్తించెదను.
    2.నీ పరిశుద్ధాలయముతట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామమంతటికంటె నీవిచ్చిన వాక్యమును నీవు గొప్పచేసియున్నావు. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను.
    3.నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచి తివి.
    #John(యోహాను సువార్త) 1:16,17,18
    16.ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి.
    17.ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.
    18.ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే(లేక, జనితైకకుమరుడే అనేక ప్రాచీనప్రతులలో-అద్వితీయ దేవుడే అని పాఠాంతరము) ఆయనను బయలు పరచెను.
    #Acts(అపొస్తలుల కార్యములు) 13:4,5,6,7,8,9,10,11,12
    4.కాబట్టి వీరు పరిశుద్ధాత్మచేత పంపబడినవారై సెలూకయకు వచ్చి అక్కడనుండి ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి.
    5.వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై యుండెను.
    6.వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్‌ యేసు అను ఒక యూదుని చూచిరి.
    7.ఇతడు వివేకముగలవాడైన సెర్గి పౌలు అను అధిపతియొద్దనుండెను; అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను.
    8.అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి, తొలగింపవలెనని యత్నముచేసి వారిని ఎదిరించెను; ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము.
    9.అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై
    10.అతని తేరిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది(అనగా-సాతాను) కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?
    11.ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను.
    12.అంతట ఆ అధిపతి జరిగినదానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను.

Комментарии •