Komma Kommako Sannayi Song From Gorintaku Movie

Поделиться
HTML-код
  • Опубликовано: 5 май 2013
  • Watch Komma Kommako Sannayi Video Song from Gorintaku Movie,
    Click Here To Watch More Videos :
    Singer Kousalya Exclusive Chit Chat : tinyurl.com/nmh7mpa
    Puri Punch Dialogues - • Puri Jagannadh Powerfu...
    Tollywood Best Monsoon Romantic Songs : tinyurl.com/oswgv5m
    Trivikram Comedy Punch Dialogues : tinyurl.com/pfe6x9p
    Chiru's 150th movie confirmed - • Ram Charan Officially ...
    Click here for more Latest Movie updates,
    Subscribe to our RUclips Channel: goo.gl/mDS9IQ
    Like us on / idreammedia
    Access iDreamMedia App on your Mobile:
    iPhone Users : tinyurl.com/lvu3wyx
    iPad Users: tinyurl.com/ls4tee8
    Android Users: tinyurl.com/m78hwyv
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 766

  • @bhashag3904
    @bhashag3904 Год назад +152

    ఈ పాటని సృష్టించిన సృష్టికర్తలకి, శోభన్ బాబు గారు, సుజాత గారికి పాదాభి వందనాలు🙏 🙏🙏ఇలాంటి ఆణిముత్యాలు ఇక రావు. ఇప్పుడు ఈపాట వినేవాళ్లు ఒకలైక్ కొట్టండి👍

  • @swethabujji7476
    @swethabujji7476 4 года назад +454

    మళ్ళీ ఈ జన్మలో ఇలాంటి అమోగం అయినా పాటలు చూస్తామా ఇంకా చూడలేము వినలేము అనే వారు లైక్ చేయండి.. మిస్ యు సుజాత గారు అండ్ శోభన్.. సార్ ❤️❤️🙏🙏🌹🌹👏👌

  • @reddyprasannakumari8445
    @reddyprasannakumari8445 2 года назад +71

    ఇటువంటి సాహిత్యం వినడం ఖచ్చితంగా తెలుగువారి అదృష్టం... 🙏🙏🙏

  • @shyamprasad5533
    @shyamprasad5533 Год назад +24

    శోభన్, సుజాత,నటి, నటులు, , వేటూరిసాహిత్యం , మామ సంగీతం, బాలు ఉన్న రోజులలో పుట్టినందుకు చాలా అదృష్ట వంతులము. 🙏

  • @VJ-xs5zt
    @VJ-xs5zt 3 года назад +125

    ప్రేమ ఎంత హుందాగా ఉండాలో , ప్రేమించడం ఎంత ఆరాధనగా ఉండాలో అత్యంత చక్కగా వర్ణించిన ఈ గీతాన్ని మర్చిపోలేం....
    " ఎప్పుడేముడి ఎవరితో పడి పడవ పయనం సాగుతుందో మరి " - ఎంత గొప్ప జీవిత సత్యాన్ని చెప్పారు వేటూరి వారు....

  • @mahaboobunnisabegum926
    @mahaboobunnisabegum926 2 года назад +24

    ఏదో తెలియని బాధ. ఈ పాటలు వచ్చినప్పుడు ఉన్న ప్రియ మిత్రులను కోల్పోయాను. పాట మాధుర్యం లోనే వాళ్ళ జ్ఞాపకాల బాధ.

  • @chandrasekharpanda4212
    @chandrasekharpanda4212 2 года назад +57

    ఇంత మంచి గీతం బాలుగారి గొంతు నుండి జాలువారింది ఎవ్వెర్ గ్రీన్ సాంగ్ ఆయన్ని ఎప్పటికి మరచిపొలెము

  • @dkr277
    @dkr277 2 года назад +104

    గ్రేట్ శ్రి దాసరి
    గ్రేట్ శ్రీ ఆత్రేయ
    గ్రేట్ శ్రీ వేటూరి
    గ్రేట్ శ్రీ మహదేవన్
    గ్రేట్ శ్రీ బాలు
    గ్రేట్ శ్రీ మురారి

    • @sankarrao9045
      @sankarrao9045 Год назад +3

      గ్రేట్ శ్రీ సుశీల గారు

    • @jayanagaraja2969
      @jayanagaraja2969 Год назад +2

      Female Singer ni marchipoyare, ani adagaalanukunnanu, kinda kanipinchindi .....

    • @krisxyz1998
      @krisxyz1998 Год назад +4

      Marchipoyaru sushilamma gaarini..gorintaku cinemalo paatalaku pranaam posindi sushilamma gaaru and Baalu gaaru

    • @raghureddy7217
      @raghureddy7217 Год назад

      u missed p sushila name

    • @madhumandli
      @madhumandli Год назад

      DKR ఏమీ సుశీల అమ్మను మారిచిరు

  • @varunfacts2439
    @varunfacts2439 2 года назад +26

    sdf ఈ పాటని చూసినా, విన్నా శోభన్ బాబు పాడుతున్నట్టే ఉంటుంది.... థ గ్రేట్ సింగర్ ఎస్.పి.బాలసుభ్రమణ్యం గారు

  • @shastrulapavanasree9444
    @shastrulapavanasree9444 Год назад +24

    ప్రతీ రోజు విన్నా మళ్లీ కొత్తగా అనిపించే మధురమైన పాట. ఎంత మంచి అభినయం , ఎంత అణకువగా,ఎంత ఆరాధన గా ఉంది 👌🏻👌🏻👌🏻🌹🌹

  • @Lobster16763
    @Lobster16763 2 года назад +50

    భార్య అంటే అలా ఉండాలి. పెద్ద రంభ కానక్కర్లేదు. ఇలా చక్కదనాల చుక్కలా, హుందాగా, నిండుగా చీర కట్టుకుని, హంగులు ఆర్భాటాలు లేకుండా, నేలకు హ్రుదయానికి దగ్గరగా, భర్తకి కూడా గౌరవప్రదంగా, ఆమే ఒక ఆస్థి అనిపించేలా, ఆహా ఏమి నా భాగ్యము అనిపించేలా. నవ్వితే మెరుపులు మెరవనక్కర్లేదు. మల్లెలు పూస్తే చాలు. అంటే ఎక్కువ సినిమాలలో నటించే తారలా కాకుండా ఎప్పుడో వాన పడ్డప్పుడే కనిపించే హరివిల్లులా సుజాతలా...
    Sujaata, I love you Sujaata....🌹💕🙏

  • @srmurthy51
    @srmurthy51 4 года назад +31

    1979 విడుదల . అద్భుతమైన విజయం సాధించింది. సుజాత అప్పుడే ఎంటర్ తెలుగు సినిమాలలో.

  • @anilpdsanil8367
    @anilpdsanil8367 Год назад +9

    మధురమైన అనురాగం,,ప్రేమ లో ఉండే హుందాతనం, తీయదనం ఆ ఉభయులిద్దరూ జీవించారు. మా ఆభిమాన శోభన్ బాబు గారు.

  • @SUNILSUNIL-cz5ry
    @SUNILSUNIL-cz5ry 3 года назад +25

    ఆ రోజుల్లో , ఆ కాలేజ్ డేస్ , ఆ మెమోరీస్ ....wonderful

  • @spsrikanth5451
    @spsrikanth5451 3 года назад +20

    సాహిత్యానికి సినీ గుబాలింపు అద్దడం అద్భుతం...👏

  • @sheelakrish872
    @sheelakrish872 3 года назад +158

    కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
    ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
    ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
    కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
    మనసులో ధ్యానం మాటలో మౌనం
    మనసులో ధ్యానం మాటలో మౌనం
    మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది
    మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
    మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది
    మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
    పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
    పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
    పసితనాల తొలి వేకువలో ముసురుకున్న మబ్బులు చూడు
    అందుకే ధ్యానం అందుకే మౌనం
    //కొమ్మకొమ్మకో సన్నాయీ...//
    కొంటే వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు
    ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
    కొంటే వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు
    వురకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
    ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి వుండాలి
    ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి వుండాలి
    ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి
    అందుకే ధ్యానం అందుకే మౌనం
    అందుకే ధ్యానం అందుకే మౌనం
    కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
    ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
    మనసులో ధ్యానం మాటలో మౌనం
    కొమ్మకొమ్మకో సన్నాయి...

    • @maheshwarisbr3949
      @maheshwarisbr3949 3 года назад +6

      ఎంత గొప్ప సాహిత్యం... అందమైన సంగీతం.. అంతే అద్భుతమైన సుశీల.. బాలు గారి గానం.. మనసుకు దగ్గరయ్యే ఇలాంటి పాటలు ..ఇంక మళ్ళీ రావు

    • @ramchanderrao2254
      @ramchanderrao2254 2 года назад

      Meaning full and mellody song

    • @lakshmivedururu795
      @lakshmivedururu795 2 года назад

      Butiful songs

    • @subbaraosanaka6334
      @subbaraosanaka6334 2 года назад

      Thanks andi

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 года назад

      Sujaatha great super ❣️ rrr nice 👍

  • @srinubabubotcha4125
    @srinubabubotcha4125 3 года назад +157

    ఈ పాటని చూసినా, విన్నా శోభన్ బాబు పాడుతున్నట్టే ఉంటుంది.... థ గ్రేట్ సింగర్ ఎస్.పి.బాలసుభ్రమణ్యం గారు.......త్వరగా కోలుకుని ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని కోరుకుంటున్నా...

  • @gondesisolapuri5691
    @gondesisolapuri5691 2 года назад +24

    ఇంత మంచి పాట
    ఇప్పటి వరకు రాలేదు రాదేమో
    గానం లో అంత మాధుర్యం
    మనస్సుకు హత్తుకునే కావ్యం

  • @anilkumarthirumalasetty3794
    @anilkumarthirumalasetty3794 4 года назад +139

    ప్రపంచంలో అద్భుతం అనేది వుంది అంటేనే బంధం దాని విలువ తెలిసిన వాడికి జీవితంలో ఈ పాట లోని అంతరార్ధం తెలుసు కొని జీవితప్రయాణం చేస్తాడు.... అనిల్

  • @user-py7qi8cz5l
    @user-py7qi8cz5l Год назад +4

    SSS ❤️సుజాత ❤️శోభన్ బాబు ❤️కేవీ మహా దేవన్ గారు నైస్ సంగీతం ❤️బ్యాక్ రౌండ్ లొకేషన్ గోదావరి సూపర్ total song refesh mind 🙏

  • @sudheer143babu
    @sudheer143babu 4 года назад +33

    సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన సంగీతం సహా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో బాణిలు టాప్

  • @mrswamy6395
    @mrswamy6395 4 года назад +22

    మనసులో భావాన్ని పాట రూపంలో అందించారు tank you

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 2 года назад +18

    సుజాత గారి యాక్షన్ సూపర్❤❤👌👌

    • @bhashag3904
      @bhashag3904 Год назад

      శోభన్ బాబు గారి యాక్షన్ బాగలేదా!

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 2 года назад +3

    సాహిత్యానికి చిరునామా ఈ పాట వింటే తెలుస్తుంది.👌

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +9

    బాలు అన్న గారు మఖరంధం‌ తాగి పాడినట్లు వుంది ఎంత అమోఘంగా వుందండి ఆ ధేవుడు బాలు గారి ఆత్మను మాత్రమే తీసుకోగలిగాడు ఆయన పాడిన ఒక్క పాట ను కూడ. ట‌చ్ చేయలేకపోయాడు ఇక్కడ ఆయన. బ్రతికే వున్నాడు శరీరం ‌ఆత్మ నే‌‌లేదు ‌ ఆయన గాత్రం ఇక్కడే వుంది ‌అది ఏదేవుడవలనకాదు ‌తీయ్యాలంటే కబధార్

  • @VenkatReddy-zq2bf
    @VenkatReddy-zq2bf Год назад +3

    ఈ పాట వింటూంటే మనసు ఏంతో హాయిగా ఉంటుంది మల్లి ఇట్లాంటి మల్లీ వస్తాయ

  • @atchutaramayyajagata1114
    @atchutaramayyajagata1114 2 года назад +8

    నేను 1980 నుండి ఈ పాటనుఏన‌్నోసార‌్లు అయినా మొదటి సారే వింటున్నాను

  • @munnavilak1375
    @munnavilak1375 6 лет назад +350

    కొమ్మ కొమ్మకో సన్నాయి..కోటిరాగాలు ఉన్నాయి. ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం...
    అచ్చ తెలుగు పాటల మణిహారం.
    నిండు గోదారమ్మ ప్రవాహం.
    సంగీత సాహిత్య ప్రియులకు వేటూరి వరం.ఈ పాట విన్నప్పుడల్లా ఒళ్ళు పులకరిస్తుంది. ఎన్నిసార్లు విన్న అదే అనుభూతి. గోదావరి పాపికొండల నడుమ స్వచ్ఛంగా అచ్చ తెలుగు పదాలతో విన్న ప్రతిసారి ఎదో తెలియని మైకం అవహిస్తుంది. ఎంత బాగా రాసవయ్య "వేటూరి" పాటను.
    ఎన్ని తరాలు మారినా ని పాటలో మాధుర్యం తగ్గదు.మా గుండెల్లో చెరగదు.మళ్ళీ పుట్టవయ్యా నాకు మరుజన్మ ఉంటే ని చేతి కలంగానో కాగితంగానో పుడతాను.'మరణించిన తరువాత మనిషి అందరికీ గుర్తుండాలంటే సదా గుర్తుంచుకోదగిన పుస్తకాలనైనా రాసి పెట్టి వెళ్ళాలి. పుస్తకాలుగా రాయదాగిన పనులనైనా చక్కబెట్టి ఉండాలి.
    నా మధుర స్మృతుల్లో అత్యంత ఇష్టమైనపాట.
    ఈ పాటకో ప్రత్యేకత ఉంది పల్లవి వేటూరి రాస్తే చరణలు ఆత్రేయ గారు రాయడం విశేషం.
    ఎందరో మహానుభావులు అందరికి వందనాలు..
    ✍ మున్నా

  • @ramanamurthy7352
    @ramanamurthy7352 2 года назад +14

    Sujatha's walking style 👌

  • @DeviValavala-mk7lo
    @DeviValavala-mk7lo 8 месяцев назад

    అద్బుతం పాట అబినయమ్ సూపర్ 😂

  • @purushIndia
    @purushIndia 4 года назад +221

    ఏమయ్యా... బాలసుబ్రమణ్యం, శోభన్ బాబును దింపేశావు గదయ్యా... Gr8

    • @jarrenashaik108
      @jarrenashaik108 4 года назад +3

      Songsaperhit

    • @PraveenKumar-sk7do
      @PraveenKumar-sk7do 4 года назад +8

      Bala subramanyam dimpandi evaranna unnara.??

    • @srinubabubotcha4125
      @srinubabubotcha4125 3 года назад +3

      Yes 100%

    • @purushIndia
      @purushIndia 3 года назад +1

      Ayya... Balu garu... Entandi intha pani chesaru...
      #om_shanthi_balu

    • @VKTVCHANNEL
      @VKTVCHANNEL 3 года назад +2

      అవును ఈ పాట ఎప్పుడూ బాలు పాడినట్టు అనిపించదు. శోభన్ బాబు మాత్రమే గుర్తిస్తాడు. His expressions also. Two dedicated artistes.

  • @thimmannadadapogul2673
    @thimmannadadapogul2673 4 года назад +68

    ఎన్ని సార్లు ఈ పాట విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @esrilakshmi
    @esrilakshmi 4 года назад +53

    ఎంత వినసొంపైన పాట,ఈ పాట వింటే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది

  • @shankarbathini9739
    @shankarbathini9739 Год назад +2

    ప్రతి ఒక్కరి Top 20 లో ఈ పాట ఉంటుందనుకుంటా .

  • @kvslnarasimharao6871
    @kvslnarasimharao6871 Год назад +2

    అక్షరాలలో ఒదగని అనుభూతి గుండెలోతుల్లో కదిలే భావలహరి! ఈ పాటకు ప్రాణప్రతిష్ఖచేసిన అందరికీ వందనాలు వందనాలు

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Год назад +68

    ఆ కాలం ఆరోజులు మళ్ళీ రావు. మా జన్మకు ఇది చాలు

  • @vlgsarma5901
    @vlgsarma5901 4 года назад +20

    ఏక్సన్, లిరిక్, & ప్లేబ్యాక్ ఆల్ గుడ్, బెటర్, & బెస్ట్. ధాంక్యూ ఆల్.

  • @poornak59
    @poornak59 2 года назад +4

    అవును నిజం మైన మనసు ‌దేనం మాటలో మౌనం

  • @rajashekar3389
    @rajashekar3389 2 года назад

    ఇలాంటి వి కుటుంబ సమేతంగా చూసె ప‌్రేమ పాటలు సాధ‌్యామా hatsup to total team wrieter

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 3 года назад +3

    Sujatha entha naturalga act chesavu naa teenage lovely song

  • @duvvadajeeviteswararao1412
    @duvvadajeeviteswararao1412 2 года назад +1

    Most handsome n stylish hero Sobhanbabu.

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 года назад +3

    ఆంధ్రా అందగాడు సోగ్గాడు శోభన్ బాబు గారు ❤️❤️❤️

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng 3 года назад +16

    Roaring melody in Balu's voice

  • @mandajinaveen1524
    @mandajinaveen1524 Год назад

    Maa amma ku baga ishtamyna movie..vaari chinnathanam lo chusam ani appudu chebhutundi...great legend s

  • @AaronAnnu
    @AaronAnnu 2 года назад +4

    ఈ పాటని వింటే నన్ను నేను మైమరచి పోతాను..

  • @Vasudha1863
    @Vasudha1863 3 года назад +9

    చిత్రం:- *గోరింటాకు* (1979)
    దర్శకత్వం:- దాసరి.నారాయణ రావు
    సాహిత్యం:- వేటూరి.సుందర రామమూర్తి
    సంగీతం:- కె.వి.మహదేవన్
    నేపథ్య గానం:- పి.సుశీల, ఎస్.పి.బాలు
    కొమ్మ కొమ్మకో సన్నాయి
    కోటి రాగాలు వున్నాయి
    ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం(2)
    కొమ్మ కొమ్మకో సన్నాయి
    కోటి రాగాలు వున్నాయి
    మనసులో ధ్యానం మాటలో మౌనం
    మనసులో ధ్యానం మాటలో మౌనం
    మనసు మాటకందని నాడు
    మధురమైన పాటవుతుంది
    మధురమైన వేదనలోనే
    పాటకు పల్లవి పుడుతుంది (మనసు)
    పల్లవించు పడుచుదనం
    పరుచుకున్న మమతను చూడు(2)
    పసితనాల తొలి వేకువలో
    ముసురుకున్న మబ్బును చూడు
    అందుకే ధ్యానం అందుకే మౌనం
    కొమ్మ కొమ్మకో సన్నాయి.......
    కొంటె వయసు కోరికలాగ
    గోదారి ఉరకలు చూడు
    ఉరకలేక ఊగిసలాడే
    పడవకున్న బంధం చూడు(కొంటె)
    ఒడ్డుతోనూ...నీటితోనూ
    పడవ ముడి పడి వుండాలి
    ఎప్పుడే ముడి ఎవరితో పడి
    పడవ పయనం సాగునో మరి
    అందుకే ధ్యానం అందుకే మౌనం(2)(కొమ్మ కొమ్మకో

  • @eedarasrinivasarao8078
    @eedarasrinivasarao8078 2 года назад +3

    One BALU
    One Aathrea
    One Veturi
    One Daasari and
    One MAHADEVAN

  • @nagarajatanuku4289
    @nagarajatanuku4289 Год назад +1

    Shri spb,shoban Babu Garu and sujatha garu great artists

  • @vv9103
    @vv9103 3 года назад +24

    Great singers, great actors...great director , great music...

  • @nagallamohan1355
    @nagallamohan1355 3 года назад +8

    This movie release at my child hood High school days.i was fan of Shobhan Babu

  • @swamylingala2655
    @swamylingala2655 5 лет назад +4

    ఈ పాట ఎన్ని సార్లు విన్న తనివి తీరదు.very melodious song. I. Like it so much

  • @janagamsheakergoud3608
    @janagamsheakergoud3608 4 года назад +18

    OLD IS GOLD 👌🏻👌🏻👌🏻

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 года назад +2

    ఇంత అర్ధాలు సమకూర్చి రాసిన కవికి పాదాభివందనం చేస్తున్నాం గోరింటాకు సినిమా సూపర్ 😍😍😍👌👌👌👌👌👌

  • @potugadu007
    @potugadu007 Год назад +4

    Simplicity at its best..lyrics are simple, yet so thoughtful, SPB and Suseela's vocals...as sweet as nectar...
    Remains forever as one of those gems 👍

  • @obulesumuktapuram8727
    @obulesumuktapuram8727 3 года назад +4

    సదా ఆభినందనీయులు ఈ పాట పాడిన మరియు రాసిన వారు💘💘💘

  • @kotisw4175
    @kotisw4175 4 года назад +75

    కోయిల రాగాలను ఒడుపుగా పట్టి గోదారి తరంగాలను అలలుగా మార్చి సంగీత ప్రియుల హృదయాలకు చెరిగిపోని జ్ఞాపకంగా ఎన్నడూ మరపురాని మధురానుభూతిని కలిగించే కవితలహరి

  • @pramodchakravarthymsc1151
    @pramodchakravarthymsc1151 3 года назад +2

    Super బాలు గారు

  • @hemanth7119
    @hemanth7119 7 лет назад +13

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

    • @rajalingam5991
      @rajalingam5991 4 года назад +1

      Rajalingam

    • @sujathak296
      @sujathak296 3 года назад +1

      ఎప్పుడో.... ముడి... ఎవరితో పడి ...
      పడవ ....పయనం ....సాగునో ....మరి

    • @hemanth7119
      @hemanth7119 2 года назад

      @@rajalingam5991 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 2 года назад

      @@sujathak296 గారు ధన్యవాదాలు.

    • @devivalavala2357
      @devivalavala2357 2 года назад +1

      @@hemanth7119 అభినందానాలు

  • @jhansivijaykumar952
    @jhansivijaykumar952 3 года назад +12

    All time favourite of mine.❤️

  • @ragirilingaswamy9105
    @ragirilingaswamy9105 4 года назад +89

    Those listening in 2020

    • @puttaparthiramulamma8724
      @puttaparthiramulamma8724 4 года назад +2

      Yb

    • @murarimurari6729
      @murarimurari6729 4 года назад +1

      Maravalyne&song&murari&toopranmaydakgella&26-05-2020&09-00am

    • @reddyysr4346
      @reddyysr4346 4 года назад +1

      Super real life Jesu's God

    • @radhadevi10
      @radhadevi10 4 года назад

      @@puttaparthiramulamma8724 aaaààaaaaaaààaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaàaàaàaàaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaàa

    • @bhavanigumparthi8138
      @bhavanigumparthi8138 3 года назад

      @@puttaparthiramulamma8724 ttt

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 года назад +16

    ఇందులో పల్లవి వేటూరి రాసారు తర్వాత ఆయన వేరే కారణాల వల్ల రాయడం లేట్ అవ్వడంతో నిర్మాత ఆత్రేయ గారి తో చరణాలని రాయించారు. కానీ పేరు మాత్రం వేటూరి గారిదే వేయమన్నారు. అది ఆత్రేయ గారు అంటే....

    • @WalkingKarma
      @WalkingKarma 3 года назад +1

      Thanks for sharing this bro. Is this the one where Veturi sent the payment to Aathreya garu and he denied etc and Veturi’s wife invited Athreya garu for lunch on a Sunday. He said but never showed up!! Veturi said to his disappointed wife “బాధ పడకు, చెప్పిన time కి వస్తే ఆయన ఆత్రేయ ఎందుకవుతాడూ?” ☺️☺️☺️ సంస్కారమంటే అదీ!!

    • @u.dastagiri3
      @u.dastagiri3 3 года назад

      @@WalkingKarma అలా టైం కి వెళితే ఆత్రేయ ఆత్రేయ కాదు అలా రాలేదు కాబట్టే ఆయన ఆత్రేయ గారు అయ్యారు మా గురువు గా నిలిచారు.. 🌹🌹

  • @arundevara2216
    @arundevara2216 Год назад +6

    No words to describe such songs which gives sweet memories

  • @PVRaviKumar
    @PVRaviKumar Год назад +6

    What a pleasant song!🎵 🎶

  • @maneswarch9515
    @maneswarch9515 2 года назад +2

    Sujatha garu superb talented Actor..

  • @smilysweetychannel509
    @smilysweetychannel509 Год назад +1

    చాలా మధురమైన పాట

  • @vktrocks3685
    @vktrocks3685 Год назад +2

    Shobhan Babu ..Legend Balu ..Sujatha garu 🙏

  • @chandrasekharpanda4212
    @chandrasekharpanda4212 2 года назад +2

    వండర్ఫుల్ సాంగ్

  • @sathishbabu6870
    @sathishbabu6870 2 года назад +1

    Both are very disciplined actors if yes click the like button.

  • @dvenkatarao9926
    @dvenkatarao9926 2 года назад +2

    beautiful song 👌👌👌
    my favourite song

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 2 года назад +3

    INTRODUCTION MUSIC 🎶 IS RAASANU PREMALEKHA LENNO... 🙄😁😁😁😍

  • @karraramesh5592
    @karraramesh5592 3 года назад +2

    అద్భుతమైన పాట.

  • @ramuanupoju2961
    @ramuanupoju2961 2 года назад +8

    Great writer,great singers,great music director🙏🙏💐💐

  • @meenakshimeenu6571
    @meenakshimeenu6571 Год назад +1

    ఈ పాట నాకు చాలా ఇష్టం ❤️

  • @39srini
    @39srini 5 лет назад +22

    Melodious music and my favorite song

  • @bhagyasreedasari7074
    @bhagyasreedasari7074 4 года назад +37

    R R R ప్రజల గుండెల్లో నిలిచి పోతుంది ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచి పోతుంది ఎవరికి అంకితం కాదు ఆర్ ఆర్ ఆర్

  • @cethimmaiah-yk1nv
    @cethimmaiah-yk1nv 3 месяца назад

    Expressions of sujatha madam and walking style super first debut in tollywood.even shobhan Babu,s feeling s super

  • @RajK09
    @RajK09 Год назад +2

    పసితనాన తొలి వేకువలో.. ముసురుకున్న మబ్బులు చూడు...
    ...
    ఎపుడేముడి ఎవరితో పడి.. పడవ పయనం సాగునో మరి...
    అందుకే ధ్యానం.. అందుకే మౌనం...
    I fond of these lines, there is an insane depth

  • @LAHARICHANNEL
    @LAHARICHANNEL 3 года назад +6

    Balu sir niku padabivandanam 🙏🙏🙏

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад

      బాగా చెప్పారండి ధన్యవాదములు మీకు

    • @LAHARICHANNEL
      @LAHARICHANNEL 2 года назад

      🙏🙏🙏

  • @shekarthelukuntla6117
    @shekarthelukuntla6117 4 года назад +2

    ఇలాంటి సాహిత్యం సంగీతం గానము చిత్రీకరణ ఆస్వాదిస్తున్న మనందరం అదృష్టవంతులం.

  • @jnandu4756
    @jnandu4756 6 лет назад +18

    All time hit song nd never before....

  • @rambabuvasamsetty4662
    @rambabuvasamsetty4662 3 года назад +3

    Iike this song so much, so i listen this song repeatedly

  • @guravaiahgarlapati2912
    @guravaiahgarlapati2912 2 месяца назад

    ఇలాంటి పాటలు పిల్లల పాటలు రావాలి

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 4 года назад +5

    Wonderful.COMBINATION.OF.ACHARYA.ATHREYA.VETURI.SUNDARA
    RAMAMUURTHY.AND.KV.MAHADEVANGARU.

  • @mahendrachowdary5441
    @mahendrachowdary5441 8 лет назад +18

    1 off the best song

  • @praveent8848
    @praveent8848 3 года назад +4

    Dammm song...... spb sir .... wht a legend ur miss u sir .....

  • @anitharajeeth1968
    @anitharajeeth1968 5 лет назад +10

    Ever green song... Thank you

  • @ushanagireddi2657
    @ushanagireddi2657 2 года назад +2

    I love you so much this song mana andaala natudu sobhana babu great 👍💐👍🤝👍💐👍🤝👍💐👍🤝👍💐👏👏👏

  • @sreekrishnadevarayalu3073
    @sreekrishnadevarayalu3073 2 года назад +1

    Yuvachitra,banner movies are best for songs and heart touching theme irrespective of heroes. Chandramohan, sobhan babu. Krishnamraju, Balakrishna..venkatesh Nagarjuna

  • @ksivaram4682
    @ksivaram4682 Год назад +1

    ❤️❤️👍👍 Kodali Siva Rama Krishna my favourite song extraordinary lyrics 💯❤️❤️❤️❤️❤️

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 года назад +20

    తెలుగు అందాలు ఈ పాటను ఎంతబాగా పాడినారు బాలు గారు సుసీలమ్మ ఈ పాట‌ విన్నప్పుడు కలిగే అనుభుతి మాట‌ల్లో చెప్పలేము అది వినేవారికి మాత్రం అర్దమౌతుంది 7/5/2020

  • @gandhimatcha4612
    @gandhimatcha4612 3 года назад +2

    Sujatha Garu Meeru Excellent Actor.

  • @sangeetarawa9141
    @sangeetarawa9141 2 года назад +4

    my heart beats ❣️ for these songs

  • @englishbyjnr1968
    @englishbyjnr1968 Год назад +2

    Hats off to Sri Veturi and Sri KV Mahadevan garu

  • @durgaprasadguttula3516
    @durgaprasadguttula3516 6 месяцев назад +1

    🙏adhubuta mayena pata e pata srustey karta ki dhanyavadamulu🙏🙏🙏 thank you👍

  • @subhashsampathi9348
    @subhashsampathi9348 5 лет назад +14

    At least one time per daily. Awesome song and lyrics

  • @durgabhavani1516
    @durgabhavani1516 5 лет назад +20

    Eppude mudi evaritho padi padava payanam saageno Mari...🙏great meaning...ilanti paatalu ee rojullo prathi okkaru vini teerali..raasina rachayithaki namaskram

  • @vv9103
    @vv9103 3 года назад +3

    Suseelamma gariki johaarluu...

  • @HCSC2022
    @HCSC2022 Год назад

    One& only ever best for ever one of the tastiest dreem projects of producer 💐🙏💐👏🙏 Mr.KATRAGADDA MURARi..🙏💐👏🙏💐🍒🍒.Ever Green songs with music& meaningful Lyrics 🍒🍒

  • @aegkveedi9667
    @aegkveedi9667 Год назад +1

    Supar song

  • @bunadrik22
    @bunadrik22 2 года назад +3

    My childhood song beautiful