చిన్న హుల్తి భజన బృందం (తెలుగు లిరిక్స్) venkatagiri bajana potilu // Telugu devotional songs
HTML-код
- Опубликовано: 14 дек 2024
- ఉదయరవిచంద్రిక రాగం : ఖండగతి తాళం
సాకి :- సాగమ గమపప గమపనిని పనిస సనిపమగ
మగసనిస.
పల్లవి :- జైజై మహావజ్రదేహా జైజై మహా వీర హనుమా
హనుమంత బలవంత శ్రీ రామదూత
జైజై భజరంగి రామాంజనేయ. ౹౹జైజై౹౹
చరణం:- అంజనాదేవి గారాలతనయా
అతులిత బలధామా కేసరినందన - 2
రాక్షసాంతక శూర ఓ రామ భక్త - 2
కోరస్ :- శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం - 2
ముజ్జగంబులకు నీవే రక్ష - 2 ౹౹జైజై౹౹
చరణం:- సీతారాములకు ఆత్మీయ బంటువు
నిను నమ్మువారిని రక్షించు దేవుడవు - 2
రామసుగ్రీవులకు మైత్రిని కల్పించి
కోరస్ :- శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ఆచంద్రతారార్కం వసుధలో నిలిచితివి - 2౹౹జైజై౹౹
చరణం:- రావణుని గర్వంబు అణచిన స్వామి
లంకను ధ్వంసంబు చేసిన దేవా - 2
జైజై హనుమా జాలమేలా రావా
కోరస్ :- శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం - 2
మము బ్రోవుమయ్యా వీరాంజనేయ - 2. ౹౹జైజై౹౹
____________________________________________
ముల్తాన్ రాగం ఆది తాళం
సాకి : శంభో.... హరహర మహాదేవ శంభో...
పల్లవి : మహాదేవ శంభో మము కావరావా
కరుణామృతా నిలయా కైలాసవాసా ఉమా
మహేశా కరుణించి కాపాడవా హరహర
కరుణించి కాపాడవా
చరణం: కనులకు ఒకసారి కనుపించరావా
మనసార నిన్నే కొలిచేము స్వామి
కారుమబ్బులు కమ్మెను జగతిని
జ్యోతిని వెలిగించరా హరహర
మాలో చీకటి తొలగించవా "మహదేవ"
చరణం: శ్రీశైలవాసా శ్రిత పారిజాతా
శతకోటి లింగేశ్వరా హరహర
ఓంకార నాదాయ ప్రణవ స్వరూపాయ
ఆనంద తేజోమయా హరహర
ఆనంద తేజోమయ "మహాదేవ
____________________________________________
రేవతి రాగం : జెంపె తాళం
పల్లవి :- చాలదా బ్రహ్మ మిది సంకీర్తనం
మీకు జాలెల్ల నడఁగించు సంకీర్తనం. ౹౹చాలదా౹౹
చరణం:- సంతోషకరమైన సంకీర్తనం
సంతాప మణగించు సంకీర్తనం
జంతువుల రక్షించు సంకీర్తనం
సంతతముఁ దలఁచుఁ డీసంకీర్తనం. ౹౹చాలదా౹౹
చరణం:- సరవి సంపదలిచ్చు సంకీర్తనం
సరిలేని దిదియపో సంకీర్తనం
సరుస వేంకటవిభుని సంకీర్తనం
సరుగుననుఁ దలచుఁ సంకీర్తనం. ౹౹చాలదా౹౹
____________________________________________
bajana potilupatalu
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.
సూపర్ అన్న