7.వ బహుమతి // డోన్_శ్రీ సరస్వతి భజన బృందం // venkatagiri bajana potilu / telugu lyrics bajana Patalu

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 5

  • @ismartramakrishna
    @ismartramakrishna  8 дней назад

    కళ్యాని రాగం : ఆది తాళం
    పల్లవి :- తలచరో జనులు యీతని పుణ్య నామములు
    సులభముననే సర్వ శుభములు కలుగు.
    చరణం:- హనుమంతుడు వాయుజు డంజనా తనయుడు
    వనధి లంఘన శీల వైభవుడు
    దనుజాంతకుడు సంజీవనీ శైల సాధకుడు
    ఘనుడు కలశాపుర హనుమంతుడు.
    చరణం:- చటులార్జున సఖుడు జాతరూప వర్ణుడు
    ఇటమీద బ్రహ్మ పట్ట మేలేటి వాడు
    నటన శ్రీ వేంకటేశు నమ్మిన సేవకుడు
    పటు కలశాపుర ప్రాంత హనుమంతుడు.
    ____________________________________________
    రాగం :- ముళ్తాని రాగము
    తాళం :- త్రిపుట తాళము
    సాకి :- ఈశ్వరా సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి
    భ్రామయన్ సర్ప భూతాని యంత్రారూఢ నిమాయయా
    పల్లవి :- శ్రీ మహేశ గౌరీశ శంకర
    పాహిమాం పరమేశ ఈశ్వర
    మీ మహూన్నత సద్గుణంబులు
    మునివరేణ్యులు తెలుప వింటిమి. ౹౹శ్రీ మహేశ౹౹
    చరణం:- సాలెపురుగు సర్పం ఏనుగు
    భక్తిచే కైవల్యం పొందెను
    నిరతమూ నిను ఆరాధించెద
    కరుణనేలగ రార హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹
    చరణం:- ప్రళయమౌనని హాలాహలము
    కంఠమందున నిల్పినావు
    అండపిండ బ్రహ్మండంమంతయు
    కాచినావు మహేశ హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹
    మిత్ర :- శ్రీ మహేశ పాపవినాశ ఫాలనేత్ర పన్నగ భూష
    నీలకంఠ నిఖిలాదార నీవె శరణు హరహర శివ శంభో
    ____________________________________________
    రాగం...నీలాంబరిరాగం
    తాళం... రూపకము
    సాక్షి :- హే సూర్యాన్మయాబ్ది సోమ రామా...
    రాక్షస సంహార... రఘువంశధి రామ
    సార్వభౌమా... రామా...
    పల్లవి :- ఏల రాదు నీ దయ ఏల వేమి రామయ,
    చాలగ నిను వేడితి బ్రతిమాలి తి నీ పాల బడితీ
    చరణం:-
    రామ రామ అనుచు నిన్ను స్మరణ చేయుచున్న, నన్ను
    అరమరేమి లేక మదిని, కరుణ చూపవేమి, రామ, పంతమేలపంకజాక్ష అంత కోపమేల రామ
    చెంతచేరి వేడి నాను, చింత తీర్చవేమిస్వామి. ౹౹ఏల రాదు౹౹
    చరణం:-
    శరణు శరణు అనుచు నిన్ను స్మరణ చేయుచున్న నన్ను కరిరాజును గాచిన గతి కావ వేల కమలనయన భారమవుదునా నేను ధరణీధర దేవ దేవ
    ధారుని నీ సేవ కన్న అన్యమేమి లేదు నాకు ౹౹ఏల రాదు౹౹

  • @MadhuSudhan-bw7bk
    @MadhuSudhan-bw7bk 8 дней назад +1

    Super anna🎉🎉

  • @hindigangadhar8579
    @hindigangadhar8579 8 дней назад +1

    Super

  • @savanamnagendrareddy5062
    @savanamnagendrareddy5062 8 дней назад +1

    😢