Alluri Seetharama Raju Telugu Movie || Vastadu Naaraju Video Song || Krishna, Vijaya Nirmala

Поделиться
HTML-код
  • Опубликовано: 29 июл 2014
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,6 тыс.

  • @user-gy2zw2lw8b
    @user-gy2zw2lw8b 8 месяцев назад +36

    తెలుగు జాతి ఎన్నటికీ మరచిపోని
    ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు రాలేవు.
    అద్భుతం మహా అద్భుతం 🌹🙏🌹

  • @saiduluedulakanti6875
    @saiduluedulakanti6875 4 года назад +392

    ప్రతిరోజు ఈ పాట వింటాను వింటూనే ఉంటాను ఇక మీదట ఇటువంటి పాటలు ఎవరు రాయలేరు ఈ పాట వినే సూపర్ స్టార్ క్రృష్ణ విజయనిర్మల అభిమానులు ఒక లైక్ వేసుకోవాల్సిందే

  • @anjanmalleboina3080
    @anjanmalleboina3080 Год назад +29

    ఆహా ఏమి ఈ మధురానుభూతి ఈ పాట విన్నప్పుడల్లా నా మనసు ఏదో తెలియని ఆనందంతో తెలియాడుతుంది. విజయనిర్మల గారి నటన అమోఘం అద్భుతం.

  • @vangaramulu4478
    @vangaramulu4478 2 года назад +17

    స్వచ్ఛమైన ప్రేమ ఒక దిక్కు, స్వాతంత్ర కాంక్ష ఒక దిక్కు
    సూపర్

  • @kuthalivenugopal256
    @kuthalivenugopal256 11 месяцев назад +24

    Dr C, నారాయణ రెడ్డి గారి రచన
    గాన కోకిల సుశీలమ్మ గారి గానము,
    అందాల విజయ నిర్మల గాని నటన
    ఆద్యంతం అద్భుతం 💥💥💥💥💥💥💥💥

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 года назад +88

    పాట సాహిత్యం చాలా బాగుంది❤️❤️❤️
    ఇంత గొప్ప సాహిత్యం తో నిండిన పాటను రాసి మాకు అందించిన సినారె గారికి 🙏🙏🙏

  • @CHARITHAVLOGS
    @CHARITHAVLOGS 2 года назад +53

    ఈ భూమి మండలం ఉన్నన్ని రోజులు ఈ పాట ఉంటుంది... అజరామరం సీతారామరాజు కీర్తి... 🙏🙏🙏🙏

    • @DurgaPrasad-sb6xr
      @DurgaPrasad-sb6xr 7 месяцев назад +3

      మేముచాలాlucky Mee time lo పుట్టినందుకు

    • @neerajarai1846
      @neerajarai1846 Месяц назад

      Correct sir

  • @rahimullashaik6467
    @rahimullashaik6467 5 лет назад +233

    విజయ నిర్మల గారు ఈ పాటకు మిమ్మల్ని తెలుగు ప్రజలు ఎప్పుడు మరచిపోరు. RIP

  • @mywish6722
    @mywish6722 3 года назад +176

    నాకు ఎప్పుడు ఈ పాట విన్నా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.....🙏
    కృష్ణ, విజయనిర్మల గారికి ఈ జాతి ఋణపడి ఉంటుంది.

    • @rameshvalupadasu8294
      @rameshvalupadasu8294 2 года назад +3

      Eppatiki 1000 vinna

    • @skidsteer7129
      @skidsteer7129 2 года назад

      NTR also felt that only Krishna did justification to Alluri sir...

    • @ravikumar-bt1kj
      @ravikumar-bt1kj Год назад

      ..nakuda kannellu vastai..

    • @balusharma6832
      @balusharma6832 Год назад

      super duper super super super super super super super super super super super super super super super super super super hot song 1000 years I na hit song

    • @srinivasoffice7066
      @srinivasoffice7066 Год назад

      Yes it is true. My all time fav song

  • @manoharnaik8389
    @manoharnaik8389 5 лет назад +36

    ఓల్డ్ సాంగ్స్ వింటే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న సాంగ్స్ వింటే పిచ్చి ఎక్కుతుంది...ఎప్పుడైనా ఓల్డ్ is గోల్డ్

  • @MVS666
    @MVS666 2 года назад +47

    తరాలు మారినా... అంతరాలు లేకుండా అందరూ పాడుకొనే అద్భుత గీతమిది... నిన్న, నేడు, రాబోయే తరాలు కూడా తన్మయత్వంతో ఓలలాడుతూ వినే అమృత గీతం.. దీన్ని ఆలాపించినవారు , సాంకేతిక బృందం , వినే మనం ..అందరం ధన్యులం

  • @krishnakvs4598
    @krishnakvs4598 3 года назад +244

    పెళ్ళి కాని ఆడపిల్ల కాబోయే భర్త కోసం ఎదురుచుస్తూ పాడిన ఈ పాట రాసిన నారాయణ రెడ్డి గారికి పాదాభివందనం....

    • @chinnusai
      @chinnusai 10 месяцев назад +1

      ☝️👏👏👏☝️

    • @user-gy2zw2lw8b
      @user-gy2zw2lw8b 8 месяцев назад

      👏👏👏👏👏👏💐

    • @ViswaNatham-bb3jl
      @ViswaNatham-bb3jl 4 месяца назад

      ఈ పాట నాకు ఎంతో ఇష్టం. 🌹🌹🌹🌹👍👍🙏

    • @user-bl6iy3fb1u
      @user-bl6iy3fb1u Месяц назад

      Alluri sitarama Raju song adbhutam

    • @user-bl6iy3fb1u
      @user-bl6iy3fb1u Месяц назад

      Na jeevitham Lo marchipolenu song vidhi

  • @punith_dr
    @punith_dr 2 года назад +49

    వస్తాడు నా రాజు ఈ రోజు
    రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
    కార్తీక పున్నమి వేళలోన
    కలికి వెన్నెల కెరటాలపైన
    కార్తీక పున్నమి వేళలోన
    కలికి వెన్నెల కెరటాలపైన
    తేలి వస్తాడు నా రోజు ఈ రోజు
    వేల తారకల నయనాలతో
    నీలాకాశం తిలకించేను
    వేల తారకల నయనాలతో
    నీలాకాశం తిలకించేను
    అతని చల్లని అడుగుల సవ్వడి
    వీచే గాలి వినిపించేను
    ఆతని పావన పాద ధూళికై
    అవని అణువణువు కలవరించేను
    అతని రాకకై అంతరంగమే
    పాలసంద్రమై పరవశించేను
    పాలసంద్రమై పరవశించేను
    వస్తాడు నా రాజు ఈ రోజు
    రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
    వెన్నెలలెంతగా విరిసిన గాని
    చంద్రుణ్ణి విడిపోలేవు
    కెరటాలెంతగా పొంగిన గాని
    కడలిని విడిపోలేవు
    కలసిన ఆత్మల అనుబంధాలు
    ఏ జన్మకూ విడి పోలేవులే
    తనువులు వేరైనా దారులు వేరైనా
    తనువులు వేరైనా దారులు వేరైనా
    ఆ బంధాలే నిలిచేనులే
    ఆ బంధాలే నిలిచేనులే
    వస్తాడు నా రాజు ఈ రోజు
    రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
    కార్తీక పున్నమి వేళలోన
    కలికి వెన్నెల కెరటాలపైన
    వస్తాడు నా రాజు ఈ రోజు

  • @kummarilachaiah5905
    @kummarilachaiah5905 4 года назад +225

    ఇంత అద్భుతమైన పాట వ్రాసిన నారాయణ రెడ్డి గారి కి ధన్యవాదములు. మీ ఆత్మ కు శాంతి కలుగు గాక

    • @appalareddydasari7732
      @appalareddydasari7732 11 месяцев назад +2

    • @sudharshan-by2ry
      @sudharshan-by2ry 7 месяцев назад +1

      Narayana Reddy Christian. Jesus grace undi anduke e song intha hit ayindi. Jai jesus jai mere. Amen ✝️

  • @sriavunuthadi8027
    @sriavunuthadi8027 2 года назад +31

    ఒక ప్రేముకుడు ఎంతలా దేశం కోసం ప్రాణం త్యాగం చేసాడు అంటే ఒక ప్రేముఖురాలు సహాయ సహకారం ఉన్నది గనుకే గొప్పవుడు అయ్యాడు మనోహర్ నాయుడు

    • @muhammedcp6293
      @muhammedcp6293 Год назад

      Vejaya nermala and sheela my faferate stan lam intelechary kerala

  • @dastagirishaik589
    @dastagirishaik589 Год назад +12

    ఈ పాటను ఎన్నిసార్లు విన్నా తనివితీరదు తెలుగింటి ఆడపడుచు కు అద్దంపట్టిన నటి విజయనిర్మల గారు 🙏🙏

  • @govindp.k.3968
    @govindp.k.3968 Год назад +34

    పై నుండి విజయనిర్మల నిన్న ఈ పాటే పాడి ఉంటుంది, అందుకే కృష్ణ గారు ఇంకా ఆగలేదు. 😥❤️

  • @sriramchakali4729
    @sriramchakali4729 3 года назад +22

    2021 లో ఎంత మంది ఉన్నారు ఈ పాట చూసిన వారు

  • @sreenivasuluroyal6289
    @sreenivasuluroyal6289 2 года назад +69

    ❤❤❤❤❤ఏమి ప్రేమ రామరాజు గారు కాని దేశం కొసం మీ ప్రేమని వదిలేసి ప్రేయసిని మీ పేరులో ముందుగా చేర్చి సీతా రామరాజు గా మారి 25సంవత్సరాలు వయసులో అస్తమించి ఎన్ని జన్మలకి మరువలేని దేవుడివి అయ్యావు 🙏

    • @mallikarjunamalli8788
      @mallikarjunamalli8788 2 года назад +1

      Nejamega

    • @skidsteer7129
      @skidsteer7129 2 года назад +1

      Hats off to him..

    • @srinivasaraosuggala6778
      @srinivasaraosuggala6778 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @balabala1638
      @balabala1638 Год назад +2

      ఎంత గొప్ప దేశం కోసం అన్ని వదులు కొని భరత మాత కు ప్రాణాలర్పించిన మహారాజు మన అల్లూరి సీతారామరాజు గారు.ఆయన గురించి విన్న చదివిన శరీరం పులకిస్తుంది.🌷🌷🙏🌹🌹🌷🌷

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 Год назад +58

    ఈ పాటలో ఉన్నట్లుగానే కార్తీక పౌర్ణమి రోజున కాకపోయినా కార్తీక మాసంలోనే తన రాణి దగ్గరకు చేరి స్వర్గ సింహాసనం అధిష్టించిన ఈ మకుటంలేని మహారాజు..
    తెలుగు ఇండస్ట్రీ మరో పెద్ద దిక్కును కోల్పోయింది..
    😪😪😪😪😪😪😪😪😪😪
    -రాంమోహన్ కస్తూరి

    • @ourhyderabad8499
      @ourhyderabad8499 Год назад

      Chaala baaga chepparu👌👌

    • @rahulnallurivari4141
      @rahulnallurivari4141 Год назад

      Aavanu

    • @murarichinodu4268
      @murarichinodu4268 Год назад

      అవును మీరు చెప్పింది అక్షరాలా నూటికి నూరు శాతం నిజం కస్తూరి రామ్మోహన్ గారు

    • @krishnakodeboyina3689
      @krishnakodeboyina3689 Год назад

      @@ourhyderabad8499 z

  • @saiduluedulakanti6875
    @saiduluedulakanti6875 4 года назад +86

    అల్లూరి సీతారామరాజు సినిమా కోసం పనిచేసిన ప్రతిఒక్కరు చిరస్థాయిగా మిగిలి పోతారు ....ఈ పాట రాసిన సీ.నారయణ రెడ్డి గారు ఈ సినిమా దర్శకురాలు హీరోయిన్ విజయనిర్మల గారు మీకు శతకోటి వందనాలు

  • @whitesun2202
    @whitesun2202 Год назад +7

    Ee rojullo kuda, ee song vintunte mamimarachopotunnam

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 2 года назад +19

    ఆదినారాయణ రావు గారి సంగీతం అద్భుతము.అల్లూరి సీతారామరాజు సినిమా, పాటలు కూడా చాలా బాగుంటాయి.

  • @ashokr5148
    @ashokr5148 5 лет назад +422

    ఇలాంటి పాటలు వినాలంటే అదృష్టం ఉండాలి,పెళ్ళి కాని ఆడపిల్ల కాబోయే భర్త కోసం ఎదురుచుస్తూ పాడిన ఈ పాట రాసిన నారాయణ రెడ్డి గారికి పాదాభివందనం....

    • @thimmappathimmappa1454
      @thimmappathimmappa1454 4 года назад +6

      Ashok r timmappa

    • @rameshbuddha3231
      @rameshbuddha3231 4 года назад +2

      Yes

    • @thimmappabayikati1998
      @thimmappabayikati1998 4 года назад

      ,,

    • @kumarks583
      @kumarks583 4 года назад +1

      Really excellent

    • @sitaramaiahk303
      @sitaramaiahk303 4 года назад +5

      సూపర్ స్టార్ కృష్ణ గారు మంచి పాటలు రాయించారు అల్లూరి సీతారామరాజు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎన్నోసార్లు వింటూ ఉంటాం కృష్ణ గారు ఒక్క వ్యక్తి

  • @rangaravikiran
    @rangaravikiran 4 года назад +40

    తెనుగు పాటకు పట్టం కట్టిన రోజు అనే చెప్పాలి 🙏 What a lyrics, composition n rendition, every bit of this masterpiece is an asset 👌

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +39

    వస్తాడు నా రాజు .వెన్నెల లెంత గా
    విరిసినా గానీ.తనువులు వేరైనా
    దారులు వేరైనా.ఎంత మధురమైన పాట
    ఎంత కాలమైనా మరచిపోలేని మధుర
    గీతము.

  • @NarendraSajja
    @NarendraSajja 2 года назад +27

    అద్భుతమైన పాట. అద్భుతమైన సినిమా. అద్భుతమైన నటులు, గాయకులూ. సినారె గారు రాసిన ఆణిముత్యం ఈ పాట. విజయనిర్మల గారు అద్భుతంగ నటించారు ప్రాణం పోశారు ఈ పాటకి. పాటలు, డైలాగ్స్, నటన, పాత్రలు అన్ని అజరామరం.

  • @kanugumahesh6088
    @kanugumahesh6088 5 лет назад +74

    వెనెల ఎంతగా వేరేసినగని చందూరిని విడిచి పోలేదు అబ్బా వెంటేనే కడుపు నిండిపోతుంది నిజాంగా చచ్చెదక గుర్తుండే పాట

  • @srikchava660
    @srikchava660 3 года назад +102

    విజయనిర్మల గారి నటన సి.నా.రే.పాట రచన అమోఘం

  • @ganjiraju9992
    @ganjiraju9992 3 года назад +51

    ఎమని చెప్పాలి,
    ఎమి చెప్పిన తక్కువే..
    ఆమోగం

  • @chiruspodari4054
    @chiruspodari4054 5 лет назад +238

    అదుబుతమైన నటన . ఈ రోజు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి.

  • @ramanaredybv8205
    @ramanaredybv8205 2 года назад +44

    కథానాయకుడు కృష్ణ గారికి కథానాయక మరియు దర్శకురాలు విజయనిర్మల గారికి గీత రచయిత సి.నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్సుమాంజలులు.

    • @sarumudivayila
      @sarumudivayila 9 месяцев назад

      కృష్ణ గారి అల్ టైమ్ హిట్ మూవీ

  • @indurthivenkateshwarlu42
    @indurthivenkateshwarlu42 Год назад +6

    ఈ మహత్తర, తీయనైన పాట లను వినటానికి ఆ పైన ఉన్న దేవతలు సయితం మన భూమి పైకి వచ్చేవారు.అందుకే మనకు సకాల వర్షాలు పడేవి.

  • @mohammedakramuddin6392
    @mohammedakramuddin6392 5 лет назад +166

    సీనారే గారి అద్భుత రచన, సుశీల గారి తేనె లాంటి తియ్యని గొంతు, ఆదినారాయణ గారి సంగీతం ఎన్ని దశాబ్దాలయినా ఎవర్ గ్రీన్ సాంగ్..

    • @muniyugender629
      @muniyugender629 Год назад +4

      nnnnnnnnn nnn

    • @balusharma6832
      @balusharma6832 Год назад

      Laksha kottla song yes

    • @junnu8946
      @junnu8946 Год назад

      ​@@muniyugender629 hu

    • @venkatareddyanekalla8172
      @venkatareddyanekalla8172 Год назад

      ​@@balusharma6832 vy ni

    • @anandkumar-fo9ji
      @anandkumar-fo9ji Год назад

      తెలుగు సినిమా బ్రతికినన్ని రోజులు కొన్ని మధురమైన పాటలు బ్రతికే ఉంటాయి

  • @PenchalaiahBalli-sf3it
    @PenchalaiahBalli-sf3it 4 года назад +8

    ఆహ... ఎంత అభూతంగా ఉందొ ఇ లాంటి పాటలు ఎన్నిసార్లు చూసిన చూడాలి అనిపిస్తుంది.

  • @inreddy1000
    @inreddy1000 Год назад +8

    శ్రీమతి సుశీలమ్మ మధురమైన స్వరంలో సరళమైన సంగీతంతో కూడిన ఈ పాట నాకు చాలా ఇష్టం

  • @jayaprakash4802
    @jayaprakash4802 3 месяца назад +9

    అద్భుతమైన పాట మనసు కదిలించే మహత్తరమైన పాట

  • @gundluruashokkumar3896
    @gundluruashokkumar3896 3 года назад +22

    పాటలోని సాహిత్యానికి సి.నా. రే గారికి పాదాభివందనం.

  • @karikeprakash3962
    @karikeprakash3962 4 года назад +57

    Sushilamma....entha baaga padavamma

  • @pendembhaskar.5246
    @pendembhaskar.5246 4 года назад +88

    స్వేచ్ఛ మైన ప్రేమకుక నిలువుటద్దం ఈ పాట

  • @gowrisankar4531
    @gowrisankar4531 4 года назад +15

    అధ్బుతమైన సాహిత్యం
    అభినయం వర్ణనాతీతం
    మనసు ఎంత హాయిగా ఉంటుంది
    తనివి తీరదు
    ఇలాంటి పాటలు
    బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు
    పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది
    పాడిన వారికి ధన్యవాదాలు
    నా పాదాభివందనాలు..

  • @srinivaskasturi786
    @srinivaskasturi786 5 лет назад +220

    మాటల్లెవు ,.. రావు
    పాటకు సంగీతం సమకూర్చిన ఆదినారయణరావు గారు ధన్యులు.

  • @Allariayansh
    @Allariayansh Год назад +3

    Krishna garu chanipoyina tharavatha vintunna vaallu oka like vesukondi

  • @vsvrorganicfarming1573
    @vsvrorganicfarming1573 3 года назад +10

    దేశ భాషలందు తెలుగు భాష లెస్స ఆ తియ్యదనం కమ్మదనం స్పష్టమైన భాష దేశంలో లేదు మధురానుభూతిని ఇస్తుంది.

  • @bhaskarraogokara317
    @bhaskarraogokara317 7 лет назад +108

    విజయనిర్మల గారి యాక్షన్ ఈ పాట కు చాలా బాగా చేశారు.

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 Год назад +8

    ఆదినారాయణ రావు గారి కి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @neerajarai1846
    @neerajarai1846 Месяц назад +1

    కట్టు బొట్టు సంప్రదాయం రెండు కళ్ళు సరిపోవు. ఇలాంటి సినిమాలు. ఇలాంటి పాటల వల్లే ఇంకా ముడుచుకొని అంటే నాకు చాలా గౌరవం.

  • @prathizna97
    @prathizna97 11 месяцев назад +1

    ఆహా... చిన్నప్పుడు రేడియోలో వింటుంటే మనసు హాయిగా ఉండేది.సంగీతము, సాహిత్యం గురించి తెలియకున్నా ఈ పాట వింటుంటే.. ఎంతో మధురానుభూతిని పొందేవాడిని కదా..! రచన: Dr C నారాయణ రెడ్డి గారు, సంగీతము: ఆదినారాయణ రావు, గానం: P సుశీల అని రేడియోలో చెబుతుంటే ఆరోజుల్లో ఆ తీయని జ్ఞాపకం ఆ మాధుర్యం గ్రేట్.

  • @laxmikante646
    @laxmikante646 Год назад +4

    ఈపాటఅంటేనాకుఎంతోఇష్టం ఈసినిమా వచ్చినప్పుడు నేను 14 ఇయర్స్ ఈసినిమా కూడా మాఊరు ఖమ్మం జిల్లా నిలబడి చూశాం మరిచిపోలేకపోయాం కృష్ణ విజయనిర్మల ఎంతోఒదిగిపోయిచేశారుఆసినిమా దివికిఏగిన ఆమూర్తులకుఇవేనమంసుమాఅంజలి

  • @gadhirajuramesh4202
    @gadhirajuramesh4202 5 лет назад +44

    ఇటు వంటి పాటలు ఎన్ని సార్లు విన్నా జన్మ దన్యమోవుటడి

  • @pv8563
    @pv8563 Год назад +5

    Amma mi king mi kosam vasthunnaru

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 3 года назад +7

    పెళ్లికి ముందు అమ్మాయిల మనసు ఇలా వుంటుంది అని 1979లో తెలిసింది.

  • @vasaanjibabu9433
    @vasaanjibabu9433 4 года назад +48

    2020 lo marrege chesukene vallaku e song dedicate

  • @munnavilak1375
    @munnavilak1375 6 лет назад +375

    ఆహా..! ఏమి ఈ భాగ్యము కదా
    మనసు ఎంతో ఆహ్లద భరితంగా ఉంది కదా!
    మనసుతో మాట్లాడుతున్నట్లే ఉంది ఈ మధుర గీతం.
    'వేల తారకల నయనాలు' తెలుగు సాహిత్యం అంటే నాకు మరింత ఇష్టం గౌరవం పెరిగేలా చేసింది.
    అజరమంగా నిలిచిన గీతాల్లో ఒకటిగా చెప్పొచ్చు... ఆదినారాయణరావు గారి సంగీతం సాంప్రదాయబద్దంగా ఆహ్లదకరం ఉంటుంది. సుశీలమ్మ గారి పాట తేనెలూరు తియ్యని వుట.
    మనసునుకు హత్తుకునే మధురమైన గాత్రం సంగీతం.
    నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నా వారెందరికో ఇవే రస గుళికలు. ఇప్పుడంతా గందరగోళం బందర బాజా use and throw songs విన్నమా చూసామా మర్చిపోయామా! పాటల విషయమే కాదు ఇప్పుడు ఇంచుమించు అన్ని అలానే ఉన్నాయి జనరేషన్ చాల వేగంగా కలుషితమవుతుంది. ఇప్పుడు ఏది ఎవరు వినే పరిస్ధితుల్లో లేరు. అందుకు ఇప్పటి పిల్లలే ఉదాహరణ. మన జనరేషన్ వరకు మనం ధన్యులమే. జీవితంలో అన్ని రకాల కోణాలను బాల్యం నుంచే చూసాం.అవి మనకు ఎంతో విజ్ఞానాన్ని. వికాసాన్ని అందించాయి. అది మనకు మాత్రమే తెలిసిన విషయం. ఇది ఈ పాటకు సంబంధించి అప్రస్తుతమైనా...
    సందర్భానుసరంగా వివరించాల్సి వచ్చింది. నాకు అత్యంత ఇష్టమైన పాటల్లో ఒకటి.
    కీర్తిశేషులు సి. నారాయణ రెడ్డి విజయనిర్మలమ్మ గారికి నమస్సమాంజలి.
    ✍ మున్నా

    • @pname941
      @pname941 6 лет назад +1

      Munna VDS hiimunna

    • @padmajauppala1815
      @padmajauppala1815 6 лет назад +6

      One of my fav song.meaningful song. Intha manchi paatalu andinchina appati writers ki music directors and singers ki sarvadaa kruthagnathalu teliyacheskuntamu. munna garu mi cmnt ki nenu ekhibhavistunnanu very good cmnt

    • @munnavilak1375
      @munnavilak1375 6 лет назад +2

      ThankQ padmaja uppala garu

    • @lakshmidevipuvvadi5938
      @lakshmidevipuvvadi5938 6 лет назад +6

      Munna Garu
      excellent comment

    • @munnavilak1375
      @munnavilak1375 6 лет назад +5

      ThankQ Lakshmi puvvadi garu

  • @pandududyala3672
    @pandududyala3672 6 месяцев назад +2

    పాట విన్నప్పుడల్లా కొత్త పాట లాగే అనిపిస్తుంది

  • @sunkarivamshikrishna1385
    @sunkarivamshikrishna1385 4 года назад +39

    P.suseela garu padina ee pata chala bagundi nijamga p.suseela garu ganakokila

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 лет назад +5

    ప్రతి అమ్మాయి తీపి కల , మదిలోన మెదిలే మధురమైన భావన...........
    Beautiful , evergreen song with wonderful lyrics.....
    Golden song.....🌹

  • @anilkumarnaguboyina531
    @anilkumarnaguboyina531 4 года назад +55

    హ్యాట్సాఫ్ నారాయణరెడ్డి గారు

  • @legend1919
    @legend1919 Год назад +6

    ఈ పాట నా చిన్నప్పటి నుండి వింటున్నాను
    నా వయస్సు ఇప్పుడు యాభై సంవత్సరాలు
    మనసు దోచిన పాట

  • @yalamareddyharinathreddy2451
    @yalamareddyharinathreddy2451 2 года назад +7

    ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన సతీమణి విజయనిర్మల గారు అద్భుతమైన ఈ పాట సినిమా చరిత్ర లో కలికితురాయి.

  • @lntsrs2656
    @lntsrs2656 5 лет назад +5

    పెళ్లిచేసుకోబోయే అమ్మాయిలందరికి ఈ పాట అంకితం!!!!

  • @Anoos674
    @Anoos674 3 года назад +5

    Vela taarakala nayanalato... Neelakasam tilakimchenu.. 🤩😍eduru chupulo enta aanamdam.. Aameki. 😘😘😘so beautiful song

  • @vamshikrovi3525
    @vamshikrovi3525 5 лет назад +138

    Who's is watching after Vijaya nirmalas mam death..Rip to legend...may soul rest in peace...

  • @saipratap9920
    @saipratap9920 Год назад +4

    చాలా అద్భుతమైన పాట.మంచి సాహిత్యం ఉన్న పాట రాసిన రెడ్డి గారికి ధన్యవాదాలు.

  • @durshetivenugopal6690
    @durshetivenugopal6690 Год назад +8

    I used listen this song to write something in poetic pattern,,,,
    Hat's off to C. నారాయణ రెడ్డి గారికి,,,,,

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 3 года назад +1

    త్యాగ మూర్తుల జంట నిజమైన ప్రేమ కు ఎగ్జాంపుల్ ఈ సినిమా రిలీజ్. చూసాను అప్పుడు పుట్టిన మేము చాలా అదృష్టవంతులం దనయులం

  • @rajuvaradhapaka5651
    @rajuvaradhapaka5651 Год назад +4

    నా పేరు రాజు ఈ పాట విన్నప్పుడల్లా మా లవరు నన్నే గుర్తు తెచ్చుకుంటుంది

  • @jakkulaupendar7690
    @jakkulaupendar7690 4 года назад +45

    2020 lo chuse vallu like kottandi

    • @gbkrishna3084
      @gbkrishna3084 3 года назад

      Sir this type of songs importance will remain for ever not less than another 3 decades, Tq for providing valuable songs

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 года назад

      సూపర్ .సాంగ్.

  • @mallugallasundar3684
    @mallugallasundar3684 4 года назад +3

    అచ్చంగా విజయనిర్మల యే పడుతున్నట్టున్నది

  • @RajuLicRajuLic
    @RajuLicRajuLic Год назад +5

    Wow what a song 👍👍👍👏👏👏🙏🙏🙏🙏🙏

  • @panasalaindhira1559
    @panasalaindhira1559 4 года назад +7

    ఈ పాటలు వింటున్న మాకు, విజయనిర్మల గారు, మన మధ్యలో ఉంటున్నట్లు అనుభూతి కలుగు తుంది

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +3

    అల్లూరి సీతారామ రాజు.సూపర్ స్టార్
    కృష్ణ .మరియు విజయ నిర్మల నటించిన
    చిత్రము.సూపర్ మూవీ.సూపర్ సాంగ్స్.

  • @crazygoy9857
    @crazygoy9857 4 года назад +18

    Lyrics : ci na re 👍👍
    Singer: P Susheela 👌👌

  • @boddubhoopal8365
    @boddubhoopal8365 3 года назад +4

    కలసిన ఆత్మల అనుబంధాలు ఏజన్మకై న విడిపోలేవు super word

  • @Raghuvaran13899
    @Raghuvaran13899 3 года назад +3

    E song RRR 🔥 movie lo unduntey bagundedi

  • @chandrasekhar4318
    @chandrasekhar4318 2 года назад +6

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మంచి పాట. ❤️👌

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Год назад +6

    One of the best and song of tollywood. In loving memorable to Dr.C N Reddy garu, Legendary Music magician Adinatayana Rao garu, P.Suseela garu and Madam Vijayanirmala garu.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 года назад +17

    A great memorable classical song, a great music magician Shri Adinarayana Rao garu classical composition, hats off sir. Never before never after.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 14 дней назад +1

    Yeppatiki memorable sweet heart touching song, lyric, Adinarayana Rao garu music mariyu V.S R. Swamy camera superb marvelous.

  • @ssk-ot4lu
    @ssk-ot4lu 6 лет назад +189

    తరాలు మారినా పాట ఇప్పటికీ హిట్

  • @umrumr11
    @umrumr11 2 года назад +8

    విజయ నిర్మల గారి నటన ఈ పాటకు ప్రాణం

  • @venkataramudu4245
    @venkataramudu4245 11 дней назад

    ఎన్నిసార్లు విన్నా ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించే సూపర్ హిట్ సాంగ్ సూపర్ స్టార్ కృష్ణ నూరు చిత్రం ఇది

  • @dharaniburujula9162
    @dharaniburujula9162 2 года назад +1

    Goosebumps anthe … Enta andanga undi Seetha … aame la ready ayyi ee pata chusinachaalu anipistundi … same feelings vastayemo … ❤️❤️🥰

  • @krs3108
    @krs3108 3 года назад +3

    ఈ పాట మహాద్బుతం.

  • @ammulu2921
    @ammulu2921 6 лет назад +81

    ఎన్నిసార్లు విన్న ఇప్పటికి ఎప్పటికి ఎవర్గ్రీన్

    • @nsamba5086
      @nsamba5086 4 года назад +2

      The

    • @murali.p2394
      @murali.p2394 3 года назад +2

      మంచి అర్ధం ఉన్నా పాటా... 🌹🌹

  • @govindarajumoka4456
    @govindarajumoka4456 4 года назад +5

    Excellent melody from Susheela garu
    and Vijaya nirmala gari amazing abhinayam

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 3 года назад

    ఈ పాటని అజరామరం అనంతం అపూర్వం అంటారు ఈసినిమా దేశభక్తి తో చూడాలి వయసుపిల్లలుకు చూపించండి మార్గం మార్చుకుంటారు

  • @durgaprasad5576
    @durgaprasad5576 6 лет назад +279

    "వేలతారకల నయనాలు" బాబోయ్.. తెలుగులో ఇంత గొప్ప పదాలు ఉన్నాయా.. !!

  • @srinivasjs7740
    @srinivasjs7740 7 лет назад +35

    super duper song in telugu cinema.
    thanks to superstar krishna &vijaya nirmala.

  • @veerabhadrareddy_1967
    @veerabhadrareddy_1967 4 года назад +5

    విజయనిర్మల గారినీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి ఈ పాట తో

  • @mettasatishkumar
    @mettasatishkumar 2 месяца назад +1

    2024 still watching this amazing song
    Super star KRISHNA and Vijaya nirmala garlu Mesmerized with their amazing performance 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤

  • @sathyanarayana1192
    @sathyanarayana1192 Год назад +3

    Superb pair nd Superb song. RIP Super ⭐

  • @venkatnaramoni4724
    @venkatnaramoni4724 5 лет назад +290

    ఇండ్రస్ట్రీ రికార్డు బద్దలు కొట్టిన సాంగ్

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 3 года назад +2

    ఈ సినిమా కృష్ణ గారి లైఫ్ ధన్యం

  • @narendrababugundala4475
    @narendrababugundala4475 Год назад

    పాటంటే ఇది.అత్యద్భుతమైన శ్రావ్య గీతం

  • @chaithrapinky5678
    @chaithrapinky5678 6 лет назад +41

    sushel Amma voice super.a singer lu lani sweat voice susheela Amma Ku undie.Amma Telugu singer kavadam mama adhurstam.

    • @sagargatla
      @sagargatla 3 года назад

      Correct.. Very sweet voice

  • @ramakrishnavasudevanittala7198
    @ramakrishnavasudevanittala7198 3 года назад +3

    Great lyrics best suited to Vijaya Nirmala garu only . Jai ho Super star Krishna

  • @mohanreddy4628
    @mohanreddy4628 4 года назад +1

    Wow super hit song. I like this song very very much

  • @rameshdevarapaga2331
    @rameshdevarapaga2331 5 лет назад

    అద్భుతమైన పాట అద్భుతమైన చిత్రము. ఈ పాట. అంటే. నాకు చాలా ఇష్టం . ముఖ్యంగా సి నా రె అద్భుతమైన సాహిత్యం. అందించాడు.

  • @bheemlamayday4487
    @bheemlamayday4487 5 лет назад +17

    ఏమైనా...ఈ.. రోజు లలో... ఇలాంటి పాటలు...సరితూగవేమో...