కూడికొని యున్నాము సంఘ ప్రభో కూడికొని యున్నాము తోడ నుండెద ననుచు నమ్ముచు దొడ్డ దగు నీ పాద సన్నిధి ||కూడికొని|| ఎచట నా ప్రియ భక్తులెలమిఁ గూడియున్న నచటికి నేతెంతునని పల్కితి విచట నుండు మమ్ము వీక్షించి కృపచేత నిపుడు దీవించు మీ యేసు క్రీస్తునాధా ||కూడికొని|| గత కాలమందున గాని చేఁతలచే దుర్గతి నొంది యుండఁగాఁ గనుఁగొంటివి శత సంఖ్య గల పాపచయ మీవు క్షమియించి యతి శాంతి నిడితివి యాత్మస్వరూపా ||కూడికొని|| నిరతము నీ ప్రేమ నెనరున ధ్యానించి పరమ ధర్మములందుఁ బరతఁ గల్గి యరులకు శుభములు నిరతంబుఁ జేయఁగఁ దిరత మా కొసఁగుము దేవుని ప్రియ తనయా ||కూడికొని|| అన్ని శోధనముల నన్ని విపత్తుల నన్ని కాలములందు నాదరించి నిన్ను నమ్మిన జనుల నీ సందిటను జేర్చి పన్నుగఁ గాపాడు ప్రభు యేసు క్రీస్తు ||కూడికొని|| అమలుఁడ నగు నన్ననుకరించుండనుచు నాన తిచ్చినాఁడ వాత్మజులకు నమల మార్గము నందు నరుగంగ మాకీవు విమలాత్మ దయసేయు వేగంబు మా తండ్రీ ||కూడికొని||
కూడికొని యున్నాము సంఘ ప్రభో కూడికొని యున్నాము తోడ నుండెద ననుచు నమ్ముచు దొడ్డ దగు నీ పాద సన్నిధి ||కూడికొని||
ఎచట నా ప్రియ భక్తులెలమిఁ గూడియున్న నచటికి నేతెంతునని పల్కితి విచట నుండు మమ్ము వీక్షించి కృపచేత నిపుడు దీవించు మీ యేసు క్రీస్తునాధా ||కూడికొని||
గత కాలమందున గాని చేఁతలచే దుర్గతి నొంది యుండఁగాఁ గనుఁగొంటివి శత సంఖ్య గల పాపచయ మీవు క్షమియించి యతి శాంతి నిడితివి యాత్మస్వరూపా ||కూడికొని||
నిరతము నీ ప్రేమ నెనరున ధ్యానించి పరమ ధర్మములందుఁ బరతఁ గల్గి యరులకు శుభములు నిరతంబుఁ జేయఁగఁ దిరత మా కొసఁగుము దేవుని ప్రియ తనయా ||కూడికొని||
అన్ని శోధనముల నన్ని విపత్తుల నన్ని కాలములందు నాదరించి నిన్ను నమ్మిన జనుల నీ సందిటను జేర్చి పన్నుగఁ గాపాడు ప్రభు యేసు క్రీస్తు ||కూడికొని||
అమలుఁడ నగు నన్ననుకరించుండనుచు నాన తిచ్చినాఁడ వాత్మజులకు నమల మార్గము నందు నరుగంగ మాకీవు విమలాత్మ దయసేయు వేగంబు మా తండ్రీ ||కూడికొని||
🙏🙏🙏🙏
Praise the Lord Ayyagaru🙏🙏
Nice bro.. 👍👍👏👏
Praise the lord amen 🙏
🙏🙏🙏🙏🙏 Anna
prize the lord sir from gudekal village yemmiganur mandal