మూర్ఖపు గొర్రెపోతు నీతికథ || Foolish ram bedtime moral story || Panchatantra stories

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • మూర్ఖపు గొర్రెపోతు నీతికథ || Foolish ram bedtime moral story || Panchatantra stories
    #మూర్ఖపుగొర్రెపోతునీతికథ #Foolishram #Telugumoralstories
    ********* మూర్ఖపు గొర్రెపోతు నీతికథ *****
    ఒక అడవిలో ఒక గొర్రెపోతు వుండేది. అది చాలా పొగరు గలది. దాని మాటలు ఎదుటివారు వినాలిగానీ, ఇతరులు చెప్పింది వాస్తవమే అయినా దాన్ని ఆ గొర్రెపోతు అంగీకరించేది కాదు. దానికి కోపం వచ్చిన ప్రతీసారీ తన వాడియైన కొమ్ములతో కొండను ఢీ కొట్టేది. ఆ క్రిందకు రాలిన బండలను చూసి 'నేనేగా ఈ కొండను పిండి చేసింది' అని ఆనంద పడేది.
    ఓనాడు అది ఆకులు అలమలు తింటూ వుండగా .. నదిలో నీళ్ళు తాగి తన దారిన తాను వెళ్లిపోతున్న ఏనుగును ఆపి.. " ఏమోయ్. నీ పేరేంటీ.. ?" అని అడిగింది.
    " నా పేరు గజరాజు.. " అంది ఏనుగు.
    " చూడు గజరాజూ.. ఈ ఎర్రటి ఆకులు కొన్ని తెంచి గుట్టలా పడేయకూడదూ.. నేను శ్రమలేకుండా నమిలి పాడేస్తాను. "
    ఆ మాటలకు ఏనుగు ఫక్కున నవ్వి.. " అయ్యో మిత్రమా..! ఆ ఆకులు ఎరుపు రంగులో లేవు.. పచ్చ రంగులో వున్నాయి." అంది.
    " నీకు రంగుల గురించి తెలియనట్టుంది.. ఇది ఎర్ర రంగే.. "
    " మిత్రమా.. నీకు చూపుతో పాటు బుద్దీ మందగించి నట్టుంది .. ఆకులు పచ్చరంగులోనే వుంటాయి.."
    రెండింటి మధ్య మాటా మాటా పెరిగింది. గొర్రెపోతు కొమ్ములు మెలేసి గొడవకు దిగింది. రెండూ కొంతసేపు తలపడ్డాయి.
    " ఈ విషయం అడవికి రాజైన సింహం దగ్గరే తేల్చుకుందాం .." అని ఏనుగు అనడంతో రెండూ సింహం గుహ దగ్గరకు బయలు దేరాయి.
    అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న సింహం వద్దకు గొర్రెపోతు, ఏనుగు చేరుకున్నాయి. తమ మధ్య జరిగిన గొడవంతా వివరించి వాస్తవాన్ని చెప్పమన్నాయవి.
    " ఆకులు పచ్చ రంగులో ఎందుకు వుంటాయి.. ఎరుపు రంగులోనే వుంటాయి.. అయినా పచ్చ రంగు ఆకులేమిటీ .. నీ అమాయకత్వం కాకపోతేనూ.. ఈ అడవిలో నేనింత వరకూ పచ్చని ఆకులనే చూడలేదు.." అని సింహం ఏనుగును వెక్కిరించి పడీ పడీ నవ్వింది..
    సింహం దగ్గర కూడా తన మాటే నెగ్గినందుకు గొర్రెపోతు ఆనందం పట్టలేక ఉబ్బితబ్బిబ్బయింది.. ఏనుగు మాత్రం మృగరాజుకి ఎదురు చెప్పలేక అది వేసిన శిక్షను అనుభవించి అక్కడి నుండి వెళ్లిపోయింది.
    ఆ మరునాడే అనుకోకుండా సింహం, ఏనుగు ఓ చోట కలుసుకున్నాయి.
    " మృగరాజా.. ఆకులు వుండేది పచ్చరంగు కదా.. ఎరుపు కాదుగదా.. మరి నిన్న ఎందుకు గొర్రెపోతు ముందు అలా అన్నారు." అని అడిగింది ఏనుగు.
    " ఆకులు పచ్చరంగులోనే వుంటాయి .. నీవు చెప్పింది సరైనదే.. కానీ, నువ్వు ఒక మూర్ఖపు గొర్రెపోతుతో వాదిస్తున్నావు అన్న సంగతిని మరిచిపోయావు.. అందుకే శిక్ష విధించాను .. అది ఒక బుద్దిలేని గొర్రెపోతు.. ఒక మూర్ఖునితో వాదిస్తే శిక్ష నీకే పడుతుంది గానీ, వాడికి కాడు .. అర్ధం అయిందా.. "
    తను చేసిన తప్పు ఏమిటో తెలుసుకుని.. సింహం చెప్పిన దానిలో వాస్తవాన్ని గ్రహించింది ఏనుగు.
    ఈ కథలో నీతి ఏమిటంటే.. " మూర్ఖులతో వాదనకు దిగకూడదు.. "
  • РазвлеченияРазвлечения

Комментарии • 21