తెగులు పట్టిన తెలుగు | Telugu Uniqueness Explained By Dhatri Madhu | Literature | Dhatri mahati

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • Watch Now ►తెగులు పట్టిన తెలుగు | Telugu Uniqueness Explained By Dhatri Madhu | Literature | Dhatri mahati
    #telugu #literature #dhatrimadhu #dhatrimahati
    Dhatri Mahati is the brain child of the Dhatri communications company. Content in the Mahati channel will be presented by Pamidikalva Madhusudan , Head of the Dhatri communications company , who has been an active participant in the field of media and journalism for 30 years.
    We have been providing services such as live television coverage, film advertisements and documentaries for well over 10 years. This marks our first venture into the realm of digital news broadcasting. The team of the Dhatri enterprise comprises of experienced individuals with a fervour for professionalism.
    Creating content such as advertisements and event video coverage for the government as well as for private firms is the field in which Dhatri shines. With the ever increasing trend in digital content consumption , we have expanded our horizons by venturing into the digital domain not just to present news but also to analyse and dissect several aspects of our society through a journalistic lens.
    Analysis of the complex implications lurking behind seemingly simple news along with an equal amount focus on the Telugu language , it’s importance and beauty shall be the primary focus of our Mahati channel.
    మూడు దశాబ్దాలుగా జర్నలిజం, మీడియా వ్యాపారంలో ఉన్న ధాత్రి కమ్యూనికేషన్స్ అధినేత పమిడికాల్వ మధుసూదన్ విశ్లేషణలు మహతి డిజిటల్ తెరపై ఎక్కువగా ఉంటాయి.
    ప్రత్యక్ష ప్రసారాలు, టీవీ సీరియళ్లు, షోలు, డాక్యుమెంటరీలు, ప్రకటనలు, ఫిలిం యాడ్స్, వైవిధ్యభరితమైన సృజనాత్మక ప్రోగ్రాములను రూపొందించిన ధాత్రి కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న డిజిటల్ వేదిక ఇది. మీడియా రంగంలో ధాత్రి ఇప్పటికే ఎన్నో మైలురాళ్లను దాటింది. హైదరాబాద్, విజయవాడల్లో సొంత డబ్బింగ్ థియేటర్లు, కెమెరాలు, అనుభవజ్ఞులైన సాంకేతిక, సృజనాత్మక సిబ్బంది ధాత్రి సొంతం. ప్రభుత్వ, రాజకీయ, కార్పొరేట్ ప్రచార వ్యూహాలు రూపొందించడం, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ధాత్రిది అందెవేసిన చేయి. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ మీడియా సేవల రంగంలోకి కూడా ధాత్రి విస్తరించింది.
    ధాత్రి డిజిటల్ విభాగం నిర్వహణలో నడిచే
    యూట్యూబ్ ఛానల్: Dhatri Mahati
    వెబ్ సైట్ : Idhatri.com
    తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, భారతీయతలు ధాత్రి మహతికి ప్రాధాన్యాలు.

Комментарии • 45

  • @sadashivan89
    @sadashivan89 23 дня назад +1

    మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ఓ గొప్ప బాట... అన్నమయ్య కీర్తనలు వింటున్నప్పుడు చాలా మాటలకు అర్థం తెలియటం లేదు! తమరు ఈ విషయం పై ఆలోచిస్తే నా బొట్లకు చాలా సంతోషం!
    అన్నమయ్య కీర్తనలు ఇంకా బాగా అర్థం చేసుకొని వారి అచ్చ తెలుగు ఆస్వాదించి వినియోగములోకి విస్తృతం చెయ్యాలి అని నా అభిప్రాయం. మీ ఈ దృశ్యమాలికలు వింటున్నప్పుడు ఎంతో బాగుంటుంది. మీరు నేను చెప్పిన అన్నమయ్య కీర్తన ల తెలుగు గురుంచి మనసు పెడతారు అని భావిస్తూ... సదాశివ నూతలపాటి విశ్రాంత దూరవాణి అభియంత.
    మీతో మాట్లాడాలి అని కోరుకుంటూ ❤❤💐💐🤚🤚... సదాశివ

  • @telugutranslation2403
    @telugutranslation2403 Месяц назад +19

    నా చిన్నతనంలో తెలుగు మీడియం చదివినప్పుడు అందరూ చిన్నచూపు చూసారు.. కొన్నిసార్లు నాకే ఒకలాగా ఉండేది. కానీ ఇప్పుడు ఐటీ రంగంలో ఆ తెలుగే నాకు అన్నం పెడుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఏఐ ఇలా ఇప్పుడు అందరికీ తెలుగు కావాలి. కానీ మంచి తెలుగు వచ్చిన వారు దొరకడమే కష్టంగా ఉంది. అరకొరగా తెలుగు వచ్చిన వారు ఇప్పుడు ఏఐకి శిక్షణనివ్వడానికి వస్తున్నారు. ఇక మీరు ఊహించవచ్చు,,తదుపరి ఏమి జరుగుతుందో.

    • @atchyuthth
      @atchyuthth Месяц назад +4

      మీరు చెప్పింది అక్షర సత్యం. వయోపరిమితి అనేది కారణం కాకపోతే , మీకు తెలుగు భాషలో మంచి పట్టు వున్నవారు దొరుకుతారు.

    • @mohansheshu4049
      @mohansheshu4049 Месяц назад +2

      తదుపరి ఎం జరుగుతుందో ఊహించుకుంటే భయం వేస్తుంది 😢

    • @telugutranslation2403
      @telugutranslation2403 Месяц назад

      @@mohansheshu4049 ఇంకేం జరుగుతుంది. ఆ ఏఐ కూడా తప్పులు తడకలే నేర్చుకుంటుంది..

    • @csnsrikant6925
      @csnsrikant6925 Месяц назад +2

      😮‍💨

  • @jagadeeshbabususarapu4023
    @jagadeeshbabususarapu4023 Месяц назад +5

    తెలుగు భాష లో అక్షరాలని చక్కగా ఆవిష్కరించిన శశి గారిని అలాగే ఆయన ప్రయత్నాన్ని మా ముందించిన మీకు🙏

  • @dwarakakrishna.v344
    @dwarakakrishna.v344 Месяц назад +8

    తెలుగు భాషను సంరక్షించుకోవడం మన కర్తవ్యం.

  • @JourneyofVidhath
    @JourneyofVidhath Месяц назад +5

    తెలుగు భాషలో మాట్లాడుకోవడం, తెలుగు రాయడం మన అందరి బాధ్యత..!

  • @msacharyacreations3049
    @msacharyacreations3049 27 дней назад +1

    అద్భుతః ఆనందం మీకు జాతి పక్షా హృదయ పూర్వక అభివందనాలు

  • @RadioRambabu
    @RadioRambabu Месяц назад +5

    తెలుగు ను
    బతికించాల్సింది తల్లిదండ్రులు ముఖ్యంగా

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Месяц назад +7

    మాతృభాషపై శ్రద్ధ లేకపోతే సమాజంలో సంస్కారం కరవు అవుతుంది. కనీసం తల్లిదండ్రులను, తాత,నాయనమ్మ, అమ్మ గార్లను గౌరవంగా చూడని బాల్యం రూపుదిద్దుకుంటుంది సర్. ఇదేదో ఎవరి గురించి కాదు సర్. మా వాడికి వచ్చిన వింత పైత్యం మాత్రమే. ముందుగా మన ఇల్లు చక్కదిద్దుకుంటే చాలన్నట్లుగా ఉంది నా పరిస్థితి సర్

    • @atchyuthth
      @atchyuthth Месяц назад +1

      మాతృభాష లో మాట్లాడుకోవటం వల్ల మన సంప్రదాయాలు పాటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మాతృ భాషలో సంభాషణలు మన పూర్వీకులనుండి మనకు వచ్చిన వారసత్వం కోల్పోకుండా వుంటాము. మాతృ భాషలోని కొన్ని పదాల మూలాలు మనకు మన సంస్కృతికి దగ్గర చేస్తాయి

    • @srinivasacharyulupanchanga1943
      @srinivasacharyulupanchanga1943 Месяц назад

      మన ప్రభుత్వం చేసిన పాపాలు గురించి , తమిళ ప్రభుత్వం సంరక్షణ. చర్యలు తేడా ఆలోచించండి.

  • @narasimhakumar3757
    @narasimhakumar3757 Месяц назад +3

    చాల మంచి స్ఫూర్తి నిచ్చే భాషణము.శశిగారికి ఎన్నో అభినందనలు

  • @jnanaparishilaka
    @jnanaparishilaka Месяц назад +3

    బాగా చెప్పారు. ధన్యవాదాలు.
    ఆ మధ్య ఇంగ్లీష్ లిపిలో వ్రాసిన ఒక తెలుగు కామెంట్ ను చదవడానికి చాలా ప్రయత్నించాను కానీ వెంటనే ఏ పదాలు అర్ధం కాలేదు. తర్వాత తెలిసింది ఏమిటంటే అది అసలు తెలుగే కాదు. అది నాకు తెలియని వేరొక దక్షిణాది బాష. దానితో మన భాషలను ఇంగ్లీష్ లిపిలో వ్రాసే వాళ్ళందరి మీదా చిరాకు వేసింది. అప్పటినుండి తెలుగు వీడియోలకు ఇంగ్లీష్ లిపిలో పెట్టిన ఏ కామెంటు నైనా చదవడం మానేశాను.
    చాలామంది శ్రమ పడి తయారు చేసిన యూనికోడ్ లిపులను వాడుకోవాలి. ఏ భాషనైనా ఆ భాష లిపిలోనే వ్రాయాలి. దీనికి మన వంతు కృషి చేద్దాము. కృతఙ్ఞతలు.

  • @rajeswarathummaluru1548
    @rajeswarathummaluru1548 21 день назад

    తెలుగువారి అందరి తరపున మీకు ధన్యవాదాలు. మీ సంకల్పానికి మాలాంటివారి చేయూత ఉంటుంది. మీకు (మనకు) మేలు జరుగుగాక

  • @subrramaniam3389
    @subrramaniam3389 Месяц назад +6

    తెలుగు భాషని గంగలో తొక్కిన ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు, సినిమా నటులు, పాటలు మాటలు రాసిన మహానుభావులు ముద్దంజులో ఉన్నారు. మనం చేసుకున్న పాపం. కనీసం పక్క రాష్ట్రం తమిళనాడు చూసైనా సిగ్గు పడుతుందట ఉండాలి.

  • @chilakamarthisaiseshu4651
    @chilakamarthisaiseshu4651 29 дней назад +1

    అద్భుతం గా చెప్పారు

  • @mundlamurivenkatrao1454
    @mundlamurivenkatrao1454 24 дня назад +1

    Variki abhinandanalu

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 Месяц назад +3

    మీ ఆవేదనను అర్థం చేసుకోగలను.

  • @rambabumadamala3226
    @rambabumadamala3226 Месяц назад +2

    ఇన్ని సంవత్సరాలనుండి ఇంగ్లీష్ మీడియం ద్వారా మనం సాధించిన ఘనత ఇదే.

  • @csnsrikant6925
    @csnsrikant6925 Месяц назад +3

    తెలుగువారు ఎవరూ శాపం పెట్టని శాపగ్రస్తులు 😮‍💨

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 Месяц назад +4

    *ఆధునిక తెలుగాంగ్ల పండితులకు శతకోటి కోదండాలు*
    😢😢😢😢😢😢😢😢
    స్మార్ట్ ఫోన్ యుగంలో తెలుగు లిపి అంటే అందరికీ చిన్న చూపు ఏర్పడింది..ఈ దరిద్రపు తెలుగాంగ్లం చదవలేక ఛస్తున్నా.. తెలుగు టైప్ చేయడం వచ్చినప్పటికీ ఇంగ్లీషు భాషమీద పట్టు లేనప్పటికీ తెలుగు మాటలు ఇంగ్లీషు లో టైప్ చేసేవాళ్లను చూస్తుంటే నాకు ఎంతగానో చిరాకు దొబ్బుతుంటుంది.. తిన్నారా- tinnara టిన్నరో ఒకటిన్నరో అర్థం కాదు; వెళ్లారా- vellara వెళ్లారా వాని ఉద్దేశం కానీ ధ్వనించే తీరు "వెళ్లరా!" మరో గమ్మత్తైన పదం ఎరిగారా- erigara; ఎరిగితిరా- erigitira ఇవి చదవటానికి కడుపులో డోకు పుడుతుంది..
    ఇలా కంపుల కుంపటి చేస్తున్న తెలుగు మహాశయులకు కోటి కోదండాలు..
    నోటు: కోదండం అంటే శ్రీ రాముని చేతిలో ఉండే కోదండం కాదు.. మా చిన్నప్పుడు మా ప్రైవేటు మాస్టారు తెలుగు అక్షరాలు సరిగా రాయకపోతే గది పైకప్పు కు ఉండే ఒక కొక్కానికి చిన్న తాడును కట్టి వేలాడదీసేవారు.. కిందికి దూకకుండా ముళ్ళపూడి వారి లెవెల్ లో ఓ ముళ్లకంప అమర్చి లాగు (నేటి ఆధునిక భాష లో షార్ట్స్) లోకి ఓ తొండ వారిని వదిలేవారు.. అదన్నమాట నేను చెప్పిన "కోదండం"
    -రాంమోహన్ కస్తూరి

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 Месяц назад +1

    Mother tongue is to be protected by all Telugu people.l being an English teacher for 51 years in various levels,(High school, junior college and Degree College) Even after retirement l extended my teaching English. With rich experience l am expressing my sincere opinion, that we should not neglect our mother tongue
    .If we do so it's like abandoning our Mother.Hope all Telugu people will stick to this aphorism

  • @csnsrikant6925
    @csnsrikant6925 Месяц назад +2

    దయచేసి ఈ పొన్నరాన్ని( video ) మన తెలుగువారు అందరితో పంచుకోండి 🤷

  • @buddhisagargodavarthi4063
    @buddhisagargodavarthi4063 Месяц назад +1

    🙏👍

  • @mp-xj4rs
    @mp-xj4rs Месяц назад +1

    ఆ పుస్తకం ఎలా కొనాలి?

  • @vignanavedika940
    @vignanavedika940 29 дней назад +1

    ఎపిసోడ్ లో కలుద్దాం అన్నారేంటి .???? వేరే పదం??? తరువాతి అంకం అనచ్చునేమో?

  • @nithinshub
    @nithinshub 23 дня назад

    శశి గూడూరి😢
    గూడూరి శశి😊😊

  • @nagarajups9190
    @nagarajups9190 Месяц назад

    దయచేసి ,శశి గారి ఫోన్ నెంబర్ ఇవ్వండి., ఆ అపురూపమైన పుస్తకం తెప్పించుకొని , మా బడి పిల్లల చిట్టి చేతులకు ముచ్చటగా - అందచేసి , వాళ్ళ తెలుగు ' ధనపు ' సిరి నవ్వుల్ని కానుకగా అందుకుంటాను.

  • @srinivask8109
    @srinivask8109 Месяц назад

    First we must habituate in talking in Telugu in our house and our people

  • @ramprasadchunduru2234
    @ramprasadchunduru2234 Месяц назад

    Sir, Can you please give the details of the book you mentioned. It looked very innovative, very smart. Love to order that book. Please give the details of publisher and where it can be purchased. Thank you.

    • @DhatriMahati
      @DhatriMahati  Месяц назад

      శశి గూడూరు ఫోన్ 98857 33717

  • @visalakshinadella1413
    @visalakshinadella1413 Месяц назад +1

    తె లు గు త ల్లి కి
    ప్ర ణామములు

  • @shaliviran9071
    @shaliviran9071 Месяц назад

    తెలుగు వెలుగు మీరు...

  • @vignanavedika940
    @vignanavedika940 29 дней назад

    తెలుగు వస్త్రాపహరణం అవుతోంది. ఆపాలి.

  • @padmasri4117
    @padmasri4117 Месяц назад +1

    తెలుగు వీర లేవరా దీక్ష పూని కాపాడు కోరా

  • @amarnathjamalpur2518
    @amarnathjamalpur2518 Месяц назад

    అయ్యా భాష మార్పు చెందుతుంది. పరేషాన్ కాకండి. సహజ పరిణామాలను ఆపడం కష్టం .

    • @TELUGU_BLASTS
      @TELUGU_BLASTS Месяц назад +1

      మార్పు చెందడానికి, మరుగు కావాడానికి చాలా తేడా ఉంది. అది తెలుసుకో ముందు

  • @mahendrareddy6625
    @mahendrareddy6625 Месяц назад

    Matladite yedutavariki ardamaithe chaalu a language aite enti em difference untundi matter convey aite saripotundi kada adi a language aina only telugu matrame kadu.keyboard lo english untundi anduke english letters tho telugu ni type chestaru okavela telugu keyboard alavatu chesunte ade alavatu ayyundedemo ala cheste english marchipoye chance undi, a language aithe maximum andariki ardam avtundo world lo use chestunnaro ade maximum members use chestaru okavela english vaddu teluge antha worldwide matladali teluge rayali type cheyyali ante ade undedemo (hypothetical) alage a language aina kuda

    • @podarallaamar7993
      @podarallaamar7993 Месяц назад +3

      ఏ కాలం లో ఉన్నావ్ bro...keyboard lo automatic ga english to తెలుగు ఉంది... అమ్మ కి పక్కన వేరే అమ్మకి చాలా తేడా ఉంది bro

    • @csnsrikant6925
      @csnsrikant6925 Месяц назад +1

      ఇంతకీ తెలుగు అక్షరాలు ఊంచాలంటావా ? లేక చంపేయాలంటావా? 😠😡🤬

    • @girijanookala5204
      @girijanookala5204 29 дней назад

      ఒక భాష చనిపోతే ఒక సంస్కృతి పోతుంది.ఇంగ్లీషైనా సరిగ్గా వచ్చా అంటే అదీ రాదు.అసలు భాషకి ప్రాధాన్యత తగ్గి పోయింది.ఆ Google మీద ఆధారపడి మన ఉనికినే మరిచి పోతున్నాం.ఎవరైనా కాపాడే ప్రయత్నం చేస్తే నవ్వే స్థాయికి వెళ్ళిపోయాం.