Garikapati Narasimha Rao :రాముడిని ఎందుకు నమ్ముకోవాలి..? | EP -247 | ABN Devotional

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 7

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 2 месяца назад +1

    ❤❤❤❤❤❤

  • @keshavgowda4785
    @keshavgowda4785 2 месяца назад

    శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏🙏💐

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 месяца назад +3

    జ్ఞాన నేత్రంతో చూసేందుకు ముందు జ్ఞానం వివరంగా తెలియాలి కదా స్వామీ?

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 месяца назад

    శ్రద్ధాత్రయ విభాగ యోగము
    శ్లో।। 8 : ఆయుస్సత్త్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః ।
    రస్యాస్స్నిగ్ధా స్థ్సిరా హృద్యా ఆహారా స్సాత్త్వికప్రియాః ।।
    (సాత్త్విక శ్రద్ధ)
    భావము:- ఆయుస్సును, శరీర ఉల్లాసము, బలము, ఆరోగ్యము, కలుగజేయునవియు, చూచుటకు అందముగను, ప్రీతిని వృద్ధిచేయు రసవత్తరమైనవి, నూనె పదార్థములు కలవి, దీర్ఘకాలమున్నా చెడిపోని ఆహార పదార్థముల మీద సాత్త్వికులకు ప్రీతియుండును.
    వివరము:- ఆహారము మీద శ్రద్ధ ఏ ఏ గుణములలో ఎలాగుండునో ఇక్కడ వివరించడమైనది. మొదట ఆహారమంటే ఏమిటో తెలుసుకొందాము. మనము నోటి ద్వార లోపలికి వేయునవన్నియు ఆహారము కాదు. నోటిద్వారా కడుపులోనికి పోవు అన్నియు ఆహారము కాదని చాలామందికి తెలియదు. నోటిద్వారా కడుపులోనికి పోవు వాటిలో ఆహారపదార్ధములని, ఆహారపదార్ధములు కానివని రెండు రకములైన పదార్థములు కలవు. శరీరమునకు ఉపయోగపడి, శరీర ఆరోగ్యమును కాపాడుచు శరీర పోషణకు ఉపయోగపడు పోషక పదార్థములున్న వాటిని ఆహారము అనవచ్చును. నోటిద్వారా తీసుకొనుచుండినప్పటికి శరీర పోషణకు ఉపయోగపడక నేరుగ మెదడు మీద పనిచేసి మానసికముగ సుఖమునుకల్గించు మత్తుపదార్ధములను ఆహార పదార్ధములనము. అటువంటి మత్తు పదార్థములైన గంజాయి, నల్లమందు, సారా, బ్రాందీలు మొదలుకొని ఉన్న ప్రతిది ఆహారపదార్థ జాబితాలో చేరవు. శరీర పోషణ నిమిత్తము పోషక పదార్థములున్న వాటినే ఆహారముగ పరిగణించవచ్చును. ఆహార పదార్థము తీసుకోవడములో ఆహారమైన ఏ పదార్థమైనను అభ్యంతరము లేదు. కాని ఆహారపదార్ధములు కాని మత్తుపదార్థములు తీసుకోవడము మంచిదికాదు. ఇక్కడ కొందరికొక ప్రశ్న రావచ్చును. అదేమనగా 'ఆహార పదార్థములలో ముఖ్యముగ శాఖాహారము, మాంసాహారము అను రెండు రకములుగ ఉన్నవి కదా! వాటిలో శాఖాహారము మంచిది, మాంసాహారము చెడ్డదనుచు మాంసాహారమును వదలివేయమంటారు. మాంసాహారము వలన చెడు గుణములు వస్తాయని చెప్పుచుంటారు అది వాస్తవమేనా?' ఈ ప్రశ్నలకు జవాబు ఏమనగా! ఆహార పదార్థములలో శరీరమునకు ఉపయోగపడు నవి, మానసికముగ పనిచేయునవని రెండు రకములు ఉన్నవి. కాని శరీరమునకు ఉపయోగపడు ఆహారములో ఇవి తినవచ్చును ఇవి తినకూడదను నియమముగలవి ఏవిలేవు. మానసిక మార్పు కలుగజేయు మత్తుపదార్థములు తప్ప తినకూడనివేవీ లేవు. ఆహారము సంపాదించుకోవడములో పాపపుణ్యములు రావచ్చునుకాని తినడములో ఏమి లేదు. ఆహారము వలన గుణములు మారునని చాలామంది చెప్పగ వినియు, చాలా పుస్తకములలో వ్రాయగ చూచివున్నాము. ఏ ఆధారముతో అలా వ్రాశారో వారికే తెలియదు. ఆహారము వలన గుణములు మారునట్లయితే జ్ఞానబోధ అవసరమే లేదు. అందరికి మంచి ఆహారము పెట్టి మంచిగ మార్చివేయ వచ్చును. ఏ ఆహారము తిన్నప్పటికి వారి శరీరమునకే కాని గుణములకు ఆధారము కాదు. గుణములకు కారణమైనది వెనుకటి జన్మ కర్మయే. సైన్యములో మూడువందల మందికి ఒకచోట ఒకే ఆహారమివ్వడము జరుగుచున్నది. ఒకే ఆహారము తినుచున్న మూడువందల మందికి ఒకే గుణమున్నదా? అని చూచిన ఎడల అట్లు ఎవ్వరికి లేదు. వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క గుణము కల్గివున్నారు. అందువలన ఆహారము గుణములను మార్చలేదని ఋజువగుచున్నది. ఇక్కడ గీతయందు ఈ అధ్యాయములో గుణమును బట్టి ఆహారమున్నదని చెప్పాడు, కాని ఆహారమును బట్టి గుణములున్నట్లు చెప్పలేదని ముఖ్యముగ తెలియవలెను.
    (తర్వాత కామెట్లో కంటిన్యూ అయింది చూడండి?

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 месяца назад

    ( 2 వ కామెంట్ కంటిన్యూ చేస్తూ)
    (3)ఆహారమైన వాటిలో మాంసాహారము నిషేధమనుట మంచిదికాదు. దాని వలన జ్ఞానము కలుగదనుట మరీ మంచిదికాదు. కర్మరీత్య మాంసాహారమే దొరికినపుడు, తప్పక తినవలసి వచ్చినపుడు, నేను తిననని కూర్చొనుట వీలుకాదు. యుద్ధము చేయనని అర్జునుడు కూర్చున్నప్పటికి కర్మరీత్య నీ పని నిల్వబోదు నీ చేతనే జరుగునన్నట్లు, నేనీ ఆహారము తిననని కూర్చున్నా కర్మ ఉన్నప్పుడు వానిచేతనే తినబడును. అంతమాత్రమున నేను జ్ఞానమునకు పనికిరానని అనుకోకూడదు. పనికి రావని ఇతరులకు కూడ చెప్పకూడదు. భగవద్గీతలో ఆహారములను గూర్చి చెప్పునప్పుడు మాంసాహారము నిషేధమని భగవంతుడెక్కడ చెప్పలేదు. ప్రతి దానిని జ్ఞానపరముగ యోచించాలి తప్ప అన్యదా యోచించి చెప్పకూడదు. ఇక్కడ కూడ ఈ ఆహారముల మీద ఈ గుణములలోనున్న వారికి శ్రద్ధ ఉండునని చెప్పాడు తప్ప ఇవి తినుట వలన ఈ గుణములు అభివృద్ధగునని చెప్పలేదనుట గ్రహించవలెను. ఇక్కడ ఆహారమును బట్టి గుణములు లేవు, గుణములను బట్టి ఆహారమున్నదనుటయే సూత్రము.
    ఉదాహరణకు కర్మరీత్య జీవుడు తామసములో ఉన్నప్పటికి, అక్కడ ప్రేరణ వలన ఆయా గుణములచేత లభించు తామసాహారము తిన్నప్పటికి, వాని శ్రద్ధ సాత్త్వికములో ఉన్న ఎడల వానిని జ్ఞానరీత్య సాత్త్వికునిగ లెక్కించవలెనని కూడ చెప్పుకొన్నాము. ఇక్కడ ఇప్పుడు చెప్పిన శ్లోకములో సాత్త్విక శ్రద్ధ కల్గిన వానికున్న ఆహార ప్రీతిని మాత్రము చెప్పుచున్నట్లు గ్రహించవలెను. అది వానికి లభించవచ్చును లభించకపోవచ్చును. అది కర్మను బట్టి ఉండును.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 месяца назад

    నమస్తే స్వామి.కామం అంటే కోరిక కదా? కోరిక అనేది దేని మీద అయినా ఉండవచ్చు.లైంగిక,ధన సంపాదన,ఇలా అనేక రకాల కోరికలు ఉండవచ్చు కానీ కోరిక వేరు కామం వేరని చెపుతున్నారు ఏమిటి?