Learn Here Sri Sai Chalisa | శ్రీసాయి చాలీసా | Sai Chalisa with Telugu Lyrics | Guru Pournima 2023

Поделиться
HTML-код
  • Опубликовано: 23 сен 2024
  • Learn Here Sri Sai Chalisa | శ్రీసాయి చాలీసా | Sai Chalisa with Telugu Lyrics | Guru Pournima 2023 #thursdayspecial #geethanjali #shirdisaibaba #saichalisa
    ►Follow us: www.facebook.c...
    ►Follow us: / sangeethasadhananjali
    ** Song Credits **
    శ్రీ సాయి చాలీసా
    షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
    దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
    త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి
    దర్శనమియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా
    || షిరిడీవాస ||
    కఫినీ వస్త్రము ధరియించి భుజముకు జోలీ తగిలించి
    నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపుధారణలో
    కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
    షిరిడీ గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం
    || షిరిడీవాస ||
    చాంద్ పాటిల్ ను కలుసుకుని ఆతని బాధలు తెలుసుకుని
    గుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
    వెలిగించావు జ్యోతులను నీవుపయోగించీ జలములను
    అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం.
    || షిరిడీవాస ||
    బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా
    నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి
    పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి
    జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం
    || షిరిడీవాస ||
    నీ ద్వారములో నిలచితిని నిన్నే నిత్యము కొలిచితిని
    అభయమునిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా
    ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి
    నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి
    || షిరిడీవాస ||
    ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
    చేసి మహామ్మారీ నాశనము కాపాడి షిరిడి గ్రామం
    అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి
    శ్యామాను బ్రతికించితివి పాము విషమును తొలగించి
    || షిరిడీవాస ||
    భక్త భీమాజీకి క్షయరోగం నశియించే ఆతని సహనం
    ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు
    కాకాజీకి ఓ సాయి విట్టల దర్శన మిచ్చితివి
    దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం
    || షిరిడీవాస ||
    కరుణాసింధూ కరుణించు మాపై కరుణా కురిపించు
    సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును
    ముస్లిం అనుకొనె నిను మేఘా తెలుసుకొని ఆతని బాధ
    దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము
    || షిరిడీవాస ||
    డాక్టరుకు నీవు రామునిగా బల్వంత్ కు శ్రీదత్తునిగా
    నిమోనుకర్ కు మారుతిగా చిదంబరకు శ్రీగణపతిగా
    మార్తాండ్ కు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా
    నరసింహస్వామిగా జోషికి దర్శన మిచ్చిన శ్రీసాయి
    || షిరిడీవాస ||
    రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
    భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం
    పదకొండు నీ వచనాలు బాబా మాకవి వేదాలు
    శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి
    || షిరిడీవాస ||
    అందరిలోన నీ రూపం నీ మహిమా అతిశక్తిమయం
    ఓ సాయి మేము మూఢులము ఒసగుమయా మాకు జ్ఞానమును
    సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం
    సాయి నామము తలచెదము నిత్యం సాయిని కొలిచెదము
    || షిరిడీవాస ||
    భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని
    చిత్తముతో సాయీ ధ్యానం చెయ్యాలండీ ప్రతినిత్యం
    బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి
    సమాధి నుండి శ్రీసాయి భక్తుల కాపాడేనోయి
    || షిరిడీవాస ||
    మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు
    వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి
    సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి
    భేద భావమును మానండి సాయి మన సద్గురువండి
    || షిరిడీవాస ||
    వందనమయ్యా పరమేశా ఆపద్భాందవ సాయీశా
    మా పాపములు కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు
    కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము దరిచేర్చోయి
    మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం
    || షిరిడీవాస ||
    అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజపరబ్రహ్మ
    శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై జై జై
    Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
    🔔Subscribe NOW: bit.ly/3imdhFp
    👉 Like Us on Facebook: www.facebook.c...
    👉 Follow us on Instagram: / sangeethasadhananjali
    👉 Follow us on Twitter: / ssadhananjali
    Thanks For Watching !!!!
    Enjoy & stay connected with us !!

Комментарии • 46

  • @madhurilolla6944
    @madhurilolla6944 4 месяца назад +1

    Adbhutham ga paadi nerpisthunnaru chaala thanks andi. Om Sri Sai Ram🙏

  • @lakshmipadmajavemuri1246
    @lakshmipadmajavemuri1246 Год назад +7

    🙏 చాలా బాగుంది
    మాకు లలిత చాలీసా కూడా పెట్టమ్మా

  • @krismaly6300
    @krismaly6300 Год назад +2

    అక్క
    నాకు మీ మధురమైన కంట ధ్వని కొద్దిగా ఇవ్వమని కోరుతున్నాను
    మీ వీడియోలు ఎంత చూసినా చూడాలివని అనిపిస్తుంది
    మీ సంగీత జ్ఞ్యననికి ఎ Ph D ఇచ్చిన తక్కువే
    మిమ్మల్ని మరియు మీ కుటుంబానికి ఆ దేవుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను
    మరోవన్ని వీడియోలు పోస్ట్ చెయ్యండి
    ఓం జై శ్రీ సాయి రామ్
    తత్ సత్ బ్రహ్మర్పణమస్తు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ushakoganti5108
    @ushakoganti5108 Год назад

    🙏🏻🙏🏻🙏🏻❤️

  • @kanthipb6513
    @kanthipb6513 Год назад +3

    అమ్మా అలంకారాలు video upload చేయండి....మీ videos practice కా చాలా help అవుతున్నాయి

  • @arunasriguduri6349
    @arunasriguduri6349 Год назад +2

    మేడం నమస్కారం.
    మీరు నేర్పించే విధానం అద్భుతం
    సంగీత పరిజ్ఞానం లేని నాకు మీ video లు chuthunte నాకు సంగీతం నేర్చుకోవాలి అనిపించింది. ఈ మధ్యే గురువు గారి దగ్గర నేర్చుకుంటున్నాను.
    మేడం దయచేసి మోహనరగం సరళీశ్వరాలు, jantaswaralu, అకార సాధన నేర్పించగలరు

  • @chennupallianjana2378
    @chennupallianjana2378 Год назад +3

    చాలా చక్కగా నేర్పించారు అమ్మ, ధన్యవాదములు 🙏🙏

  • @purnaramesh5133
    @purnaramesh5133 Год назад +3

    ప్రతిరోజూ ఈ వీడియో పెట్టుకొని వింటూ,పాడుకుంటూ వుంటే చాలా ఆనందం గా వుంటుంది..అందరూ చక్కగా పాడుకునే విధంగా వుంది..చాలా సంతోషం గా వుంది మేడం..🙏🙏🌹🌹💐💐👌👌😊

  • @nagamanimurthy7945
    @nagamanimurthy7945 Год назад +7

    నిస్వార్దమైన ప్రేమకు నిలువెత్తు రూపం బాబా ,బాబా గారికి ప్రతిరూపం మీ నిస్వార్దమైన మనసు. వేలలో ఫీజు చెల్లించిన ఇంత వివరణ తో కూడిన సంగీతం దొరకడం లేదు.మీ మంచి మనసును మాకు పరిచయం చేసిన ఆ పరమాత్మ కు 🙏🙏🙏🙏

  • @krismaly6300
    @krismaly6300 Год назад

    అక్క గురు
    ఓం సాయి రామ్

  • @lalitaakella581
    @lalitaakella581 Год назад +1

    గీతాంజలి గారు మీరు చేసే యీ నిస్వార్థ సేవకు శతకోటి నమస్కారములు.చాలా బాగా నేర్పించారు.ధన్యవాదములు. 🙏🙏

  • @nithyaarts816
    @nithyaarts816 Год назад +3

    మీరు చాలా బాగా పాడతారు.......🙏

  • @ushakoganti5108
    @ushakoganti5108 Год назад

    Thank you mamma ❤️

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 Год назад +2

    Dhanyavaadalu amma

  • @palurilakshmi2947
    @palurilakshmi2947 Год назад +2

    2 days before ee meeru Sai Baba paatalu emina pedithe bagunnu anukunna, thanq so much mam

  • @achantasurekha7908
    @achantasurekha7908 Год назад +2

    Omkara rupini hreekara vasini suseela gari song nerpandamma

  • @INDIANRANGOLIvlogs
    @INDIANRANGOLIvlogs Год назад +2

    అమ్మా నేనైతే రోజుకు ఎన్నిసార్లు మీ ఛానల్ ఓపెన్ చేస్తానో నాకే తెలియదు🙏
    మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశవర్యాలతో సుఖ సంతషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జైశ్రీరామ్ 🙏🙏

  • @venkatalakshmigadugoyyala594
    @venkatalakshmigadugoyyala594 Год назад +1

    Amma meru chala Baga padataru

  • @jangapadma9903
    @jangapadma9903 Год назад +1

    వేలల్లో ఫీజు కట్టి సంగీతం నేర్చుకున్నాను.. కానీ ఇంత వివరంగా ఎవరూ చెప్పలేదు🙏

  • @nn-fm8sy
    @nn-fm8sy Год назад

    Amma chala chala dhanyavadhamulu meeku 🌹💐💐👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🌹

  • @ushakoganti5108
    @ushakoganti5108 Год назад

    🙏🏻🙏🏻💐🌺❤️

  • @sanjanaganivada8084
    @sanjanaganivada8084 Год назад

    Om sai ram🙏🙏

  • @kvasista483
    @kvasista483 10 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @ushakoganti5108
    @ushakoganti5108 Год назад

    💐🌺🙏🏻🙏🏻🌹🌷

  • @bhargavisatyaprabhanunna1590
    @bhargavisatyaprabhanunna1590 Год назад

    ధన్యవాదాలు మేడమ్ 🙏 🙏🙏

  • @madhurilatha9067
    @madhurilatha9067 Год назад

    Sooper mam almost ma amma kuda ilane nerpincharu baba temple lo ilane padutham but ur voice is amazing oka madhuryam untundhi me patalo tqqqq so much

  • @nallabothulalakshmikumari6812
    @nallabothulalakshmikumari6812 Год назад

    Amma Rama kodanda rama song nerpinchandamma

  • @ushakoganti5108
    @ushakoganti5108 Год назад

    Wow what sweet voice and explanation 🎉🙏🏻🌹

  • @ramadevipulugurtha2950
    @ramadevipulugurtha2950 Год назад

    Super. Chala Bavundi thank you 😊

  • @janakiprasad9790
    @janakiprasad9790 Год назад

    సాయిరాం🙏🙏

  • @mallelarajani6466
    @mallelarajani6466 Год назад

    🙏🙏🙏 అమ్మ🌹

  • @dhanalakshmi-nm5eu
    @dhanalakshmi-nm5eu Год назад

    Sairam

  • @vijayalakshmi-bq2sb
    @vijayalakshmi-bq2sb Год назад

    Thank you mam
    Suuuuper mam 🙏🙏

  • @rajeswararaokurma6096
    @rajeswararaokurma6096 Год назад

    thank you madam

  • @srinivasyaramanedi6311
    @srinivasyaramanedi6311 Год назад

    Thank you mam. Please teach us hanuman dandakam

  • @murikikalpana4200
    @murikikalpana4200 Год назад

    Super akka 🙏🙏🙏

  • @vimalabaig6504
    @vimalabaig6504 Год назад

    Very melodious voice

  • @sailajamocherla6348
    @sailajamocherla6348 Год назад

    Amma! Sada sat swarupam, sai harati nerpandi please🙏

  • @gontlasukanya2813
    @gontlasukanya2813 Год назад +1

    Mam harathulu neerpinchande

  • @mohanraokocherla166
    @mohanraokocherla166 Год назад

    Siddamangala stotram neripichandi

  • @krismaly6300
    @krismaly6300 Год назад

    FYI
    Searched on Google and found as below
    Who wrote Shirdi Sai Baba?

    Most information about Shirdi Sai Baba tends to be derived from a book called Shri Sai Satcharitra written by a disciple called Hemadpant (also known as Annasaheb Dabholkar / Govind Raghunath) in 1922 in Marathi.

  • @priyapandey-wi2wo
    @priyapandey-wi2wo Год назад

    👃👃👃👃👃

  • @mvsnreddy8506
    @mvsnreddy8506 5 месяцев назад

    😂