చిత్తజగురుడా ఓ నర్సింహా అన్నమయ్య కీర్తన Narasimha Swamy Annamayya Keerthana | Kalyani Dwibhashyam

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024
  • #AnnamayyaKeerthana #KalyaniDwibhashyam #Kalyani
    చిత్తజగురుడా ఓ నర్సింహా అన్నమయ్య కీర్తన
    Chitha Jaagarudaa O Narasimha - Annamayya Keerthana | Kalyani Dwibhashyam
    Genre : Devotional Carnatic Music
    Composed by : Sri.Garimella Balakrishna Prasad
    Singer : Kalyani Dwibhashyam
    Contact No - Kalyani Dwibhashyam - Mobile : 9246117795
    Lyrics in Telugu....
    పల్లవి..
    చిత్తజగురుడా ఓ శ్రీ నరసింహ
    బత్తిసేసేరు మునులుపరికించవయ్యా(2)
    చరణం..1)
    సకలదేవతలును జయవెట్టుచున్నారు
    చకితులై దానవులు సమసిరదే
    ఆకళంకయగు లక్ష్మి అటు నీ తొడపై నెక్కి
    ప్రకటమైన నీ కోపము మానవయ్యా..(చిత్తజ)
    చరణం..2
    తుంబురు నారదాదులు దొరకొని పాడేరు
    అంబుజాసనుండ భయమడిగినదే
    అంబర వీధి నాడేరు అచ్చరలందరు గూడి
    శంబర రిపు జనక శాంతము చూపవయ్యా..(చిత్తజ)
    చరణం..3
    హత్తి కొలిచేరట యక్షులును గంధర్వులు
    చిత్తగించి పొగిడేరు సిధ్ధ సాధ్యులు
    సత్తుగ నీ దాసులము శరణు జొచ్చితి మిదే..
    ఇత్తల శ్రీ వేంకటేశ ఏలు కొనవయ్యా...
    (చిత్తజగురుడా)

Комментарии •