కాశీలో ద్వాదశ ఆదిత్యులు దర్శనం ఒక్క రోజులో చేసుకోవడం ఎలా?

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 91

  • @kashivihari
    @kashivihari  Год назад +7

    మనలో చాలామందికి కాశీలో ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు అని తెలుసు కదా. సూర్యుడు కాశీలో 12 రూపాల్లో ఉండి మనల్ని అనుగ్రహిస్తున్నరు. చాలామంది కాశీ వచ్చినపుడు ఈ ద్వాదశ అదిత్యులను దర్శించుకుందాం అనుకుంటారు. కానీ కాశీలో ఉన్న అసంఖ్యాక దేవాలయాలు, చిన్న చిన్న సందులు, భాష సమస్యల వల్ల చాలామందికి కుదరక ఉండి పోవచ్చు. పరమేశ్వరుడి అనుగ్రహంతో మీ అందరికీ ద్వాదశ ఆదిత్యులు దర్శనానికి కావలసిన సమాచారాన్ని నేను ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం జరిగింది.
    ఈ ద్వాదశ ఆదిత్యులు గురించి కాశీ ఖండం 46, 47, 48, 49, 50, 51 అధ్యాయాలలో ప్రస్తావించారు.
    ఈ అధ్యాయాలలో ఉన్న విషయాలని శక్తి మేరకు ఈ వీడియోలో వివరించడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఆదిత్యులు గురించి కాశీ ఖండంలో చెప్పిన క్రమంలో కాకుండా దర్శనానికి సులభమైన క్రమంలో ఇవ్వడం జరిగింది. గమనించగలరు 🙏🏼.
    ఈ వీడియోలో కాశీలో ఉన్న ద్వాదశ ఆదిత్యులు దర్శనం ఒక్కరోజులో ఎలా చేసుకోవాలో చూద్దాం.
    ముందుగా ప్రతీ గుడి యొక్క గూగుల్ మ్యాప్ కోఆర్డినేషన్స్:
    1) లోలర్క ఆదిత్యుడు
    LOLARK ADITYA MANDIR
    maps.google.com/?cid=485401672973092857&entry=gps
    2) విమల ఆదిత్యుడు
    Vimala Aditya
    maps.google.com/?cid=1778698027781500511&entry=gps
    3) సాంబ ఆదిత్యుడు
    Samba Aditya Temple
    maps.google.com/?cid=6054061089927256060&entry=gps
    4) ఉత్తరార్క ఆదిత్యుడు
    Uttararka temple
    maps.google.com/?cid=13996839033398061501&entry=gps
    5) కేశవ ఆదిత్యుడు
    Sri Adhi Kesava
    maps.google.com/?cid=8386150230186783179&entry=gps
    6) ఖఖోల్క ఆదిత్యుడు
    Kameshwar Mahadev & Khakhol Aditya Temple - Kashi Khand
    maps.google.com/?cid=17584961918457789926&entry=gps
    7)అరుణ ఆదిత్యుడు
    TRILOCHAN MAHADEV TEMPLE
    maps.google.com/?cid=13657183929498468436&entry=gps
    8) మయూఖ ఆదిత్యుడు
    Mangalagauri + Gabhasteeshwar mandir varanasi
    maps.google.com/?cid=13029910419037644947&entry=gps
    9) యమ ఆదిత్యుడు
    Yama Aditya Temple - Dwadash Aditya Kashi Khand
    maps.google.com/?cid=12200389243507373878&entry=gps
    10) వృద్ధ ఆదిత్యుడు
    Vriddha Aditya Mandir - Dwadash Aditya Kashi Khand
    maps.google.com/?cid=12612803378128305319&entry=gps
    11) గంగా ఆదిత్యుడు
    Nepali Temple
    maps.google.com/?cid=4335805247785518914&entry=gps
    12) ద్రౌపది ఆదిత్యుడు
    Shree Annapurna Mandir
    +91 542 239 2619
    maps.google.com/?cid=12372421082235836014&entry=gps
    నా అభిప్రాయం ప్రకారం వీడియో చూసిన తరువాత పైన ఇచ్చిన గూగుల్ మ్యాప్ కోఆర్డినేషన్స్ సహాయంతో యాత్ర సులభంగానే చేసుకోవచ్చు అనుకుంటున్నా. ఇంకా ఏమైనా సందేహాలు కానీ వివరణ కానీ కావాలంటే కింద ఇచ్చిన సమాచారం కూడా చదవండి.

    • @kashivihari
      @kashivihari  Год назад +2

      ముందుగానే చెప్పినట్టు ద్వాదశ ఆదిత్యులు క్రమం కాశీ ఖండంలో చెప్పినట్టు కాకుండా దర్శనానికి సులభకరమైన రీతిలో ఇవ్వడం జరిగింది.
      ముందుగా లోలార్క ఆదిత్యుని దర్శనం చేసుకుందాము. కాశీలో తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రదేశం ఆంధ్ర ఆశ్రమం. ఈ ప్రాంతాన్ని సోనార్ పుర, పాండే హవేలీ అంటారు. ఇక్కడకి దగ్గరలోనే ఉంది లోలార్కుని గుడి. ఆంధ్ర ఆశ్రమం మెయిన్ రోడ్ సోనార్ పుర జంక్షన్ నుండి అసి ఘాట్ వైపు వెళ్ళే ఆటోలు ఎక్కితే 5 రూపాయల చార్జీతో మార్వాడి సేవా సంఘం దగ్గర దింపుతారు. అక్కడ నుండి లోలార్క కుండం చాలా దగ్గర. ఈ కుండం దగ్గరే లోలార్క ఆదిత్యుని గుడి ఉంది. ఈ ప్రదేశం చాలా మందికి సుపరిచితం. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జన్మస్థలం ఇక్కడకు దగ్గరే.
      ఈ లోలార్క కుండం లో స్నానం చేసి బట్టలు అక్కడ వదిలేసి లోలార్క ఆదిత్యుని పూజిస్తే పిల్లలు పుడతారు ముఖ్యంగా మగ సంతానం కలుగుతారు అని నమ్మకం. చాలా మంది అలాగే చేస్తారు కూడా.
      లోలార్క ఆదిత్యుని దర్శనం తరువాత అక్కడ నుండి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న విమల ఆదిత్యుని దర్శనానికి వెళ్ళండి. ఈ మందిరం గురించి చాలా మంది స్థానికులు కూడా తెలియదు. కానీ మీరు గూగుల్ మ్యాప్స్ సహాయంతో చాలా సులభంగా చేరుకోవచ్చు. లోలార్క ఆదిత్యుని గుడి నుండి మెయిన్ రోడ్ మీదకి వచ్చిన తరువాత కాశీ విశ్వనాథ గుడి వైపు వెళ్ళే ఆటో ఎక్కాలి. జంగంబాడి లేదా బెంగాలీ టోలా పోస్ట్ ఆఫీస్ దగ్గర దిగాలి. ఈ బెంగాలీ టోలా పోస్ట్ ఆఫీస్ రోడ్ కి ఎదురు రోడ్ లో వెళితే ఆంధ్ర ఆశ్రమం అని తెలుగులో పెద్ద బోర్డ్ ఉంటుంది. మీరు అక్కడ అడిగితే చెప్తారు గుడికి ఎలా వెళ్ళాలో. లేదా ఆ ఆశ్రమానికి ఎదురుగా ఉన్న సందులోకి వెళ్తే ఒక 30 అడుగుల తరువాత మీకు కుడి చేతి వైపు ఒక శిధిలావస్థలో వున్న భవనం కనపడుతుంది. ఆకారానికి ఏ మాత్రం గుడిలా ఉండదు. అదే విమల ఆదిత్యుని ఆలయం. పక్కనే స్వీట్స్ తయారు చేస్తూ ఉంటారు. సందులో నుండి కుడి చేతి వైపు తిరిగి అలా స్వీట్స్ తయారు చేసే వారి పక్క నుండి వెళ్తే గుడి లోపలకి వెళ్ళే గేట్ స్టీల్ తో చేసినది కనపడుతుంది. సాధారణంగా ఎవరూ ఉండరు గుడిలో. తలుపుకి తాళం ఏమి వెయ్యరు. మీరు తీసుకుని వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆదివారాల్లో ఈయన దర్శనం అత్యంత శుభప్రదం.
      విమల ఆదిత్యుని దర్శనం తరువాత అక్కడ నుండి 700 మీటర్ల దూరంలో ఉన్న సాంబ ఆదిత్యుని గుడి వెళ్ళండి. ఈ గుడి సూరజ్ కుండ్ అనే ప్రసిద్ధ ప్రాంతంలో ఉంది. కనుక గుడికి చేరుకోవడానికి ఇబ్బంది ఏమి ఉండదు. హైదరాబాద్ వారి వాసవి సదన్ కు వెనకగా వస్తుంది ఈ గుడి. విమల ఆదిత్య గుడి నుండి లోపల సందులో నుండి మార్గం ఉంటుంది. కానీ కొత్త వారు విమల ఆదిత్యుని గుడి నుండి మెయిన్ రోడ్ కి వచ్చేసి అక్కడ నుండి గదౌలియా క్రాస్ రోడ్స్ కి చేరుకోవాలి. అక్కడ నుండి గిరిజా ఘర్ సర్కిల్ కి వెళ్ళాలి. ఇవి చాలా ప్రసిద్ధమైన ప్రదేశాలు. మీకు హిందీ రాకపోయినా కూడా కేవలం ఈ ప్రాంత పేరు చెప్తే చాలు స్థానికులు చేతుల సైగలతో అయిన ఎటుగా వెళ్ళాలో చెప్పేస్తారు. గిరిజా గర్ చౌరస్తాలో సూరజ్ కుండ్ అని అడిగితే సాధారణంగా ఎవరైనా చెప్పేస్తారు. ఈ సూరజ్ కుండ్ దగ్గరలోనే ఉంది సాంబ ఆదిత్యుని ఆలయం. ఈ సాంబ ఆదిత్యుని ఆలయంలోనే స్వామికి ఎదురుగా ఉన్న గదిలో 56 శక్తి గణపతులు లో ఒకరైన ద్విముఖ వినాయకుడు కూడా ఉన్నారు.
      ఈ సాంబ ఆదిత్యుని దర్శనం తరువాత అక్కడ నుండి 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉత్తరార్క ఆదిత్యుని గుడికి వెళ్ళండి. ఈయన గుడి వారణాసి సిటీ స్టేషన్ (జంక్షన్ స్టేషన్ కాదు). సిటీ స్టేషన్ దగ్గరకి వచ్చి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న సందులో నుండి వెళ్ళాలి. వారణాసి సిటీ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి బకరియా కుండ్ అని అడగాలి (ఉత్తరార్క ఆలయం అంటే సాధారణంగా తెలీదు అంటారు). ఈ ఉత్తరార్క ఆదిత్యుని ఆలయం ఈ బకరియ కుండ్ కి చాలా దగ్గరలో ఉంది.

    • @kashivihari
      @kashivihari  Год назад +2

      ఈ ప్రాంతంలో ముస్లింలు ఎక్కవగా ఉంటారు. అందుకని ఈ గుడి ఎక్కువగా ఎవరికి తెలియదు. పైన చెప్పిన ఆధారాలు మరియు గూగుల్ మ్యాప్స్ సహాయంతో చేరుకోండి. సాంబ ఆదిత్య నుండి ఈ గుడికి చేరుకోవడానికి డైరెక్ట్ ఆటో కానీ పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ కానీ ఉండదు. ఒకవేళ మీరు ఆటోలోనే వస్తుంటే వారణాసి కాంట్ (జంక్షన్) రైల్వే స్టేషన్ వరకు వచ్చి అక్కడ నుండి సిటీ స్టేషన్ వైపు వెళ్ళే ఆటో (గోల్ గట్టా/ రాజ్ ఘాట్/ మొఘల్ సరాయి) ఎక్కాలి. చేరుకోవడానికి
      ఈ ఉత్తరార్క ఆదిత్యుని దర్శనం తరువాత అక్కడ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేశవ ఆదిత్యుడు దర్శనానికి వెళ్ళండి. ఈయన ఆది కేశవ్ ఘాట్ లో ఉన్న ఆది కేశవ్ మందిరంలో ఉన్నారు. ఈ గుడికి వెళ్ళడానికి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏమి ఉండదు. మీరు రాజ్ ఘాట్ దగ్గర ఉన్న రాజ్ ఘాట్ ఫోర్ట్ నుండి లోపలకి 2 కిలో మీటర్లు వెళ్ళాలి. గూగుల్ మ్యాప్స్ సహాయంతో గుడికి చేరుకోవడం చాలా సులభం. గుడిలో కూడా ఆది కేశవుని విగ్రహం ప్రక్కనే కేశవ ఆదిత్యుడు ఉన్నారు. ఈ గుడి దగ్గరలోనే వరుణ నది గంగా నదిలో కలుస్తుంది.
      ఈ కేశవ ఆదిత్యుని దర్శనం అనంతరం అక్కడ నుండి 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఖఖోల్క ఆదిత్యుని దర్శనానికి వెళ్ళండి. ఈ గుడి వారణాసిలో ని మత్స్యోదరి అనే ప్రాంతంలో ఉన్న బిర్లా హాస్పిటల్ కి ఎదురుగా ఉన్న సందులో కామేశ్వర మహాదేవ్ గుడిలో ఉన్నారు. వీడియోలో చూపించినట్లు గుడి వెనకాల ఉన్న వరండాలో ఉన్నారు స్వామి వారు. కేశవ ఆదిత్య గుడి నుండి మీరు రాజ్ ఘాట్ ఫోర్ట్ వరకు వస్తే అక్కడ నుండి మత్స్యోదరి బిర్లా హాస్పిటల్ వరకు ఆటోలు ఉంటాయి.
      ఖఖోల్క ఆదిత్యుని దర్శనం తరువాత అక్కడకి చాలా దగ్గరలో ఉన్న అరుణ ఆదిత్య దర్శనానికి వెళ్ళండి. ఈ అరుణ ఆదిత్య త్రిలోచన మహాదేవ్ మందిరంలో ఉన్నారు. ఇది చాలా పెద్ద గుడి. కామేశ్వర మహాదేవ్ గుడి దగ్గరలో ఎవర్ని అడిగినా చెప్తారు. వీడియోలో చూపినట్టు త్రిలోచన మహాదేవ్ గుడి వెనక వైపు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం కింద ఉంది అరుణ ఆదిత్య మూర్తి. ఈ గుడి దగ్గరలో త్రిలోచన ఘాట్ ఉంది. మిగిలిన ఆదిత్య మందిరాలను దర్శించడానికి కావాలంటే ఇక్కడ ఘాట్ లో నుండి పడవలో వెళ్ళవచ్చు. కానీ ప్రతీ ఘాట్ లో దాదాపు 70 నుండి 80 మెట్లు ఎక్కాలి. అలా 3 ఘాట్ లు ఎక్కి దిగాలి. లేనిచో తరువాత దర్శించే మయూఖ ఆదిత్యుని గుడి వరకు ఏదైనా మోటారు వాహనంలో ప్రయాణించి అక్కడ నుండి మాత్రం నడక ద్వారానే వెళ్ళాలి.
      ఈ అరుణ ఆదిత్యుడు దర్శనం తరువాత మయూఖ ఆదిత్యుని గుడికి వెళ్ళండి. ఘాట్ లో నుండి వెళ్తుంటే బాలాజీ ఘాట్ వరకు వెళ్ళండి. అక్కడ మెట్లు ఎక్కిన వెంటనే గుడి వస్తుంది. రోడ్డు మార్గంలో వెళ్తుంటే 1 కిలో మీటర్ దూరంలో ఉన్న పంచగంగ ఘాట్ వరకు వెళ్ళాలి. ఈ ఘాట్ వరకు వాహనాలు వెళ్ళడం చాలా కష్టం. కాల భైరవ గుడి వెనక నుండి వెళ్ళే దారి సాధారణంగా కొత్త వారు వెళ్ళే దారి. చెప్పడానికి కూడా కొంచెం సులభం. మిగిలిన దారులలో వెళ్ళడం కొత్త వారికి చాలా కష్టం. పంచగంగా ఘాట్ దగ్గరలో ఉన్న మంగళ గౌరీ ఆలయంలో ఉన్నారు మయూఖ ఆదిత్యుడు. ఈ మూర్తిని కనుక్కోవడం కొత్తవారికి కొంచెం కష్టం. ఈ గుడి మధ్యలో వున్న గభస్తీశ్వర లింగమునకు కుడి వైపు మూలలో ఉంటారు. గుడిలో ఉన్న అర్చకులను అడిగితే చూపుతారు.
      మయూఖ ఆదిత్యుని దర్శనం తరువాత అక్కడ నుండి 400 మీటర్ల దూరంలో ఉన్న యమ ఆదిత్యుని గుడికి వెళ్ళండి. పడవలో వెళ్ళేవారు సింధియా ఘాట్ లేదా సంకట ఘాట్ లో దిగితే ఘాట్ మెట్లు మీద ఉన్నారు. లేదంటే మయూఖ ఆదిత్యుని గుడి దగ్గర నుండి అగ్నీశ్వర్, ఉపసాంతేశ్వర్, నాగేశ్వర్, సంకట దేవి గుడి మీదగా నడిచి రావచ్చు.

    • @kashivihari
      @kashivihari  Год назад +2

      ఈ యమ ఆదిత్యుని దర్శనం తరువాత అక్కడకు దగ్గర్లోనే ఉన్న గంగా ఆదిత్యుని దర్శనానికి వెళ్ళండి. ఈయన లలిత ఘాట్ లో వున్న నేపాలి మందిరం కింద భాగంలో ఉన్నారు. లలితా ఘాట్ నుండి నేపాలి మందిరం వరకు మెట్లు ఎక్కిన తరువాత మళ్ళీ గుడి ముందు కుడి చేతి వైపు ఉన్న చిన్న చిన్న మెట్లు దిగాలి. అక్కడ ఎడమ చేతి వైపు ఉంటారు ఈ గంగా ఆదిత్యుడు.
      ఈ గంగా ఆదిత్యుని దర్శనం తరువాత దగ్గర్లో ఉన్న వృద్ధ ఆదిత్యుని గుడికి వెళ్ళండి. ఈ గుడి మీర్ ఘాట్ లో ఉంది. పడవలో వచ్చే వారు మీర్ ఘాట్ లో దిగి మెట్లు ఎక్కి విశాలాక్షి అమ్మ వారి గుడి వైపు వస్తుంటే ఎడమ చేతి వైపు ఉంటుంది ఆలయం. నడచి వచ్చే వారు కూడా లలిత ఘాట్ నుండి ఘాట్ మార్గంలో వస్తే సులభంగా చేరుకోవచ్చు. వృద్ధ ఆదిత్యుని దర్శనం తరువాత దగ్గరలోనే ఉన్న విశాలాక్షి అమ్మవారిని కూడా దర్శించుకోండి.
      వృద్ధ ఆదిత్యుని దర్శనం తరువాత ద్రౌపది ఆదిత్యుని దర్శనానికి వెళ్ళండి. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కు వున్నది. విశ్వనాథ గుడి అభివృద్ధి పనులలో భాగంగా అసలైన ద్రౌపది ఆదిత్యుని విగ్రహం తొలగించేసారు. అందుకని ప్రతిగా మీరు అన్నపూర్ణ దేవి గుడి వెనకాల భోజనాలకి వెళ్ళే మార్గానికి కుడి వైపు ఉన్న సూర్య నారాయణ మూర్తి దర్శనం చేసుకోవచ్చు. వృద్ధ ఆదిత్యుని దర్శనం తరువాత విశ్వనాథ కారిడార్ 2వ నంబర్ గేటు నుండి కానీ 4వ నంబర్ గేటు నుండి కానీ అన్నపూర్ణ అమ్మవారి గుడికి వెళ్ళవచ్చు. అన్నపూర్ణ అమ్మవారు, ద్రుపద ఆదిత్య అంశ ఒక్కటే కాబట్టి అసలైన ద్రుపద ఆదిత్య విగ్రహం ప్రస్తుతం లుప్తంగా ఉంది కాబట్టి ఈ ఆదిత్యుని దర్శనంతో ద్వాదశ ఆదిత్యులు యాత్ర పూర్ణం చేసుకోండి. తరువాత అన్నపూర్ణ అమ్మను, విశ్వనాథ తండ్రిని దర్శించుకుంటే మీ యాత్ర పరిపూర్ణం.
      ద్వాదశ ఆదిత్యులు వృత్తాంతం గురించి తెలుసుకోవడానికి KASHI YATHRA Telugu ఛానల్ లో ఉన్న ద్వాదశ ఆదిత్యులు గురించిన వీడియో కానీ ఏదైనా కాశీ ఖండం పుస్తకం ద్వారా కానీ తెలుసుకోవచ్చు.

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 2 года назад +6

    కాశీ లోని ద్వాదశ ఆదిత్యుల గురించి చాలా మంచిగా తెలియజేసారు. ధన్యవాదములు..

  • @shankarkakarla4838
    @shankarkakarla4838 Месяц назад

    ద్వాదశ ఆదిత్యులు గురించి చాలా బాగా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేటట్లు తెలిపారు. మీ వీడియో చూసి ఒక్కరోజే ఇవి అన్నీ చూసేసాను. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @vittalpalthi713
    @vittalpalthi713 Год назад +1

    Mee video chusaka 12 adithyula darshana bhagyam kaligindi. Meeku 🙏🙏🙏. Your way of explanation is crystal clear. 🙏🙏.
    Mamatha, kashi

  • @sudhakar6219
    @sudhakar6219 Год назад +2

    చాలా బాగా వివరించారు. వీడియోలు అందరూ చేస్తారు కానీ మీరు ప్రత్యేకం, ఎందుకంటే ఎలా వెళ్ళాలి అన్న విషయాన్ని డిస్క్రిప్షన్ తో సహా గూగుల్ co ordinates తో సహా ఇవ్వడం అన్న ఐడియా చాలా అద్భుతంగా వుంది.
    ఆ కాశీ విశ్వేశ్వరుడు మరియు ఆదిత్యుని అనుగ్రహం మీకు సదా వుండాలని ప్రార్థిస్తూ ఉన్నాను.

    • @kashivihari
      @kashivihari  Год назад

      ధన్యవాదాలు అండి

  • @Lalitha-m9g
    @Lalitha-m9g 4 месяца назад +1

    Chala chala tqs andi meru chala baga neat ga maps information echaru meru happy ga unndali

  • @smithaparasam2202
    @smithaparasam2202 Год назад +1

    Dhanyavaadam, it is a very very infomative video about Dwadashaaditya darshan at Kaashi, thanks a lot for all your hard efforts in making and sharing this very blissful video. 🙏🙏🙏🙏🙏

  • @talentinfluencer9157
    @talentinfluencer9157 2 года назад +4

    Very great effort 👍 well done brother, thanks 🙏🙏🙏

    • @itsarma
      @itsarma 2 года назад

      సర్వే జనా సుఖినోభవంతు
      సర్వే సృజన సుఖినోభవంతు
      అసతోమ సద్గమయ
      తమసోమ జ్యోతిర్ ర్గమయా మృత్య్యోర్మ అమృతంగమయా
      ఓం శాంతిః శాంతిః శాంతిః

  • @vinodputta5507
    @vinodputta5507 4 месяца назад

    Chala manchi information icharu.. Thanks..

  • @ASTROVASTU
    @ASTROVASTU 2 года назад +2

    చాలా చక్కగా వివరించారు

  • @gattepallyushasree6774
    @gattepallyushasree6774 Год назад +1

    Dhanyavaadalu andi.. Meeku aa aadityudu&vishwanadhudi anugraham labhinchali

  • @nandinepragada3874
    @nandinepragada3874 2 года назад +1

    ధన్యవాదములు తెలియని విషయాలు తెలుసుకున్నాము

  • @SHIVA7278
    @SHIVA7278 Год назад

    Chala baga explain cheysaru, dini venuka mee kashtam naku ardham avuthondi.

  • @srinivasakula7637
    @srinivasakula7637 2 года назад +2

    Useful Information good

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 2 месяца назад +1

    మీరు చెప్పే విధానం బాగుంది. సహజం ga, ఎటువంటి over action లేకుండా, చాల బాగా natural ga ఉంది.

    • @kashivihari
      @kashivihari  Месяц назад +1

      ధన్యవాదాలు అండి

  • @gsmani9648
    @gsmani9648 Год назад +1

    Nice information Tq 🙏🙏

  • @tekulavenkat1239
    @tekulavenkat1239 2 года назад +3

    🚩హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ..🙏🏻

  • @sriravikiranr4788
    @sriravikiranr4788 2 года назад +3

    Nice video bro 🙏🙏🙏🙏

  • @kumarakella4274
    @kumarakella4274 2 года назад +3

    నమః పర్వతీపతయే హర హర మహాదేవ శంభోశంకర🙏🙏🙏🙏

  • @kumarakella4274
    @kumarakella4274 2 года назад +3

    ధన్యవాదాలు🙏
    ధన్యోస్తు శుభంభుాయాత్🙏

  • @satyakumar007abc
    @satyakumar007abc Год назад +2

    Good job 👏

  • @sucharithaindrakanti9586
    @sucharithaindrakanti9586 2 года назад +1

    Chala chakkaga vivarincharu chinna savarana indrudi gurramu Peru uchhaistavamu andi

  • @harikrishnamaakam9654
    @harikrishnamaakam9654 2 месяца назад

    ద్వాదశ ఆదిత్యుల దర్శనం చేయించిన మీకు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏కాశీకి రాలేని నాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగకరం ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏16/08/2024🌼🌼🌼🌼🌼🌺🌺🌺🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @SureshSuresh-7799
    @SureshSuresh-7799 Год назад +2

    చాలా బాగా చెప్పారు అందరికి me ద్వారా దర్శనం బాగా జరగాలి అని 🙏🙏🙏

    • @kashivihari
      @kashivihari  Год назад

      ధన్యవాదాలు అండి

  • @lsri6590
    @lsri6590 Год назад

    Very helpful video andi

  • @yerrabattularamakrishnakri756
    @yerrabattularamakrishnakri756 24 дня назад

    ధన్యవాదములు

  • @kirankumar-tk4du
    @kirankumar-tk4du Год назад +1

    Thankyou so much brother,

  • @sandeepmamidipelli2918
    @sandeepmamidipelli2918 2 года назад +1

    Good info. Buddy! 💐

  • @prabhud6029
    @prabhud6029 2 года назад

    Good video sir.jai Kasi

  • @thavitammabalaga8458
    @thavitammabalaga8458 7 месяцев назад

    Thnq

  • @PPullrao
    @PPullrao Месяц назад

    Good video brother

  • @sattilalitha9945
    @sattilalitha9945 2 года назад +3

    Omm aditya namaha

    • @kbre741
      @kbre741 2 года назад +2

      hi andi

  • @draksharammohith5670
    @draksharammohith5670 Год назад +1

    ❤SUPPAR BABU NIKU NAA ASSISSULU SHIVA KARUNA KATHAKSHA SIDDHY RASTHU

  • @PraveenKumar-fc5rh
    @PraveenKumar-fc5rh 9 месяцев назад +1

    om namah shivaya

  • @amitichakradhararao1568
    @amitichakradhararao1568 17 дней назад

    Super sir

  • @itsarma
    @itsarma 2 года назад +2

    maha dev
    smt c kala madam daily provide all dwdasadityulu vision with free of services like you MAHADEV

  • @nagajyothiganapa6719
    @nagajyothiganapa6719 Год назад

    Super ❤

  • @mayanksharma4610
    @mayanksharma4610 Год назад +1

    Om grahni Suraya namha 🌞💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @mainmurari4294
    @mainmurari4294 Год назад

    Jai Sri Raam🙏🙏🙏

  • @PraveenKumar-fc5rh
    @PraveenKumar-fc5rh 2 года назад +2

    har har mahadev

  • @Mahesh-vu6pc
    @Mahesh-vu6pc Год назад

    Om namah shivaya 🚩📿🌿

  • @sagunaratnam3899
    @sagunaratnam3899 Год назад

    ధన్యవాదములు 🙏

  • @saiprashanthipidugu8777
    @saiprashanthipidugu8777 11 дней назад

    Great job..Thank you..why you stopped making videos?

  • @sailajadeviayyalaganti7818
    @sailajadeviayyalaganti7818 2 года назад +2

    Brother! Entha baagaa no చెప్పేరు. ధన్యవాదములు🙏
    నేను మరి కొందరు కుటుంబ సభ్యులు తో ఒక ఆదివారం 1రోజు 12ఆదిత్యులు దర్శనం చేస్కోవడం జరిగింది.. దైవ ఆశీర్వచనం, అదృష్టం🙏🙏

    • @pratapyerrapragada4954
      @pratapyerrapragada4954 27 дней назад

      Sir Meeru 12 temples chudadaniki ella vellaru.okkaroje complete ayayaa.mimmalni tisukuvellina traveles number emaina vunda.vuntey send cheyandi pls

  • @mayanksharma4610
    @mayanksharma4610 Год назад +2

    Plz make this video in English or Hindi 🙏🏻

  • @slnarsaiah5549
    @slnarsaiah5549 8 месяцев назад

    Kashi dvadhasha adityulara meeku 🙏🏿💐🌸🌸🌸🌹🌸🌸💐🙏🏿💐💐💐💐💐💐💐🙏🏿🙏🏿
    Swamy maku ayu arogyalanu prasadhinchu.

  • @sriravikiranr4788
    @sriravikiranr4788 2 года назад +1

    🙏🙏🙏🙏

  • @saidurgaraom3556
    @saidurgaraom3556 2 года назад +2

    Me voice nice anna

    • @vittalpalthi713
      @vittalpalthi713 Год назад

      Voice and way of explanation is excellent
      Mamatha, kashi

  • @rekharamesh5361
    @rekharamesh5361 2 года назад +1

    👏👍🙏

  • @kattikaphanindrakumar8197
    @kattikaphanindrakumar8197 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @pavanhota369
    @pavanhota369 10 месяцев назад +1

    Nenu 8 of 12 chusa

  • @sriganesh704
    @sriganesh704 Год назад +1

    జై బాబా కాలభైరవ్

  • @manikarnika2433
    @manikarnika2433 2 года назад

    Om namah shivaya 🙏🙏🙏🙏🙏..
    Kallaki kattinattu chupinchi ,chepatu thank you meeku ..memu 2 times vellamu ,kaani Aditya lanu chudaleu..

  • @chinnarao4683
    @chinnarao4683 Год назад +2

    నేను నా భార్య దర్శనం చేసుకున్నాం.
    మీ వీడియో చూసి అడ్రస్ రాసుకున్న,ఈరోజె దర్శనం చేసున్నాం.
    ధన్యవాదములు

  • @poornimak4295
    @poornimak4295 2 года назад

    Swamy, Yama Adithya Inka akkade unnaru. Sankata ghat steps meeda velte akkada right hand side untaru🙏🏻 memu July 2nd '22 darsanam chesukunnamu

    • @kashivihari
      @kashivihari  2 года назад +1

      యమ ఆదిత్యుడు ఉన్నారు అండి. కాశీ ఖండంలో చెప్పిన యమ తీర్థం లేదు అని చెప్పాను వీడియోలో.

  • @shiva8047
    @shiva8047 3 месяца назад

    kashi kandamu a writer book chadavali please send the link or suggest the book with writer

  • @prathibhaA87
    @prathibhaA87 Год назад

    🙏🏻

  • @govindpvr6648
    @govindpvr6648 Год назад

    Om namah shivaya 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @lakshmirajyamvemuru80
    @lakshmirajyamvemuru80 2 года назад

    Kasivelli chusina anubhuthi pondanu🙏🙏🙏

    • @kashivihari
      @kashivihari  2 года назад +1

      కాశీ వెళ్లి చూసే ఈశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు 🙏🙏

  • @sucharithaindrakanti9586
    @sucharithaindrakanti9586 2 года назад

    Uchhaisravamu andi

  • @sivadharmam
    @sivadharmam Год назад

    Meeru కాశీ లో ఉంటారా

  • @niranjaninagaraju7987
    @niranjaninagaraju7987 2 года назад

    విశాలాక్షి మందిరం లో ఉన్న ఈశ్వరుని పేరు తెలుపగలరు

    • @kashivihari
      @kashivihari  2 года назад

      విశాలాక్షేశ్వరుడు

  • @aparnarjy4681
    @aparnarjy4681 2 года назад

    Adityula daya valla anni chudagaliganu kaani Drupadaditya temple dorakaledu
    Pl mee phone no evvandi

    • @kashivihari
      @kashivihari  2 года назад

      కాశీ అన్నపూర్ణ అమ్మవారి ఆలయంలో ఉన్న ఆదిత్యుని దర్శనం చేసుకోండి. అదే పరిహారం.

  • @TheSoham8
    @TheSoham8 3 месяца назад

    Anni chudataniki oka auto nos unte baguntundi

  • @machlipatnammachlipatnam7418
    @machlipatnammachlipatnam7418 2 года назад

    ద్వాదశ ఆదిత్యులని చూపారు.....4 సార్లు కాశీ వెళ్ళొచ్చాను కానీ.....నేను చూసింది యమాదిత్యుని మాత్రమే.......మిగతావి చూసినట్టు లేదు.......ప్రధాన గుళ్ళని దెగ్గర్లోనే ఉన్నా మాకు తెలియక వెళ్ళలేదు.......మీ వల్ల మీ వీడియో వల్ల తెలిసింది......కాబట్టి......కాశీ వెళ్ళేవారికి వీటిని దరశించుకోవడం సులభం అవుతుంది

    • @yadaanil9329
      @yadaanil9329 2 года назад

      We are went adhiya temples in Kashi one month back.bablu sigh brother Auto driver taken 500 per head. 5 to 6 hours. Good information .

  • @srilakshmipalanki9677
    @srilakshmipalanki9677 2 года назад

    మిగతా వున్న విఎలావస్తాయి

  • @mvramalakshmi942
    @mvramalakshmi942 2 года назад

    విష్ణువు ని ఓడించలేదు. ఇంద్రుని ఓడించాడు

    • @kashivihari
      @kashivihari  2 года назад

      వీడియోలో చెప్పాను కదా అండి. కాశీ ఖండం మూల గ్రంథంలో ఎలా వుందో అలాగే చెప్పాను నేను ఈ వీడియోలో. చాలా వృత్తాంతాలు కాశీ ఖండమునకు అన్య గ్రంథాలకు కించిత్ తేడా ఉంది.

  • @genjisukumar2448
    @genjisukumar2448 9 месяцев назад

    Sir Any Guide Available If So Name And Phone Number Please Inform For Much Guidance

    • @kashivihari
      @kashivihari  8 месяцев назад

      Chandra Sekhar garu
      +919611678545

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 28 дней назад

    🙏🙏

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk Год назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 2 года назад +1

    🙏🙏🙏

  • @Geetha622
    @Geetha622 2 года назад

    🙏🙏🙏