సిరికాకొలను చిన్నది - వేటూరి సుందర రామమూర్తి - Sirikakolanu chinnadi - veturi

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
    www.youtube.co...
    కవులకు కొదవ లేని సీమ మనది. ప్రభువుల కొలువుల లోను, ప్రజల మనసులలోనూ వారి ప్రాభవానికీ లోటులేదిక్కడ.
    “ఎదురైనచో దన మదకరీంద్రము డిగ్గి
    కే లూత యొసగి యెక్కించుకొనియె
    మనుచరిత్రం బందుకొనువేళ బుర మేగ
    బల్లకి తనకేల బట్టియెత్తె
    బిరుదైన కవిగండ పెండేరమున కీవె
    తగు దని తానె పాదమున దొడిగె
    గోకటగ్రామా ద్యనే కాగ్రహారము
    లడిగినసీమలయందు నిచ్చె
    నాంధ్రకవితాపితామహ యల్లసాని
    పెద్దనకవీంద్ర యని నన్ను బిలుచునట్టి
    కృష్ణరాయలతో దివి కేగలేక
    బ్రతికియుండితి జీవచ్ఛవంబ నగుచు..” అంటూ ఆంధ్ర కవితా పితామహుడు తన ప్రభువైన రాయలు దివికేగినప్పుడు విలపించిన తీరులోనే మన కవులు ఎంతటి ఘనసత్కారాలు అందుకున్నారో తెలుస్తోంది. కవిత్రయం, అష్ట దిగ్గజ కవులు, శ్రీనాథుడు, పోతన ఇలా ఎందరో ప్రాచీన కవుల కావ్యాలు నేటికీ ఠీవీగా నిలబడి ఉన్నాయి. మనతో ప్రదక్షణ నమస్కారాలు చేయించుకుంటున్నాయి. అయితే, “ఘనత అంతా గతానిదే” అని చెప్పుకునే స్థితి ఎప్పుడూ తెలుగుజాతికి పట్టలేదు. విశ్వనాథ, జాషువా, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, దాశరథి, కరుణశ్రీ, ఆరుద్ర, నారాయణరెడ్డి ఇలా కవి పరంపర కొనసాగుతూనే వచ్చింది. వీరితో పాటూ సినిమా సాహిత్యాన్ని అందలం ఎక్కించిన మల్లాది, సముద్రాల, పింగళి, ఆత్రేయ, కొసరాజు వంటి కవులు కూడా తెలుగుగడ్డకు దొరికారు. ఆనాడే కాదు, ఈనాటికీ ఏ ప్రక్రియలోనైనా ఉత్తమ స్థాయి కవిత్వాన్ని అందించగల కవులకు ఇక్కడ లోటు లేదు. కానీ అప్పుడున్నన్ని సరైన అవకాశాలు ఇప్పుడు లేవంతే.
    ఈ అవకాశాల కలిమి దశకూ, అవకాశాల లేమి దశకూ సంధికాలంలో కవిపుంగవుడొకడు పుట్టుకొచ్చాడు. ఈ పురుషుల్లోని పుంగవుడు పులకింతొస్తే ఆగేరకం కాదు. కవితా ధనువు పట్టుకుని విజృంభిస్తుంటాడు. పాటల శర సంధానం చేస్తుంటాడు. జన హృదయాలను ఛేదించి రసానందాన్ని ఉప్పొంగిస్తుంటాడు. ఇదంతా సుమారు పదేళ్ళ క్రితం మాట. ఇప్పుడా ధనుర్ధారి లేడు. కానీ ఆయన సంధించిన బాణాలు మాత్రం లక్షలాది తెలుగువాళ్ళ హృదయాలలో దిగబడిపోయే ఉన్నాయి. ఆ కవితాశర సంధానకర్త, తెలుగు సినీసాహితీప్రియ హృదయహర్త అయిన శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారికి నమస్కరిస్తూ, ఆయన కవితాస్త్రాలలో ఒకటైన “సిరికాకొలను చిన్నది” సంగీత రూపకం ప్రయోగ ఉపసంహారాల కోసం తెలుసుకుందాం.
    #RajanPTSK #Veturi #Rajan

Комментарии • 53

  • @hussaingajjala4949
    @hussaingajjala4949 4 года назад +12

    మరు జన్మకు దొరకునో ఏమో
    ఈ జన్మకు హాయి గొల్పెడి
    వీనులవిందు వేటూరి పాటలు దొరకడం నా అదృష్టం.

  • @venkatasubbaiahkalluri-kt4nr
    @venkatasubbaiahkalluri-kt4nr 4 месяца назад +2

    సాహితీ సౌరభవం శ్లాఘనీయం

  • @12345678955150
    @12345678955150 Год назад +4

    Veturi garu Saraswthi puthrudu

  • @praneethallinone8738
    @praneethallinone8738 Год назад +2

    Kreedabhiramam gurinchi chepandi guru

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 2 года назад +2

    Super

  • @kavidas009
    @kavidas009 3 года назад +7

    మీ స్వరం దేవుని వరం అజగవ అక్షర సేవ అజరామరం. ఇట్లు: మీ హృదయాభిమాని కవిదాసు.

  • @nslaxmi6012
    @nslaxmi6012 2 года назад +3

    ఎంత చక్కని సంగీత రూపకం! మాకు తెలియని చాలా చక్కటి తెలుగు సాహిత్యం మాకు తెలియచెప్పే మీకు ఎన్ని ధన్యవాదాలు తెలిపినా తక్కువే.అయినా మరిన్ని సాహితీ విషయాలు తెలియచేయాలని కోరుతున్నాను.అలాగే మీ వీలును బట్టి కాశ్మీర రాజతరంగిణి కథలు వినిపించమని కోరుతున్నాను.నా కోరిక మన్ని స్తారని భావిస్తున్నాను.

  • @MallikajunaMarthati-k3j
    @MallikajunaMarthati-k3j 2 дня назад +1

    కవితా సుధా ఝరి వేటూరి

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 года назад +7

    వేటూరి రచన అద్భుతం

  • @manoharkotakonda5004
    @manoharkotakonda5004 4 года назад +8

    పుస్తకం దొరికితే చాలు,,, వేటూరి గారి పుత్రులు చొరవ తీసుకునే దిశలో... 🤝

  • @naresh.m8361
    @naresh.m8361 4 года назад +9

    గొప్ప సాహితీ పిపాసి

  • @srinivasa8184
    @srinivasa8184 4 года назад +2

    Mee voice super sit

  • @kosarajumeena3542
    @kosarajumeena3542 3 года назад +2

    Chala bagundhi Sir, please make more like this. So blessed to hear

  • @suryakumaryadala1820
    @suryakumaryadala1820 4 года назад +2

    Thank you

  • @pasulakamalakar3289
    @pasulakamalakar3289 4 года назад +3

    I'm a biggest fan of Veturi garu

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 8 месяцев назад

    ఎంతో సాహితీ సంపద.

  • @bhuvanagiriradhakrishnamur6773
    @bhuvanagiriradhakrishnamur6773 3 года назад +1

    Chala baga tookiga chepparu. Ee pustakam chaduvalani interest puttincharu. Thanks.

  • @rangavajjula1941
    @rangavajjula1941 4 года назад +4

    అద్భుతంగా ఉంది

  • @pavankumar-rd9ek
    @pavankumar-rd9ek 4 года назад +4

    అద్భుతం

  • @sureshannam6183
    @sureshannam6183 4 года назад +7

    What a smart looking scholar.

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 4 года назад +5

    Thank you sir meeru adivi baapiraaju gaari himabindu gurinchi parichayam cheyyandi

  • @MrVarsu
    @MrVarsu 4 года назад +3

    Beautiful

  • @kalyaniveluri8461
    @kalyaniveluri8461 Год назад

    Excellent

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 3 года назад +1

    3 hours ago rest my mind Ajagava thanks

  • @harikiran8830
    @harikiran8830 4 года назад +2

    Meeku Dhanyavadalu manchi katha venupencharu

  • @sureshannam6183
    @sureshannam6183 4 года назад +4

    Very very thanks to ajagava channel to reintroduce the grand writing of legendary poet veturi who was known only as a cine lyric writer.

  • @jayasreegoparaju2394
    @jayasreegoparaju2394 4 года назад +1

    అద్భుతంగా చెప్పారు 🙏

  • @kommukarthik7872
    @kommukarthik7872 4 года назад +3

    Yes absolutely correct

  • @एकोनारायणा
    @एकोनारायणा 2 года назад

    Super andi very enjoyable, I wish I could hear more and video was short.

  • @veturisundararamamurthy2564
    @veturisundararamamurthy2564 4 года назад +4

    Sirikakolanu Chinnadi ebook is available in KINIGE

  • @indiragovardhanam7984
    @indiragovardhanam7984 4 года назад +4

    Avunooo pusthaka parichayam tho paatoo aa radio Sangeetha roopakanni pedithe vela namaskaralu meeku pedtham kada😄👌👍🙏

    • @naguvanapalli1760
      @naguvanapalli1760 4 года назад +2

      AIR Hyderabad RUclips channel lo vundi anandinchagalaru

  • @padmaduggirala2587
    @padmaduggirala2587 4 года назад +1

    Veturi vaari andhaggaadu...padhaalatho andhamyna vetu veya gala vaaru ...mana veturi sundhara rammurthy garu.... rendu vypula padhunu unna kathi....inko aani muthyapu rachananu parichayam chesaaru...🙂👌

  • @prasadupadhyayula8495
    @prasadupadhyayula8495 4 года назад +4

    ధన్యవాదములు 🙏🙏🙏

  • @varajv
    @varajv 4 года назад

    Great

  • @ramakoteswararaokanthamnen2556
    @ramakoteswararaokanthamnen2556 4 года назад +2

    ఆర్య
    మీ సాహితీ ఛానల్ గురించి. ఎందరు ఆస్వాదిస్తున్నారో తెలియదు. మన తెలుగు వారి భాష ప్రియత్యంపై నాకు సదేహం. నేను సాధ సీద వాడిని. మీ పుస్తక పరిచయం కరతామలకం అయినను, ఎంతమంది ఆస్వాదిస్తూ ఉన్నారో తెలియదు.మన్నిoచాలి.తెలుగు పట్టిన దుర్గతి. ప్రముఖ దినపత్రికలే
    అంగుళాలను ఇన్సులని
    ఆమ్మ ను. మమ్మీ వాడు సున్నారు.

  • @sairk6174
    @sairk6174 4 года назад +1

    Sir Rajan garu..Pinaki Antey Ardam telusukunnanu..
    Kodandam Sudarshanam antey telusu.. mari Ajagava gurinchi ye puranam lo undi daya chesi cheppagalaru..Dhanyavadamulu..

  • @prashanthivadari3802
    @prashanthivadari3802 4 года назад +3

    చాలా బాగుంది. అసందర్భం అయినా నా ఈ సందేహం తీర్చండి.ముక్కు పచ్చలారని అనే మాట ఎలా వచ్చింది? అర్ధం తెలుసు.

  • @drbvrao2207
    @drbvrao2207 4 года назад +2

    🙏🙏🙏🙏🙏👌👌

  • @quariiick
    @quariiick 3 года назад

    🙏🙏🙏

  • @kalyanram4889
    @kalyanram4889 3 года назад +2

    Google lo book pdf available undhi......60rs

  • @kirankumarsuggala9572
    @kirankumarsuggala9572 4 года назад +3

    Pustakam online lo ponde Margamu cheppandi....

  • @varmakotyada9402
    @varmakotyada9402 4 года назад +2

    Book yekkada dhorukuthundhi

  • @pujarimahesh2936
    @pujarimahesh2936 4 года назад +4

    అన్నా ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్తరా.

  • @Chakradhar52
    @Chakradhar52 4 месяца назад +1

    సిరికాకొలను చిన్నది సంగీత నాటికన్నాఆస్వాదించండి. విశ్లేషణ విన్నారు కాబట్టి Original నాటిక కూడా విని ఆనందించండి

  • @karambiamvenu
    @karambiamvenu Год назад +2

    🙏🙏🙏

  • @mallikarjunaraoponnapula9427
    @mallikarjunaraoponnapula9427 2 года назад

    అద్భుతంగా ఉంది