Jaivanth Rao Maharaj Gondi speech at Chinna hathnoor village
HTML-код
- Опубликовано: 6 фев 2025
- #adilabadnews #adishesha #nagoba #nagobajatara #adilabad #adilabadnews #adishesha #adivasi #devotionalsongs #gondi #trending #adivasiculture #ai #top #today #quotes #quotesaboutlife #quoteoftheday #inspiration #reels #gondidharma #class #motivationalvideo #admireyourself #respect #reel #dailynews #jaivanthRao Maharaj #maharaj
#newsreader #ai
.
.
.Inspiring Gondi motivational quotes by Thodasam Kailas #motivationalquotes #insprirational #gond
#course #devotional #design #telangana #adivasiculture #gondi #thodasamkings #thodasamkailas #kailasthodasam #teacher #tech #tending #gondi
.
.
.
.
.
.
.
.
.#aigondi #aitools #aitalks #kailasthodasam #dailynews #ainews #motivationalvideo #interview #famouspoe #famouswritter #adilabadnews
www.facebook.c...
x.com/kailasth...
www.instagram....
For Economical support please send to this number9949084767
ఉపాధ్యాయుడి ప్రతిభ అధ్భుతం
◾కృత్రిమ మేధ ఆధారిత యాంకర్ ను సృష్టించిన ఉపాధ్యాయుడు
తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో ఓ సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏకంగా AI( ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) ఆధారిత న్యూస్ యాంకర్ ను సృష్టించి ఔరా అనిపించారు. ఆదిలాబాద్ జిల్లా మావల మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన తొడసం కైలాస్ తలమడుగు మండలం సాయిలింగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గోండి భాషకు లిపి లేకపోవడంతో తెలుగు లిపితో గోండి భాషలో రాసిన కవిత్వాలు AI యాంకర్ ద్వారా చదివి వినిపించడం నిజంగా గొప్ప విషయం.
నిజానికి తెలుగు లిపిలో గోండి భాషలో రాయడం చాలా ఇబ్బంది. కానీ కైలాస్ దానిని AI ద్వారా అధిగమించాడు. తను రాసిన ‘సద్వీచార్’ అనే పుస్తకాన్ని అచ్చు తప్పు లేకుండా AI ద్వార ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ పుస్తకం యువతను మేలుకొలిపేదిగా ఉంటుంది అని ఆయన చెప్పారు. ఈపాటికే వాటిని తన యుట్యూబ్ చానెల్ ద్వారా విడుదల చేశారు.త్వరలోనే పుస్తకాన్ని సైతం విడుదల చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
గోండి భాషకు మక్కువ తేవాలని
ప్రస్తుత తరుణంలో గోండి భాషకు ఆదరణ తగ్గిపోతున్న సందర్భంలో ఆయన భాష పైన లోతుగా అధ్యయనం చేయసాగారు. ఇప్పుడు దాదాపు వాడుకలో లేని కొన్ని పదాలను, ఆయన తన పూర్వీకులు ఉపయోగించిన భాషను గుర్తు చేసుకొని స్వచ్ఛమైన గోండి భాషలో పుస్తకాన్ని రాశారు. పుస్తక రచన సమయంలో సెందేహాలు తలెత్తితే వాళ్ల అక్క సరస్వతిని అడిగి సందేహాలు నివృత్తి చేసుకుంటూ... గోండిలో ఉచ్చారణ దోషాలు లేకుండా AI ద్వార ఎడిటింగ్ చేస్తున్నారు.
ఈ పుస్తకాన్ని తానే స్వయంగా మొబైల్ లో టైప్ చేసి రాస్తున్నారు. రాసిన వాటిని గూగుల్ డాక్యుమెంట్స్, బ్లాగర్ లో భద్రపరుస్తున్నారు. ఇప్పటికే రాసిన వాటిని యూట్యూబ్ ద్వారా కొన్నిటిని విడుదల చేశారు.
గోండి భాషలో వార్తలు ఉండాలన్న ఉద్దేశంతో
గోండి భాషలో సైతం వార్తాలు ఉంటే బాగుండు అని తలచిన ఆయన. గోండి భాషలో వార్తా ఛానల్స్ లేకపోవడంతో స్వయంగా తనే తన యూట్యూబ్ ఛానల్ కైలాస్ తొడసం వ్లాగ్ ద్వార ప్రతి రోజు ఉదయం “సాడ కాండీర ప్రార్థన త్ సాటి నేట సమాచార్” అంటే పాఠశాల అసెంబ్లీ వార్తాలు రాసి యూట్యూబ్ లో AI యాంకర్ “సుంగాల్ తుర్పో” సృష్టించి వార్తాలు చదివించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ వార్తల్ని అన్ని ఆశ్రమ పాఠశాలల్లో, గిరిజన పాఠశాలల్లో ఉపాధ్యాయులు వినిపిస్తున్నారు. ఈవిధంగా ఆయన మరుగున పడిపోతున్న గోండి భాషకు ఊపిరి పోస్తున్నారు.
కంప్యూటర్ విభాగంలో అనుభవంతోనే సాధ్యం
ఇదంతా ఓ సాధారణ ఉపాధ్యాయుడు చేశాడంటే ఏ మాత్రం నమ్మశక్యంగా ఉండదు. కానీ ఈయన ఎంచుకున్న ఉపాధ్యాయ వృత్తిలో మరిన్ని పోకడలకు శ్రీకారం చుట్టి.. మరింత ప్రభావవంతమైన భోధన సాగించలన్న ఉద్దేశంతో చెన్నై లోని ఓ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆన్లైన్ లో కోచింగ్ తీసుకున్నారు. దాంతో పాటు 15సంవత్సరాల కంప్యూటర్ అనుభవం.. ఈయన AI యాంకర్ తయారీకి ఉపయుక్తంగా మారింది. హేజెన్ అనే సాఫ్ట్వేర్ ఆధారంగా కంప్యూటర్ లో ఈ AI ( కృత్రిమ మేధ) యాంకర్ ను సృష్టించినట్లు ఆయన పేర్కొన్నారు.
అవకాశం ఉంటే రోబో తయారు చేస్తా
భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తే..ప్రభుత్వం నుండి, ఇతరుల నుండి ఆర్థిక సహకారం అందితే గోండి భాషలో రోబోను తయారు చేస్తానని ఆయన చెప్పారు.