శ్రీ గణపతి ముని గారి ఆశయములు ఏంటి? Aspirations of Kavyakantha Vasishtha Sri.Ganapati Muni for Bharat

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • #ganapatimuni #sanatandharma #bharat #veda #srigayatritapovanam
    కావ్యకంఠ శ్రీ వాసిష్ఠ గణపతి ముని గారి స్ఫూర్తితో "శ్రీ గాయత్రీ తపోవనం"
    భారతీయులు సంస్కృత భాషకి దూరము కారాదు. భారతీయులందరూ ఖచ్చితముగా సంస్కృతమును నేర్చుకొని ఉండాలి. మన వేద వాంగ్మయమును స్వయంగా వారు పరిశీలించి నిజానిజాలను గుర్తించాలి. ఆనాడే మన భారతీయ సనాతన విలువలను మనము కాపాడగలుగుతామని గణపతి ముని ఆశించారు.
    పురాణ గ్రంథములు మనకు ప్రమాణము కావని వేదములే ప్రమాణమని గుర్తించాలి. వేదమునే ఆధారముగా చేసుకుని మన యొక్క జీవన విధానములను సంస్కరించుకోవాలని గణపతి ముని యొక్క ఆశయము. మన పౌరాణిక కథనములలో ఏవేవైతే కల్పిత భాగములు ఉన్నాయో వాటిని మనము సంస్కరించి మన భావితరాలకు తెలియచేసేటువంటి బాధ్యత మనకి ఉన్నదని గణపతి ముని గుర్తు చేశారు. ముఖ్యముగా పండితులు ఈ పరిశోధన చేయాలని, ఇది వారి కర్తవ్యమని గుర్తుచేశారు.
    వేదములకు నూతన భాష్యము యొక్క ఆవశ్యకత ఎంతో ఉందని గణపతి ముని గుర్తించారు. ఋషులు మనకు అందించిన అపూర్వమైన వైదిక విజ్ఞానమును మనము అలవర్చుకొని నిజమైన “వైదిక వ్యక్తిత్వ వికాసమును” భారతీయులు పొందాలని గణపతిముని ఆశించారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇత్యాది కుల, వర్ణ విభజన, వివక్షత లేకుండా వైదిక కాల జీవనమే మనకు ప్రమాణమని గుర్తించి, మనమందరము ఋషి సంతతి వలె జీవించినప్పుడు భారతదేశమునకు “నూతన యుగ ప్రతిష్టాపన” జరిగి ఎంతో అమోఘమైన పురోభివృద్ధి సాధించగలమని గణపతిముని ఆశించారు.
    ఋషులు మనకు నేర్పించినటువంటి ప్రాచీన విధి విధానములను మనము తిరిగి అలవర్చుకోవాలి. ప్రకృతి సహజసిద్ధమైన సేంద్రియ వ్యవసాయ విధానములు. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ హితమైన జీవన విధానము, ప్రాచీన ఆయుర్వేద వైద్య, ఔషధ తయారీ విధానములు.
    Donate us for building Yagnasala, maintenance of Gausala
    A view of Sri Gayatri Tapovanam: • Sri Gayatri Tapovanam|...
    Whatsapp Call: 9019953318 / 7396305775
    Follow:
    x.com/@Ganapat...
    / kavyakanthaganapatimuni
    / kavyakanthaganapatimuni
    phanimadhavrss...
    / phanimadhavrss
    #kavyakantha #phanimadhavrss #SpiritualDiscourses #SpiritualExperiences #VedicSuktas #ramanamaharshi #Sadhanarahasyam #AvadhutaPolayya #LordDattatreya #vedicvillage #vedavidya

Комментарии • 6

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477 9 месяцев назад +4

    "ఇంద్రో విస్వశ్య రాజతి" నా గురుదేవునకు నమస్సుమాంజలు
    లు!శ్రీ కావ్యకంఠ వాసిష్ట గణపతిమునిగారికి వారి రచనలకు ప్రణామములు!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻🌼🌼🌼🌼🌼🦢🦢🦢🌅🌅🌅🙏🏻🎆

  • @tprabhakar7187
    @tprabhakar7187 9 месяцев назад +4

    ఓం శ్రీ మాత్రే నమః.
    శ్రీ గణపతి ముని స్వామియై నమో నమః.
    అయ్యా, దండ ప్రణామం 🎉
    ముని గారి దేశభక్తి ఆశయాన్ని,ప్రస్తుత కాలంలో ప్రతీ హిందువు ఆచరించాల్సిన అవసరం ఉంది.

  • @jyotimodekurti5776
    @jyotimodekurti5776 9 месяцев назад +1

    Indro Vishwasya Rajati🙏
    Very proud to be a part of Sri Gayatri Tapovanam🙏

  • @parthasaradhireddy855
    @parthasaradhireddy855 9 месяцев назад +3

    Jai Gurudev 😊😊😊

  • @prakash100100
    @prakash100100 9 месяцев назад +3

    Indro visvasya Rajati

  • @shastrimedhatithi
    @shastrimedhatithi 9 месяцев назад

    Please do this video in English too.