HLM GPT - MESSAGE ON JEHOVAH SHAMMAH (1) ON 31-01-2024
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Jehovah Shammah: The LORD is Here (Ezekiel 48:35)
"The circumference of the city shall be 18,000 cubits. And the name of the city from that time on shall be,The LORD Is There."
యెహేజ్కేలు 48:35 దాని కైవారము (చుట్టుకొలత) పదునెనిమిదివేల కొలకఱ్ఱల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాటనుండి ఆ పట్టణమునకు పేరు.
యెహేజ్కేలు 48:30 పట్టణస్థాన వైశాల్యత ఎంతనగా, ఉత్తరమున నాలుగు వేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము.
యెహేజ్కేలు 48:31 ఇశ్రాయేలీయుల గోత్రపు పేళ్లనుబట్టి పట్టణపు గుమ్మములకు పేళ్లు పెట్టవలెను. ఉత్తరపుతట్టున రూబేనుదనియు, యూదాదనియు, లేవిదనియు మూడు గుమ్మములుండవలెను.
యెహేజ్కేలు 48:32 తూర్పుతట్టు నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆ తట్టున యోసేపుదనియు బెన్యామీను దనియు దానుదనియు మూడు గుమ్మములుండవలెను.
యెహేజ్కేలు 48:33 దక్షిణపుతట్టు నాలుగు వేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆ తట్టున షిమ్యోనుదనియు ఇశ్శాఖారు దనియు జెబూలూనుదనియు మూడు గుమ్మములుండవలెను.
యెహేజ్కేలు 48:34 పడమటితట్టు నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణ ముగలది. ఆ తట్టున గాదుదనియు ఆషేరుదనియు నఫ్తాలిదనియు మూడు గుమ్మములుండవలెను.
యెహేజ్కేలు 48:35 దాని కైవారము పదునెనిమిదివేల కొలకఱ్ఱల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాటనుండి ఆ పట్టణమునకు పేరు.
ప్రకటన గ్రంథం 21:2 మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.
ప్రకటన గ్రంథం 21:10 ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.
ప్రకటన గ్రంథం 21:11 దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.
ప్రకటన గ్రంథం 21:12 ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి.
ప్రకటన గ్రంథం 21:13 తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మము లున్నవి.
ప్రకటన గ్రంథం 21:14 ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైన గొఱ్ఱ పిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.
ప్రకటన గ్రంథం 21:15 ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.
ప్రకటన గ్రంథం 21:16 ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; (పన్నెండు వేల ఫర్లాంగులు = 2414.016 kms) దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.
ప్రకటన గ్రంథం 21:17 మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబది నాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే.
ప్రకటన గ్రంథం 21:18 ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.
ప్రకటన గ్రంథం 21:19 ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి యుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ,
ప్రకటన గ్రంథం 21:20 అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.
ప్రకటన గ్రంథం 21:21 దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.
ప్రకటన గ్రంథం 21:22 దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.
ప్రకటన గ్రంథం 21:23 ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము.