#ChangeBehavior

Поделиться
HTML-код
  • Опубликовано: 30 авг 2021
  • #లింగాపూర్ గ్రామ ప్రజలకు నమస్కారం.....
    * గ్రామ పంచాయతీ లో పంచాయతీ కార్యదర్శి ఉదయం పూట గ్రామంలోని సిబ్బందికి రోజువారీ పారిశుధ్య పనులు వివరించడం జరుగుతుంది.
    * గ్రామంలోని సరైన పారిశుద్ధ్య నిర్వహణ లో భాగంగా ప్రతి ఇంటి నుండి #తడిచెత్త-పొడిచెత్త విడివిడిగా గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించుట కొరకు ప్రతి ఇంటికి గ్రామ పంచాయితీ రెండు చెత్త బుట్టలు పంపిణీ చేయడం జరిగింది.
    * కావున గ్రామ ప్రజలందరూ గ్రామపంచాయతీ ట్రాక్టర్ చెత్త సేకరణ కొరకు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్త విడివిడిగా సిబ్బందికి అందించి సిబ్బందితో సహకరించవలసిందిగా కోరుతున్నాం.
    * ఏ ఇంటి నుండి అయినా తడి చెత్త పొడి చెత్త విడివిడిగా గ్రామపంచాయతీ సిబ్బందికి ఇవ్వ నట్లయితే లేదా చెత్తను రోడ్లమీద కానీ వీధుల్లో గానీ డ్రైనేజీ లలో కానీ పరపోసినట్లు అయితే గ్రామపంచాయతీ వారు జరిమానా విధించడం జరుగుతుంది.
    *అంతేకాకుండా చెత్త ఇంటి చుట్టూ వేయడం వల్ల, అధి కుళ్ళి పోయి అనారోగ్యలకు దారి తీస్తాయి. దావకణాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కావున ఇప్పటికైనా తడి పొడి చెత్త ను వేరు చేద్దాం మన ఆరోగ్యాన్ని కాపాకుందాం.
    ** గ్రామపంచాయతీ వారు ఇచ్చిన చెత్తబుట్టలో కాకుండా ప్లాస్టిక్ కవర్లలో నూ పాలితిన్ సంచులలో చచెత్త వేస్తూ గ్రామపంచాయతీ వారు ఇచ్చిన చెత్త బుట్టలను నీళ్లకు తప్పు దినుసుల కు మరే ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు.
    *అలా కాకుండా ప్రభుత్వం మరియు గ్రామపంచాయతీ వారు చేసిన తడి చెత్త పొడి చెత్త సేకరణ అంశంలో అన్ని విషయాలను గుర్తు పెట్టుకుని మీరు చేసే పనులలో భాగంగా రెండు నిమిషాలు కేటాయిస్తే కుళ్లిపోయే స్వభావం కలవి. పశువుల పేడ మిగిలిన అన్నం కూరలు,మిగిలిన మాంసం పదార్థాలు పూల వ్యర్థాలు, కొబ్బరి పీచు,కూరగాయల తొక్కలు, పనికిరాని చీపుర్లు,వాడిన కాఫీ పొడి, పండ్ల తొక్కలు, చెట్ల ఆకులు, గడ్డి,వ్యవసాయ వ్యర్థాలు. అన్ని రకాల చనిపోయిన పురుగులను తడి చెత్త డబ్బలో వేయాలి.
    * సబ్బు కవర్లు ఖాళీ షాంపూ సీసాలు పాల కవర్లు వాడేసిన టూత్ బ్రష్ లు పాలిథిన్ కవర్లు కురుకురే ప్యాకెట్లు వాడేసిన మంచి నీటి బాటిల్ లు, కూల్డ్రింక్ బాటిల్, టాబ్లెట్లు కవర్లు, వాడిన బ్లేడ్,పిల్లల మలవిసర్జన డైపర్లు, తుప్పు పట్టిన ఇనుప ముక్కలు, బయట ముక్కలు పాత చార్జీలు పొడి చెత్త డబ్బులు వేయాలి.
    * ఇలా వీటిని వెంటనే వేరు చేస్తే మీకు సమయం ఆదా అవుతుంది. అలాగే ప్రభుత్వం చేపట్టిన తడి పొడి చెత్త సేకరణ లో భాగస్వాములు అవుతారు.
    * ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం వల్ల మన ఇల్లు మన ఊరు -వాడ శుభ్రంగా ఉంటుంది
    * అలా మీరు ఇచ్చిన తడిచెత్త లో మన గ్రామంలోని డంపింగ్ యార్డ్ లో గ్రామ పంచాయతీ సిబ్బంది సేంద్రియ ఎరువుగా తయారు చేస్తారు.
    * ఇలా ఎరువు గా మారిన సేంద్రియ ఎరువు తో హరితహారం లోని మొక్కలకు వేయడం జరుగుతుంది ఈ ఎరువు గ్రామంలోని వ్యవసాయ అవసరాలకు ఉపయోగించడం వల్ల గ్రామపంచాయతీకి ఆదాయం వస్తుంది.అలాగే మన గ్రామం హరిత లింగాపూర్ గా మారుతుంది.
    స్వచ్ఛ లింగాపూర్ స్వచ్ఛ తెలంగాణగా మారుద్ధం.
  • РазвлеченияРазвлечения

Комментарии •