కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాల పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు
HTML-код
- Опубликовано: 7 фев 2025
- ది.15.11.2024 వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణా జిల్లా SP గారు అయిన శ్రీ ఆర్ గంగాధరరావు,IPS గారి నేతృత్వంలో, మచిలీపట్నం సబ్-డివిజినల్ పోలీసు ఆఫీసర్ అయినఎండి. అబ్దుల్ సుభాన్గారి పర్యవేక్షణలో,మచిలీపట్నం రూరల్ సర్కల్ ఇన్స్పెక్టర్ కె. యేసుబాబు గారి ఆద్వర్యంలో,మంగినపూడి బీచ్ దగ్గర జరుగు సముద్ర స్నానముల కార్యక్రమంలో భాగంగా పోలీసు వారు తెలిపిన విధంగా వాహనదారులు మరియు భక్తులు ఈ క్రింది సూచనలు పాటించవలెను.
1.విజయవాడ, గుడివాడ, చల్లపల్లి వైపు నుండి వచ్చే భక్తులు/వాహానదారులు మచిలీపట్నం,
చిలకలపూడి సెంటర్ నుండి మంగినపూడి బీచ్ వైపుకు వెళ్లవలెను.
2. బంటుమిల్లి వైపు నుండి వచ్చు భక్తులు/వాహానదారులు పెదపట్నం, కానూరు మీదగా మంగినపూడి
బీచ్ వైపుకు వెళ్లవలెను.
DO’s and DONT’s
1. భక్తులు/వాహానదారులు పోలీసు వారు మరియు సంబందిత అధికారులు సూచించిన సూచికల ప్రకారం
బీచ్ లోనికి వెళ్లవలెను.
2. భక్తులు/వాహానదారులు పోలీసు వారు సూచించిన ప్రదేశాలలో మాత్రమే కార్లు, ఆటొలు, బస్సులు,
మోటార్ సైకిళ్ళు మరియు ఇతర వాహనాలు పార్కింగ్ చేసుకోవలెను.
3. భక్తులు/వాహానదారులు వారి వాహనాలను రోడ్డు ప్రక్కల పార్కింగ్ చేయరాదు.
4. భక్తులు సముద్ర స్నానాలు చేసేటప్పుడు అధికారులు సూచించిన బారికెట్స్ పరిధి లోపల మాత్రమే
స్నానాలు చెయ్యవలెను.
5. భక్తులు సముద్ర స్నానాలు త్వరితగతిన ముగించుకొని బయటకు రావలెను.
6. చిన్నపిల్లలను, వృద్దులను ఒంటరిగా విడిచిపెట్టరాదు.
7. చిన్నపిల్లలకు అధికారులు ఏర్పాటు చేసే ట్యాగ్స్ ను తప్పనిసరిగా వేయించుకోవలేను.
8. భక్తులు వారి విలువైన సామగ్రిని మరియు వస్తువులను వారే భద్రపరచుకోవలెను. తెలియని వ్యక్తులకు
అప్పగించవద్దు.
9. భక్తులు విలువైన వస్తువులు మరియు ఆభరణాలను వెంట తీసుకొని రాకూడదు.
10. అపరచిత వ్యక్తుల నుండి ఎటువంటి తినుబండరాలు స్వీకరించరాదు.
11. భక్తులు/వాహానదారులు స్నానాలు ముగించుకున్న తరువాత తమ వాహనాలు ఎక్కి దత్తశ్రయం వైపు
నుండి వెళ్ళు సమయంలో దత్తశ్రయం దగ్గర వాహనాలు నిలిపి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించరాదు.