ఇబ్రహీంపట్నంలో ఆగస్టు 31 నుండి రైతు సంఘం రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు : టి సాగర్
HTML-код
- Опубликовано: 12 ноя 2024
- ఆగస్టు 31 నుండి ప్రారంభమయ్యే తెలంగాణ రైతు సంఘ
రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయండి.
--రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ పిలుపు
తెలంగాణ రైతు సంఘం రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణా తరగతులు ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, రాందాసు పల్లి స్టేజ్ దగ్గర గల శుభమ్ గార్డెన్‌లో జరుగుతున్నాయి. ఈ క్లాసులను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యాలయం రాగన్నగూడ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ పిలుపునిచ్చారు.
అఖిల భారత ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజ్జు కృష్ణ, వ్యవసాయరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొంటారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో తీసుకొస్తున్న మార్పులు, వాతావరణంలో వస్తున్న మార్పులు రైతులు, రైతు సంఘం కార్యకర్తలు తీసుకోవాల్సిన చర్యలను ఈ తరగతులలో చర్చించడం జరుగుతుంది.
అఖిల భారత కిసాన్ సభ (ఏఐకెఎస్)కు తెలంగాణ రైతు సంఘం అనుబంధంగా పని చేస్తున్నది. జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 1936లో అఖిల భారత కిసాన్ సభ ఏర్పడింది. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సమరశీలంగా పోరాడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన సుదీర్ఘ పోరాటంలో కీలకమైన పాత్ర పోషించింది. లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్‌లు, నీటి ఫిరంగులను లెక్క చేయకుండా సమరశీలంగా పోరాడింది. 750 మందికి పైగా ప్రాణాలు బలిదానం చేసి 3 వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే విధంగా జరిగిన పోరాటంలో అఖిల భారత కిసాన్ సభ కీలకమైన భాగస్వామిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, స్వామినాథన్ కమీషన్ సిఫారసు చేసిన సమగ్ర ఉత్పత్తి ఖర్చు సి2 ఆధారంగా కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, వడ్డీతో సహా రైతుల రుణాలన్ని మాఫీ చేయాలని, రుణ విమోచన చట్టం చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని, పంటల బీమా పథకాన్ని రైతాంగానికి ఉపయోగపడే విధంగా మార్చాలని పోరాడుతున్నది.
రాష్ట్ర స్థాయిలో అర్హులైన అందరికీ 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని, కౌలు రైతులందరికీ 2011 చట్టం ప్రకారం రుణ అర్హత కార్డులు ఇచ్చి రైతు భరోసా ఇవ్వాలని, సాగునీటి ప్రాజెక్టులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని, పంటలు నష్టపోయిన సందర్భంలో నష్ట పరిహారం ఇవ్వాలని, అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రాజెక్టులు, పరిశ్రమలు, రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు భూ సేకరణ జరుగుతున్న సమయంలో 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, రైతు భరోసా ఇవ్వాలని, పంటలకు బోనస్ ఇవ్వాలని, రైతు బీమా వయస్సు పెంచాలని పోరాటాలు కొనసాగిస్తున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను రైతాంగానికి అవగాహన కల్పించేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులను ఆహ్వానించి ప్రతి సంవత్సరం వానాకాలం ప్రారంభం సందర్భంగా సెమినార్లను నిర్వహిస్తున్నది. కౌలు, పోడు, పత్తి, మిర్చి, చెరుకు, ఫౌల్ట్రీ, పండ్ల తోటలు, కూరగాయలు, పాలు, మహిళలు తదితర రంగాల వారీగా రైతులను సమీకరిస్తున్నది.
ఇటువంటి సంస్థ తన కార్యకర్తలను, నాయకులను తాజా విజ్ఞానంతో మరింత పటిష్టంగా రైతుల సమస్యలపై ఐక్యపరిచేందుకు, పోరాడేందుకు వీలుగా శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నది. ఈ తరగతులలో 300 మంది పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుస్సు. మధుసూధన్ రెడ్డి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే.భాస్కర్, రైతు సంఘం ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి రామకృష్ణ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు p. జంగయ్య లూ పాల్గొన్నారు.
Follow the
Facebook : www.facebook.c...
Mana Rytu channel on WhatsApp: whatsapp.com/c...
RUclips: / @chaitanya2014
రుణమాఫీపై రైతులకు అపోహ వద్దు : మంత్రి తుమ్మల
• రుణమాఫీపై రైతులకు అపోహ...
వరదల కారణంగా పంటల నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలి : టి సాగర్
• వరదల కారణంగా పంటల నష్ట...
రేషన్ కార్డుకు రుణానికి సంబంధం ఏమిటి? : పోతినేని సుదర్శన్
• రేషన్ కార్డుకు రుణానిక...
పంటపొలాల్లో ఇసుక, రాళ్ళతో మేటలు : పల్లె వెంకటరెడ్డి
• పంటపొలాల్లో ఇసుక, రాళ్...
ఇబ్రహీంపట్నంలో ఆగస్టు 31 నుండి రైతు సంఘం రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు : టి సాగర్
• ఇబ్రహీంపట్నంలో ఆగస్టు ...
రుణమాఫీ నిబంధనలతో రైతాంగాన్ని కుదిస్తారా? : అన్నవరపు సత్యనారాయణ
• రుణమాఫీ నిబంధనలతో రైతా...
పూర్తికాని సీతారామ ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారు : అన్నవరపు సత్యనారాయణ
• పూర్తికాని సీతారామ ప్ర...
రుణమాఫీకై ఆగస్టు 27న కలెక్టరేట్ ఎదుట నిరసన : బొంతు రాంబాబు
• రుణమాఫీకై ఆగస్టు 27న క...
ఎల్లంపల్లి లిఫ్ట్‌ల ద్వారా మిడ్‌మానేరు, లోయర్ మానేరు నింపాలి : సారంపల్లి మల్లారెడ్డి
• ఎల్లంపల్లి లిఫ్ట్‌ల ద్...