Songs of Zion || Aakaasha Maha Kaashambhulu || Kadapa Disrtict Fasting Prayer || Beersheba Kadapa

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • పల్లవి : ఆకాశ మహా - కాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా
    1. కృపజూపి నిబంధనను - నెరవేర్చిన ఉపకారి
    కాపాడితివి నడిపితివి - నీ యింటికి మమ్ములను
    || ఆకాశ ||
    2. నీ దాసునికి నీ ప్రజలకు - నీ క్షమను కనుపరచు
    నీదు కల్వరి రక్తమున - నీవె కడుగు కరుణామయ
    || ఆకాశ ||
    3. నీతి న్యాయముల కర్త - ప్రీతితోడ నీ ప్రజలకు
    నీతి న్యాయముల నిమ్ము - స్తుతియింప నిరతంబు
    || ఆకాశ ||
    4. రాజులనుగా యాజకులనుగా - మము చేసిన మా రాజా
    విజయమిమ్ము మా విజయుండా - నిజమైన నీ ప్రజలకు
    || ఆకాశ ||
    5. కరువు తెగులు కష్టనష్టముల్ - వర్ష లేమి పురుగు బాధల్
    కరుణజూపి విడిపించి - మురిపించుము మమ్ములను
    || ఆకాశ ||
    6. సమాధాన సంతోషము - ఆదరణ ఆలోచన
    అనుభవింప ననుగ్రహించు - మనిశంబు మాకిచట
    || ఆకాశ ||
    7. బలపరచు నీ భక్తులను - బలము తోడ ప్రవేశించి
    విలువైన నీ రక్షణన్ను - ధరింపజేయు మల్లెలూయ
    || ఆకాశ ||

Комментарии •