CV ANAND IPS COMMISSIONER OF POLICE,HYDERABAD/HELD EXECUTIVE COURT/ON AIMIM,CONGRESS PARTY LEADERS

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024
  • తేది 24.10.204
    ప్రెస్ నోట్
    ఈరోజు (తేదీ 24.10.2024) శ్రీ.సివి ఆనంద్ ఐపిఎస్ కమీషనర్ ఆఫ్ పోలీస్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్), హైదరాబాద్ గారు TGICCC భవనము, రోడ్ నెం.12, బంజారాహిల్స్, హైదరాబాద్ లోని కమీషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోధాలో కార్యనిర్వాహక న్యాయస్థానాన్ని నిర్వహించారు. SHO, హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ ద్వారా కోర్టు ముందు ఉంచిన సమాచారాన్ని పరిశీలించారు.
    నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం MLA/AIMIM Mohd.Majid Hussain మరియు Mohd.Feroz Khan (కాంగ్రెస్/నాంపల్లి A/C MLA పోటీదారు) వారి మధ్య, ఈ ప్రాంతంలో ఆధిపత్యాన్ని చాటుకునేందుకు గట్టి రాజకీయ పోటీ ఉంది. తేది 7.10.2024న, మహ్మద్.మాజిద్ హుస్సేన్, MLA/AIMIM తన అనుచరులతో కలిసి హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిరోజ్ గాంధీ నగర్‌లో CC రోడ్డు యొక్క సివిల్ పనులను పరిశీలిస్తుండగా, అదే సమయానికి మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్/కాంగ్రెస్ పార్టి తన అనుచరులతో కలిసి సిసి రోడ్డు యొక్క సివిల్ పనిని తనిఖీ చేయడానికి అక్కడ వచ్చారు. దీనిపై మహ్మద్ మజీద్ హుస్సేన్, ఎమ్మెల్యే/ఏఐఎంఐఎం పార్టి, మరియు తన అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు గ్రూపుల అనుచరులు ప్రజల్లో భయాందోళనలు కలిగించడమే కాకుండా ఆ ప్రాంతంలో శాంతి, ప్రశాంతతకు భంగం కలిగించారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరుపక్షాల కార్యకర్తలను చెదరగొట్టారు మరియు ఇరుపక్షాల ప్రతివాదులపై u/s 194 BNS, 2023 కేసు నమోదు చేశారు.
    శ్రీ.సివి ఆనంద్ ఐపిఎస్ కమీషనర్ ఆఫ్ పోలీస్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్), హైదరాబాద్ గారికి ఎస్‌హెచ్‌ఓ, హుమాయున్ నగర్ పిఎస్ గారు రెండు వర్గాల మధ్య రాజకీయ వైరం ఉందని, వారి మధ్య విభేదాలు ఉన్నాయని తెలిపినారు. హుమాయున్ నగర్ P.S మరియు దాని పరిసర ప్రాంతాలలో ప్రజల ప్రశాంతతను ప్రభావితం చేస్తూ శాంతికి విఘాతం కలిగించే చట్టవిరుద్ధమైన మరియు తప్పుడు చర్యల వల్ల. శాంతి మరియు ప్రశాంతతకు భంగం కలిగించే ప్రతి అవకాశం ఉన్నందున, గౌరవనీయమైన కోర్టు వారిని సహేతుకమైన కాలానికి బంధించాలని ఎస్‌హెచ్‌ఓ, హుమాయున్ నగర్ గారు అభ్యర్థించారు.
    కమీషనర్ ఆఫ్ పోలీస్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్), హైదరాబాద్ కు రెండు గ్రూపుల (గ్రూప్-Aలో 10 మంది మొహమ్మద్ మజిద్ హుస్సేన్, MLA/AIMIM & 9 మంది మరియు గ్రూప్-Bకి మొహమ్మద్ ఫెరొజ్ ఖాన్ (కాంగ్రెస్) తొ 9 మంది) ప్రతివాదుల వాదనను వినిపించారు . వాదనలు విన్న కమీషనర్ ఆఫ్ పోలీస్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్), హైదరాబాద్ గారు అలాంటి రెచ్చగొట్టే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని వారికి సూచించారు మరియు కేసు తదుపరి విచారణకు వాయిదా వేసారు.
    “”ఏ వ్యక్తి లేదా సమూహాలలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే, అతను/ఆమె/వారు u/s 126 BNSS, 2023 (సెక్షన్‌ 107 CrPC) ప్రకారము ఆ ప్రాంతంలో శాంతి మరియు ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించే చర్యకు పాల్పడే అవకాశం ఉన్న యెడల నిర్ణీత వ్యవధిలో పేర్కొన్న ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి బాండ్‌ని అమలు చేయమని ఆదేశించడం జరుగుతుంది.””
    ****

Комментарии •