అరుణాచల పుణ్యక్షేత్ర విశిష్టత | అరుణాచల గిరి ప్రదక్షిణ | రమణ మహర్షి అరుణాచల శివ శ్లోకం

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • తిరువణ్ణామలై పట్టణం లో ఆహారాన్ని యాచించటం కోసం రమణ మహర్షి భక్తులు వెళ్లేవారు. తాము రమణ మహర్షి శిష్యులు గా గుర్తింపు పొందుట కొరకు అవి పడుతూ యాచించుటకు పద్యాలూ రాయమని రమణ మహర్షిని ప్రార్థించారు. వారి అభ్యర్ధన పై రమణులు ఈ “అరుణాచల మణమాల” వ్రాసారు. తనను వధువు గా, శివుని వరుని గా ఇందులో రమణులు భావించారు.
    “మణమాల” అంటే కల్యాణమాల. అది నాశమెరుగని, పసివాడని జీవాత్మ పరమాత్మ బంధమైతే “అక్షర మణమాల”. ఇదొక దివ్య సాధనామార్గం. ద్వైతం తో మొదలై అద్వైతంగా ముగిసే అందమైన భావగీతం . లోతు గ అధ్యనం చేసి అన్నిభూతి చెంద గలిగితే అక్షర మణమాల సుషుమ్నా గీతం. అహం నశిస్తే తప్ప సోహం స్థితి లభించదని చెప్పే సాధనా గీతం. ఇందులో 108 చరణాలు ఉంటాయి.
    Arunachala Siva Aksharamala in Telugu - అరుణాచల శివ అరుణాచల శివ
    పూర్తి అక్షరమాల కోసం కింద ఉన్న లింకును తెరువుము :-
    bhaktinidhi.co...
    Address :-
    Pavazhakundur, Tiruvannamalai, Annamalai R.F., Tamil Nadu 606601
    Phone :- 04175 252 438
    Hours:
    Open - Closes :- 8:30 pm
    Completed :- 9th century
    Google Maps :- g.co/kgs/cSfWENH
    Online website :- hrce.tn.gov.in...
    అరుణాచల పుణ్యక్షేత్రం విశిష్టత :-
    అరుణాచలం దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగా క్షేత్రాలలో అగ్ని భూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని.. అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణ పాపాలను తొలగించునది అని అర్థం అని పండితులు చెబుతారు. అదే తమిళంలో అయితే ‘‘తిరువన్నామలై’’ అంటారు. శివ భక్తులు తిరువాన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. తిరు అంటే శ్రీ, అణ్ణామలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి.
    అరుణాచలం క్షేత్రంలో పగలు, రాత్రి, సంధ్యా సమయం, ఎర్రని ఎండలో.. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. చలికి గజ గజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి పద్రక్షిణం చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్య లోక వాసులు కూడా తిరువాన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
    అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల.. ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని చాలా మంది నమ్మకం. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలా మంది విశ్వాసం.
    అరుణాచల గిరి పద్రక్షిణం చేసేవారికి మోక్షం లభిస్తుందని.. కోరిన కోరికలన్నీ నెరువేరుతాయని చాలా మంది నమ్ముతారు. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది నమ్మకం. ఇలా ప్రదక్షిణకు వెళ్లే వారు ఏవైనా పండ్లను, నిమ్మకాయలను తీసుకెళ్లాలి.
    గిరి ప్రదక్షిణం చేసే వారు కచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్లాలి. బరువులు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకెళ్లకండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణం మొత్తం 14 కిలోమీట్ల వరకు ఉంటుంది. పగటిపూట ప్రదక్షిణ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఉదయం 10 గంటలలోపు గిరి పద్రక్షిణాన్ని ముగించాలి. ఎక్కువమంది పౌర్ణమి రోజే గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. మిగిలిన భక్తులు ప్రతిరోజూ గిరి ప్రదక్షిణం చేస్తారు.
    ఎలా చేరుకోవాలంటే..
    తిరుపతి నుంచి 193 కిలోమీటర్ల దూరంలో.. బెంగళూరు నుంచి 202 కిలోమీటర్ల దూరంలో.. చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి
    ధన్యవాదాలు :-
    రవితేజ.
    #arunachalamtemple #tamil #telugu #telangana #tiruvannamalai

Комментарии • 22