కోరాడ సూర్యనారాయణ కోరాడ వాసు యాదవ్ గొల్ల చదువు గావు పండుగ golla chaduvu
HTML-код
- Опубликовано: 22 янв 2025
- జానపదమనగా జనపదానికి సంబంధించింది. జనపదమనగా పల్లెటూరు. జనపదమున నివసించు వారు జానపదులు, వారు పాడుకొను పాటలు జానపదములు. జానపద గీతాలు: జానపదులు పాడుకునే గీతాలను జానపద గీతాలు అంటారు. వీటినే ఆంగ్లములో folk songs అని అంటారు. తెలుగు జానపద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ జానపదగీతాలలో కొన్నిసార్లు చక్కని ఛందస్సు కూడా ఉంటుంది. పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు ఆ కాలంలో ప్రసిద్ధములైన జానపద బాణీలలో చాలా పదములు రాసారు.
తెలుగు వారికి అపూర్వమైన జానపద కళా వారసత్వము ఉన్నది. జానపద కళా సాహిత్యము ద్వారా జాతి సంస్కృతి తెలుస్తుంది. ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకారాలు జానపద కళలు అందిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి సంస్కృతీ వారసత్వాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. జానపద ప్రదర్శన కళలకు తెలుగు భూమి పండిన పంట పొలం వంటిది. ఎన్నో రకాల జానపద ప్రదర్శన కళలు తెలుగు నేలను సుసంపన్నం చేశాయి. శతాబ్దాలుగా ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించినవి జానపద ప్రదర్శన కళలే. ప్రాచీన సమాజంలో వినోదం కోసం ప్రజలకు జానపద కళామాధ్యమం తప్ప మరొక మాధ్యమం లేదు. పరివర్థితులైన శిష్టుల కళారూపాలు ప్రజల దాకా వచ్చేవి కావు అవి ప్రభువుల కొలువులకు రాచనగరులకు పరిమితం అయ్యేవి. కాగా జన సామాన్యానికి జానపదులకు అందుబాటులో ఉండి వారి జీవితాన్నే వస్తువుగా జేసుకొని ఆడిన నాటకాలు జానపద కళలే. మన పురాణాలన్నింటినీ దృశ్య మాధ్యమంలో ప్రజలకు అందించి ప్రజలకు పురాణ పరిజ్ఞానాన్ని కలిగించినవి కూడా ఈ ప్రజాకళలే. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో జానపద ప్రదర్శన కళారూపాలు ఈనాటికీ సజీవంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. తెలుగు జానపద ప్రదర్శన కళలను ఏ ఒక్క దాన్ని తీసుకున్నా కూడా ఒక్కో కళ గురించే ఒక విస్తృత గ్రంథం రాయడానికి వీలుంది. అలా రాశారు కూడా.
Vasu yadav king super guruvu
Super
Nice guruvu
1~11