తేదీ : 19 జనవరి 2025 యేసుక్రీస్తు ప్రార్ధనా మందిరం పైడిభీమవరం వర్తమానికులు : పాస్టర్ ఎం. సైలస్ గారు మూలవాక్యం : ఎస్తేరు 5:3 రాజురాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? నీ మనవి యేమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకను గ్రహించెదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు 5:4 ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినయెడల నేను రాజుకొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను. ● అహష్వేరోషు రాజు యేసుక్రీస్తు ప్రభులవారికి సాదృశ్యం ●ఎస్తేరు సంఘమునకు సాదృశ్యం *★ రాజురాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? అని అడగడానికి గల కారణం ఏమిటి?* *★ యేసుక్రీస్తు ప్రభులవారు మనలో ఏం చూస్తే మనకు దీవెనలు కలుగచేస్తాడు?* *ఎస్తేరు లో అహష్వేరోషు రాజు చూసిన 3 లక్షణాలు ఏమిటి అంటే* ఎస్తేరు 5:1 మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని, రాజునగరుయొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనముమీద రాజు కూర్చుని యుండెను. ఎస్తేరు 5:2 రాణియైన ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలోనుండు బంగారపు దండమును ఎస్తేరుతట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. ● ఎస్తేరు అనే పేరుకు అర్థం ఏమిటి అంటే నక్షత్రం ఎస్తేరుకు గల మరొక పేరు హదస్సా అనగా గొంజి చెట్టు( సువాసన కలిగిన వృక్షము ) *1.ఎస్తేరు రాజభూషణములు ధరించుకొన్నది.* ★ మనము కూడా రాజభూషణములు ధరించుకోవాలి కీర్తనలు 96:9 పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి. *★ పరిశుధ్ధతను అలంకారముగా ధరించుకోవాలి అనగా పరిశుధ్ధత కలిగి ఉండాలి* యెషయా 4:3 సీయోనులో శేషించినవారికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖ లైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. *2.ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను.* *★ఎస్తేరు ప్రతికూల పరిస్తితిలో రాజు ఎదుట నిలవబడింది* *★మనము కూడా మనకు ఎన్ని ప్రతికూల పరిస్తితులు ఎదురైనా దేవుని ముందు నిలబడే వారిగా ఉండాలి* దానియేలు 3:16 షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకద్నెజరూ,యిందును గురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకులేదు. దానియేలు 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు;మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను *★షద్రకును, మేషాకును, అబేద్నెగోయులు ప్రతికూల పరిస్తితిలో కూడా దేవుని కొరకు నిలబడి దేవుని మీద విశ్వాసం ఉంచి అగ్నిగుండం నుండి రక్షించబడ్డారు.* *3.రాజు తన చేతిలోనుండు బంగారపు దండమును ఎస్తేరుతట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను.* *★ఎస్తేరు రాజు దగ్గరకు వచ్చింది అనగా ఆసక్తి కలిగి ఉంది* *★దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి* యెషయా 26:9 రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించు చున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు. ★ యెషయా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు 2రాజులు 10:16 యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతోకూడ రమ్మనగా యెహూ రథము మీద వారతని కూర్చుండబెట్టిరి. 2రాజులు 10:17 అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించియున్న వారినందరిని చంపి, ఏలీయాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి, అహాబును నిర్మూలము చేయు వరకు హతముచేయుట మానకుండెను. *★యెహూ దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు* *1 పరిశుధ్ధత* *2 ప్రతికూల పరిస్థితి లో నిలబడడం* *3 దేవుని పట్ల ఆసక్తి* పై మూడు లక్షణాలు ఎస్తేరు లో ఉండడం వలన ఎస్తేరు కు నీకు ఏం కావాలి అని అడిగాడు *మనలో కూడా పై మూడు లక్షణాలు ఉండడం వలన దేవుడు మనలను దీవిస్తాడు.* దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్...
తేదీ : 19 జనవరి 2025
యేసుక్రీస్తు ప్రార్ధనా మందిరం
పైడిభీమవరం
వర్తమానికులు : పాస్టర్ ఎం. సైలస్ గారు
మూలవాక్యం :
ఎస్తేరు 5:3
రాజురాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? నీ మనవి యేమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకను గ్రహించెదనని ఆమెతో చెప్పగా
ఎస్తేరు 5:4
ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినయెడల నేను రాజుకొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను.
● అహష్వేరోషు రాజు యేసుక్రీస్తు ప్రభులవారికి సాదృశ్యం
●ఎస్తేరు సంఘమునకు సాదృశ్యం
*★ రాజురాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? అని అడగడానికి గల కారణం ఏమిటి?*
*★ యేసుక్రీస్తు ప్రభులవారు మనలో ఏం చూస్తే మనకు దీవెనలు కలుగచేస్తాడు?*
*ఎస్తేరు లో అహష్వేరోషు రాజు చూసిన 3 లక్షణాలు ఏమిటి అంటే*
ఎస్తేరు 5:1
మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని, రాజునగరుయొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనముమీద రాజు కూర్చుని యుండెను.
ఎస్తేరు 5:2
రాణియైన ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలోనుండు బంగారపు దండమును ఎస్తేరుతట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను.
● ఎస్తేరు అనే పేరుకు అర్థం ఏమిటి అంటే నక్షత్రం ఎస్తేరుకు గల మరొక పేరు హదస్సా అనగా గొంజి చెట్టు( సువాసన కలిగిన వృక్షము )
*1.ఎస్తేరు రాజభూషణములు ధరించుకొన్నది.*
★ మనము కూడా రాజభూషణములు ధరించుకోవాలి
కీర్తనలు 96:9
పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి.
*★ పరిశుధ్ధతను అలంకారముగా ధరించుకోవాలి అనగా పరిశుధ్ధత కలిగి ఉండాలి*
యెషయా 4:3
సీయోనులో శేషించినవారికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖ లైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు.
*2.ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను.*
*★ఎస్తేరు ప్రతికూల పరిస్తితిలో రాజు ఎదుట నిలవబడింది*
*★మనము కూడా మనకు ఎన్ని ప్రతికూల పరిస్తితులు ఎదురైనా దేవుని ముందు నిలబడే వారిగా ఉండాలి*
దానియేలు 3:16
షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకద్నెజరూ,యిందును గురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకులేదు.
దానియేలు 3:17
మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు;మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను
*★షద్రకును, మేషాకును, అబేద్నెగోయులు ప్రతికూల పరిస్తితిలో కూడా దేవుని కొరకు నిలబడి దేవుని మీద విశ్వాసం ఉంచి అగ్నిగుండం నుండి రక్షించబడ్డారు.*
*3.రాజు తన చేతిలోనుండు బంగారపు దండమును ఎస్తేరుతట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను.*
*★ఎస్తేరు రాజు దగ్గరకు వచ్చింది అనగా ఆసక్తి కలిగి ఉంది*
*★దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి*
యెషయా 26:9
రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించు చున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.
★ యెషయా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు
2రాజులు 10:16
యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతోకూడ రమ్మనగా యెహూ రథము మీద వారతని కూర్చుండబెట్టిరి.
2రాజులు 10:17
అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించియున్న వారినందరిని చంపి, ఏలీయాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి, అహాబును నిర్మూలము చేయు వరకు హతముచేయుట మానకుండెను.
*★యెహూ దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు*
*1 పరిశుధ్ధత*
*2 ప్రతికూల పరిస్థితి లో నిలబడడం*
*3 దేవుని పట్ల ఆసక్తి*
పై మూడు లక్షణాలు ఎస్తేరు లో ఉండడం వలన ఎస్తేరు కు నీకు ఏం కావాలి అని అడిగాడు
*మనలో కూడా పై మూడు లక్షణాలు ఉండడం వలన దేవుడు మనలను దీవిస్తాడు.*
దేవుడు మనలను దీవించును గాక.
ఆమేన్...
ఆమెన్
Praise God 👏 🙌
Super message