తేదీ : 24 జనవరి 2025 శుక్రవారం యేసుక్రీస్తు ప్రార్ధనా మందిరం పైడిభీమవరం వర్తమానికులు : పాస్టర్ ఎం. సైలస్ గారు మూలవాక్యం : పరమగీతము 7:4 నీ కంధరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున నున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. ● పై వచనం ప్రియుడు ప్రియురాలిని పొగుడుతూ మాట్లాడుతున్న మాటలు *★ ప్రియుడు యేసుక్రీస్తు ప్రభులవారికి ప్రియురాలు సంఘమునకు సాదృశ్యంగా ఉన్నారు.* *1. నీ కంధరము దంతగోపుర రూపము* ● కందరం అనగా మెడ గోపురం ఏ విదంగా అంతస్తుపై అంతస్తు ఉంటుదో ఆ విదంగా మెడ ఉన్నది ● శిరస్సును శరీరాన్ని కలిపేది మెడ కొలస్సీయులకు 1:18 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను. ●శిరస్సు యేసుక్రీస్తుకి శరీరం సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది ●యేసుక్రీస్తుని సంఘాన్ని కలపడానికి మెడ దంత గోపురం వలే ఉన్నది ●తెలుపు పరిశుధ్ధత కు సాదృశ్యం దంతం ఏ విదంగా తెలుపుగా ఉంటుందో సంఘం ఆ విదంగా పరిశుధ్ధత కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రభులవారు ఆ సంఘములో ఉంటారు మార్కు 1:21 అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను. ★కపెర్నహోము అనగా ఆదరించు పట్టణము ●కపెర్నహోము సంఘములో పరిశుధ్ధత కలిగి ఉండడం వలన యేసుక్రీస్తు ప్రభులవారు సంఘానికి వెళ్ళి భోదింపసాగెను. *●పరిశుధ్ధత ఉన్న సంఘంలో యేసుక్రీస్తు ప్రభులవారు ఉంటారు.* 1పేతురు 1:14 నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. *2 నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున నున్న రెండు తటాకములతో సమానములు* ●హెష్బోను పట్టణము లో ఉన్న రెండు చెరువులు ప్రజల జీవనోపాదికి ఆదారం గా ఉన్నాయి. ●హెష్బోను పట్టణము లో ఉన్న రెండు చెరువులు ప్రజల అవసరాలను ఏ విధంగా తీరుస్తున్నాయో ఆ విదంగా మన నేత్రములలో ఉన్న నీళ్ళు ప్రజలకు ఉపయోగకరమైనవిగా ఉండాలి. ●అనగా మన యెక్క కన్నీటి ప్రార్ధన అనేక కార్యాలకు ఉపయోగపడాలి. ఎస్తేరు 8:3 మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసికొని, అతని పాదములమీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధ ముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా ★ ఎస్తేరు యూదా జనాంగం అయిన దేవుని ప్రజలను రక్షించం కొరకు రాజు యొద్ద కన్నీరు కార్చంది. ఎస్తేరు కన్నీటి వలన అహష్వేరోషు రాజు యొక్క మనస్సు మారి యూదా ప్రజలపై ఉన్న మరణ శాశనం రద్దు చేసాడు. యెషయా 38:3 యెహోవా, యథార్థ హృద యుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా ★ హిజ్కియా కన్నీటి ప్రార్ధన వలన మరణకరమైన రోగం నుండి స్వస్థత కలిగింది అపో.కార్యములు 17:16 పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. ★ పౌలు ఏథెన్సు పట్టణంలో పాపంలో పడి నశించి పోతున్న ప్రజలు కొరకు కన్నీటి ప్రార్ధన చేసాడు అపో.కార్యములు 17:34 అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరునుండిరి. ★ పౌలు కన్నీటి ప్రార్ధన వలన కొంతమంది ప్రజలు రక్షంచబడ్డారు *★కన్నీటి ప్రార్ధనా జీవితం కలిగి ఉండాలి.* *3 నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము.* ●నాసిక అనగా ముక్కు ★ ఊపిరి శరీరం జీవించడానికి ఎంత ముఖ్యమో మనం ఆత్మీయంగా జీవించాలి అంటే ప్రార్ధన అంత ముఖ్యం లూకా 7:14 ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా లూకా 7:15 ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. *★చనిపోయిన చిన్నవాడు లేచిన తరువాత మాటలాడ సాగెను అనగా ప్రార్ధించెను* *★ ఆత్మీయ జీవితంలో చనిపోయిన మనం జీవించాలి అంటే ప్రార్ధన కలిగి ఉండాలి* యాకోబు 5:18 అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. *★ ఏలియా ప్రార్ధన వలన గొప్ప కార్యాలను దేవుడు జరిగించాడు.* *★ ప్రార్ధనా జీవితం కలిగి ఉండాలి.* దేవుడు మనలను దీవించును గాక ఆమేన్ ప్రార్ధనా అవసరతలకు : 9441804941
తేదీ : 24 జనవరి 2025
శుక్రవారం
యేసుక్రీస్తు ప్రార్ధనా మందిరం
పైడిభీమవరం
వర్తమానికులు : పాస్టర్ ఎం. సైలస్ గారు
మూలవాక్యం :
పరమగీతము 7:4
నీ కంధరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున నున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము.
● పై వచనం ప్రియుడు ప్రియురాలిని పొగుడుతూ మాట్లాడుతున్న మాటలు
*★ ప్రియుడు యేసుక్రీస్తు ప్రభులవారికి ప్రియురాలు సంఘమునకు సాదృశ్యంగా ఉన్నారు.*
*1. నీ కంధరము దంతగోపుర రూపము*
● కందరం అనగా మెడ
గోపురం ఏ విదంగా అంతస్తుపై అంతస్తు ఉంటుదో ఆ విదంగా మెడ ఉన్నది
● శిరస్సును శరీరాన్ని కలిపేది మెడ
కొలస్సీయులకు 1:18
సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.
●శిరస్సు యేసుక్రీస్తుకి శరీరం సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది
●యేసుక్రీస్తుని సంఘాన్ని కలపడానికి మెడ దంత గోపురం వలే ఉన్నది
●తెలుపు పరిశుధ్ధత కు సాదృశ్యం
దంతం ఏ విదంగా తెలుపుగా ఉంటుందో సంఘం ఆ విదంగా పరిశుధ్ధత కలిగి ఉంటే
యేసుక్రీస్తు ప్రభులవారు ఆ సంఘములో ఉంటారు
మార్కు 1:21
అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను.
★కపెర్నహోము అనగా ఆదరించు పట్టణము
●కపెర్నహోము సంఘములో పరిశుధ్ధత కలిగి ఉండడం వలన యేసుక్రీస్తు ప్రభులవారు సంఘానికి వెళ్ళి భోదింపసాగెను.
*●పరిశుధ్ధత ఉన్న సంఘంలో యేసుక్రీస్తు ప్రభులవారు ఉంటారు.*
1పేతురు 1:14
నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.
*2 నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున నున్న రెండు తటాకములతో సమానములు*
●హెష్బోను పట్టణము లో ఉన్న రెండు చెరువులు ప్రజల జీవనోపాదికి ఆదారం గా ఉన్నాయి.
●హెష్బోను పట్టణము లో ఉన్న రెండు చెరువులు ప్రజల అవసరాలను ఏ విధంగా తీరుస్తున్నాయో ఆ విదంగా మన నేత్రములలో ఉన్న నీళ్ళు ప్రజలకు ఉపయోగకరమైనవిగా ఉండాలి.
●అనగా మన యెక్క కన్నీటి ప్రార్ధన అనేక కార్యాలకు ఉపయోగపడాలి.
ఎస్తేరు 8:3
మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసికొని, అతని పాదములమీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధ ముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా
★ ఎస్తేరు యూదా జనాంగం అయిన దేవుని ప్రజలను రక్షించం కొరకు రాజు యొద్ద కన్నీరు కార్చంది.
ఎస్తేరు కన్నీటి వలన అహష్వేరోషు రాజు యొక్క మనస్సు మారి యూదా ప్రజలపై ఉన్న మరణ శాశనం రద్దు చేసాడు.
యెషయా 38:3
యెహోవా, యథార్థ హృద యుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా
★ హిజ్కియా కన్నీటి ప్రార్ధన వలన మరణకరమైన రోగం నుండి స్వస్థత కలిగింది
అపో.కార్యములు 17:16
పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.
★ పౌలు ఏథెన్సు పట్టణంలో పాపంలో పడి నశించి పోతున్న ప్రజలు కొరకు కన్నీటి ప్రార్ధన చేసాడు
అపో.కార్యములు 17:34
అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరునుండిరి.
★ పౌలు కన్నీటి ప్రార్ధన వలన కొంతమంది ప్రజలు రక్షంచబడ్డారు
*★కన్నీటి ప్రార్ధనా జీవితం కలిగి ఉండాలి.*
*3 నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము.*
●నాసిక అనగా ముక్కు
★ ఊపిరి శరీరం జీవించడానికి ఎంత ముఖ్యమో మనం ఆత్మీయంగా జీవించాలి అంటే ప్రార్ధన అంత ముఖ్యం
లూకా 7:14
ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా
లూకా 7:15
ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను.
*★చనిపోయిన చిన్నవాడు లేచిన తరువాత మాటలాడ సాగెను అనగా ప్రార్ధించెను*
*★ ఆత్మీయ జీవితంలో చనిపోయిన మనం జీవించాలి అంటే ప్రార్ధన కలిగి ఉండాలి*
యాకోబు 5:18
అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను.
*★ ఏలియా ప్రార్ధన వలన గొప్ప కార్యాలను దేవుడు జరిగించాడు.*
*★ ప్రార్ధనా జీవితం కలిగి ఉండాలి.*
దేవుడు మనలను దీవించును గాక
ఆమేన్
ప్రార్ధనా అవసరతలకు : 9441804941
Praise the Lord pastor garu
Great message