Ephesians ( ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక ) Full Audio Bible in Telugu || Telugu Audio Bible

Поделиться
HTML-код
  • Опубликовано: 24 авг 2024
  • Ephesians Full Audio Bible in Telugu
    Telugu Audio Bible
    ఎఫెసీయులకు
    ‪@TeluguAudioBIBLE‬
    Telugu Audio Bible Channel
    / @teluguaudiobible
    Telugu Audio BIBLE, Audio Bible Telugu, Bible old testament Telugu, Holy Bible, bible audio in Telugu, Bible Audio Telugu, Audio Bible, parishudha grandham bible Telugu, Ephesians Full Audio Bible in Telugu, ఎఫెసీయులకు

Комментарии • 44

  • @NAGABABU.
    @NAGABABU. 9 месяцев назад +4

    చాలా చక్కగా పంపారు

  • @rashirashi8637
    @rashirashi8637 Год назад +2

    🙏🏻🙏🏻

  • @shivaperike3402
    @shivaperike3402 8 месяцев назад

    Thank you so much God🙏
    Praise Lord Brother 🙏

  • @izacaras1465
    @izacaras1465 3 года назад +2

    Good

  • @PolepakaSandhyarani-ij8mo
    @PolepakaSandhyarani-ij8mo 6 месяцев назад

    Amen amen amen amen amen 🙏🏻

  • @GideonReddy
    @GideonReddy Год назад

    Jesus loves you unconditionally

  • @simonpitla5250
    @simonpitla5250 3 года назад +1

    🙏Lord Jesus Thank You🙏

  • @nagasreenu926
    @nagasreenu926 2 года назад

    Hallelujah hallelujah hallelujah

  • @kgnaidu1100
    @kgnaidu1100 4 месяца назад

    Praise the lord

  • @swajaaprandasari3461
    @swajaaprandasari3461 Год назад +1

    Ephesians(ఎఫెసీయులకు) 4:1కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
    2.మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
    3.ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.
    4.శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.
    5.ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే,
    6.అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి(మూలభాషలో-అందరిద్వారాను) అందరిలో ఉన్నాడు.
    7.అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప యియ్యబడెను.
    8.అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.
    9.ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకు(కొన్ని ప్రాచీన ప్రతులలో-మొదట అని కూర్చబడియున్నది) దిగెననియు అర్థమిచ్చుచున్నదిగదా.
    10.దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటె మరి పైకి ఆరోహణమైనవాడునై యున్నాడు.
    11.మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగువరకు,
    12.అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.
    13.పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.
    14.అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలల చేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక,
    15.ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.
    16.ఆయన శిరస్సయియున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతికీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసి కొనుచున్నది.
    17.కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.
    18.వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానముచేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.
    19.వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామేకాముకత్వమునకు అప్పగించుకొనిరి.
    20.అయితే మీరు యేసును గూర్చి విని,
    21.ఆయనయందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడినవారైనయెడల, మీరాలాగు క్రీస్తును నేర్చుకొన్నవారుకారు.
    22.కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును(మూలభాషలో-ప్రాచీన పురుషుని) వదలుకొని
    23.మీ చిత్తవృత్తియందు నూతన పరచబడినవారై,
    24.నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును(మూలభాషలో-నవీన పురుషుడు) ధరించుకొనవలెను.
    25.మనము ఒకరికొకరము అవయవములైయున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.
    26.కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.
    27.అపవాదికి(అనగా సాతాను) చోటియ్యకుడి;
    28.దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.
    29.వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.
    30.దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.
    31.సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
    32.ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.

  • @swajaaprandasari3461
    @swajaaprandasari3461 Год назад +1

    Ephesians(ఎఫెసీయులకు) 2:1,.మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.
    2.మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున(మూలభాషలో-యుగము చొప్పున) మునుపు నడుచుకొంటిరి.
    3.వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై(మూలభాషలో-ఉగ్రత పిల్లలమై) యుంటిమి.
    4.అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడ బ్రదికించెను.
    5.కృపచేత మీరు రక్షింపబడియున్నారు.
    6.క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము,
    7.క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను.
    8.మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
    9.అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.
    10.మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.
    11.కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతి లేనివారనబడిన మీరు
    12.ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడు లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.
    13.అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.
    14.ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.
    15.ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,
    16.తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.
    17.మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.
    18.ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.
    19.కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.
    20.క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
    21.ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.
    22.ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

  • @padmapeddinti8927
    @padmapeddinti8927 10 месяцев назад

    Praise the lord 🙏

  • @Sudhirkavuri
    @Sudhirkavuri Год назад

    Amen

  • @nirmalamathi7653
    @nirmalamathi7653 Месяц назад

    దేవునికి మహిమ. మీ పని ప్రయత్నం ప్రభువు ఆశీర్వదిస్తాడు. Music సౌండ్ తగ్గిస్తే మంచిది.

  • @swajaaprandasari3461
    @swajaaprandasari3461 Год назад

    Ephesians(ఎఫెసీయులకు) 5:1.కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడుచుకొనుడి.
    2.క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.
    3.మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.
    4.కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను(లేక,వెఱ్ఱిమటలైనను), సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.
    5.వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.
    6.వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి(మూలభాషలో-అవిధేయత కుమారుల మీదికి) వచ్చును
    7.గనుక మీరు అట్టివారితో పాలివారైయుండకుడి.
    8.మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు.
    9.వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.
    10.గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి
    11.నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి.
    12.ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది.
    13.సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్ష పరచబడును; ప్రత్యక్ష పరచునది ఏదో అది వెలుగే గదా
    14.అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు.
    15.దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,
    16.అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
    17.ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.
    18.మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మపూర్ణులైయుండుడి.
    19.ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు,
    20.మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,
    21.క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.
    22.స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి.
    23.క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.
    24.సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.
    25.పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
    26.అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,
    27.నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.
    28.అటువలెనే పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
    29.తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును.
    30.మనము క్రీస్తు శరీరమునకు అవయవములమైయున్నాము గనుక అలాగే క్రీస్తు కూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.
    31.ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏక శరీరమగుదురు.
    32.ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను.
    33.మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.

  • @MadhuMothkri-cg3ij
    @MadhuMothkri-cg3ij Год назад

    Praise the Lord🙏🙏🙏

  • @swajaaprandasari3461
    @swajaaprandasari3461 Год назад

    Ephesians(ఎఫెసీయులకు) 3:1ఈ హేతువుచేత అన్యజనులైన మీనిమిత్తము క్రీస్తు యేసుయొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను.
    2.మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన యేర్పాటును(లేక,గృహనిర్వాహకత్వము) గూర్చి మీరు వినియున్నారు.
    3.ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని.
    4.మీరు దానిని చదివినయెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు.
    5.ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడియున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడలేదు.
    6.ఈ మర్మమేదనగా అన్యజనులు, సువార్త వలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునైయున్నారను నదియే.
    7.దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.
    8.దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున,
    9.పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘము ద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి,
    10.శోధింపశక్యము కాని(మూలభాషలో-అడుగుజాడలు పట్ల శక్యముకాని) క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును,
    11.సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన యేర్పాటు(లేక,గృహనిర్వాహకత్వము) ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.
    12.ఆయనయందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగియున్నవి.
    13.కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములైయున్నవి.
    14.ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని
    15.మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను,
    16.క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను,
    17.తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,
    18.మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,
    19.జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.
    20.మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,
    21.క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్‌.

  • @lakshmaiahvemula5989
    @lakshmaiahvemula5989 Год назад

    Praise the Lord

  • @swajaaprandasari3461
    @swajaaprandasari3461 Год назад

    Ephesians(ఎఫెసీయులకు) 1:1దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులును క్రీస్తుయేసు నందు విశ్వాసులునైనవారికి శుభమని చెప్పి వ్రాయునది
    2.మన తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు(యేసుక్రీస్తు అను శబ్దమునకు రక్షకుడగు అభిషిక్తుడని అర్ధము) నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.
    3.మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
    4.ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,
    5.తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,
    6.మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
    7.దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
    8.కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును బట్టి, ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి,
    9.మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను.
    10.ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.
    11.మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని,
    12.దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను(లేక,మనకొక స్వాస్థ్యము నేర్పరచెను) . ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.
    13.మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
    14.దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన(సొతైయిన ప్రజలకు) ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
    15.ఈ హేతువుచేత, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి యెడల మీరు చూపుచున్న విశ్వాసమును(అనేక ప్రాచీన ప్రతులలో-ప్రేమను అని పాఠాంతరము) గూర్చియు, నేను వినినప్పటినుండి
    16.మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
    17.మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో,
    18.ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని,
    19.మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.
    20.ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందు మాత్రమే
    21.గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండ బెట్టుకొనియున్నాడు.
    22.మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.
    23.ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది.

  • @prabavathiprabavathi2300
    @prabavathiprabavathi2300 3 месяца назад

    🤲☦🤲☦🤲

  • @rendlasammaiah5358
    @rendlasammaiah5358 Год назад

    Paise the lord

  • @justforchrist3213
    @justforchrist3213 3 года назад

    Praise the lord amen

  • @davidpdavid1359
    @davidpdavid1359 3 года назад

    Praise the lord Great universal speech

  • @sheelakumari8938
    @sheelakumari8938 Год назад +1

    Yes, My LORD JESUS I want you always in my life please help me always God, Thank you for loving me Almighty God,Amen

  • @saggurthyvamsi2947
    @saggurthyvamsi2947 3 года назад +2

    Blessed voice. Thank you Jesus for the word you have given.

  • @swajaaprandasari3461
    @swajaaprandasari3461 Год назад +1

    Ephesians(ఎఫెసీయులకు) 6:1పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.
    2.నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,
    3.అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.
    4.తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.
    5.దాసులారా, యథార్థమైన హృదయముగలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకువలె, శరీర విషయమై మీ యజమానులైనవారికి విధేయులైయుండుడి.
    6.మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు,
    7.మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి.
    8.దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యముచేయునో దాని ఫలము ప్రభువువలన పొందునని మీరెరుగుదురు.
    9.యజమాను లారా, మీకును వారికిని యజమానుడైనవాడు పరలోకమందున్నాడనియు, ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగినవారై, వారిని బెదరించుట మాని, ఆ ప్రకారమే వారియెడల ప్రవర్తించుడి.
    10.తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులైయుండుడి.
    11.మీరు అపవాది(అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
    12.ఏలయనగా మనము పోరాడునది శరీరులతో(మూలభాషలో-రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
    13.అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు(దేవుని) సర్వాంగ కవచమును ధరించుకొనుడి
    14.ఏలా గనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని
    15.పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి.
    16.ఇవన్నయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
    17.మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
    18.ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
    19.మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచునప్పుడు
    20.దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
    21.మీరును నా క్షేమసమాచారమంతయు తెలిసికొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నియు మీకు తెలియజేయును.
    22.మీరు మా సమాచారము తెలిసికొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీయొద్దకు పంపితిని.
    23.తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక.
    24.మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక.

  • @paulbraineard6424
    @paulbraineard6424 3 года назад +1

    Thank You for all of your great efforts. May God bless all of you abundantly. Once again thank you so much.

  • @rajitharajitha307
    @rajitharajitha307 2 года назад

    🙏🙏🙏🙏🙏👏👏👏

  • @mohanraomovva7270
    @mohanraomovva7270 3 года назад +2

    ✝️🙏Praise the lord🙏✝️

  • @airswatipraisethelordbroth5369

    Prayer for my marriage and my family and my mother leg pain

  • @nagasreenu926
    @nagasreenu926 2 года назад +1

    Praise the LORD 🙌

  • @KumarSamuel68
    @KumarSamuel68 2 года назад

    Blessed by listening thank you Bro.

  • @robertkennedyvaradhi8890
    @robertkennedyvaradhi8890 10 месяцев назад

    Praise the Lord brother for this Audio.
    One submission from my side,kindly Don't give back ground music while ur reading as this is disturbing & Loosing clarity of OUTPUT.🙏🙏🙏

  • @tvaraprasadnlr
    @tvaraprasadnlr 3 года назад +4

    Background music making inconvenience to concentrate on audio, if possible please remove

    • @kishanchandu4805
      @kishanchandu4805 3 года назад

      Lite music is better

    • @Michael-lu9ho
      @Michael-lu9ho 2 года назад

      S currect

    • @aprilmay7816
      @aprilmay7816 Год назад

      Yes, especially if you hear the Word of God with AirPods, music hurts your ears

  • @Michael-lu9ho
    @Michael-lu9ho 2 года назад +1

    Background music disturbing voice 😬

  • @anilKumar-ix1gb
    @anilKumar-ix1gb 2 года назад +1

    Background music yenduku

  • @steevenhosanna1624
    @steevenhosanna1624 3 года назад +2

    Good

  • @krishnakumari8838
    @krishnakumari8838 2 года назад

    Amen

  • @krishnakumari8838
    @krishnakumari8838 2 года назад

    Praise the lord

  • @kbevarajnaik1493
    @kbevarajnaik1493 3 года назад +2

    Good