swachanda siyonu vasi song by ||APO DR. A.S. RANJEET OPHIR GARU||

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 3

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 11 месяцев назад

    Glory to God

  • @omegaswaramophirministries5497
    @omegaswaramophirministries5497 Год назад +1

    స్వఛ్చంద సీయోను వాసి
    సర్వాధికారి - కస్తూరి పూరాసి (2)
    వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి (2)
    అల్ఫా ఒమేగ తానే (2)
    ఆద్యంతము మన యేసే (2) ||స్వఛ్చంద||
    ఇదిగో నేనొక నిబంధనను
    అద్భుతముగ జేతున్ - నీ ప్రజలందరి యెదుట (2)
    పరిశోధింపజాలని మహా - పనులెల్ల ప్రభువే (2)
    లెక్క లేని యద్భుతముల్ (2)
    మక్కువతో చేయువాడు (2) ||స్వఛ్చంద||
    సంగీతం నాదముల తోడ
    సీయోను పురము - సొంపుగను చేరితిమి (2)
    శాశ్వత సంతోషము మా - శిరములపై వెలసెన్ (2)
    దుఃఖము నిట్టూర్పును పోయెన్ (2)
    మిక్కిలి ఆనందము కల్గెన్ (2) ||స్వఛ్చంద||
    నీలముల పునాదులు వేసి
    నీలాంజనములతో - మాణిక్య మణులతో (2)
    సువర్ణ శునీయముల - సూర్య కాంతముతో (2)
    ప్రశస్త రత్నములతో (2)
    ప్రవిమలముగా నిను గట్టెదను (2) ||స్వఛ్చంద||
    సుమముల హారము
    సంతోషానంద తైలము నీదే - స్తుతి వస్త్రమును నీదే (2)
    ఉల్లాస వస్త్రంబు నీదే - విడుదలయి నీదే (2)
    హిత వత్సరము విముక్తి (2)
    ఆత్మాభిషేకము నీదే (2) ||స్వఛ్చంద||
    జలములలో బడి దాటునప్పుడు
    బలమై యుండెదను - నీ తోడై యుండెదను (2)
    నదులలో వెళ్లునప్పుడు - నీపై పారవు (2)
    అగ్ని మధ్యను నడచినను (2)
    జ్వాలలు నిను కాల్చగ లేవు (2) ||స్వఛ్చంద||
    ఇత్తడి తలుపుల బగుల గొట్టెద
    నినుప ఘడియలను - విడగొట్టెదను నేను (2)
    అంధకార స్థలములలో ను-న్నట్టి నిధులను (2)
    రహస్యములో మరుగైన (2)
    ధనమును నీ కొసంగెదను (2) ||స్వఛ్చంద||
    గర్భమున పుట్టినది మొదలు
    తల్లి యొడిలోన - కూర్చుండినది మొదలు (2)
    నేను చంక బెట్టుకొన్న - నాదు ప్రజలారా (2)
    ముదిమి వచ్చుఁ వరకు నిన్ను (2)
    ఎత్తుకొను వాడను నేనే (2) ||స్వఛ్చంద||

  • @dhereakbekkamm
    @dhereakbekkamm 10 месяцев назад

    ❤️❤️