Это видео недоступно.
Сожалеем об этом.

చపాతీ, ఫుల్కాలోకి రెస్టారంట్ రుచి వచ్చేట్టు కాజు పనీర్ మసాలా చేయండిలా | Paneer Kaju Masala Recipe

Поделиться
HTML-код
  • Опубликовано: 6 авг 2023
  • చపాతీ, ఫుల్కాలోకి రెస్టారంట్ రుచి వచ్చేట్టు కాజు పనీర్ మసాలా చేయండిలా Kaju Paneer Curry
    #kajupaneercurry #cashewpaneercurry #kajupaneermasalaintelugu
    Here's the link to this recipe in English: • Kaju Paneer Curry | Au...
    Our Other Recipes:
    Rajma Curry: • ఎదిగే పిల్లలకి, పెద్దవ...
    Pesala Masala Kura: • Green Gram Curry | పెస...
    Pachibatani Masala Kura: • Green Peas Curry | పచ్...
    Sorakaya Kofta Curry: • Lauki Kofta Curry | సొ...
    Mixed Veg Curry: • మిక్స్డ్ వెజ్ కర్రీ | ...
    Kadai Mushrrom Curry: • చికెన్ కర్రీని తలదన్నే...
    తయారుచేయడానికి: 5 నిమిషాలు
    వండటానికి: 35 నిమిషాలు
    సెర్వింగులు: 4-5
    కావలసిన పదార్థాలు:
    నెయ్యి
    జీడిపప్పులు
    కాప్సికం - 1 (ఆప్షనల్)
    పనీర్ - 400 గ్రాములు
    నూనె - 3 టేబుల్స్పూన్లు
    మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, మిరియాలు, షాజీరా, జీలకర్ర, సోంపు గింజలు)
    ఉల్లిపాయలు - 3
    పచ్చిమిరపకాయలు - 3
    అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టీస్పూన్లు
    టొమాటో ప్యూరీ
    ఉప్పు - 2 టీస్పూన్లు
    పసుపు - 1 / 2 టీస్పూన్
    కాశ్మీరీ కారం - 3 టీస్పూన్లు
    ధనియాల పొడి - 2 టీస్పూన్లు
    జీలకర్ర పొడి - 1 1 / 2 టీస్పూన్లు
    పంచదార - 1 / 2 టీస్పూన్
    నీళ్ళు
    గరం మసాలా పొడి - 1 టీస్పూన్
    కసూరీ మేథీ
    కొత్తిమీర
    తయారుచేసే విధానం:
    ముందుగా నెయ్యిలో జీడిపప్పులు, కాప్సికం, పనీర్ను విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి
    అలాగే, నానపెట్టిన జీడిపప్పులని కూడా మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి
    ఒక వెడల్పాటి కడాయిలో నెయ్యి, నూనె వేసి, అందులో మసాలా దినుసులు వేసిన తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కనీసం పదిహేను నిమిషాలు వేయించాలి
    ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కాస్త వేయించిన తరువాత టొమాటో ప్యూరీ వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి
    ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పంచదార వేసి బాగా కలపాలి
    ఆ తరువాత నానపెట్టిన జీడిపప్పుల పేస్టు వేసి కలపాలి
    గ్రేవీ కాస్త పలచగా అవ్వడం కోసం అందులో నీళ్ళు పోసి కలిపిన తరువాత, వేయించిన కాప్సికం, వేయించిన పనీర్, వేయించిన జీడిపప్పులు వేసి కలపాలి
    కడాయికి ఒక మూత పెట్టి, కూరని కనీసం ఐదు నిమిషాలు వేయించాలి
    ఆ తరువాత ఇందులో గరం మసాలా పొడి, నిలిపిన కసూరీ మేథీ, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి
    అంతే, హోటల్ స్టైల్ కాజు మసాలా కర్రీ తయారైనట్టే, దీన్ని వేడివేడిగా రోటీ, ఫుల్కా, నాన్ లాంటి వాటిల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
    Dhaba style curries are very special due to the unique flavors they possess. Now if you actually get into the business, it is not too difficult to recreate those recipes at home. So this video is one such attempt at making the great Dhaba style Kaju Paneer Masala Curry. It is obviously great because of all the rich and beautiful ingredients that go into it like cashewnuts and paneer. We basically make a nice gravy and then add in the important ingredients. This video is a step-by-step guidance on making the curry easily at home with all the regular ingredients available in our kitchens all the time. So watch the video right away till the end, make some wonderful rotis to go with this side dish and enjoy the special meal with your family and friends.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in...
    FACEBOOK - / homecookingtelugu
    RUclips: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

Комментарии • 11