Pidikita Talambrala - Annamayya Sankeerthana (పిడికిట తలంబ్రాల - అన్నమయ్య సంకీర్తన) Lyrics

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024
  • పిడికిట తలంబ్రాల - అన్నమయ్య సంకీర్తన (Pidikita Talambrala - Annamayya Sankeerthana)
    Singer - VaniJaiRam garu
    (Courtesy - TTD & Sri Venkateswara Recording Project)
    Lyrics -
    పిడికిటి తలంబ్రాల పెండ్లికూఁతురు కొంత
    పెడమరలి నవ్వీనె పెండ్లి కూఁతురు
    పేరుకల జవరాలె పెండ్లికూఁతురు పెద్ద-
    పేరులముత్యాలమేడ పెండ్లికూఁతురు
    పేరంటాండ్ల నడిమి పెండ్లికూఁతురు విభుఁ
    బేరు కుచ్చ సిగ్గువడీఁ బెండ్లికూఁతురు
    బిరుదు పెండెము వెట్టెఁ బెండ్లికూఁతురు నెర-
    బిరుదు మగనికంటెఁ బెండ్లికూఁతురు
    పిరిదూ రినప్పుడె పెండ్లికూఁతురు పతిఁ
    బెరరేఁచీ నిదివో పెండ్లికూఁతురు
    పెట్టెనె పెద్దతురుము పెండ్లికూఁతురు నేఁడె
    పెట్టెఁడు చీరలుగట్టెఁ బెండ్లికూఁతురు
    గట్టిగ వేంకటపతికౌఁగిటను వడి-
    వెట్టిన నిధానమైన పెండ్లికూఁతురు

Комментарии • 10