శాశ్వతమైన ప్రేమ, Saswathamaina Prema .

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025
  • శాశ్వతమైనది ప్రేమ
    యెహోవా తండ్రి ప్రేమ
    ప్రేమలో భయమేమియు లేదు
    ప్రేమ పరిపూర్ణంబైయున్న
    భయమును పారగ ద్రోలున్‌
    1). దీర్ఘకాలము ప్రేమ
    దయచూపి సహించును
    మత్సరపడ దీయుత్తమ ప్రేమ
    డంబముగా నడువని దీ ప్రేమ
    ఉప్పొంగని దీ ప్రేమ ||శాశ్వత||
    2). స్వప్రయోజనమును
    ఎప్పుడు కోరనిదీ ప్రేమ
    అమర్యాదగ నడువని ప్రేమ
    త్వరగా కోపపడని ప్రేమ
    తలచదు అపకారమును ||శాశ్వత||
    3).దుర్నీతిలో గాక
    సత్యాన సంతోషించున్‌
    అన్నిటికి తాళుకొను ప్రేమ
    అన్నిటిని నమ్మి యోర్చెడి ప్రేమ
    అన్నిటి నిరీక్షించున్‌ ||శాశ్వత||
    4).నిలుచును విశ్వాసము
    నిరీక్షణయు మరి ప్రేమ
    వీటిలో శ్రేష్టమైనది ప్రేమ
    ప్రేమను కల్గియుండుటకు
    ప్రయత్నించుడి మీరు ||శాశ్వత||
    5).ప్రేమ లేనివాడు
    దేవుని యెరుగనివాడు
    మన దేవుడు ప్రేమ స్వరూపి
    తన ప్రేమ మనలో సంపూర్ణ
    సిద్ధిని పొందవలయు ||శాశ్వత||
    6).నిన్నడుగుచున్నాడు
    నిను ప్రేమించిన ప్రభు యేసు
    నన్ను ప్రేమించుచున్నావా?
    వీరికంటె నాపై నీకు
    ఎక్కువ ప్రేమగలదా ||శాశ్వత||
    7).నను ప్రేమించినయెడల
    నా యాజ్ఞలను గైకొనుము
    మీలో మీరు ఒకరి నొకరు
    ప్రేమించుకొనుచున్నయెడల
    అదియే మహదానందం ||శాశ్వత||

Комментарии •