పాత పాటల బుట్ట ౼ గాయనీమణుల సామ్రాజ్యం : లీల || paatha paatala butta - P leela

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 566

  • @rambrathi1312
    @rambrathi1312 3 года назад +224

    సార్..ఏనాటి నుంచో ఎదురుచూస్తున్న ఆనాటి పాటలు వినిపించే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది. మీకూ, మీ ఛానల్ కూ, ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా చాలా ధన్యవాదాలు.నాచిన్నతనములో, మిలట్రీ నుండే రోజుల్లో ఈ పాటలు రికార్డింగ్ వినేవారు. ఈరోజున..మీ చానల్ పుణ్యమా అని .. చాలా చాలా హృద్యంగా యున్నది. Congratulations to all the Channel Staff & SPL thanks to the Management.. Rammurty Indian Army RTD.

  • @subbamambasharma6864
    @subbamambasharma6864 28 дней назад +2

    ఇంత మంచి పాటలు ఆణిముత్యాలు అలాంటి పాటలు మనకు అందించినటువంటి లీలమ్మ గారికి పాదాభివందనాలు అలాగే ఇలాంటి పాటలు ఏరి కోరి కూర్చి మనకు అందించిన ఛానల్ వారికి ధన్యవాదాలు నా చిన్న వయసులో రేడియోలలో ఈ పాటలు వింటూ ఆనందాన్ని పొందుతూ ఉండేవాళ్ళు ఉండేవాళ్లం అంటే నా 45వ ఏట తిరిగి ఇప్పుడు ఇలాంటి పాటలు లభ్యం కావడం మన అదృష్టం ప్రొద్దుటూరు నుంచి జీవకళ ధనుంజయ శర్మ

  • @vqragantiramesh2889
    @vqragantiramesh2889 8 месяцев назад +12

    మధురమైన ఆ పాత పాటలు వింటూ వింటే మా చిన్నప్పుటి ఆట పాటలతో ఆడుతున్న సంగతులు గుర్తుకొచ్చి కన్నీళ్ళు వస్తుంది

  • @sureshbabuvadlamudi5810
    @sureshbabuvadlamudi5810 Год назад +20

    సడి చేయకే గాలి సడి చేయ బోకే
    ఎంత హాయి గొలిపే పాట ఈ రోజులలో మళ్ళీ వినగలమా అనుకునే వాడిని.ధన్యవాదాలు మీకు.

  • @bhakthavathsalamgoudgundra153
    @bhakthavathsalamgoudgundra153 3 года назад +66

    లీలమ్మ తల్లికి అంత పారవశ్యం గా కంచు కంఠము తో పాడగలిగే శక్తి ఆదేవుడు ఇచ్చా డంటే అది మన తెలుగు రాష్ట్రాలు చేసుకున్న అదృష్టమే

  • @madakajaganmohan6861
    @madakajaganmohan6861 9 месяцев назад +9

    నిండు పౌర్ణమి రోజున చల్లని వెన్నెలలో శయనించి కనులు మూసుకొని హాయిగా లీలమ్మ గారి పాటలు వింటుంటే జన్మధన్య మౌతుంది.

  • @laxmayyachetti557
    @laxmayyachetti557 2 месяца назад +1

    తెల్లవార వచ్చే తెలియక నా స్వామి పాట ❤నిద్దుర పోతున్న సంగీత కలని తట్టి లేపి నట్టుగా ఉంది

  • @ramakrishnaraoanasingaraju7240
    @ramakrishnaraoanasingaraju7240 3 года назад +42

    చాలా అద్భుత మైన పాటలు అందించారు. కృతజ్ఞతలు.

  • @mulupurunrao1
    @mulupurunrao1 2 года назад +21

    విలక్షణమైన గొంతు లీల గారిది . మధురమూ మార్ద వము కలబోత ! పంచామృతం లో తేనె లాగా మనసులో ఆ రుచి అలా ఉండిపోతుంది . ఘంటసాల గారు సరైన గొంతు కు సరైన సపోర్ట్ ఇచ్చారు .

  • @danielnagulapally9540
    @danielnagulapally9540 7 месяцев назад +6

    లీలమ్మ పాడిన అన్ని పాటలు హిట్
    అమ్మా లీల మ్మ నీ గానమృతముతో
    మాహృదయాలలో సదా జీవించి ఉన్నావు తల్లి

  • @rssamudrala
    @rssamudrala 2 месяца назад +1

    అలనాటి పాటలు వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుందండి.

  • @kumarsubraveti
    @kumarsubraveti 7 месяцев назад +14

    సుశీల, లీల, జిక్కి, ఘంటసాల.. వీళ్ళు ముగ్గురూ ఆ రోజుల్లో(అంటే 60 ఏండ్ల కిందటి మా చిన్ననాటి)తెలుగు సినిమాల్లోని పాటలకు జీవం పోసి, తెలుగుతనాన్ని చాటిచెప్పిన మహానుభావులు...

  • @sagabalithathaiah4256
    @sagabalithathaiah4256 7 месяцев назад +3

    లీలమ్మ గురించి ఎంత చెప్పుకున్న తక్కువ లీలమ్మ గొంతులో తేనె ఉన్నట్లు అంతలా ఉంటుంది ఆమెపాదాలకు శతకోటి వందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 7 месяцев назад +10

    ఈ పాత మధుర గీతాలను వినిపించిన గాన కోకిల లీల గారికి హృదయపూర్వక నమస్సుమాంజలను తెలియజేయుచున్నాను

  • @gudivadavenkatrao6842
    @gudivadavenkatrao6842 4 месяца назад +1

    పాత పాటలు అందించినందులకు ధన్యవాదాలు. లీలమ్మ గారికి నమస్సుమాంజలి.

  • @IkasavaRao
    @IkasavaRao 3 месяца назад +1

    ఇ ముత్యాలు హారం లాంటి పాటలు నేను రోజు వేసి ఆనందం న్గా ఫీల్ అవుతున్నాను థాంక్స్. కేశవరావు, జేయపూర్, ఒడిశా.

  • @HarishChanderSambeta
    @HarishChanderSambeta 3 месяца назад +1

    పి లీల గారూ మీకు దేవుడు చాలా మృదువైన కోమల మైన ఖంఠం ఇచ్చి నందుకు ఆ ఆది దేవునికి నా శతకోటి వందనాలు.

  • @nukz-fo8mi
    @nukz-fo8mi Год назад +8

    రచయిత భావాలు మరియు గాయకుడి మధురమైన గాత్రం రెండూ మెచ్చుకోవలసిన అవసరం ఉంది

  • @ChandraSekhar-z4j
    @ChandraSekhar-z4j 3 месяца назад +1

    పాటకు జీవం పోసిన మహాతల్లి 🙏
    మనసుకు హాయి గొలిపే అమృత భాండాగారం లీలమ్మ గారి గానము

  • @vizzisvlogs5695
    @vizzisvlogs5695 3 года назад +52

    🌱లీలమ్మ అందమైన పాటల పూదోటలో అమృత మకరందాన్ని ఆస్వాదించే అదృష్టం కలిగిన మన తెలుగువారందరూ అదృష్టవంతులు... లీలమ్మ స్వర మాధుర్యంతో మనసుకు కలిగే ప్రశాంతతని ఎన్ని కోట్లు ఇచ్చి కొనగలం...ఈ అందమైన పాటలన్నింటిని మీ పూతోటలో పొందికగా చేర్చినందుకు మీకు కృతజ్ఞతలు😊

  • @manoramanag9796
    @manoramanag9796 10 месяцев назад +9

    A Very good collection of old melodious songs of Leela.Super sir I am 76 still I am continuing to listen these songs .Thank you for your presentation.

  • @veerangulu
    @veerangulu 2 года назад +11

    రాజా మకుటము సినిమాలోని, జడిచేచేకే గాలి పాట చాలా మధురమైన స్వీట్ నెస్ ఉన్నదమ్మా, గాయనీ గాయకులు అందరూ మీ యొక్క స్వరముతో మమ్ములను ఆనందింప చేయుచున్న గాయని గాయకులకు మా ప్రణామములు, అమ్మ లీలమ్మ నీ గాత్రమువింటూ ఉంటే, మా మనసు మాత్రం ఎక్కడో ఆనంద లోకంలో విహరించినట్టుగా ఉంటూ ఉంటది ,ఎన్నటికీ మరచిపోలేని పాటలు ,

  • @mirzamohammadalibaigalibai4725
    @mirzamohammadalibaigalibai4725 3 года назад +75

    ఈ మధురమైన లీలమ్మగారి పాత పాటలను ఏరి కూర్చి జనులకు వినిపించాలని సంకల్పంతో ప్రయత్నం చేసిన వారి పాదాలకు నమస్కరించి వారికి నా కృతజ్ఞత తెలుపు కుంటున్ననాను. ఎక్కడికో తెలియని లోక వివాహారం చేశాను.చాలా మంచి ప్రయత్నం! మన సంగీత సాహిత్య సౌరభాలు నేటి జనానికి తెలువాలి. తెలుగువారి తడాఖా!

    • @venkateswarluch8199
      @venkateswarluch8199 3 года назад +4

      🙏🙏🙏🙏🙏తమరి వర్ణన అద్భుతం సార్ 🙏🙏🙏🙏🙏

    • @padmaayyala6709
      @padmaayyala6709 3 года назад +5

      అవునండీ నిజమే చాలా చక్కగా వివరించారు,👌

    • @mirzamohammadalibaigalibai4725
      @mirzamohammadalibaigalibai4725 3 года назад +10

      అయ్యల పద్మగారికి ధన్యవాదాలు. పి. లీల గారి పాటలు మెచ్చుకున్నండుకు. నా సలహా ముఖ్యంగా ముసలి రిటైర్ అయిన వాళ్లకు ఏ మంటే మన దేశ శాస్త్రీయ సంగీతం వింటే మన ఆరోగ్యం బాగుంటుంది ఆయుష్షు పెరుగుతుంది. ఎ లాంటి చెడు ఆలోచనలు దరిచేరవు ప్రశాంతంగా నిదుర పోగల్గుతాము. మన పూర్వీకులు మనకు ప్రసాదించిన వరం.దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అనేదే నా తపన!

    • @naren.k2382
      @naren.k2382 3 года назад

      @@mirzamohammadalibaigalibai4725 చక్కగా చెప్పారు 👌👏🏽👏🏼

    • @dasaradharamireddychevuru2949
      @dasaradharamireddychevuru2949 Год назад

      Evergreen songs by LEELA AMMA.

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 3 года назад +21

    మరపురాని మధురగీతం లీలమ్మ కంఠంలో ఒదిగిపోతుంది ఏపాటయినా
    మధురమైన జ్ఞాపకాలు❣️❣️❣️

  • @sailajaupadrasta8093
    @sailajaupadrasta8093 3 месяца назад +1

    నిష్కల్మషమైన సాహిత్యం , మనుషుల మనసులు, అద్భుతమైన కలయిక. ఆ లోకం లోకి తీసుకొని వెళ్ళారు. కృతజ్ఞతలు.

  • @krishnareddy6346
    @krishnareddy6346 2 года назад +23

    చెవుల్లో అమృతం పోసినట్లు వుంది, ఈ పాత పాటలు వింటుంటే. గాన కోకిల లీల అమ్మ 👏👏👏👌👌👌

  • @b.knagarajarao8960
    @b.knagarajarao8960 3 года назад +14

    ఇలాంటి మంచి పాటలు విని పించినందులకు
    ధన్యవాదములు. !!!!

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 года назад +19

    చాలా మంచి పాత పాటలు లీల గారి వి వింటుంటే మనసు మనసులో లేదు అందుకే అంటారు పాత చిత్రాలు స్వర్ణ యుగం అని ఇలాంటి పాత పాటలు మరి ఒకటి చెయ్యండి

  • @raghuramracherla7506
    @raghuramracherla7506 2 года назад +27

    ఓహో మేఘమాల చల్లగరావేలా, అందమే ఆనందం...ఆహా ఎంతచక్కని పాటలు ఎన్నిసార్లు విన్నా తనివితీరదు కదా. మాచిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. మధురానుభూతి లీలమ్మ గాణమృతం❤🎉🎉

  • @hanumanthraomajety6500
    @hanumanthraomajety6500 3 месяца назад +1

    Super fantastic songs sung by Smt P .Leela garu evergreen songs unforgettable sweet voice songs. Thanks for reminding me on You Tube channel.

  • @bitlasridhar260
    @bitlasridhar260 Год назад +7

    అమ్మ ఎంత హాయిగా ఉందొ
    మా అమ్మ పాడి నట్టు
    ధన్యవాదాలు తల్లి

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 5 месяцев назад +1

    చాలా చక్కనైన పాట పాటలు వినిపించినందుకు, పాడిన లీలమ్మ గారికి, వేరే వేల వేల నమస్కారా లు తెలియజేయుచు, ఇటువంటి చక్కనైన పాటలు వినిపించిన, వీడియో వారి కూడా ధన్యవాదాలు తెలియజేయుచున్నాము.

  • @rohitrudrapu6729
    @rohitrudrapu6729 3 года назад +19

    A.v.r.murthy, madinaguda, Hyderabad
    ఈ పాటల్లో సంగీతం, సాహిత్యం,గానం ఎంతో
    మధురం గా ఉన్నాయి.

  • @dasaradharamireddychevuru2949
    @dasaradharamireddychevuru2949 8 месяцев назад +3

    ఈ పాటౌ అద్భుతంగా పాడిన లీల గారికి నా నమస్కారాలు.

  • @cvenkat7766
    @cvenkat7766 3 года назад +104

    అమ్మా ! లీలమ్మ ! నువ్వు పుట్టింది మళయాళ రాష్ట్రం. నీ కమ్మటి పాట‌లతో మా తెలుగు వారిని అలరింపచేశావు. నువ్వు ధన్యురాలవు తల్లీ !

    • @Ramteja98
      @Ramteja98 3 года назад +7

      Mee patalu vinenduku memantha petti puttamu. Memu dhanyulamu

    • @naren.k2382
      @naren.k2382 3 года назад +6

      నిజం చెప్పారు 👌👏🏽👏🏼

    • @prabhavathiayenala4722
      @prabhavathiayenala4722 3 года назад +6

      జన్మ తరించిపోయే పాటలు పాడిన బంగారుతల్లి లీల గార్కి ప్రభావతి నమస్కారములు

    • @kasturilakshmi4794
      @kasturilakshmi4794 3 года назад +3

      @@Ramteja98 🌹

    • @tirupathiraonarsipuram8464
      @tirupathiraonarsipuram8464 3 года назад +2

      @@naren.k2382 l0
      00

  • @IkasavaRao
    @IkasavaRao 4 месяца назад +2

    మురళీగారు, లీలగారు పాటలు అప్పుడు వినాలి లని, నేనురోజు ఉదయాన్ని ఆలకిస్తాను. ఎ న్నిసారులు విన్న ఆలకించాలనివుంటుంది. వెరీ స్వీట్ టోన్. కేశవరావు, జేయపూర్, ఒడిశా.

  • @savitriy2682
    @savitriy2682 3 года назад +27

    హృదయంలోనుండి బాధను అమాంతం తీసివేయగల మధుర గానం. లీల గారు తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర తెలుగులో ఉంది. హృదయానికి భాషతో ప్రాంతంతో పని ఏముంది. నిజంగా వసంత గానం 🙏🙏🙏

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 3 года назад +32

    ఆనాటి సంగీత సాహిత్యాలకు అనుగుణంగా తన స్వర మాధుర్యంతో ఎన్నో అద్భుతమైన అపురూపమైన పాటలను పాడిన పోరయత్ లీల గారు. చిరస్మరణీయులు

  • @jsp2083
    @jsp2083 3 года назад +20

    తెలుగు సినిమా అనే చంద్రహారం లో పొదిగిన వజ్ర వైడూర్యాలు ఈ
    పాటలు...
    ఆ చంద్రిహారం ఎక్కడో లేదు..
    అద్భుత గాయని లీల గారి
    మెడలోనే ఉంది...

    • @sarmakameshwar9085
      @sarmakameshwar9085 2 года назад

      మెడలోనే కన్నా గళములో బాగుంటుందేమో. హరే కృష్ణ.

  • @marlagopalakrishna4623
    @marlagopalakrishna4623 3 года назад +57

    ఆ గొంతులోని మాధుర్యం ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని ఉంటుంది.. లీలమ్మను మరచిపోలేం.

  • @meenugakaveridevadas4660
    @meenugakaveridevadas4660 3 месяца назад +1

    No.words.to.praise.Leelammagarini.back.tomy.child.hood.tq.

  • @prasadarao6833
    @prasadarao6833 3 года назад +28

    అమృత తుల్యమైన పాటలు వినిపించారు.
    ధన్యవాదాలు.

    • @vijaylakkavatri2822
      @vijaylakkavatri2822 3 года назад

      Leela amma gaariki na shathakoti namaskaaramulu.
      Lakkavatri.Vijay. Maram pally.

  • @RaviShankar-ss3ii
    @RaviShankar-ss3ii 3 года назад +12

    అమృత ప్రాయమైన పాటలనందించారు...ధన్యవాదాలు..!🙏

  • @srirangaswamythirukovaluru6944
    @srirangaswamythirukovaluru6944 3 года назад +14

    మధురమైన పాటలను అందించారు. వీటిని భద్రపరచుకుందామని ఉంది

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 3 месяца назад +1

    What great olden days those were with greatest human beings like Karana janmudu Sri Ghanta sala garu,Madhava peddi Satyam garu,pithapuram garu,madam Leela garu,Suseela garu,Jikki garu,Janaki garu,L.R Eswari garu and other lady Singers of those Old Golden Days.In the modern days it is not possiable to produce these kind of Greatest personalities.Of course only the older generation of people know the greatness of those Legendry Personalities and can really enjoy Whole heartedly there voice.

  • @satyanarayana4035
    @satyanarayana4035 3 года назад +24

    తీయని ఊహలు, వసంత వీచికలు,ఈ పాటలు. ఎంచుకున్న తీరు చాలా బాగుంది. వందనాలు.

  • @goduguravishankar5837
    @goduguravishankar5837 3 года назад +7

    ఎంత చక్కటి మాధుర్యం తో గా నం , సంగీతం ఎదో తెలియని లోకానికి వెళ్లిన అనుభూతి కలిగింది
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramaprasad8036
    @ramaprasad8036 2 года назад +10

    తెల్ల వారక ముందే...... ఆహా పాటకు ప్రాణం పోయటం అంటే ఇదే. శ్రీమతి లీలమ్మ పాటకు ప్రాణం పోసేరు. she is legend.

  • @bharathibudati7330
    @bharathibudati7330 3 года назад +14

    అమ్మ నీ గాత్రంతో చాలా సంతోషంగా ఉంది అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @asailaja5137
    @asailaja5137 2 года назад +24

    అద్భుతమైన పాటలు... Collection Super... ఇది పాత పాటల బుట్ట కాదండీ మాకు మీరు అందిస్తున్న మధురపాటల తేనెపట్టు... దీని వెనుక ఉన్న ప్రతివ్యక్తి శ్రమ ఒక్కో తేనెటీగ ఎంత శ్రమ పడి తేనెని సమకూరుస్తుందో అంతటి కష్టం... మురళి గారూ.. మీకు, మీ బృందానికి ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

    • @jashuvad8041
      @jashuvad8041 Год назад

      Beautiful and sweet and golden songs. We are soooo thankful to you. Keep continue such heart touching songs.

  • @rajannayarappagowda5739
    @rajannayarappagowda5739 2 года назад +4

    I am very thankful to you tube for displaying such valuable songs and cinemas.

  • @venuvenuvenuvenu4318
    @venuvenuvenuvenu4318 3 года назад +7

    ఎంత గొప్ప పాటలు. మళ్ళీ, మళ్ళీ, వినాలని, అందరికి వినిపించిన మీకు, నా 🙏🙏🙏.

  • @venkataramanan3538
    @venkataramanan3538 3 года назад +15

    Dhanyulamu Swamyji. Oho! WOW these songs....No words sir/Madam🙏

    • @abbugadu
      @abbugadu 3 года назад

      Super songs of p Leela in the Telugu cinema music world. K S L Prasad.

    • @abbugadu
      @abbugadu 3 года назад

      🙏🙏🙏

  • @ramadevinandanavanam7467
    @ramadevinandanavanam7467 Год назад +1

    Old songs vinetemanasu ekkadiko velutundi Leela samrajyam garisongs superb mny more tanks sirs

  • @rambrathi1312
    @rambrathi1312 3 года назад +8

    సార్.... చాలా కాలం గా..ఎదురు చూస్తున్న నాకు..చాలా సంతోషంగా ఉంది.ఏనాటి పాటలు, మరియూ..నాటి రంగస్థలం లోని పద్యరాజములు.. ఎన్నో అమూల్యమైన పద్యంలు వినిపించిన...మీ చానల్ వారికీ, ముఖ్యం గా మేనేజ్ మెంట్ వారికి.. శుభాభినందనలు. We wish you all the Best. Pl keep it up. Congrats. All the Best. Rammurty Indian Army RTD

  • @manoharnayani6292
    @manoharnayani6292 3 года назад +8

    🙏🙏🙏 ఆహా...అమృత గుళికలు లాంటి గీతాలు.

  • @chalapathikr1042
    @chalapathikr1042 6 месяцев назад +1

    Eelanti patalu vintuvunte yentho hayiga untundhi chala thanks

  • @bvenkatasubbaiah2384
    @bvenkatasubbaiah2384 Год назад +1

    Chala manchi patalu vinipinchi nanduku..thanks

  • @anithakonreddy4698
    @anithakonreddy4698 3 года назад +41

    మధుర గాత్రం నుంచి జాలు వారిన
    అమృతపు జల్లులు
    వింటూ ఉంటే మనసున కలిగే ఆనందానికి
    లేవు కదా ఎల్లలు

  • @guglavathgangaram3078
    @guglavathgangaram3078 3 года назад +27

    బంగారు తల్లి సరిగమల సరస్వతి ఈ కలప వల్లి లిలకంఠలో స్వర పేటీ అమర్చి పంపరు బ్రహ్మ సరస్వతి దేవి ఈ కలియుగ నికీ ఎంత మధురం అ గానం ఎవరు ఆమెకు సాటి లెరుఎవ్వరు ఆమెకు పోటీ

  • @anon-kw9ku
    @anon-kw9ku 3 года назад +5

    We cannot expect such melodious songs and literature in telugu filmy field now a days hearty thanks to the old generation singers

  • @nagumantrikodandagnanadev3477
    @nagumantrikodandagnanadev3477 3 года назад +2

    లీల గారి స్వరం ఒకరకమయిన అనుభూతి కలిగిస్తుంది. మీ ప్రయత్నం అభినందనీయం. 🙏

  • @nadakuditiphaniprasanth1917
    @nadakuditiphaniprasanth1917 2 года назад +4

    చాలా పాత పాటలు సంగీత సాహిత్య విలువలు గల వేలాది పాటలు వెలుగులోకి తెస్తున్నారు అంతే కాకుండా వేలాది పాటలు ఎంతో కష్ట పడి రాసి సంగీతం కూర్పు చేసి రికార్డింగ్ చేసినవి సుమారుగా సుశీల గారివి వేలల్లో ఉన్నాయిట సినిమాలు రిలీజ్ కాకుండా ఉండిపోయాయి అవి కూడా వెలుగు చూడాలి.

  • @ramadevinandanavanam7467
    @ramadevinandanavanam7467 Год назад +1

    Chala manchi songs. Sing cheincharu thanks old memablesong v good

  • @vadisettyramarao2540
    @vadisettyramarao2540 3 года назад +11

    These sweetest Amrutha sudha jallulu awakened my teenage sweet memories ! Hats off P Leelamma 🙏

  • @nrusimha11
    @nrusimha11 2 года назад +3

    మంచి ముత్యాలు ఏరి కూర్చేరు, ధన్యవాదాలు!

  • @vnarasimharao1120
    @vnarasimharao1120 4 месяца назад +1

    What a graceful singer! Fantastic

  • @umaboyana6104
    @umaboyana6104 2 года назад +3

    very sweet & always full of melody P. Leela garu voice. l had a chance to meet her at Prashanti nilayam Puttaparthi.During Dusehra holidays she visited along with P. Suseela & she had given solo classical performance which brought rain & many had to run for shelter.The way she sang was so sweet superb with swaranjali continuously nonstop due to which we felt that it was raining.Heavenly feeling with Sai in Joola & P. leelagaru's performance. Now a days we cannot find such top artists.
    ii

  • @laxmareddylekkala5155
    @laxmareddylekkala5155 3 года назад +11

    It’s amazing it’s wonderful songs all time evergreen now days where this type of songs and music it’s superb old is gold proved again and again it’s really tremendous wonderful Telugu literature thanks to all of coordinators 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏

  • @nag9700
    @nag9700 3 года назад +25

    "అమృతం" ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు "లీలమ్మ" గారి పాటలు వింటే చాలు 🙏🙏🌷⚘🌹🌺☘🌿🌴

    • @krishnakanthkk6375
      @krishnakanthkk6375 3 года назад +2

      K. KrishnaPrasad. Manikonda. Hyderabad.
      Very well said brother. We are lucky enough to have such a great singer. They are GODs Gift to us.
      28.3.2021.

    • @nag9700
      @nag9700 3 года назад

      @@krishnakanthkk6375 🙏

  • @kamalakamala2338
    @kamalakamala2338 Год назад +1

    అద్భుతము అతిమధురమైన మనోహర గీతములను అందిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదములు మురళి గారు.

  • @anjaiahkandula7538
    @anjaiahkandula7538 Год назад +2

    Leelamma gari gatram amrutham. Vaari janma danyam🙏🙏🙏🙏🙏

  • @meenugakaveridevadas4660
    @meenugakaveridevadas4660 Год назад +1

    No.words.to.comment..leela.gari.patalu..

  • @mandepudilaxmaiah1660
    @mandepudilaxmaiah1660 2 года назад +1

    హాయి గొలిపే మధురమైన అలనాటి లీల గారి పాటల అమ్రృత ఝరి ఇష్టపడని పాత తరం తెలుగు వారు లేరంటే అతిశయం కాదేమో!

  • @thirupaluyadav2395
    @thirupaluyadav2395 3 года назад +17

    Excellent songs verybeatiful old is gold

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 года назад +1

    ఈ విడియోలోని పాటలు పి.లీల గారలు
    చక్కని రచన సంగీతం సాహిత్యం సహకారం
    తో మధురంగా వినసొంపుగా పాడినారు.
    పాత స్మృతులు పులకింపు చేయునవి.

  • @vasundharakatikaneni4973
    @vasundharakatikaneni4973 2 года назад

    P.Leela Gari patalu Vintunte manasuku haiga anandanga untunnadi many many thanks

  • @nagabhushana1150
    @nagabhushana1150 3 года назад +7

    One of the best albums in Telugu with the melodious voice of smt. Lela .

  • @padmaadiraj8598
    @padmaadiraj8598 3 года назад +2

    అద్భుతమైన పాటలు వినిపించి నారు. 🙏

  • @kameswararaojalla7757
    @kameswararaojalla7757 3 года назад +7

    Leala Amma gariki naa padhabhi vandanam

  • @murthys.s.n.1641
    @murthys.s.n.1641 3 года назад +6

    Superb songs and superb effort by Raparti garu with high quality of audio! Many thanks.

  • @jaisri3144
    @jaisri3144 2 года назад +1

    Kalanayinaa nee thalape... Sadiseyakogaali.. Songs my favourite songs

  • @chandramouliallanki4526
    @chandramouliallanki4526 2 года назад +1

    మీ పాటల సేకరణ...intrest... super..,

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 2 года назад +4

    Beautiful and sweet voice of leelamma. Some thing special in her tone including Carnatic classical and janapadam mix.

  • @girijanco-opmarketingsocie8161
    @girijanco-opmarketingsocie8161 2 года назад +7

    చాలా మంచి పాత పాటలు లీల గారి వి వింటుంటే మనసు మనసులో లేదు అందుకే అంటారు పాత చిత్రాలు స్వర్ణ యుగం

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 2 года назад +2

    Great leelamma garu. Excellent songs. Singer voice is primary, music is secondary. That is the beauty of old songs. Crystal clear voice with all words are heard. Lyrics, music director and singer are great. Very very rare in present songs.

  • @బాలు-తెలుగుపాటలు

    ఆ గానం అమృతం ఆ పాట మధురం లీలమ్మ నీకు💐

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy5294 3 года назад +5

    Lyrics melody modulation music situation artistic acting all in perfect mix hence eternal evergreen

  • @ramkishore4393
    @ramkishore4393 2 года назад +2

    ప్రతి పాట ఆపాత మధురం. అమృత గుళికలు.🙏

  • @jyothijason9979
    @jyothijason9979 3 года назад +1

    అందియ రవళి , చిరు మువ్వల సమ్మేళన లే ఆమె గాత్రం!

  • @alurisreedhar9834
    @alurisreedhar9834 2 года назад

    Leela amma gurinchi cheppe arhatha kuda naku ledu…no words 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎸🎻🎻🎹mahathalli malle puttali 🙏🏻

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 2 года назад

    చాలా చాలా అద్భుతంగా ఉన్నది మీ coment ఇలాంటి పాటలు sarvaroganivarini టీకా ఇప్పటి పాటలు వింటే అన్ని రోగాలు వస్తాయి

  • @gstsayi4413
    @gstsayi4413 3 года назад +27

    'పాత పాటల పల్లకి' అంటె బాగుంటుందేమో! అంత మంచి మంచి పాటలు మరి!

  • @vaddireddyobulreddy1551
    @vaddireddyobulreddy1551 3 года назад +3

    మహాగాయనికి. శతాధికవందనములు.

  • @bsatyasrinivas8050
    @bsatyasrinivas8050 2 года назад +2

    Excellent collection of P Leela memorable unique voice

  • @rameshnarayanapathiki4984
    @rameshnarayanapathiki4984 2 года назад +2

    Beautiful and amazing collection of Smt. P Leela songs..... A rare and memorable treat...... Congratulations 🌹🌹🌹🌹🌹

  • @uppalapativenkatarathnam5381
    @uppalapativenkatarathnam5381 3 года назад

    అమృతం ఆ గానం, గ్రోలిన వారంతా అమరులే... లీలమ్మ ఇచ్చిన అమృత కలశం లోని బిందువులు మనకు...

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 3 года назад +1

    P leela garu meeku dannyavadamulu namaskaaramulu paddbhivandanamulu jay sairama 🙏🙏👏👏🕉️🕉️🔱🔱🌹🌹🌷🌷

  • @babaprasadmachiraju3580
    @babaprasadmachiraju3580 9 месяцев назад

    We are very lucky because Amma Leela has given beautiful songs to our telugu prople

  • @kurnoolkeerthissangeethavi7841
    @kurnoolkeerthissangeethavi7841 Год назад +1

    ఆనందామ్రుతం కర్ణములకు అందించిన ఘనత మీకే