నాకు గుర్తింపు కన్నా, జనం అభిమానం గొప్పది.. Vaddadi Papaiah Arts & Paintings | Surya Toons

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 138

  • @VijayKumar-ks4tk
    @VijayKumar-ks4tk 2 дня назад +24

    నాకు 62 సం,లు. నా చిన్నతనము నుండి చందమామ, బొమ్మరిల్లు, యువ, కథలు వడ్డాది గారి బొమ్మలు చూస్తూ పెరిగాను. మంచి ప్రయత్నం చేశారు. కానీ ఇంక ఎంతో చెప్పవలసి వుంది. అసంపూర్తిగా వుంది. పూర్తిగా
    స్టడీ చేసి వీడియో చేసి వుంటే ఎంతో
    బాగుండేది అని నా అభిప్రాయం.
    మంచి ప్రయత్నం చేశారు. ధన్యవాదాలు.

  • @KarremSrinivasarao
    @KarremSrinivasarao 23 часа назад +4

    వడ్డాది పాపయ్య గారు గొప్ప చిత్రకారకుడు.వారుగీసినచిత్రాలు గొప్పకళాఖండాలు.

  • @venumamuduri5973
    @venumamuduri5973 2 дня назад +9

    వపా గారి గురించి ఇంత విపులంగా వివరించిన యాంకర్
    గారికి అభినందనలు

  • @Pulihara
    @Pulihara 2 дня назад +17

    సంతకం అక్కర్లేని చిత్రకారుడు. కనుల సౌందర్యం మహా గొప్పగా ఉంటుంది, గురువుగారి paintings లో. అప్పటి యువ మాసపత్రికలో వీరి చిత్రాలు విరివిగా వచ్చేవి. స్వాతి పత్రికలొ కూడా కొన్ని చూసాను.

  • @3ram3k82
    @3ram3k82 2 дня назад +15

    చాలా గొప్ప చిత్రకారుడు,చాల అందంగా గీస్తారు.చాల దైవమూర్తుల చిత్రాలు అతను గీసినవే

  • @Lobster16763
    @Lobster16763 День назад +4

    బాపు, వపా గార్లు ఆ కళామతల్లి మనపై ఎంతో వాత్సల్యంతో ఇచ్చిన వరాలు. ఏ మగవాడైనా వపా గారి బొమ్మలాంటి స్త్రీ భార్యగా వస్తే బావుణ్ణు అనుకోవడం అత్యాశే అయినా అదొక తియ్యని కోరిక. రంగుల మనసున్న ప్రతీ ఆంధ్రుడి హక్కు. జై శ్రీరాం.🌹🌿

  • @rammohanraj5750
    @rammohanraj5750 2 дня назад +10

    Wonderful Wonderful a great artist oka dhanya jeevi Vapa garu, భగవంతుని అనుగ్రహం తో జన్మనిచ్చే ధన్యజీవులు వాపా గారు 🙏🙏

  • @rajkumaryata9996
    @rajkumaryata9996 День назад +6

    నేను చిన్నప్పుడు చూసిన వడ్డాది పాపయ్య గారి చిత్రాలు ఇప్పుడు వీడియో ద్వారా చూపెట్టినoదుకు చాలా థాంక్స్ 🎉

  • @chandrashekharummettala6757
    @chandrashekharummettala6757 2 дня назад +16

    గానం లో ఘంటసాల గారంటే నాకు ఎంత ప్రీతి, అభిమానమో, చిత్రాలంటే వడ్డది పాపయ్య గారు. నేను అలా తదేకంగా చూస్తూవుండిపోయిన ఆయన చిత్రాలు ఎన్నో. జీవం ఉట్టి పడేలా, సందర్భానికి అంత్యంత సమీపంగా, చిత్రానికి సంభందించిన ఏ విషయం లోపం లేకుండా, భావాలు ఆయన చూపేవారు. కారణ జన్ములకే ఇది సాధ్యం. లేదంటే ఇన్ని వేల హృదయాలలో స్థానం - అదికూడా పదిలంగా శాశ్వతంగా సంపాదించారు అంటే మాటలా? ప్రచారాలకు దూరంగ ఉన్నారు కాబట్టే కళకు ప్రాణం పోశారు. గుర్తింపు పై యావ లేని ఎందరో మహనుభావులలో వీరు ఒక్కరు. నిజంగా తెలుగువారు గర్వించ దగ్గ కళాకారుడు. ఏది శాశ్వతం కాదు......పది మందికి జ్ఞాపకం ఉండే మంచి పని తప్ప అనే విషయం వీరి జీవిత సందేశం !

    • @DrB.SuriBabu
      @DrB.SuriBabu День назад +1

      I am waiting since a very long time an article on the great artist Late Sri Vaddadi Papayya,Thank you very much for your article on this great artist in your channel, Wonderful arts were published in Yuva monthly Deepavali special issues.🎉🎉

  • @madhuakkinepally6290
    @madhuakkinepally6290 2 дня назад +17

    చంధ మామ,బాలమిత్ర లోనిచిత్రాలు వడ్డాది పాపయ్య గారు.great Legend

  • @jyothijo2964
    @jyothijo2964 2 дня назад +12

    నా జీవితం మొత్తం లో నాకు నా బాల్యం అంటే ఇష్టం...
    బాలు గారి గళం నుంచి జాలువారిన పాటలన్నా
    వడ్డాది పాపయ్య గారి కుంచె నుంచి రూపు దిద్దుకున్న అపురూప చిత్రాలన్నా ప్రాణం ❤❤❤❤❤❤❤❤

  • @gbr9615
    @gbr9615 2 дня назад +12

    కీ. శే వడ్డాది పాపయ్య గారు అసమాన్య చిత్రకారుడు. తెలుగు వారు గర్వించదగ్గ మహోన్నత కళాకారుడు. వారికీర్తి శాశ్వతం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajghopall9588
    @rajghopall9588 День назад +3

    అపురూప చిత్రకారులు శ్రీ వడ్డాది పాపయ్య గారికి ఘనమైన నివాళి అర్పించారు!!!

  • @Ravindranath-i5o
    @Ravindranath-i5o 2 дня назад +5

    💐 వడ్డాది పాపయ్య గారికి నమఃసుమాంజలి. 🙏

  • @lakshmanaraoavala4636
    @lakshmanaraoavala4636 23 часа назад +2

    🙏🙏🙏🙏 యువ, స్వాతి, చందమామ. బుక్స్ ప్రసిద్ధికి కారణం వాపా గారు.....❤❤❤

  • @naadinarayna8644
    @naadinarayna8644 3 дня назад +13

    చిన్నప్పటి చిత్రాల జ్ఞాపకాలు.. అందించినందుకు మీకు ధన్యవాదములు

  • @suryaprakashpedapati1661
    @suryaprakashpedapati1661 День назад +5

    వృధా జలపాతం అత్యుత్తమ అద్భుతం వపా గారి బ్రష్ నుండి జాలువారిన సృష్టి. ఇంక మాటల్లేవ్...

  • @nageshkodukula3952
    @nageshkodukula3952 2 дня назад +25

    వడ్డాది పాపయ్య గారు మా వూరి లొనె,కశింకోట లోనె వుండెవారు ఆ మహనుభావుడిని నేను చాల సార్లు చూసెవాడిని. ఆయన 16 ఏళ్ల వయసులో ఆయన 60 ఏళ్లు అప్పుడు ఎలా వుంటాడొ గీసిన ఆయన బొమ్మ ఒక అద్భుతం

    • @krishnarao4769
      @krishnarao4769 2 дня назад +3

      చాల ధన్యులు మీరు 🙏

    • @sriharirao1487
      @sriharirao1487 2 дня назад +3

      Great Artist andi.SRIHARI

    • @sugunaseereddi9748
      @sugunaseereddi9748 2 дня назад +3

      మా అమ్మమ్మ వూరు khasimkota.vaddadi పాపయ్య గారు di కూడా kasimkota ani telisina తరువాత maaku aanandamu kaligindi🙏

    • @ramanamurthyburra9570
      @ramanamurthyburra9570 2 дня назад +2

      అద్భుత చిత్రకారుడు 🎉🎉🎉

    • @mallikharjuanaraovedula9466
      @mallikharjuanaraovedula9466 2 дня назад +1

      Maa Vooru Koodaa Kasimkota. Nenu Vaddadi Paapayya garini Choodaleykapoyanu ! Chandamama Patrika lo Paapayya gari Chitralu Chusi Anandincheyvadini . Kasimkota Librery lo. In 1977.

  • @saikumartalari9312
    @saikumartalari9312 2 дня назад +11

    ఆయనకు పద్మ శీరి ఇపటికైన ఇవాలి ఇ విషయము ప్రభుత్వ దృసిటికి ఎవరైన తిసుకు పొవాలి

  • @srinivasthadagonda9658
    @srinivasthadagonda9658 2 дня назад +5

    వడ్డాది పాపయ్య గారికి వందనాలు 🎉🎉🎉

  • @muralij5826
    @muralij5826 2 дня назад +6

    These paintings are I seen
    From my child would story magajins cover n lots of Books he is very great Artist

  • @madhumurthykv2455
    @madhumurthykv2455 День назад +2

    వపా గారి చిత్రాలు చాలా రోజుల తర్వాత చూపించారు! నెనర్లు!

  • @subbareddydunutala5992
    @subbareddydunutala5992 2 дня назад +12

    యువ దీపావళి మాసపత్రిక లో బావ వచ్చే దా రి వృధా జలపాతం నాకు నచ్చిన చిత్రాలు

  • @muralij5826
    @muralij5826 2 дня назад +5

    I Recollect my child would days with this video my heart
    full thanks to creter of this video

  • @satya1852
    @satya1852 2 дня назад +3

    He has come from heaven. Telugu people are lucky and proud to have such a great artist from AP. Good to publish a book of all his paintings

  • @Lobster16763
    @Lobster16763 День назад +3

    వపా గారి చిత్రాలు ఇంత బాగా ఉంటాయి, అంత బాగా ఉంటాయి, ఆహా ఓహో - ఇదేగా మీరు చెప్పింది! ఇదెవరికి తెలీదని? మీరు ఆయన జీవిత చరిత్ర చెప్తారనుకుని వీడియో మొత్తం చూసాను. అంతా సొల్లు వాగుడే. సబ్జెక్ట్ లేకుండా వీడియో భలే చేసారండీ, సు ఉ ఊపర్.👌🏼

  • @penchaladas
    @penchaladas 2 дня назад +8

    ఒక దశాబ్దం కాదు తల్లీ!
    అర్ధ శతాబ్దంపైనే ఆ మహా కళాకారులు వ పా తన కుంచె వర్ణ సమ్మేళనం తో కళా పిపాసులను అలరించిన చిత్ర కళా తపస్వి 🙏

  • @edlamahender3503
    @edlamahender3503 День назад +3

    V P garu great artist 👏👏

  • @adilakshmiguruvugari8498
    @adilakshmiguruvugari8498 День назад +2

    My favoeite artist. He brings out naturally the feelings in his portraits. 🙏🙏🙏 My regards towards him is not countable.

  • @venkatareddyjanga7933
    @venkatareddyjanga7933 2 дня назад +7

    Oka Ravivarma oka Vaddadipapayya oka Bapu

  • @KLBSMSAP
    @KLBSMSAP День назад +2

    Great talented artist. I have liked his paintings since my childhood days. His paintings are inspiration to artists of all time.👃👃

  • @rajusiriki3791
    @rajusiriki3791 2 дня назад +3

    చాలా మంచి ఎపిసోడ్ థాంక్స్ 👌👌👌👌🙏

  • @ammulupeddu2866
    @ammulupeddu2866 День назад +2

    మంచి video వాపా గారిది

  • @raghavareddygundam528
    @raghavareddygundam528 День назад +2

    Thanks to the organisers of this video,who gave us thisopportunity reminding the artist,thanks toorganisers

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 День назад +3

    ఆ జనరేషన్ లోని అందరూ అయనకి అభిమానులే

    • @sudarsanaraokomma9244
      @sudarsanaraokomma9244 День назад

      నేనూ వడ్డాది పాపయ్య అభిమానినే 🙏🌹!

  • @btrinath9172
    @btrinath9172 2 дня назад +4

    Thank you very much for this video.

  • @girivenkataratnam336
    @girivenkataratnam336 День назад +5

    వడ్డాది వారు గీచినవి చిత్రాలు కాదు సజీవ శిల్పాలు. రోజూ లేవగానే వారి చిత్రాలు చూస్తే బాధలు బారెడు దూరం జరుగుతాయి. ఎక్కడో వున్న పికాసో ను గొప్పగా చెప్పుకొనే మనం మన ప్రక్కనే వున్న దామెర్ల, వడ్డాది, బాపు లను గుర్తించి సత్కరించి గౌరవించలెను దౌర్భాగ్యపు జీవితాలు మనవి. మనకు పొరుగింటి పుల్లకూర రుచి. మాతృభాషను మట్టిపాలుచేసి పరాయి భాషకు భవంతులు నిర్మించే జన్మ తెలుగు వారిది. ఎదుటివాడు గుర్తిస్తే తప్ప తమ విలువని గ్రహించలేని నికృష్ట బతుకులు తెలుగువారివి. వడ్డాది... అభినవ రవివర్మ. ఆయన రంగుల కళ అజరామరం. ఆకాశంలో "చందమామ"ను చూస్తే గుర్తు వచ్చేది ఆయనే!

    • @nootyramamohan2911
      @nootyramamohan2911 День назад

      Sir, what ever you observed is absolutely true. Those venerable artists are perhaps the best in their contemporary period. The Museum at Rajahmundry is standing proof. A similar Museum either at Vizag or at least at Srikakulam in honour of VAPA should be established for inspiring the future generation.-- Justice Nooty Ramamohana Rao, Former Judge, Madras High Court.

    • @lakshmanamurty1667
      @lakshmanamurty1667 День назад

      💯

  • @krishnarao4769
    @krishnarao4769 2 дня назад +6

    చాలా ధన్యులు మీరు🙏

    • @Sw.Ananda
      @Sw.Ananda 2 дня назад +1

      అలాంటి అరుదైన అద్భుత వ్యక్తులను సన్మానించి గౌరవించడం మనకు లేదు. We are
      Thank less people.

  • @raghavareddygundam528
    @raghavareddygundam528 День назад +1

    Ifelt very glad to see paintings once again,who does not know about vaddadi,it is showing the sun.all older generation needs no introduction about the great painter.any

  • @saradadevireddy
    @saradadevireddy 2 дня назад +2

    Some great talented artistes are confined to a region though deserve to be recognised at national level

  • @indirasubraveti
    @indirasubraveti 2 дня назад +3

    A very great artist to remember for ever.

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 3 дня назад +3

    Kuncha chetha pattukuni kuchagirulu diddutunte vapagaru vallumarachu purushulaku rommulunchu Ani evaro saradaga rasaru. Manchi artist.

  • @sriramulu.mayiladuthurai
    @sriramulu.mayiladuthurai День назад +3

    ❤Thank you verymuch. Good video 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Vvenkateshwararao
    @Vvenkateshwararao 2 дня назад +3

    Top class Artist. I feel he was not recognised, as much as he was deserved. But i love his art verymuch. He is my most favourite Artist.

  • @seragadamanandarao2604
    @seragadamanandarao2604 День назад +2

    A good programme..

  • @rajarao8720
    @rajarao8720 2 дня назад +2

    I love pappayya sir wonder artist

  • @sureshkumarpvs6342
    @sureshkumarpvs6342 День назад +2

    He deserves Bharatha Ratna because there is no equivalent for VAPA

  • @RAJABABU-mc8rm
    @RAJABABU-mc8rm 2 дня назад +3

    చందమామ మాసపత్రికకు చిత్ర, శంకర్ గార్లు గొప్ప చిత్రాలు వేసి మంత్ర ముగ్దుల్ని చేశారు. పాపయ్య గారు ముఖచిత్రానికి (front page) పంచరంగుల చిత్రాలు వేసేవారు.స్వర్గీయ బాపుగారు మరచిపోలేని తెలుగు చిత్రకారులు. వారిని కూడా పరిచయం చేయండి. అభినందనలు. 🎉

  • @subbareddydunutala5992
    @subbareddydunutala5992 2 дня назад +7

    నేను ఆయన చిత్రలకోసమే దీపావళి యువ కొనేవాడిని air ఇండియా logo ఎప్పటికి మరచి పోలేము ❤

  • @subbareddybomma4173
    @subbareddybomma4173 День назад +2

    దైవాంశసంభూతా పాపన్నా నీవు అమరుడవు.

  • @nanibabu1169
    @nanibabu1169 2 дня назад +7

    పాపయ్య గారికి ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే .ఆయన కళా నైపుణ్యాని కి ఎంత పోగిడినా తక్కువే .ఆయన బొమ్మలు చూసే పుస్తకాలు కొనే వాడిని .అవి చూసే నేను బొమ్మలు వేయడం నేర్చుకున్నాను . ఈయన అందాన్ని చూపిస్తే .బాపు గారు వ్యంగ్యాన్ని చూపించే వారు .వీరు మన తెలుగు వారు కావడం మన అదృష్టం .😂

  • @ravib185
    @ravib185 День назад +1

    Great man 🙏🙏🙏🙏🙏

  • @syam57
    @syam57 2 дня назад +3

    ఈయన చిత్రాలు చూస్తూ పెరిగాను. వీడియో సాంతం ఆయన చిత్రాలు చూడడం ఆనందమనిపించింది. కానీ ఇంకా ఆయన గురించి, పుట్టుక నుంచి అంతిమ యాత్ర వరకు ఇంకా విపులంగా చెప్పలేదన్న నిరాశ కలిగింది.

  • @artistandcreater
    @artistandcreater 2 дня назад +3

    Guruvulaku kalabhivandanamulu

  • @BCSPRASAD
    @BCSPRASAD 2 дня назад +4

    అనుకరించడానికి సాధ్యాపనిది వ.పా సాధించిన చిత్ర కళ. వీరి చిత్రాల ప్రదర్శన వివిధ నగరాల్లో యేర్పాటు చెయ్యాలి .

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf День назад +2

    పొలిటికల్ కార్టూన్స్ కూడా బాగా వేశారు

  • @SubhashMaganti-nr5lj
    @SubhashMaganti-nr5lj День назад +1

    మహనీయుడు 🌹🙏🙏🙏🙏🙏🌹

  • @ramaprasadmanda5169
    @ramaprasadmanda5169 2 дня назад +3

    "బాపు గారి బొమ్మలు మన డ్రాయింగ్ గదిలో పెట్టుకుంటాము;
    పాపయ్య గారి బొమ్మలు పూజామందిరంలో పెట్టుకోవాలి"

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm 2 дня назад +2

    Ee rakam ga evaru geeyaleru namaste 🙏 papayya garu :: emi andam na bhutho na bhavishyathi

  • @mohank838
    @mohank838 2 дня назад +1

    🙏🙏🙏very great

  • @ramadevisingaraju4935
    @ramadevisingaraju4935 2 дня назад +4

    Rare video 👌🏻

  • @sastryjvs8365
    @sastryjvs8365 День назад +3

    నా వయసు 74 నా చిన్నతనం లో చందమామ మాసపత్రిక లో వీరి బొమ్మలు తీపి గురుతులు కొన్ని ఇప్పటికి నాదగ్గర ఉన్నాయి.

  • @Sundarimbt
    @Sundarimbt 2 дня назад +3

    Nijame....maa.chinna tanam loo chandamaama Balamitra, meeda vaari chitralu cut chesi dachukunee vaallm.

  • @Chkeshwar
    @Chkeshwar День назад +2

    Vaddadhi gaaru Leonardo daavincy kanna naaku goppa kalaakaaridiga chinna thanam nundi aanandisthanu mainga chandamaama bhale mukhachithramga wah ,,,,anipisthundi pillalaku,pedhalaku eeeena tharvaathe Bapu gaari style

  • @vvk9862
    @vvk9862 День назад +1

    Good memories

  • @srisuryaa7361
    @srisuryaa7361 2 дня назад +2

    super good

  • @TheGiriganga
    @TheGiriganga 2 дня назад +6

    ఆంధ్రా రవివర్మ

    • @RAJABABU-mc8rm
      @RAJABABU-mc8rm 2 дня назад

      బాపు గారిని మర్చిపోయారు 😂

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 2 дня назад +2

    గొప్ప చిత్రకారుడు వడ్డాది పాపయ్య గారు ఈయన మావూరి పక్కనే ఉన్న కశింకోట లో స్థిరపడ్డారు నేను తాళ్ల పాలెంలో పుట్టి పెరిగాను

  • @koteswararaoparuchuri5705
    @koteswararaoparuchuri5705 День назад +1

    We used to draw his pictures which were on the back cover of yuva for our art class

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 День назад +1

    కీర్తి శేషులు శ్రీ వడ్డాది పాపయ్య గారి చిత్రాలు ఏంతో అచ్చెరువు గొల్పేవి. మమ్ములను ఏంతో మంత్రముగ్ధులను చేసేవి. అందరూ అడిగేది దేవుణ్ణి చూపమని. కానీ ఆ దైవశక్తి కి సాక్షీభూతంగా మనకు ముందుగా వెంటనే స్ఫురించేవి కోట్లాది మానవ ముఖ చిత్రాలు మరియు అనేక కళాత్మక రూపాలు. కేవలం కన్ను, ముక్కు, చెవి, నోరు వీటి సంయోగంతో ఆ దైవం ఎన్ని కోట్ల ముఖాలను నిత్యం రూపొందిస్తున్నాడో కదా ! అలాగే ఆ దైవశక్తి ఆయన కుంచెలో నిక్షిప్తమై అందరినీ ఎంతగానో అలరించింది. ఏదిఏమైనా ఆయన స్థాయికి తగిన గుర్తింపు ఆయనకు దక్కలేదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆయన చిరస్మరణీయుడు. 🙏🙏

  • @sudarsanaraokomma9244
    @sudarsanaraokomma9244 День назад +1

    ఈవీడియో అసంపూర్ణంగా ముగించారు?

  • @nootyramamohan2911
    @nootyramamohan2911 День назад +1

    It is no secret that some of the people in70s and 80s used to buy Swati magazine for the sake of VAPA’s paintings .

  • @KESHAVRAJGudipaty
    @KESHAVRAJGudipaty 2 дня назад +1

    Picasso is nothing when compared to great Artist Vaddadi Papayya garu

  • @venkateswarlumadhavarapu3377
    @venkateswarlumadhavarapu3377 2 дня назад +3

    వపాగారికి🙏

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 День назад +1

    Dear Madam,
    Jai Sri Ram !
    Late Sri Vaddadhi Paapayya gari Paintings are - MESMARIZING.
    I personally feel that you did not display his BEST Paintings.
    In any case, his Paintings are - Exciting, Thrilling, Impressive, Interesting, Inspiring, and ... and ... and ... Mesmerizing.
    When we look at his Paintings, we will FORGET the out side world.
    Aayana Kunche Ku KANIKATTU Thelusu.
    Thank you very much for your great services.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @ramaprasadmanda5169
    @ramaprasadmanda5169 2 дня назад +1

    శ్రీ వడ్డాది పాపయ్య గారు గీసిన ప్రతి గీతలో దైవత్వం కనిపిస్తుంది. శ్రీకాకుళంలో పుట్టి, అక్కడే తనువు చాలించిన చిత్రకళాతపస్వి. ఆయన కశింకోటలో నివసించేవారని తెలిసి, నేను బాధపడని రోజు లేదు - ఎందుకంటే - నేను విశాఖపట్నంలో వుండేవాడిని. ఆయన ఇంత దగ్గరగా వున్నారని తెలియదు - అంతే!
    ఎంత దురదృష్టవంతుడినో కదా - అనిపిస్తుంది.‌
    ఆయన చిత్రాలకు లక్షల సంఖ్యలో అభిమానులున్నా, వారు బ్రతికియుండగా ఆంధ్రులు వారిని సత్కరించుకున్న ఉదంతం లేనే లేదు. అర్థశతాబ్దిగా - ఆంధ్రులకు సినిమాలు తప్ప మరే కళల అవసరమే లేదు. అభిమానసంఘాల‌ గోల తప్ప, అసలైన పాపయ్య గారి వంటి కళాకారుల పట్ల ఆదరణే లేదు.‌
    పాపయ్య బొమ్మల అందమంతా వాటి కళ్ళలో, చేతి వ్రేళ్ళలో కనిపిస్తుంది. లక్షలమంది హృదయాలలో గల వివిధ దేవతారూపాల మూర్తులు శ్రీ పాపయ్య గారి చేతి చలవే! పాపయ్య గారి బొమ్మలలో ఔచిత్యం, నిష్పత్తి, వర్ణశోభ, సందర్భశుద్ధి, లాలిత్యం - మరెక్కడా కానరావు. అక్షరాలు రాని వాళ్ళకు కూడా, పాపయ్య గారి బొమ్మలు పురాణ పాత్రల గురించి చెపుతాయి.
    ఎంతోమంది చిత్రకారులతో పోలిస్తే పాపయ్య గారు ఆమడల ముందుంటారు.
    మనమందరం పూనుకొని, ఇప్పటికయినా శ్రీ పాపయ్య గారికొక 'పద్మ' పురస్కారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి, సాధిస్తే, మనకు తృప్తి, ఆయనకు నివాళి.

    • @satyamshrungavarapu3824
      @satyamshrungavarapu3824 2 дня назад

      అద్భుతః. ఇంత హృద్యంగా ఆ మహానుభావుని గురించి ఎవరు చెప్పలేరు. మీరు అత్యద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు. నిజమే, ఆ మహా కళాకారునికి పద్మ పురస్కారం ఇవ్వాలి. అలా చేస్తే మనల్ని మనమే గౌరవించుకున్నట్లే.

    • @VenkataRamanaVangipurapu-q2j
      @VenkataRamanaVangipurapu-q2j 2 дня назад

      అటు సున్నా, ఇటు సున్నా.........🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @aravindbandila3806
    @aravindbandila3806 День назад +1

    Tq vapa🎉

  • @srinivasaraokasi9688
    @srinivasaraokasi9688 2 дня назад +3

    వడ్డది పాపయ్య గారు రియల్ And నాచురల్ ఆర్టిస్ట్ And జూనియర్ రవి వర్మ

  • @krovvidinageswararao3115
    @krovvidinageswararao3115 2 дня назад +1

    Please say the history of papayyagaru.

  • @sharmaa.s.s.k3076
    @sharmaa.s.s.k3076 2 дня назад +2

    🙏🙏🙏

  • @satyanarayanak5137
    @satyanarayanak5137 2 дня назад +2

    చిత్ర కళా తపస్వి. మీకు మీరే సాటి. మీకు పోటీ లేదు. మీలాంటి చిత్రకారుడు భవిషత్తులో ఉండడు. మిమ్ములను అనుకరెంచే వారు ఉన్నారు. అందులో నేను ఒక్కడిని.

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 2 дня назад +5

    చందమామ

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana628 2 дня назад +1

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤❤soo ooper 🎉

  • @gmanastudio2174
    @gmanastudio2174 День назад +1

    👌🙏🇮🇳

  • @ramakrishnagadepalli8677
    @ramakrishnagadepalli8677 2 дня назад +2

    💐🙏

  • @aravindbandila3806
    @aravindbandila3806 День назад +1

    ❤❤❤

  • @siripalliprasad4700
    @siripalliprasad4700 2 дня назад +1

    Hi is cover page of yuva magazine

  • @komatlanagavenkataganapath4355
    @komatlanagavenkataganapath4355 2 дня назад +2

    చందమామ కథల ముఖ చిత్రం ఆయనవే , వపా అని చూచి పూర్తి పేరు ఇప్పటికీ తెలిసింది,
    చిన్నపుడు వపా అంటే ఏ హిందీ లేదా విదేశీ కళా కారుడు అనుకున్నా ,

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 2 дня назад +4

    దశాబ్దాల క్రితం నవ్వులు పువ్వులు మాసపత్రిక కవర్ పేజీ మీద వారి చిత్రాలు మరువ లేనివి. ధన్యులు, అజరా మరులు

  • @Sundarimbt
    @Sundarimbt 2 дня назад +3

    Anchi chitra kalaakaruni guirchi vivarinchi manchi pani chesinanduku dhanyavaadalu.

  • @shalvachary1971
    @shalvachary1971 2 дня назад +2

    కళాత్రుష్ణకి ఆది అంతం లేదు.ఏ వస్తువూ కూడా కళాకారుల చేతుల్లో చిక్కుకో వలసిందే.పొగడ్తలు మా లాంటి కళాకారుల కు ముఖ్యం కాదు.కళాకారులు జీవనోపాధి లేక కంటికి దరిద్రం అనుభవిస్తున్నారు.దీని గురించి ఆలోచించాలి....

  • @brk18pearls70
    @brk18pearls70 20 часов назад

    అద్భుత చిత్ర కారుడు ఫోటో ఇప్పుడే చూస్తున్న ఇతని బొమ్మలు94 లో చూసాను

  • @suryaprakashpedapati1661
    @suryaprakashpedapati1661 День назад +1

    వడ్డాది వారి చిత్రాలు మిస్ అయిన మనిషి జన్మ, జన్మే కాదని నా అభిప్రాయం. బాపు గారిస్టైల్ వేరు, వడ్డాది గారి స్టైల్ వేరు. తెలుగులో ఎందరు ఆర్టిస్ట్ లున్నా వడ్డాది వారి స్టైల్ వేరు. ఒక్కసారి చూస్తే జన్మంతా గుర్తుండే చిత్రాలు, చిత్రాలా అవి, భావుకుడైతే తెలుస్తుంది అవేమిటో.

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 2 дня назад +3

    ఆయన అపరబ్రహ్మ నమస్కారాలు

  • @dhanayakkala2176
    @dhanayakkala2176 2 дня назад +1

    🙏🙏🙏💐💐♥️♥️

  • @KKSWAMYRDMKKSWAMYRDM
    @KKSWAMYRDMKKSWAMYRDM 2 дня назад +2

    దయచేసి పెద్ద వారిని (వారు )గారు అని సంబోదించండి

    • @suryatoons
      @suryatoons  2 дня назад +1

      'గౌరవించడం' వద్దని కాదు, మన'వాడు' అన్న చనువుతో కొంత, ముందు 'శ్రీ' అన్నప్పుడు, చివర 'గారు' అనకపోయిన, గౌరవం తగ్గదు అనేది కొంత,
      అలవాటులో..(మాట్లాడే ఫ్లో) లో , డు అని పలకడం, అలా.. అప్రయత్నంగా జరిగిపోయింది

  • @tprasadtt9143
    @tprasadtt9143 2 дня назад +2

    గొప్పోరు

  • @gmkrao9224
    @gmkrao9224 23 часа назад +1

    Prathi sankranthiki ma kasimkota(v)AKP(m)&Dt. Vachevaru

  • @PadmavathiGottivedu-pz8ul
    @PadmavathiGottivedu-pz8ul 2 дня назад +1

    ఆయన జననం మరణం చెప్పలేదు

  • @kamasani999
    @kamasani999 День назад +1

    {8:24} ఈ చిత్రాన్ని బాహుబలి లో కాపీ చేశారనుకొంటా !