పల్లవి పాలించు కామాక్షీ పావనీ పాప శమనీ అంబ అనుపల్లవి చాలా బహు విధముగా నిన్ను సదా వేడుకొనేడి నాయందేల ఈ లాగు జేసేవు వెత హరించవే వేగమే నన్ను (పాలించు) చరణం 1 స్వాంతంబులోన నిన్నే దలచిన సుజనులకెల్లనే వేళ సంతోషములొసగేవని నీవు మనోరథ ఫల దాయినివని కాంతమగు పేరు పొందితివి కారుణ్య మూర్తివై జగము కాపాడిన తల్లి గదా నేను నీదు బిడ్డను లాలించి (పాలించు) చరణం 2 ఈ మూర్తియింత తేజో-మయమై- యిటు వలె కీర్తి విస్ఫూర్తి- నిట్లను గుణ మూర్తి త్రి-లోకములో జూచినయెందైన గలదా ఏమో తొలి నోము నోచితినో నీ పాద పద్మ దర్శనము వేమారు లభించి కృతార్థుడనైతి నా మనవినాలకించి (పాలించు) చరణం 3 రాజాధి రాజన్మకుటీ తట మణి రాజ పాదా నే చాల నిజ సన్నిధిని కోరి సమస్త జనులకెల్ల వరదా రాజ ముఖీ శ్యామ కృష్ణ నుతా కాంచీ పురేశ్వరీ వికస రాజీవ దళాక్షీ జగత్సాక్షీ ఓ ప్రసన్న పరా శక్తీ (పాలించు) స్వర సాహిత్య కనక గిరి సదన లలిత నిను భజన సంతతము సేయని జడుడను వినుము నిఖిల భువన జననివియిపుడు మా దురితము దీర్చి వరాలిచ్చి (పాలించు)
Very nice.thanks
🙏🙏🙏🙏
Simply superb rendition. No words to describe. Great.
Thanks for listening
పల్లవి
పాలించు కామాక్షీ పావనీ
పాప శమనీ అంబ
అనుపల్లవి
చాలా బహు విధముగా నిన్ను
సదా వేడుకొనేడి నాయందేల
ఈ లాగు జేసేవు వెత
హరించవే వేగమే నన్ను (పాలించు)
చరణం 1
స్వాంతంబులోన నిన్నే
దలచిన సుజనులకెల్లనే వేళ
సంతోషములొసగేవని నీవు
మనోరథ ఫల దాయినివని
కాంతమగు పేరు పొందితివి
కారుణ్య మూర్తివై జగము
కాపాడిన తల్లి గదా నేను
నీదు బిడ్డను లాలించి (పాలించు)
చరణం 2
ఈ మూర్తియింత తేజో-మయమై-
యిటు వలె కీర్తి విస్ఫూర్తి-
నిట్లను గుణ మూర్తి త్రి-లోకములో
జూచినయెందైన గలదా
ఏమో తొలి నోము నోచితినో
నీ పాద పద్మ దర్శనము
వేమారు లభించి కృతార్థుడనైతి
నా మనవినాలకించి (పాలించు)
చరణం 3
రాజాధి రాజన్మకుటీ
తట మణి రాజ పాదా
నే చాల నిజ సన్నిధిని కోరి
సమస్త జనులకెల్ల వరదా
రాజ ముఖీ శ్యామ కృష్ణ నుతా
కాంచీ పురేశ్వరీ వికస
రాజీవ దళాక్షీ జగత్సాక్షీ
ఓ ప్రసన్న పరా శక్తీ (పాలించు)
స్వర సాహిత్య
కనక గిరి సదన లలిత నిను భజన
సంతతము సేయని జడుడను
వినుము నిఖిల భువన జననివియిపుడు
మా దురితము దీర్చి వరాలిచ్చి (పాలించు)
O' Amma, the Goddess, hearing your superlatives thru this ragam and from this respected musician is my fortune. 👏🏼👏🏼👏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️
Thanks for listening,
Wonderful!!
Kalpana swaram is super