Episode-49: రుక్మిణీ కళ్యాణం (Part-1): Krishna Charithamu...Madhurasudhabharithamu
HTML-код
- Опубликовано: 10 фев 2025
- కృష్ణ చరితము... మధురసుధాభరితము
"Krishna Charithamu...Madhurasudhabharithamu".
పిబరే కృష్ణ రసమ్ ! PIBARE KRISHNA RASAM !!
Stay blessed with THE NECTOR of KRISHNA THATHVAM.
Watch new Episode every week.
మన బమ్మెఱపోతనామాత్యుల ప్రణీతమైన శ్రీమద్భాగవతములోని అనేక అద్భుతమైన ఘట్టాలలో రుక్మిణీ కళ్యాణము ఒకటి. ఇది దశమ స్కంధం లో ఉంటుంది. రుక్మిణీ కళ్యాణముతో పాటు మరో నాలుగు ఘట్టాలు ఉన్నాయి. అవేమిటంటే గజేంద్ర మోక్షణము, ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్ర, కుచేలోపాఖ్యానము. ఈ ఐదింటిని పంచరత్నాలుగా పిలుస్తారు. ఈ రుక్మిణీ కల్యాణము తెలుగువారికీ మిక్కిలి ప్రీతిపాత్ర మైనది. దీన్ని పారాయణ చేసే సంప్రదాయము మన తెలుగువాళ్లకు మాత్రమే ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే, దీన్ని పఠించినా, విన్నా, కళ్యాణం శీఘ్రంగా జరుగుతుందని ఇంకా కళ్యాణ విఘ్నాలు తొలగిపోతాయని, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చాలామంది నమ్మకం కూడా.
రుక్మిణి అన్న రుక్మి తనను శిశుపాలుడికిచ్చి వివాహం చేయ నిశ్చయిస్తాడు. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి ఒక బ్రాహ్మణుడి ద్వారా ఒక సందేశం పంపిస్తుంది. దాంతో శ్రీకృష్ణుడు రుక్మిణిని రాక్షస వివాహం చేసుకుంటాడు. ఆ విశేషాలేంటో చూడండి.
జై శ్రీకృష్ణ!
Nicely explained
Thank you🙏🙏
🙏🙏
Well explained Sir, అభినందనలు.
కృష్ణ చరితం వర్ణన చాలా బాగుందండి
Thank you🙏🙏
అభినందనలు రామకృష్ణ గారు, చాలా చక్కగా వివరించారు
Thank you
Thank you sir.
Hi Rama Krishna!Superb raa!Narration and content is fantastic!
Thank you so much 🙂
Thank you. Jai Srikrishna🙏🙏