We also consider u a member of our family sir... We keep waiting for your videos.. idk how many times I've heard few videos repeatedly... Especially ur interview in i dreams and alwar , naayanar charitras... My family was in the verge of loosing all our respect and maby even our lives... Datta pradakshina saved my family and till date incan feel that I was saved by his grace..thank u for telling us abt it🙏🏻 my whole family is thankful to u till we die🙏🏻 it's not one way sir , we all consider u as our family and love u the same way 🙏🏻♥️ we shld thank ur parents amd devi for bringing u up in such a way and u for making this channel 🙏🏻🙏🏻
మా కుటుంబం తో కలిసి తిరుపతి వెళ్లినపుడు . స్వామివారి దర్శనానికి వెళ్ళేటపుడు మా నాన్న మా కోడలు తప్పి పోయారు... తిరుమల మొత్తమ్ సుమరు 2 గంటలు మొత్తం వేతిక కాని మా వాళ్ళు దొరకలేదు. చేసేదేమి లేక స్వామి వారి ఆలయం ముందుకి వెళ్లి స్వామి నేను వెతికి వెతికి ఆల్సిపోయా ఇ కా మీరే ధిక్కు అని ఆర్తి తో నమస్కారం చేసా.... కళ్ళు తెరిచి పుష్కరిణి వైపు ఇలా చూసా అంతే మా నాన్న కోడలు ఎదురుగా కనిపించారు... అంతే నాకళ్ల వెంట నీళ్లు వచ్చాయ్... అంటే కోరి పిలుస్తే కోనేటి రాయుడు కడలి వస్తాడు అనిపించింది... చాలా మంచి అనుభూతితో స్వామి వారి దర్శనానికి వెళ్లాం....
ఓం నమో వేంటేశాయ 🙏 నిజమే గురువుగారు, స్వామిని నమ్మితే ఆయన అనుగ్రహం ఎలా ఉంటుందో ఊహించలేము. 20 సంవత్సరాల క్రితం ఒక శనివారం రోజు , మా ఏరియా లో ఒక అబ్బాయి (కొంచెం పెద్దవాడు కొంచెం ఆకతాయి. గుళ్ళలో అన్నదానం రోజు భోజనానికి వచ్చేవాడు. నల్ల గా, బొద్దు గా ఉంటాడు.) నుదుటిన పెద్ద నామాలతో మా ఇంటికి వచ్చాడు. అలా ఎప్పుడూ తనని చూడలేదు .ఎవరి ఇంటికి ఎప్పుడూ వెళ్ళడు. అప్పుడే నా శనివారం సహస్రనామ పూజ అయ్యింది. అక్కా, ఆకలి వేస్తోంది, ఏమైనా పెట్టవా అని అడిగాడు. నేను కొంతసేపటి క్రితం వేసిన అట్టు ఉంటే పెట్టాను. తాగడానికి ఏమైనా కావాలి అన్నాడు. టీ పెట్టి ఇచ్చాను. మా ఇల్లు చాలా దూరం వెళ్ళాలి 2 రూపాయలు ఇమ్మని అడిగాడు. 5 రూపాయలు ఇచ్చాను. కానీ ఆ అబ్బాయి ఇల్లు మా ఏరియా కి ప్రక్కనే. వెళ్తూ తిరుపతి కొండకు వస్తావు అన్నాడు. నాకు అర్ధం కాలేదు. మాకు ఏమీ తిరుపతి ప్రయాణం ఆలోచన లేదు. ఎందుకు అన్నాడు అనుకున్నాను. బయటికి వెళ్లి చూస్తే లేడు. బాబా గుడిలో కూడా భోజనం చేశాక బాబా కి దణ్ణం పెట్టుకుంటాను అని మందిరం లోకి వెళ్ళేవాడు కానీ బయటకు వచ్చేవాడు కాదు, లోపల ఉండే వాడు కాదు. బాబాయే అలా వచ్చారు అనుకునే వారు .కొద్ది రోజుల తరువాత అనుకోకుండా మా అమ్మగారు మమ్మల్ని తిరుపతి పంపించారు. ఆశ్చర్యం. అంతకంటే పెద్ద ఆశ్చర్యం, ఆనందం దారిలో ట్రైన్ లో నాకు వచ్చిన కల. కలలో ,"తెల్లవారుఝామున ఒక గొల్ల వ్యక్తి పంచెకట్టు తో, ఒక గొల్ల పాప పొట్టి స్కర్ట్,పొట్టి జాకెట్, ఇద్దరూ మెడకి నల్లని తాడు కి స్వామి వెండి డాలర్ తో ఉన్నారు. స్వామి ఆలయం తలుపులు తీసి తొలి దర్శనం చేసుకున్న తరువాత , మిగిలిన ఆచార్యులు దర్శనం చేసుకుని విష్ణు సహస్ర నామం చదువుతూ స్వామి కి తులసి దళాలతో అర్చన చేస్తున్నారు. స్వామికి ఏ విధమైన అలంకారం లేదు. తెల్లని పట్టుపంచే, మెడ లో కండువా , యజ్ఞోపవీతం. అంతే.నల్లని రూపం మీద నుదుటిన నామం." ఎంత గాఢ నిద్ర అంటే, ట్రైన్ రాత్రి నుండి ఆగిపోయిన విషయం కూడా తెలియలేదు. నా ప్రక్కన3 years మా బాబు నిద్ర లో జారిపోతున్నాడు ఏమో అని చెక్ చేసుకోవడం తప్ప. ఏదో ట్రైన్ నెల్లూరు లో ఏక్సిడెంట్ అయ్యింది అట. అందువల్ల ఉదయం 9 కాస్త రాత్రి 11.30 గంటలకు చేరాము. కానీ దర్శనం అద్భుతం, అనందనిలయంలోనే అప్పటి కప్పుడు 6 సార్లు తనివి తీరా దర్శనం చేసుకున్నాము. దేవాలయం లోనే ఆ అవకాశం ఇచ్చారు. ఆ తరువాత మా ఆంటీ తో కల చెప్తే నిత్యం తిరుపతి లో అలానే జరుగుతుంది అని, స్వామి నాకు నిజనేత్ర దర్శనం ఇచ్చారు అని చెప్తే,నా ఆనందం చెప్పలేను.ఇప్పటికీ ఆ కల , స్వామి దర్శనం యధాతధంగా గుర్తు ఉంది .ఓం నమో వేంటేశాయ 🙏
మీ అమ్మ గారి గురించి విన్నతరువాత..చాలా సంతోషమనిపించింది. ఆ తల్లి కడుపులో పుట్టిన మీరు కారణ జన్ములు. ఇది విన్నందుకు మా జన్మ కూడా ధన్యమైంది. మీరు చెప్పినట్టు భగవంతుని పాదాలు అస్సలు వదలం.
నమో వేంకటేశ! మా అమ్మగారికి 2015 లో ఒక సంఘటన జరిగింది..వైజాగ్ నుంచి చెల్లనారుఝామున 4 కి ట్రైన్ లో కాకినాడ వెళ్ళాలి సీతమ్మధార లో ఇంటి నుంచి..ఆ ఇంట్లో పెద్దవాళ్ళిద్దరూ స్టేషన్ కి దిగబెట్టే పరిస్థితి లేదు ఇంక తానే ధైర్యం చేసి స్వామి వారిని తలచుకుంటూ అపార్ట్మెంట్ దిగి వీధి చివరకి వెళ్ళింది ఆటో కోసం కుడి వైపు చూసి ఎడమవైపు కి తిరిగింది అంతే పూవ్వులు లైట్లు తో ధగ ధగ మెరిసిపోతున్న ఆటో వచ్చి ఆగింది తన ముందు ధగ ధగ మెరిసిపోతున్న చెవిపోగుతో తెల్లటి ధోతీ జుబ్బా వేసుకున్న 8 ఏళ్ళ పిల్లవాడు ఆ ఆటోవాడితో అమ్మగారిని స్టేషన్లో దింపేయి అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు..మా అమ్మ గారు అంతలా అలంకరింపబడి ఉన్న ఆటో ని ఇప్పటిదాకా చూడలేదు..ట్రైన్ టైమ్ అయిపోతున్న హడావిడి లో ఆటో ఎక్కేసారు ఆ అబ్బాయి ముఖం సరిగా గమనించుకోలేకపోయారు..స్టేషన్లో జాగ్రత్తగా దింపాక ఆటో అతన్ని ఎంతైంది అంటే ఏంతోకొంత ఇవ్వండి అన్నాడట మా అమ్మగారు పర్సులో చేయిపెట్టి యాభైయో వందో ఇచ్చారుట క్షేమంగా ట్రైన్ ఎక్కేసారు కాకినాడ చేరుకున్నారు మళ్ళీ రెండ్రోజులకి తిరిగి వైజాగ్ వచ్చేసారు కానీ మనసంతా ఆ పిల్లవాడు ఎవరు ఏంటీ అన్న ఆలోచనే…సీతమ్మధార అన్నీ వీధులలో చెవిపోగుండి ప్రొద్దున్నే పాలు పోసేఅబ్బాయిలున్నారా పేపర్లు వేసే అబ్బాయిలున్నారా అని ఎంతే అన్వేషించారు కానీ ఆ వయస్సు వాళ్ళు ఎవ్వరూ లేరని తెలిసింది…ఇది జరిగిన కొన్ని రోజులకి మా అమ్మగారికి తిరుమల సేవకి వెళ్ళడం అందులో ఒకరోజు కులశేఖర్ పడి దగ్గర 6గంటలు డ్యుటీ చేయడం అన్నీ జరిగిపోయాయి తన ఆనందానికీ అవధులు లేవు ఇప్పటికీ ఇవన్నీ చెప్తే తన కళ్ళు చెమరుస్తాయి…ఆయన లీలలు అద్భుతం..
అయ్యా మీ తల్లిదండ్రులు అంత గొప్ప వాళ్ళు కాబట్టి మీరు వాళ్ల కడుపున మీరు జన్మించారు నిజంగా మీ తల్లిదండ్రులు పాదాలు ఉదయ పూర్వకంగా ధన్యవాదాలు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః
శ్రీ మాత్రే నమః 🙏🙏 గురువు గారు మీరు అమ్మగారు కీ జరిగిన ఆ వెంకటేశ్వర స్వామీ అనుభూతి చెపుతుంటే నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి 🙏🙏 ఓం నమో నారాయణాయ మీ పాదాలే మాకు శరణం తండ్రి🙇🙇... అందరినీ చల్లగా కాపాడు తండ్రీ 🙏🙏
నా వయస్సు 23 సంవత్సారాలు...నేను కూడా శ్రీవారికి చేసింది ఏం లేదు గురువు గారు..ఆయన్ని చిన్నప్పుడు ఎన్నో సార్లు నిందించాను కూడా..కానీ ఆయన కరుణా పయోనిధి కదా...ఒకసారి 2021 april లో తిరుమల వెళ్ళే రైలు లో సీట్ దొరక్క...అసలు ఈ వేంకటేశ్వరుడు ఎవరా అని చూద్దాం అని..వెంగమాంబ గారు పుస్తకం చూసాను..కానీ అర్ధంకాలేదు...వదిలేసాను...తిరిగి ఇంటికి వచ్చాక చాగంటి గారి వేంకటేశ్వర మహత్యము అనుకోకుండా విన్నాను..ఆ రోజు మొదలు ఈ రోజు దాకా కంటి కి రెప్పలా కాపాడుకుంటున్నాడు నన్ను...అప్పటి నుండి ఇప్పటి దాకా ఈశ్వర కథా శ్రవణం కి ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా దూరం చేయలేదు..నాలో ఎన్నో మార్పులు తెచ్చారు..రాను రాను శ్రీవారు నాతో స్వయంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది...నాకు ఏం అనుమానం వచ్చినా చెప్తాడు... ఏదైనా కష్టం వస్తుంది అంటే నా కంటే ముందే ఆలోచించి సుగమం చేస్తాడు....నాకు ఇప్పుడు శ్రీ వారి ని చూడకుండా ఉండలేను అని అనిపిస్తుంది ( ఇది గొప్ప కోసం చెప్పట్లేదు)...వారిని ఎప్పుడు ఎప్పుడు చూస్తానా అని రోజులు లెక్కపెడ్తున్నాను... నేను వేసింది ఒక్క అడుగు( ఆయన గురించి తెుసుకునేందుకు)...ఆయన నాకోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు...కరుణా పయోనిది కనుక...ఇలానే శ్రీ వారు ఈ కట్టె కాలేంత వరకు నాతో ఉండాలని ఆశీర్వచనం చేయండి గురువు గారు 🙏
🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ🙏 నమస్తే గురువుగారు 🙏 మీ అమ్మగారి పాదపద్మములకు నమస్తే 🙏 మీ అమ్మగారికి వెంకటేశ్వర స్వామి కి ఉన్న అనుబంధం వింటుంటే చాలా ఆనందంగా ఉంది 🙏 మీ మాట తప్పకుండా వింటాము భగవంతుని పాదాలు అస్సలు విడువము🙏 ధన్యవాదములు గురువుగారు 🙏 🌹🙏శ్రీ మాత్రే నమః 🙏🌹
ఆహా ఏమి మీ అమ్మగారి భాగ్యము 🙏 ఒకసారి తిరుమలలో అనుకోకుండా 3 రోజుల్లో ఆరు దర్శనములు అయ్యాయి. 5 సార్లు లడ్డూ ప్రసాదం గా ఇచ్చారు. నేను సరదాకి అబ్బా స్వామీ అన్నిసార్లు తీపి తినలేక పోతున్నా ప్రసాదం మార్చండి అని అన్నా విచిత్రం ఆరో సారి దధ్యోధనం ప్రసాదం గా ఇచ్చారు. నాతో ఉన్న వాళ్ళందరూ స్వామీ న్ మాట విని ఇలా అనుగ్రహించారు అని అంటుంటే కన్నీళ్లు ఆగలేదు. అలాగే వెన్న కూడా ప్రసాదంగా లభించింది. ఎంత కరుణ స్వామి కి 🙏
ఆహా!!!🥰🥰🥰 ఆయనకి ఉన్న అనేక నామములలో భక్తవత్సలుడు అనే నామం కూడా ఒకటి. ఆయన ఇంతటి భక్తవత్సలుడా అని మీరు చెప్పిన అనుభూతి చదివితే తెలిసింది 😢😢😢 ఓం నమో నారాయణాయ
గురువుగారు మీరు మీ అమ్మ గారి కథ చెప్పేసరికి నా కన్నీళ్లు ఆగలేదు ఆనందం తో నా మనసు ఊగిసలాడుతోంది నాకు కూడా ఆ భాగ్యం దొరికితే బాగుండు అని అనిపిస్తోంది 🥹🥹😭😭🙏🙏
శ్రీ మాత్రే నమః గురువుగారు మీ తల్లి గారి జీవితం లో జరిగిన ఈ సంఘటన గురించి మీరు చెప్తూ ఉంటే నా కంటిలో నీళ్ళు తిరుగుతున్నాయి. అంత సంతోషంగా ఉంది మీరు చెప్తూ ఉంటే అదృష్టం అందరికీ దొరుకుతుందా మహాతల్లి పాదపద్మములకు వందనాలు గురువుగారు.
తిరుపతి వేంకటేశ్వరుని లీలలు వర్ణించటం ఎవరి తరం అండీ.మీరన్నట్లు చేదుకున్నవారికి చేదుకున్నంత.మీ అమ్మగారి అనుభవం వింటుంటే మా తాతగారి కి జరిగిన అనుభవం పంచుకోవాలని ఉంది. దాదాపు ఎనభై ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది.మా తల్లిదండ్రులు, మా పెదనాన్న గారు దంపతులు,మా తాతగారు, నాయనమ్మ గారు తిరుపతి శ్రీనివాసుని దర్శనార్థం వెళ్ళారు.మా తాతగారు చాలా ఆచారవంతులు.నిత్య కర్మలు,దేవతార్చనలు కించిత్తూ లోపం రాకుండా జరగాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా తన దేవతార్చన సంపుటాన్ని వెంట తీసుకెళ్ళి నిత్య పూజా విధానాలు క్రమం తప్పకుండా చేసేవారు. భగవంతునికి నివేదన చేయని ఏ ఆహారమూ తినేవారు కాదు.తిరుపతిలో చక్కెర పొంగలి ప్రసాదం ఇస్తే సరియైన మడీ,శుభ్రమూ పాటించి చేసారో లేదో, స్వామికి నివేదన చేసారో లేదో అన్న సందేహం తో ప్రసాదం స్వీకరించటానికి నిరాకరించారట.వెంటనే ఎక్కడి నుంచో ఒక కోతి వచ్చి వారి దేవతార్చన సంపుటాన్ని ఎత్తుకు పోయి ఎదురుగా ఉన్న ఒక ఇంటి పైకప్పు మీద కూర్చొని చూస్తూ ఉన్నదట.మా తాతగారి కి తన ప్రాణాల కన్నా ఎక్కువైన తన దేవతార్చన కోతి ఎత్తుకెళ్ళటంతో హతాశులై తన దైవం మళ్ళీ తనకు దక్కితేనే మళ్ళీ మన ఊరికి ఇంటికి తిరిగి వస్తాను అనీ లేకపోతే ఇక్కడే ప్రాయోపవేశం చేసి ప్రాణ త్యాగం చేస్తాననీ భీష్మించుకు కూర్చున్నారట.మా నాన్నగారు, పెద నాన్న గారు చుట్టుపక్కల వారి సహాయం తో కర్రలు గట్రా పట్టుకుని ఎంత అదిలించినా,బెదిరించినా ఆ కోతి వీళ్ళని చూసి గుర్రుమనటమే తప్ప వీళ్ళ ప్రయత్నాలు ఏవీ ఫలించనే లేదట.అప్పుడు కొందరు మీ వలన ఏదో అపచారం జరిగి ఉంటుంది. అందుకే ఇలా జరిగింది. స్వామిని మన్నించమని ప్రార్థించుకోండి అని చెప్పగా మా పెదనాన్న గారికి తక్షణం మా తాతగారు ప్రసాదం స్వీకరించక పోవటమే కారణం అయి ఉంటుంది అని స్ఫురించి,వెంటనే మా తాతగారి ని స్వామి సన్నిధిలో మడీ ఆచారం అంటూ చూడకూడదు.ఎవరు ఎలా వండినా దేవుని ప్రసాదం పరమ పవిత్రం అనే భక్తి భావం తో స్వీకరించాలి.స్వామికి క్షమాపణలు చెప్పుకొని ప్రసాదం స్వీకరించండి అని హితవు చెప్పగానే మా తాతగారు అలాగే చేసారట.ఆయన ప్రసాదం స్వీకరించిన మరుక్షణమే ఆ కోతి ఆ దేవతార్చన సంపుటాన్ని ఆయన ఒడిలో పడవేసి పారిపోయిందట.తరవాత మా తాతగారు కన్నీళ్ళతో మరోసారి స్వామి దర్శనం చేసుకుని అపరాధ కానుక చెల్లించుకుని వచ్చారట.తాను ప్రత్యక్షంగా చూసిన ఈ సంఘటన మా నాన్నగారు ఎన్నో సార్లు అందరికీ చెప్పేవారు.🙏హరే శ్రీనివాస🙏
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ స్వామి గారు మీరు చెప్పింది నూటికి నూరు పర్సెంట్ నిజం మా అమ్మ గారి విషయంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది మా నాన్న గారికి 54 సంవత్సరాల ఆరోగ్యం బాగ లేకుంటే మా అమ్మగారు ఏడుస్తూ తిరుమల కొండ చేరాను బాధతో దర్శనం కూడా చేసుకోకుండా తిరుగు ప్రయాణం చేశారు చూడగా మా నాన్నగారి ఆరోగ్యం చాలా బాగా అయ్యింది ఆ రోజు నుంచి 54 సంవత్సరాలుగా మా ఫ్యామిలీ మొత్తం స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తొమ్మిది రోజులు ఉండడం అలవాటు ఐ స్వామి పాద పద్మముల చెంత మా యొక్క జీవితాలను అనిపించడం జరుగుతుంది ఓం నమో నారాయణాయ నమః ఓం నమో వేంకటేశాయ
🙏🙏🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏 అమ్మగారి పట్ల తిరుమలేశుడు చూపిన లీలా అద్భుతము స్వామీ... మాకు కూడా తిరుమలేశుని లీల మీ మాటలలో వింటూ వుంటే మాకు కూడా చాలా చాలా ఆనందమైనది .... ధన్యవాదములు స్వామీ 🙏
నిజంగా మీ తల్లి గారు కారణజన్మరాలు. ఆ తల్లి కడుపు పుట్టిన మీరు , మేడం గారు, మీ కడుపు పుట్టిన మీ పాప గారు చాలా అదృష్టవంతులు, కారణ జన్ములు. మీరు ఇంతలా దేవుడు గురించి రీసెర్చ్ చేసి మాకు చెప్పుతున్నారు , మీకు దేవుడితో చాలా జన్మల సంబంధం ఉంది. మీ లాంటి వారు దొరకటం మా అదృష్టం.
సాక్షాత్తు ఆ పరమ పురుషుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సాకార దర్శనం అయింది అంటే మీ అమ్మగారు కారణజన్ములు. మీ తల్లిదండ్రులు లాంటి మహాత్ముల కడుపున మీలాంటి మహానుభావులు జన్మిస్తారు. జన్మించి, మాలాంటివాళ్ళ జీవితాలను భగవంతుడి పాదాల వద్దకు చేర్చి, మా జన్మలు సార్థకం చేస్తారు. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఆనంద భాష్పాలు వచ్చాయి. శ్రీ మాత్రే నమః🙏🙏
మహదానందబరితం అయ్యాయి మా మనస్సులు అమ్మ గారికి స్వామీ పై ఉన్న ప్రేమ స్వామీ ని కదిలించింది. .ఆర్తి తో ఉన్న మనసుకి స్వామి సాక్షాత్కారం అవ్తుంది అనీ కళ్ళకి కట్టినట్టు చూపించారు మాకు..ఓం నమో వేంకటేశాయ నమః ఇవన్నీ అంతే ఆర్తి తో వింటునందుకు ఏమో మీరు మీ కుటుంబ సభ్యులు పదే పడే కలలో కనిపిస్తున్నారు .. ఆశీర్వదిస్తూ మొన్న ఒక రోజు మీరు నాకు బట్టలు పెట్టారు కలలో.. నా లాంటి వాళ్ళకి మీ దర్శనం అయ్యేనో లేదో తెలీదు కలలో మాత్రం multiple times avthunay ..గురువుల ప్రేమ భగవంతుడు ఇలా అనుభవం అయ్యేలా చేస్తున్నారేమో అనిపిస్తుంది
Being a malayali sir . I am naryana devotee... One of my friend recommended this video since i am n depressed state after my another friend demise. Since she knows i love tirupati god and want to visit there . By god's grace guruvayoor i used to visit in every 2 months ... Tirupati god stories and miracles i love to listen ❤ Mind is feeling calm download sir 😊🙏.. Om srinivasa Narayana...Sri vekentesha narayana 🙏 Om Namo Narayana 🙏❤
శ్రీ గురుభ్యోనమః ఆ తల్లికి మీలాంటి బిడ్డని ఇచ్చిన ఆ భగవంతుని కి మాకు మార్గనిర్దేశం చేస్తున్న మీకు శతకోటి వందనాలు అండి మా జీవితంలో ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన చెప్పాలి అనిపించింది మీ వీడియో చూసాక మా ఇంట్లో ఏవేవో సమస్యలు ఉన్నపుడు ఎవరో చెప్పారని అరుణాచలం వెళ్ళాము కాని మాకు అసలు ఎలా వెళ్ళాలో తెలియదు నువ్వే ఉన్నావు తండ్రి అని మద్రాసులో అరుణాచలం వెళ్ళే బస్సు ఎక్కాము అందులో అందరినీ అడుగుతూ ఉన్నాము ఎక్కడ దిగాలి గుడికి ఎలా వెళ్ళాలో అని ఈలోపు బస్సులోకి ఒక ముసలతను ఎక్కారు ఆయనకి కొంచెం తెలుగు తెలియడం వల్ల మా కంగారు చూసి మీరేమి భయపడకండి నేను తీసుకెళ్ళి అన్ని చూపిస్తాను అన్నారు అలాగే మమ్మల్ని దగ్గరుండి అన్ని చూపించి చాలా దగ్గరగా ఆ స్వామి దర్శనం చేయించి మిమ్మల్ని మళ్ళీ అక్కడ ఉన్న తెలుగు బస దగ్గర దిగబెట్టారు ఆ తర్వాత రోజు ఉదయం మేము దర్శనానికి వెళితే చాలా సమయం పట్టేసింది అపుడు తెలిసింది ఆఆ అరుణాచలేశ్వరుడు మాకు దగ్గర ఉండి అన్ని చూపించాడు అని
మీరు పెట్టే ప్రతి వీడియో చూస్తుంటాను. ప్రతి వీడియో ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతూ వచ్చింది. దానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు.. ఒకరకంగా చెప్పాలంటే నాకు మీరు ఆధ్యాత్మిక గురువు అని చెప్పాలి... శ్రీ గురుభ్యోనమః..... మీరు పెట్టే జగన్నాధుని వీడియోలు చూసి, ఆ పూరీ జగన్నాథ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నాను. ఆ క్షణం నాకన్నా అదృష్టవంతుడు అన్నంత సంతోషం వేసింది. మీరు చెప్పిన ప్రతి ఉప ఆలయాన్ని, ప్రతి స్థలాన్ని maximum దర్శించుకున్నాను. దానికి పూరీ జగన్నాధునికి మరియు నన్ను గురువు రూపంలో నడిపించిన మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను గురు గారు..... అలాగే మీరు చెప్పే ప్రతి స్థల పురాణాన్ని చూస్తుంటాను. మీకు వీలైతే షిర్డీ యొక్క స్థల పురాణం, విశిష్టత, అక్కడి ఆలయాల గురించి వీడియో చేయండి గురు గారు..... శ్రీ విష్ణురూపాయ నమః శివాయ.... శ్రీ మాత్రే నమః..... గురుభ్యోనమః......
మా అమ్మ గారు చాలా చిన్న వయసులో బావి దగ్గర పశువుల దగ్గర కూర్చోమని వాళ్ళ నాన్న గారు చెప్పారట పశువులు మేపెవరు వెళ్లిపోతున్నారు ఆ సమయములో వారి వేలుతువుంటే కొద్ది దూరం వచ్చింది ఆ సమయములో రెండు పశువులూ అడవిలో కి పోయాయి అయితే మా అమ్మ గారు వాటిని వదిలేసి ఇంటికి వస్తున్న సందర్భములో ఒక రైతు ఒక దారి చూపించి ఈటు పోయాయి అని చెప్పాడట అయితే సాయంత్రం సమయములో వాటిని తోలుకొద్ధమని మళ్లీ వెనకకి పోయింది, అలానే వెళ్తూ వుంటే చీకటి అయింది. ఎదో ఒక దారిలో ఊరిలోకి వద్దామని వస్తు వుంటే ఎవరో చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలు జరిగాయి కాలుతువుంటే మా అమ్మ గారు బయపడి మళ్లీ వెనకకి వచ్చింది అయితే చీకటి లో బోరున ఏడ్చుకుంటూ వెలుతువుంటే రాయి తగిలి కింద పడబోతు వుంటే మా అమ్మ గారి చేయి పట్టుకొని ఎత్తే సరికి మా అమ్మ గారికి వారి అమ్మ నాన్న లాగే కనిపించ రంట అమ్మ నాన్న అని పిలిచింది వారిని,వారు వచ్చి తీసుకొని పోయి వడిలో పడుకోబెట్టుకొని జో కొట్టి పడుకోబెట్టారు అంటా తెలవరుతున్నప్పుడు కూడా వాళ్ళు వున్న రంటా ఆ రాత్రి అంతా ఆ వూరు గ్రామ ప్రజలు మా అమ్మ గారి అమ్మ నాన్న తెళ్లర్లు దీపం పట్టుకొని వేతికరంటా అది పెద్ద అడవి కొండల ప్రాంతం ఎక్కడ కనిపించా లేదు తెల్ల వార్లు పెద్ద వర్షం కాని ఒక్క చినుకు కూడా తదవలేదు, తెల్ల వరగానే మా అమ్మ లేచి కొద్ది దూరం నడవగానే ఆమె వూరి రైతుకు కనపడింది అంటా ఎక్కడ పోయావు అడిగితే మొత్తం కథ మొత్తం చెప్పింది అంటా తెల్లవార్లూ మా అమ్మ నాన్న నా పక్కనే ఉన్నారు నేను నిద్ర నుండి లేవగానే లేరు అని అన్నది అంటా ఆ రైతు ని వెంట రాత్రి మొత్తం వున్నది మి అమ్మ నాన్న కాదు రంగ నాయకులు,అండల్ అమ్మ వారు గుడి వుంది వారు నీ దగ్గర ఉన్నారు అని ఆ రైతు అమ్మ నీ తీసుకొని అమ్మ నాన్న లకు అప్పగించాడు అంటా ఈ ప్పటికీ మా అమ్మ చేపుతువుంటుంది. ఆ వూరి పెద్ద వారు కూడా చెపుతూ వుంటారు.
మీ అమ్మ గారి జీవితంలో జరిగిన వెంకన్న లీల వింటుంటే ఆనందంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి గురువుగారు 🥲. మీకు మీ కుటుంబానికి శ్రీనివాస కృపా కటాక్షములు సదా ఉండుగాక. నమో వేంకటేశాయ 🙏🚩
అవును అండి ..మా బాబు చిన్నప్పుడు ఒకసారి వాళ్ళ నాన్న ఏదో అన్నారని వెళ్ళి railway station లో బిచ్చగాడి భార్య పిల్లల కి అన్నం పెట్టే దృశ్యం చూసి అమ్మ గుర్తు వచ్చి వెనక్కు వచ్చి చెప్పు తూ ఏడ్చే సాడు నేను వెంకటేశ్వరస్వామి ని ప్రార్థించడం వలననే అయింది అని నా నమ్మకం ... 🎉🎉🎉🎉
నమస్తే గురువు గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది కొన్ని అప్పులు వున్నాయ్ అవి ఎంత తీరుదం అనుకున్న నాకు అవి చాలా ఇబ్బంది కలుగుతున్నాయి దయచేసి adyna పరిష్కారం చెప్పండి మీకు రుణపడి ఉంటా మీకు పాదాభి వందనాలు గురువు garu
గురువు గారు same మా అమ్మ నాన్న లకు ఆ దుర్గమ్మ తల్లి కనిపించారు ఒక ముసలి అమ్మ లాగా అని చెపుతారు. భద్రాచలం వెళ్లినప్పుడు అక్కడి దారులు అమ్మ వాళ్ళకి కొత్త అప్పుడు ఒక ముసలి అమ్మ వచ్చి మొత్తం ఏవి ఎక్కడ ఉంటాయి.... భోజనం, కళ్యాణం tickets ekada దొరుకుతుంది.... అలా అన్ని విషయాలు చెప్పారట ఆవిడి చూసినప్పుడు అల్లా పసుపు, రెడ్ చీర తో, ఎరుపు, పసుపు గాజులతో కనిపించింది అంట.... చివరికి బయలుదేరుతుంటే అదుగో మీరు వెళ్లాల్సిన bhimavaram బస్ వచ్చేసింది అని చెప్పి దగ్గరుండి బస్ ఎక్కించరట తిరిగి వెనక్కి చూస్తే ఆవిడ కనపడలేదు అంట.. ఈ విషయం గురించి ఎప్పుడు అయినా మాటలాడుకుంటే ఆవిడ ఎవరా అని ఆ అమ్మవారు ఎవరి మీదనైనా వచ్చి "ఏ నేను ఎవరో నీకు తెలియదా అని...... అని anevaru ఈ సగటన నేను పుట్టక ముందు జరిగినది ఇప్పుడు 25yrs నాకు
🤲గురువు గారు...ముందుగా ఇది వినాలని అనిపించినపుడు ధన్యుడ్ని... మీరు చెప్పింది అక్షర సత్యం...స్వచ్ఛమైన మనసుతో అర్పణ చేస్తే నమ్మిన దైవం లేదా గురువు ఏదో ఒక రూపంలో ధర్శనమిస్తారు.ఈ చిల్లుకుండ రంధ్రం ఎప్పటికి...బాగుపడుతుందో ..దానికి కూడా ఆభగవంతుని క్రృప ఉండాలి... శ్రీ గురుభ్యోనమః 👏👏👏 శ్రీ మాత్రే నమః 👏👏👏
ధన్యవాదాలండి గురువు గారు..చాలా బాగా చెప్పారు. మా పూర్వ జన్మ సుకృతమండి మీ మాటలు వినడానికి.నిజంగా మీరు చెప్పినట్టు ఆ దేవ దేవుడి పాదాలు వదలమండి. ధన్యోస్మి. మీ పాద పద్మ ములకు శతకోటి వందనాలు
ఆ తల్లి ఎంత గొప్పదో,మిమ్మల్ని చూస్తే అర్ధం అవుతుంది గురువుగారు.ఆ తల్లి ఎన్ని పూజలు,పుణ్యాలు చేస్తే మీలాంటి కొడుకును ఆ భగవంతుడు ప్రసాదించాడు స్వామి.మీలాంటి సన్మార్గంలో నడిపించే గురువును ప్రసాధించినందుకు ఆ తల్లికి శతకోటి నమస్కారాలు🙏🙏🙏
🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️ 🙏🏻🕉️Jai Jai sitha Rama 🙏🏻🕉️ 🙏🏻🕉️Jai Jai Sri Rama 🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri Ramadutha Hanuman🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri jaganatha🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva🕉️🙏🏻 🙏🏻🕉️Aruna siva🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri Sadguru Aadi sankaracharaya 🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri guru Sri Ramana Maharishi 🕉️🙏🏻
నిజంగా మీరు చాలా అదృష్టవంతులు అంత గొప్ప తల్లి కి పుట్టడం అలాగే అమ్మగారు ఇంకా అదృష్టవంతులు నా తండ్రి నారాయన్నీ చూడడం ఎంత అదృష్టవంతులు మీరు మేము అదృష్టవంతులమే ఎందుకంటే నా నారాయణ తండ్రి మీ రూపంలో మాకు ఎన్నో విషయాలు చెప్తున్నారు మీకు మా లక్ష్మినారాయణ తల్లి తండ్రులకి శతకోటి నమస్కారాలు
Yes sir.. even I have experienced the god in garbhalaya recently.. he came and talked to me indirectly.. most unforgettable moment for me.. blessed to have that experience.. 🙏🏻 om namo narayanaya..!!
మా ఇంట్లో కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దేవీ శరన్నవరాత్రులు చాలా నిష్ట గా చాలా సంతోషంగా ఇష్టంగా చేస్తుంటాము , మేము కూడా ఆ భగవంతుని కాళ్ళు పట్టుకుని ఉన్నాము ఇంకా జన్మలో విడువం కూడా గురువు గారూ ! మీ అమ్మ గారు చాలా ధన్యాత్ములు
1) భగవంతుని పాదాలు వదలకండి. ఎందుకంటే తల్లిదండ్రులు స్వర్గస్థులు అయ్యాక మనల్ని కంటికి రెప్పలా కాపాడే వాళ్ళు లక్ష్మీ- నారాయణులే/శివ-పార్వతులే. 2) నవరాత్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ మానకండి . మీ అమ్మగారు ఎంత గొప్పవారో... సాక్షాత్ ఆ శ్రీనివాసునితో కలిసి, నడిచి, తిరిగి, మాట్లాడి, కులశేఖర పడి వద్ద దర్శనంతో తాదాత్మ్యం చెందిన ఈ సంఘటన బహుశా యే భాగవతునికి జరిగి ఉండకపోవచ్చు. ఆ కరుణా సముద్రుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాలకి నమస్కరిస్తూ 🙏🙏🙏 ఓం నమో నారాయణాయ 😢😢
నమస్కారం గురువుగారు,మా కుటుంబం విపరీతమైన అప్పుల ఊబీలో కూరుకుపోయి ఉన్నాము.మా కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చి ఈ అప్పుల ఊబీలో నుండి బయటకు తీసుకురావాలి.నేను ఏమి జరిగిన కూడా భగవంతుడు కాళ్ళు వదలిపెట్ట కూడదు అనుకుంటున్నాను.
సార్ నేను పిబ్రవరి లో దైవ దర్శనానికి వేళ్లాము లోపలికి వెళ్లే టపటికి రద్దీ గావు0ది అలా దేవుని దగ్గర కు వచ్చేసరికి నాముందర చాలాకాలిగావు0ది దేవుని లీల నా మనస్సు లో అనుకున్న
స్వామి చలించిపోతారు అండి. నేను చాలా బాధలో ఉన్నప్పుడు స్వామి ఏవేరెవరినో పరిచయం చేసి రోజుకు మూడు సార్లు దర్శన భాగ్యం కల్పించారు. ఒకసారి ఏకంగా 15 మినిట్స్ స్వామి ముందు నిలబెట్టుకున్నారు. అది ఎలానో చెప్పలేను. ఆయన అపార కారుణామూర్తి.... గోవిందా గోవిందా 🙏🙏🙏
Nanduri sir, mee valle nenu ammavari gurinchi telusukunnanu... 4 navaratrulu chesukunnanu... Feeling internal peace.. Common ppl ki ardam ayyela mee seva anirvachaneeyam adbhutham... We are so so so grateful to u n ur family.. What else we can do for u.... Stay blessed sir
ఓం శ్రీమాన్ నారాయణ 🙏it's hundred times True. I am a grand of daughter of Shri Venkateshwara swamy thathaya garu and my Amma garu is Sri Alivelu mangama talli. Even my mother taught us Sri narayana mantram from my childhood. I always share happiness and sorrow with my thathaya garu only. His my soul, mind and everything. Jai Shri man narayana 🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, 🙏🙏🙏🙏🙏, శ్రీ మాత్రే నమః. గురువు గారూ నాకు ఆనందం తో కడుపు నిండి పోయింది. మీరు చెప్పినట్లు గానే భగవంతుడిని, భక్తి తో పూజ చేసుకుని ఆ గోవిందుని పాదాలు, శివయ్య పాదాలు, అమ్మవారి పాదాలు అస్సలు వదలము గురువు గారూ! మా అందరి కోసం మీరు పడే తపన, ఆరాటం మా అందరికీ అర్థం అవుతుంది గురువు గారూ! మీకు, మీ తల్లి తండ్రులు కి మా పాధాబి వందనములు.
స్వామి నాకు నిన్న కలలో భూవరాహ స్వామి దర్శనం అయింది చాలా సంతోషంగా ఉంది స్వామి నేను మా అమ్మగారు స్వామి దర్శనం యొక్క లైన్లో ఉన్నామట స్వామి ని చాలా చక్కగా దర్శించుకున్నాము అన్నట్టుగా కల వచ్చింది స్వామి🙏🙏😍😍💞💕😘
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇 శ్రీ మాత్రే నమః 🙇🙇 ఓం నమో వేంకటేశాయ🙇🙇 గురువు గారు నేను ఎవ్వరి నీ ఏమీ అనక పోయిన నాపై నిందలు వేస్తున్నారు.నన్ను బాధ పెట్టే మాటలు అంటున్నారు.దగ్గరి బంధువులు. నేను ఏమి అనను.బాధ పడతాను . నాలొనేను ఏడు స్తాను.ఆ దుర్గమ్మ కు చెప్పు కుంటాను.అమ్మ నువ్వు చూస్తున్నావ్.గా అని వారాహీ నవరాత్రులు బాగా చేసుకోవాలి.అనుకుంటున్నాను.నాకు శక్తి నీ ఇవ్వు అమ్మ నా బంగారు తల్లి.🙇🙇
ఆమె అంతటి మహా భక్తురాలు కనుకే మీ వంటి మహానుభావుని బిడ్డగా పొంది మాకు గొప్ప మార్గదర్శిగా అందించారు. మీ అమ్మగారి లాగే మా అమ్మ గారు దేవుని పాదాలు పట్టుకుని ఆయన లీలలు ప్రత్యక్షంగా అనుభూతి పొంది 10 సంవత్సరాలు తిరుమలలో కాపురం చేసి తన కర్మ పలితమో ఏమో ప్రస్తుతం పక్షవాతంతో 5సంవత్సరాలు మంచాన పడి నాన్నగారితో సేవలు చేయించుకుంటూ కాలం వెళ్ళ దీస్తోంది. అయినా కూడా మేము స్వామి పాధాలనే నమ్ముకునే ముందుకు వెళుతున్నాం.ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏🙏🙏 గోవిందా గోవింద గోవిందా గోవిందా
Namaste Sir. Even Brahmasri Chaganti Gaaru also told in a pravachanam that Sri Mahavishnu will be roaming around Tirumala hills to help his devotees and now your video is the proof for the same🙏Om Namo Venkateshshaya🙏 Memo kuda ee video chusaka Swami Anubhuthini poduthuamu🙏
గురువు గారు మిరు చెప్పినట్టే నేను కూడా దశరల్లో అమ్మ వారిని కనక ధార స్తోత్రం తో రెండు పూటలా అర్చిస్తా .అప్పటి నుంచి మా జీవితం లో ఉండే యెన్నో కష్టాలు దూరం అయ్యాయి .అమ్మ దయతో నా సమస్య లు అన్ని దూరం అయ్యాయి . ధన్య వాదాలు గురువు గారు
గురువు గారు,నేను లాస్ట్ week tirumala lo seva ki వెళ్ళాను,లాస్ట్ Friday aa గోవిందుడు ఎదురుగా జయ ,విజయ ల దగ్గర లైన్ లో నిలబడి సేవ చేశాను,ఎంత సేపు చూసినా తనివి తీరలేదు,మీరు లక్ష్మి చటర్వింశతి నామాలు చడావమన్నరు ,అసలు అవి గుర్తు రావడం లేదు గురువు గారు,ఎంత సేపు గోవిందా అనే నామం తప్ప,లాస్ట్ సేవ రోజు దర్శనమ్ ఇచ్చారు,దేవుడు నీ చూసి వచ్చేస్తుంటే చాలా బాధ వేసింది,మళ్ళీ ఆ గోవిందుడు కి అంత దగ్గరగా సేవ చేసే అదృష్టం వస్తుందో లేదో అని😌😭🙏
నమస్కారం గురువు గారు. నాకు పెళ్ళి జరిగి 3 సంవత్సారాలు అయినది. ఇంతవరకు పిల్లలు లేరు.నా వయసు 32 సంవత్సరాలు. మీరు చెప్పిన విధంగా పిల్లల కోసం రామాయణం మరియు గురుచరిత్ర చేస్తున్నాను. ఇప్పటికీ 3 సార్లు రామాయణం మొదలు చేశాను. కానీ ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఒకసారి 21 రోజులు చేశాను. కానీ మధ్యలో రెండు రోజులు ఉదయం సమయంలో కుదరక సాయంత్రం చేశాను. మళ్ళీ మొదలు పెట్టాను రామాయణం మరియు గురుచరిత్ర. కానీ మధ్యలో బంధువులు చనిపోయారు అని వార్త చెప్పారు. మనసు చాలా కష్టం గా ఉంది. ఎంతో ఇష్టం గా చేసిన ఆ దేవుడు నన్ను కరునించడం లేదు అని చాలా బాధగా ఉంది గురువు గారు. నాకు ఏది అయిన పరిష్కారం తెలుపగలరు
మీ ప్రవచనాలకు వల్ల చాలా మంది తెలియని విషయాలు చాలా తెలుసుకుంటున్నారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని కోరుకుంటూ మీకు శతకోటి వందనాలు
మా చిన్నప్పుడు మాకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మా తమ్ముని నన్ను తిరుపతికి పుట్టు వెంట్రుకలు తీయడానికి తీసుకుని వెళ్లారు అప్పుడు మా తమ్ముడు కోనేరు లో మునిగిపోయాడు మునిగిపోతే ఆ వెంకటేశ్వరస్వామి కనిపించిన మా అమ్మకి మా తమ్ముడి పాదము పైకి తేలుతున్నట్టు కనిపిస్తే వెంటనే లాగేసింది ఆ జరిగిన సంఘటనను మా అమ్మ ఇప్పటికీ మా తోటి పంచుకుంటూనే ఉంటుంది ఓం నమో వేంకటేశాయ
We also consider u a member of our family sir... We keep waiting for your videos.. idk how many times I've heard few videos repeatedly... Especially ur interview in i dreams and alwar , naayanar charitras... My family was in the verge of loosing all our respect and maby even our lives... Datta pradakshina saved my family and till date incan feel that I was saved by his grace..thank u for telling us abt it🙏🏻 my whole family is thankful to u till we die🙏🏻 it's not one way sir , we all consider u as our family and love u the same way 🙏🏻♥️ we shld thank ur parents amd devi for bringing u up in such a way and u for making this channel 🙏🏻🙏🏻
మాతాచ పార్వతీ దేవీ పిత దేవో మహేశ్వర
బాంధవా శ్శివ భక్తాశ్చ స్వదేశో భువన త్రయం
మా అమ్మా, నాన్నగారూ వెళ్ళిపోతూ ఇన్ని లక్షల కుటుంబ సభ్యులని ఇచ్చారు 🙏
🙏🙏🙏
@@NanduriSrinivasSpiritualTalks adi maa adrushtam Andi.. meeku na krutangnatalanu matallo cheppalenu.. ammavaru Mee rupamlo daari choopindi.. grahaalu ammavarikkanna chinnavi Ani meeru Anna okka maata nannu ippati varaku upiri peelchukunela chesthu'undi🙏🏻 yeppudaina aekantamga kalavadaniki avakasham ivvandi..mimmalni ibbandi pettanu..okka 10 mins meetho matlaadi namaskaram chesi vellipotha🙏🏻
మాటలు రాలెదు గురువు గారు ఒళ్లుంత పులకరించి పోయింది
🙏🙏🙏
మా కుటుంబం తో కలిసి తిరుపతి వెళ్లినపుడు . స్వామివారి దర్శనానికి వెళ్ళేటపుడు మా నాన్న మా కోడలు తప్పి పోయారు... తిరుమల మొత్తమ్ సుమరు 2 గంటలు మొత్తం వేతిక కాని మా వాళ్ళు దొరకలేదు. చేసేదేమి లేక స్వామి వారి ఆలయం ముందుకి వెళ్లి స్వామి నేను వెతికి వెతికి ఆల్సిపోయా ఇ కా మీరే ధిక్కు అని ఆర్తి తో నమస్కారం చేసా.... కళ్ళు తెరిచి పుష్కరిణి వైపు ఇలా చూసా అంతే మా నాన్న కోడలు ఎదురుగా కనిపించారు... అంతే నాకళ్ల వెంట నీళ్లు వచ్చాయ్... అంటే కోరి పిలుస్తే కోనేటి రాయుడు కడలి వస్తాడు అనిపించింది... చాలా మంచి అనుభూతితో స్వామి వారి దర్శనానికి వెళ్లాం....
ఓం నమో వేంటేశాయ 🙏 నిజమే గురువుగారు, స్వామిని నమ్మితే ఆయన అనుగ్రహం ఎలా ఉంటుందో ఊహించలేము. 20 సంవత్సరాల క్రితం ఒక శనివారం రోజు , మా ఏరియా లో ఒక అబ్బాయి (కొంచెం పెద్దవాడు కొంచెం ఆకతాయి. గుళ్ళలో అన్నదానం రోజు భోజనానికి వచ్చేవాడు. నల్ల గా, బొద్దు గా ఉంటాడు.) నుదుటిన పెద్ద నామాలతో మా ఇంటికి వచ్చాడు. అలా ఎప్పుడూ తనని చూడలేదు .ఎవరి ఇంటికి ఎప్పుడూ వెళ్ళడు. అప్పుడే నా శనివారం సహస్రనామ పూజ అయ్యింది. అక్కా, ఆకలి వేస్తోంది, ఏమైనా పెట్టవా అని అడిగాడు. నేను కొంతసేపటి క్రితం వేసిన అట్టు ఉంటే పెట్టాను. తాగడానికి ఏమైనా కావాలి అన్నాడు. టీ పెట్టి ఇచ్చాను. మా ఇల్లు చాలా దూరం వెళ్ళాలి 2 రూపాయలు ఇమ్మని అడిగాడు. 5 రూపాయలు ఇచ్చాను. కానీ ఆ అబ్బాయి ఇల్లు మా ఏరియా కి ప్రక్కనే. వెళ్తూ తిరుపతి కొండకు వస్తావు అన్నాడు. నాకు అర్ధం కాలేదు. మాకు ఏమీ తిరుపతి ప్రయాణం ఆలోచన లేదు. ఎందుకు అన్నాడు అనుకున్నాను. బయటికి వెళ్లి చూస్తే లేడు. బాబా గుడిలో కూడా భోజనం చేశాక బాబా కి దణ్ణం పెట్టుకుంటాను అని మందిరం లోకి వెళ్ళేవాడు కానీ బయటకు వచ్చేవాడు కాదు, లోపల ఉండే వాడు కాదు. బాబాయే అలా వచ్చారు అనుకునే వారు .కొద్ది రోజుల తరువాత అనుకోకుండా మా అమ్మగారు మమ్మల్ని తిరుపతి పంపించారు. ఆశ్చర్యం. అంతకంటే పెద్ద ఆశ్చర్యం, ఆనందం దారిలో ట్రైన్ లో నాకు వచ్చిన కల. కలలో ,"తెల్లవారుఝామున ఒక గొల్ల వ్యక్తి పంచెకట్టు తో, ఒక గొల్ల పాప పొట్టి స్కర్ట్,పొట్టి జాకెట్, ఇద్దరూ మెడకి నల్లని తాడు కి స్వామి వెండి డాలర్ తో ఉన్నారు. స్వామి ఆలయం తలుపులు తీసి తొలి దర్శనం చేసుకున్న తరువాత , మిగిలిన ఆచార్యులు దర్శనం చేసుకుని విష్ణు సహస్ర నామం చదువుతూ స్వామి కి తులసి దళాలతో అర్చన చేస్తున్నారు. స్వామికి ఏ విధమైన అలంకారం లేదు. తెల్లని పట్టుపంచే, మెడ లో కండువా , యజ్ఞోపవీతం. అంతే.నల్లని రూపం మీద నుదుటిన నామం." ఎంత గాఢ నిద్ర అంటే, ట్రైన్ రాత్రి నుండి ఆగిపోయిన విషయం కూడా తెలియలేదు. నా ప్రక్కన3 years మా బాబు నిద్ర లో జారిపోతున్నాడు ఏమో అని చెక్ చేసుకోవడం తప్ప. ఏదో ట్రైన్ నెల్లూరు లో ఏక్సిడెంట్ అయ్యింది అట. అందువల్ల ఉదయం 9 కాస్త రాత్రి 11.30 గంటలకు చేరాము. కానీ దర్శనం అద్భుతం, అనందనిలయంలోనే అప్పటి కప్పుడు 6 సార్లు తనివి తీరా దర్శనం చేసుకున్నాము. దేవాలయం లోనే ఆ అవకాశం ఇచ్చారు. ఆ తరువాత మా ఆంటీ తో కల చెప్తే నిత్యం తిరుపతి లో అలానే జరుగుతుంది అని, స్వామి నాకు నిజనేత్ర దర్శనం ఇచ్చారు అని చెప్తే,నా ఆనందం చెప్పలేను.ఇప్పటికీ ఆ కల , స్వామి దర్శనం యధాతధంగా గుర్తు ఉంది .ఓం నమో వేంటేశాయ 🙏
ఆహా! ఎంత పూజ్యనీయులో మీతల్లి గారు🙏 ఈ సంఘటన విన్న మా అందరి జన్మలు ధన్యం🙏🙏 గోవిందా గోవింద
స్వామి... మీ హృదయంలో ఉన్న ఆర్తి.. మీ కళ్ళల్లో కనపడుతోంది.. ఆనంద భాష్పాలు గా...అవి..మా కళ్ళల్లో కూడా.. జాలువారుతూ ఉన్నాయి... ధన్యోస్మి స్వామి
మీ అమ్మ గారి గురించి విన్నతరువాత..చాలా సంతోషమనిపించింది. ఆ తల్లి కడుపులో పుట్టిన మీరు కారణ జన్ములు. ఇది విన్నందుకు మా జన్మ కూడా ధన్యమైంది. మీరు చెప్పినట్టు భగవంతుని పాదాలు అస్సలు వదలం.
వేంకటేశ్వర స్వామిని చూసిన అమ్మ జీవితం సార్థకం .... ఆమె అనుభవం విన్న మా జీవితాలు సార్థకం 🙏🏻
నమో వేంకటేశ!
మా అమ్మగారికి 2015 లో ఒక సంఘటన జరిగింది..వైజాగ్ నుంచి చెల్లనారుఝామున 4 కి ట్రైన్ లో కాకినాడ వెళ్ళాలి సీతమ్మధార లో ఇంటి నుంచి..ఆ ఇంట్లో పెద్దవాళ్ళిద్దరూ స్టేషన్ కి దిగబెట్టే పరిస్థితి లేదు ఇంక తానే ధైర్యం చేసి స్వామి వారిని తలచుకుంటూ అపార్ట్మెంట్ దిగి వీధి చివరకి వెళ్ళింది ఆటో కోసం కుడి వైపు చూసి ఎడమవైపు కి తిరిగింది అంతే పూవ్వులు లైట్లు తో ధగ ధగ మెరిసిపోతున్న ఆటో వచ్చి ఆగింది తన ముందు ధగ ధగ మెరిసిపోతున్న చెవిపోగుతో తెల్లటి ధోతీ జుబ్బా వేసుకున్న 8 ఏళ్ళ పిల్లవాడు ఆ ఆటోవాడితో అమ్మగారిని స్టేషన్లో దింపేయి అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు..మా అమ్మ గారు అంతలా అలంకరింపబడి ఉన్న ఆటో ని ఇప్పటిదాకా చూడలేదు..ట్రైన్ టైమ్ అయిపోతున్న హడావిడి లో ఆటో ఎక్కేసారు ఆ అబ్బాయి ముఖం సరిగా గమనించుకోలేకపోయారు..స్టేషన్లో జాగ్రత్తగా దింపాక ఆటో అతన్ని ఎంతైంది అంటే ఏంతోకొంత ఇవ్వండి అన్నాడట మా అమ్మగారు పర్సులో చేయిపెట్టి యాభైయో వందో ఇచ్చారుట క్షేమంగా ట్రైన్ ఎక్కేసారు కాకినాడ చేరుకున్నారు మళ్ళీ రెండ్రోజులకి తిరిగి వైజాగ్ వచ్చేసారు కానీ మనసంతా ఆ పిల్లవాడు ఎవరు ఏంటీ అన్న ఆలోచనే…సీతమ్మధార అన్నీ వీధులలో చెవిపోగుండి ప్రొద్దున్నే పాలు పోసేఅబ్బాయిలున్నారా పేపర్లు వేసే అబ్బాయిలున్నారా అని ఎంతే అన్వేషించారు కానీ ఆ వయస్సు వాళ్ళు ఎవ్వరూ లేరని తెలిసింది…ఇది జరిగిన కొన్ని రోజులకి మా అమ్మగారికి తిరుమల సేవకి వెళ్ళడం అందులో ఒకరోజు కులశేఖర్ పడి దగ్గర 6గంటలు డ్యుటీ చేయడం అన్నీ జరిగిపోయాయి తన ఆనందానికీ అవధులు లేవు ఇప్పటికీ ఇవన్నీ చెప్తే తన కళ్ళు చెమరుస్తాయి…ఆయన లీలలు అద్భుతం..
గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏 మీరు చెప్తుంటే మాకు కూడా కళ్లల్లో నీళ్లు తిరిగాయి 🙏🙏🙏🙏
ఎంత అదృష్టవంతులు స్వామి మీరు ఆ తల్లి కడుపున పుట్టిన మీరు, వింటుంటే కళ్ళలో నీళ్లు ఆగడం లేదు 🙏🙏 నిజంగానే స్వామి వున్నారని నిరూపించారు
Aounu sujatha garu
అయ్యా మీ తల్లిదండ్రులు అంత గొప్ప వాళ్ళు కాబట్టి మీరు వాళ్ల కడుపున మీరు జన్మించారు నిజంగా మీ తల్లిదండ్రులు పాదాలు ఉదయ పూర్వకంగా ధన్యవాదాలు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః
సాక్షాత్తు వేంకటేశ్వర స్వామిని చూసిన మీ అమ్మగారి కళ్ళు చేసుకున్న పుణ్యం ,ఆవిడ కడుపున పుట్టిన మీ జన్మ
కారణజన్మలు అండి మీవి .Thanks for sharing andi
మేమంతా మి కుటుంబం... ఆ మాట చాలా తీయగా వుంది...కుటుంబ పెద్ద దీకు అయిన మీకు ఎలాంటి దృష్టి సొకకుడదు అనీ నా స్వామీ నీ కోరుకుంటున్నాను....
శ్రీ మాత్రే నమః 🙏🙏 గురువు గారు మీరు అమ్మగారు కీ జరిగిన ఆ వెంకటేశ్వర స్వామీ అనుభూతి చెపుతుంటే నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి 🙏🙏 ఓం నమో నారాయణాయ మీ పాదాలే మాకు శరణం తండ్రి🙇🙇... అందరినీ చల్లగా కాపాడు తండ్రీ 🙏🙏
నా వయస్సు 23 సంవత్సారాలు...నేను కూడా శ్రీవారికి చేసింది ఏం లేదు గురువు గారు..ఆయన్ని చిన్నప్పుడు ఎన్నో సార్లు నిందించాను కూడా..కానీ ఆయన కరుణా పయోనిధి కదా...ఒకసారి 2021 april లో తిరుమల వెళ్ళే రైలు లో సీట్ దొరక్క...అసలు ఈ వేంకటేశ్వరుడు ఎవరా అని చూద్దాం అని..వెంగమాంబ గారు పుస్తకం చూసాను..కానీ అర్ధంకాలేదు...వదిలేసాను...తిరిగి ఇంటికి వచ్చాక చాగంటి గారి వేంకటేశ్వర మహత్యము అనుకోకుండా విన్నాను..ఆ రోజు మొదలు ఈ రోజు దాకా కంటి కి రెప్పలా కాపాడుకుంటున్నాడు నన్ను...అప్పటి నుండి ఇప్పటి దాకా ఈశ్వర కథా శ్రవణం కి ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా దూరం చేయలేదు..నాలో ఎన్నో మార్పులు తెచ్చారు..రాను రాను శ్రీవారు నాతో స్వయంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది...నాకు ఏం అనుమానం వచ్చినా చెప్తాడు... ఏదైనా కష్టం వస్తుంది అంటే నా కంటే ముందే ఆలోచించి సుగమం చేస్తాడు....నాకు ఇప్పుడు శ్రీ వారి ని చూడకుండా ఉండలేను అని అనిపిస్తుంది ( ఇది గొప్ప కోసం చెప్పట్లేదు)...వారిని ఎప్పుడు ఎప్పుడు చూస్తానా అని రోజులు లెక్కపెడ్తున్నాను...
నేను వేసింది ఒక్క అడుగు( ఆయన గురించి తెుసుకునేందుకు)...ఆయన నాకోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు...కరుణా పయోనిది కనుక...ఇలానే శ్రీ వారు ఈ కట్టె కాలేంత వరకు నాతో ఉండాలని ఆశీర్వచనం చేయండి గురువు గారు 🙏
🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ🙏
నమస్తే గురువుగారు 🙏
మీ అమ్మగారి పాదపద్మములకు నమస్తే 🙏
మీ అమ్మగారికి వెంకటేశ్వర స్వామి కి ఉన్న అనుబంధం వింటుంటే చాలా ఆనందంగా ఉంది 🙏
మీ మాట తప్పకుండా వింటాము భగవంతుని పాదాలు అస్సలు విడువము🙏
ధన్యవాదములు గురువుగారు 🙏
🌹🙏శ్రీ మాత్రే నమః 🙏🌹
🙏🙏🙏🙏🙏
నాన్న మి మాటలు వింటూ ఉంటే న మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది
ఓం నమః శివాయ
హరా హరా మహా దేవ్ సెంబో శంకర🙏🙏🙏🙏🙏
ఆహా ఏమి మీ అమ్మగారి భాగ్యము 🙏 ఒకసారి తిరుమలలో అనుకోకుండా 3 రోజుల్లో ఆరు దర్శనములు అయ్యాయి. 5 సార్లు లడ్డూ ప్రసాదం గా ఇచ్చారు. నేను సరదాకి అబ్బా స్వామీ అన్నిసార్లు తీపి తినలేక పోతున్నా ప్రసాదం మార్చండి అని అన్నా విచిత్రం ఆరో సారి దధ్యోధనం ప్రసాదం గా ఇచ్చారు. నాతో ఉన్న వాళ్ళందరూ స్వామీ న్ మాట విని ఇలా అనుగ్రహించారు అని అంటుంటే కన్నీళ్లు ఆగలేదు. అలాగే వెన్న కూడా ప్రసాదంగా లభించింది. ఎంత కరుణ స్వామి కి 🙏
ఆహా!!!🥰🥰🥰
ఆయనకి ఉన్న అనేక నామములలో భక్తవత్సలుడు అనే నామం కూడా ఒకటి. ఆయన ఇంతటి భక్తవత్సలుడా అని మీరు చెప్పిన అనుభూతి చదివితే తెలిసింది 😢😢😢
ఓం నమో నారాయణాయ
గురువుగారు మీరు మీ అమ్మ గారి కథ చెప్పేసరికి నా కన్నీళ్లు ఆగలేదు ఆనందం తో నా మనసు ఊగిసలాడుతోంది నాకు కూడా ఆ భాగ్యం దొరికితే బాగుండు అని అనిపిస్తోంది 🥹🥹😭😭🙏🙏
శ్రీ మాత్రే నమః గురువుగారు మీ తల్లి గారి జీవితం లో జరిగిన ఈ సంఘటన గురించి మీరు చెప్తూ ఉంటే నా కంటిలో నీళ్ళు తిరుగుతున్నాయి. అంత సంతోషంగా ఉంది మీరు చెప్తూ ఉంటే అదృష్టం అందరికీ దొరుకుతుందా మహాతల్లి పాదపద్మములకు వందనాలు గురువుగారు.
మీ అమ్మ గారి జీవితం లో జరిగిన ఈ సంఘటన గురించి మీరు చెపుతుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి . స్వామి వారి లీలలు అద్బుతం. గోవిందా గోవింద.🙏🙏🙏
చాల సంతోషం గురువు గారు అమ్మ గురుంచి మాట్లాడిన పతి సరే మీ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది అది చూస్తేనే నాకు కడుపు నిండిపోతుంది
తిరుపతి వేంకటేశ్వరుని లీలలు వర్ణించటం ఎవరి తరం అండీ.మీరన్నట్లు చేదుకున్నవారికి చేదుకున్నంత.మీ అమ్మగారి అనుభవం వింటుంటే మా తాతగారి కి జరిగిన అనుభవం పంచుకోవాలని ఉంది. దాదాపు ఎనభై ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది.మా తల్లిదండ్రులు, మా పెదనాన్న గారు దంపతులు,మా తాతగారు, నాయనమ్మ గారు తిరుపతి శ్రీనివాసుని దర్శనార్థం వెళ్ళారు.మా తాతగారు చాలా ఆచారవంతులు.నిత్య కర్మలు,దేవతార్చనలు కించిత్తూ లోపం రాకుండా జరగాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా తన దేవతార్చన సంపుటాన్ని వెంట తీసుకెళ్ళి నిత్య పూజా విధానాలు క్రమం తప్పకుండా చేసేవారు. భగవంతునికి నివేదన చేయని ఏ ఆహారమూ తినేవారు కాదు.తిరుపతిలో చక్కెర పొంగలి ప్రసాదం ఇస్తే సరియైన మడీ,శుభ్రమూ పాటించి చేసారో లేదో, స్వామికి నివేదన చేసారో లేదో అన్న సందేహం తో ప్రసాదం స్వీకరించటానికి నిరాకరించారట.వెంటనే ఎక్కడి నుంచో ఒక కోతి వచ్చి వారి దేవతార్చన సంపుటాన్ని ఎత్తుకు పోయి ఎదురుగా ఉన్న ఒక ఇంటి పైకప్పు మీద కూర్చొని చూస్తూ ఉన్నదట.మా తాతగారి కి తన ప్రాణాల కన్నా ఎక్కువైన తన దేవతార్చన కోతి ఎత్తుకెళ్ళటంతో హతాశులై తన దైవం మళ్ళీ తనకు దక్కితేనే మళ్ళీ మన ఊరికి ఇంటికి తిరిగి వస్తాను అనీ లేకపోతే ఇక్కడే ప్రాయోపవేశం చేసి ప్రాణ త్యాగం చేస్తాననీ భీష్మించుకు కూర్చున్నారట.మా నాన్నగారు, పెద నాన్న గారు చుట్టుపక్కల వారి సహాయం తో కర్రలు గట్రా పట్టుకుని ఎంత అదిలించినా,బెదిరించినా ఆ కోతి వీళ్ళని చూసి గుర్రుమనటమే తప్ప వీళ్ళ ప్రయత్నాలు ఏవీ ఫలించనే లేదట.అప్పుడు కొందరు మీ వలన ఏదో అపచారం జరిగి ఉంటుంది. అందుకే ఇలా జరిగింది. స్వామిని మన్నించమని ప్రార్థించుకోండి అని చెప్పగా మా పెదనాన్న గారికి తక్షణం మా తాతగారు ప్రసాదం స్వీకరించక పోవటమే కారణం అయి ఉంటుంది అని స్ఫురించి,వెంటనే మా తాతగారి ని స్వామి సన్నిధిలో మడీ ఆచారం అంటూ చూడకూడదు.ఎవరు ఎలా వండినా దేవుని ప్రసాదం పరమ పవిత్రం అనే భక్తి భావం తో స్వీకరించాలి.స్వామికి క్షమాపణలు చెప్పుకొని ప్రసాదం స్వీకరించండి అని హితవు చెప్పగానే మా తాతగారు అలాగే చేసారట.ఆయన ప్రసాదం స్వీకరించిన మరుక్షణమే ఆ కోతి ఆ దేవతార్చన సంపుటాన్ని ఆయన ఒడిలో పడవేసి పారిపోయిందట.తరవాత మా తాతగారు కన్నీళ్ళతో మరోసారి స్వామి దర్శనం చేసుకుని అపరాధ కానుక చెల్లించుకుని వచ్చారట.తాను ప్రత్యక్షంగా చూసిన ఈ సంఘటన మా నాన్నగారు ఎన్నో సార్లు అందరికీ చెప్పేవారు.🙏హరే శ్రీనివాస🙏
ఆహా అద్భుతం
ఓం నమో వెంకటేశ 🙆🏻♂️🙆🏻♂️అమ్మ గారి గురించి మీరు చేపుతుంటే నాకూ ఓలుంతా గ్లూస్ బామ్స్ వచ్చాయి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
"ఓం నమో వెంకటేశాయ "
గోవిందా గోవిందా గోవిందా
స్వామి మీ పాద పద్మము లకు సాష్టాంగ నమస్కారములు చేసుకుంటూ శరణు శరణు శరణు అని అర్తిస్తూన్నాను తండ్రీ.
Nenu ee video kosam yennaluga vethukuthunnano, thank you for re-bringing it to the public. 🙏🏻
That one line at the end "you are all our extended family..."
ఏమిచ్చి రుణం తీర్చుకోగలము గురువర్య 😢😢😢
ఒక్క వీడియో లోనే మా అందరికీ నారాయణి, నారాయణులను ,సనాతనధర్మాన్ని సన్నిహితంగా చేసారు.
జగత:పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ.
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ
స్వామి గారు మీరు చెప్పింది నూటికి నూరు పర్సెంట్ నిజం మా అమ్మ గారి విషయంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది మా నాన్న గారికి 54 సంవత్సరాల ఆరోగ్యం బాగ లేకుంటే మా అమ్మగారు ఏడుస్తూ తిరుమల కొండ చేరాను బాధతో దర్శనం కూడా చేసుకోకుండా
తిరుగు ప్రయాణం చేశారు చూడగా మా నాన్నగారి ఆరోగ్యం చాలా బాగా
అయ్యింది ఆ రోజు నుంచి 54 సంవత్సరాలుగా మా ఫ్యామిలీ మొత్తం స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తొమ్మిది రోజులు ఉండడం అలవాటు ఐ స్వామి పాద పద్మముల చెంత మా యొక్క జీవితాలను అనిపించడం జరుగుతుంది
ఓం నమో నారాయణాయ నమః
ఓం నమో వేంకటేశాయ
🙏🙏🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
అమ్మగారి పట్ల తిరుమలేశుడు చూపిన లీలా అద్భుతము స్వామీ... మాకు కూడా తిరుమలేశుని లీల మీ మాటలలో వింటూ వుంటే మాకు కూడా చాలా చాలా ఆనందమైనది ....
ధన్యవాదములు స్వామీ 🙏
స్వామి అయ్యప్ప స్వామి విశిష్టత మరియు మహత్యాలు చెప్పండి స్వామి నాకు వినాలని ఆసక్తిగా ఉంది 🙏🏻
ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మీ అమ్మ గా రూ గురించి తెలుసూకోనందుకు మీ రూ చాఆ అదృష్టం వంతులు
మీ అమ్మ నాన్న గారి కి నా శతకోటి వందనాలు
నిజంగా మీ తల్లి గారు కారణజన్మరాలు. ఆ తల్లి కడుపు పుట్టిన మీరు , మేడం గారు, మీ కడుపు పుట్టిన మీ పాప గారు చాలా అదృష్టవంతులు, కారణ జన్ములు. మీరు ఇంతలా దేవుడు గురించి రీసెర్చ్ చేసి మాకు చెప్పుతున్నారు , మీకు దేవుడితో చాలా జన్మల సంబంధం ఉంది. మీ లాంటి వారు దొరకటం మా అదృష్టం.
సాక్షాత్తు ఆ పరమ పురుషుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సాకార దర్శనం అయింది అంటే మీ అమ్మగారు కారణజన్ములు. మీ తల్లిదండ్రులు లాంటి మహాత్ముల కడుపున మీలాంటి మహానుభావులు జన్మిస్తారు. జన్మించి, మాలాంటివాళ్ళ జీవితాలను భగవంతుడి పాదాల వద్దకు చేర్చి, మా జన్మలు సార్థకం చేస్తారు. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఆనంద భాష్పాలు వచ్చాయి. శ్రీ మాత్రే నమః🙏🙏
మహదానందబరితం అయ్యాయి మా మనస్సులు అమ్మ గారికి స్వామీ పై ఉన్న ప్రేమ స్వామీ ని కదిలించింది. .ఆర్తి తో ఉన్న మనసుకి స్వామి సాక్షాత్కారం అవ్తుంది అనీ కళ్ళకి కట్టినట్టు చూపించారు మాకు..ఓం నమో వేంకటేశాయ నమః
ఇవన్నీ అంతే ఆర్తి తో వింటునందుకు ఏమో మీరు మీ కుటుంబ సభ్యులు పదే పడే కలలో కనిపిస్తున్నారు .. ఆశీర్వదిస్తూ మొన్న ఒక రోజు మీరు నాకు బట్టలు పెట్టారు కలలో.. నా లాంటి వాళ్ళకి మీ దర్శనం అయ్యేనో లేదో తెలీదు కలలో మాత్రం multiple times avthunay ..గురువుల ప్రేమ భగవంతుడు ఇలా అనుభవం అయ్యేలా చేస్తున్నారేమో అనిపిస్తుంది
మీ వీడియో వినడం స్టార్ట్ చేశా అలా శ్రీ వారి లడ్డూ ప్రసాదం చేతికి వచ్చింది 🙏🙏🙏
Being a malayali sir . I am naryana devotee... One of my friend recommended this video since i am n depressed state after my another friend demise.
Since she knows i love tirupati god and want to visit there .
By god's grace guruvayoor i used to visit in every 2 months ...
Tirupati god stories and miracles i love to listen ❤
Mind is feeling calm download sir 😊🙏..
Om srinivasa Narayana...Sri vekentesha narayana 🙏 Om Namo Narayana 🙏❤
మీరు మళ్ళీ తిరుమల మీద పరిశోధన అన్నారు
నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా తదుపరి videos కోసం
శ్రీ గురుభ్యోనమః ఆ తల్లికి మీలాంటి బిడ్డని ఇచ్చిన ఆ భగవంతుని కి మాకు మార్గనిర్దేశం చేస్తున్న మీకు శతకోటి వందనాలు అండి మా జీవితంలో ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన చెప్పాలి అనిపించింది మీ వీడియో చూసాక మా ఇంట్లో ఏవేవో సమస్యలు ఉన్నపుడు ఎవరో చెప్పారని అరుణాచలం వెళ్ళాము కాని మాకు అసలు ఎలా వెళ్ళాలో తెలియదు నువ్వే ఉన్నావు తండ్రి అని మద్రాసులో అరుణాచలం వెళ్ళే బస్సు ఎక్కాము అందులో అందరినీ అడుగుతూ ఉన్నాము ఎక్కడ దిగాలి గుడికి ఎలా వెళ్ళాలో అని ఈలోపు బస్సులోకి ఒక ముసలతను ఎక్కారు ఆయనకి కొంచెం తెలుగు తెలియడం వల్ల మా కంగారు చూసి మీరేమి భయపడకండి నేను తీసుకెళ్ళి అన్ని చూపిస్తాను అన్నారు అలాగే మమ్మల్ని దగ్గరుండి అన్ని చూపించి చాలా దగ్గరగా ఆ స్వామి దర్శనం చేయించి మిమ్మల్ని మళ్ళీ అక్కడ ఉన్న తెలుగు బస దగ్గర దిగబెట్టారు ఆ తర్వాత రోజు ఉదయం మేము దర్శనానికి వెళితే చాలా సమయం పట్టేసింది అపుడు తెలిసింది ఆఆ అరుణాచలేశ్వరుడు మాకు దగ్గర ఉండి అన్ని చూపించాడు అని
గోవింద గోవింద, ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవింద 🙏🙏🙏
మీరు పెట్టే ప్రతి వీడియో చూస్తుంటాను. ప్రతి వీడియో ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతూ వచ్చింది. దానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు..
ఒకరకంగా చెప్పాలంటే నాకు మీరు ఆధ్యాత్మిక గురువు అని చెప్పాలి...
శ్రీ గురుభ్యోనమః.....
మీరు పెట్టే జగన్నాధుని వీడియోలు చూసి, ఆ పూరీ జగన్నాథ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నాను. ఆ క్షణం నాకన్నా అదృష్టవంతుడు అన్నంత సంతోషం వేసింది. మీరు చెప్పిన ప్రతి ఉప ఆలయాన్ని, ప్రతి స్థలాన్ని maximum దర్శించుకున్నాను. దానికి పూరీ జగన్నాధునికి మరియు నన్ను గురువు రూపంలో నడిపించిన మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను గురు గారు.....
అలాగే మీరు చెప్పే ప్రతి స్థల పురాణాన్ని చూస్తుంటాను.
మీకు వీలైతే షిర్డీ యొక్క స్థల పురాణం, విశిష్టత, అక్కడి ఆలయాల గురించి వీడియో చేయండి గురు గారు.....
శ్రీ విష్ణురూపాయ నమః శివాయ....
శ్రీ మాత్రే నమః.....
గురుభ్యోనమః......
మా అమ్మ గారి జీవితములో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.మీరు చెపుతుంటే మా అమ్మ గారికి జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది.చాలా సంతోషంగా వుంది గురువు గారు.
Please tell your mathers experience
Ok
😍👍
మా అమ్మ గారు చాలా చిన్న వయసులో బావి దగ్గర పశువుల దగ్గర కూర్చోమని వాళ్ళ నాన్న గారు చెప్పారట పశువులు మేపెవరు వెళ్లిపోతున్నారు ఆ సమయములో వారి వేలుతువుంటే కొద్ది దూరం వచ్చింది ఆ సమయములో రెండు పశువులూ అడవిలో కి పోయాయి అయితే మా అమ్మ గారు వాటిని వదిలేసి ఇంటికి వస్తున్న సందర్భములో ఒక రైతు ఒక దారి చూపించి ఈటు పోయాయి అని చెప్పాడట అయితే సాయంత్రం సమయములో వాటిని తోలుకొద్ధమని మళ్లీ వెనకకి పోయింది, అలానే వెళ్తూ వుంటే చీకటి అయింది. ఎదో ఒక దారిలో ఊరిలోకి వద్దామని వస్తు వుంటే ఎవరో చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలు జరిగాయి కాలుతువుంటే మా అమ్మ గారు బయపడి మళ్లీ వెనకకి వచ్చింది అయితే చీకటి లో బోరున ఏడ్చుకుంటూ వెలుతువుంటే రాయి తగిలి కింద పడబోతు వుంటే మా అమ్మ గారి చేయి పట్టుకొని ఎత్తే సరికి మా అమ్మ గారికి వారి అమ్మ నాన్న లాగే కనిపించ రంట అమ్మ నాన్న అని పిలిచింది వారిని,వారు వచ్చి తీసుకొని పోయి వడిలో పడుకోబెట్టుకొని జో కొట్టి పడుకోబెట్టారు అంటా తెలవరుతున్నప్పుడు కూడా వాళ్ళు వున్న రంటా ఆ రాత్రి అంతా ఆ వూరు గ్రామ ప్రజలు మా అమ్మ గారి అమ్మ నాన్న తెళ్లర్లు దీపం పట్టుకొని వేతికరంటా అది పెద్ద అడవి కొండల ప్రాంతం ఎక్కడ కనిపించా లేదు తెల్ల వార్లు పెద్ద వర్షం కాని ఒక్క చినుకు కూడా తదవలేదు, తెల్ల వరగానే మా అమ్మ లేచి కొద్ది దూరం నడవగానే ఆమె వూరి రైతుకు కనపడింది అంటా ఎక్కడ పోయావు అడిగితే మొత్తం కథ మొత్తం చెప్పింది అంటా తెల్లవార్లూ మా అమ్మ నాన్న నా పక్కనే ఉన్నారు నేను నిద్ర నుండి లేవగానే లేరు అని అన్నది అంటా ఆ రైతు ని వెంట రాత్రి మొత్తం వున్నది మి అమ్మ నాన్న కాదు రంగ నాయకులు,అండల్ అమ్మ వారు గుడి వుంది వారు నీ దగ్గర ఉన్నారు అని ఆ రైతు అమ్మ నీ తీసుకొని అమ్మ నాన్న లకు అప్పగించాడు అంటా ఈ ప్పటికీ మా అమ్మ చేపుతువుంటుంది. ఆ వూరి పెద్ద వారు కూడా చెపుతూ వుంటారు.
ఎంత అదృష్టవంతులు స్వామి మేము కూడా అదృష్టవంతులు మీ అమ్మ గారి కోసం
తెలుసుకుననందుకు ఎప్పటికీ శివయ్య పాదాలను వదలం స్వామి
మీ అమ్మ గారి జీవితంలో జరిగిన వెంకన్న లీల వింటుంటే ఆనందంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి గురువుగారు 🥲.
మీకు మీ కుటుంబానికి శ్రీనివాస కృపా కటాక్షములు సదా ఉండుగాక. నమో వేంకటేశాయ 🙏🚩
అవును అండి ..మా బాబు చిన్నప్పుడు ఒకసారి వాళ్ళ నాన్న ఏదో అన్నారని వెళ్ళి railway station లో బిచ్చగాడి భార్య పిల్లల కి అన్నం పెట్టే దృశ్యం చూసి అమ్మ గుర్తు వచ్చి వెనక్కు వచ్చి చెప్పు తూ ఏడ్చే సాడు నేను వెంకటేశ్వరస్వామి ని ప్రార్థించడం వలననే అయింది అని నా నమ్మకం ... 🎉🎉🎉🎉
మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
❤❤❤ మనస్సు చాలా అహలాధమంగ ఉంది గురువు గారు మీకు మీ కుటుంబ సభ్యులుకు మా హృద్యపురవ ధన్యవాదాలు ❤❤❤❤🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
మీరు జన్మతః అదృస్టవంతులు శ్రీవేంకటేశుని కృపా పాత్రులైన తల్లిగారి అంశ మీది అది మా అదృష్టం ధన్య వాదములు
నమస్తే గురువు గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది కొన్ని అప్పులు వున్నాయ్ అవి ఎంత తీరుదం అనుకున్న నాకు అవి చాలా ఇబ్బంది కలుగుతున్నాయి దయచేసి adyna పరిష్కారం చెప్పండి మీకు రుణపడి ఉంటా మీకు పాదాభి వందనాలు గురువు garu
గురువు గారు same మా అమ్మ నాన్న లకు ఆ దుర్గమ్మ తల్లి కనిపించారు ఒక ముసలి అమ్మ లాగా అని చెపుతారు.
భద్రాచలం వెళ్లినప్పుడు అక్కడి దారులు అమ్మ వాళ్ళకి కొత్త అప్పుడు ఒక ముసలి అమ్మ వచ్చి మొత్తం ఏవి ఎక్కడ ఉంటాయి.... భోజనం, కళ్యాణం tickets ekada దొరుకుతుంది.... అలా అన్ని విషయాలు చెప్పారట ఆవిడి చూసినప్పుడు అల్లా పసుపు, రెడ్ చీర తో, ఎరుపు, పసుపు గాజులతో కనిపించింది అంట.... చివరికి బయలుదేరుతుంటే అదుగో మీరు వెళ్లాల్సిన bhimavaram బస్ వచ్చేసింది అని చెప్పి దగ్గరుండి బస్ ఎక్కించరట తిరిగి వెనక్కి చూస్తే ఆవిడ కనపడలేదు అంట.. ఈ విషయం గురించి ఎప్పుడు అయినా మాటలాడుకుంటే ఆవిడ ఎవరా అని ఆ అమ్మవారు ఎవరి మీదనైనా వచ్చి "ఏ నేను ఎవరో నీకు తెలియదా అని...... అని anevaru ఈ సగటన నేను పుట్టక ముందు జరిగినది ఇప్పుడు 25yrs నాకు
🤲గురువు గారు...ముందుగా ఇది వినాలని అనిపించినపుడు ధన్యుడ్ని...
మీరు చెప్పింది అక్షర సత్యం...స్వచ్ఛమైన మనసుతో అర్పణ చేస్తే నమ్మిన దైవం లేదా గురువు ఏదో ఒక రూపంలో ధర్శనమిస్తారు.ఈ చిల్లుకుండ రంధ్రం ఎప్పటికి...బాగుపడుతుందో ..దానికి కూడా ఆభగవంతుని క్రృప ఉండాలి...
శ్రీ గురుభ్యోనమః 👏👏👏
శ్రీ మాత్రే నమః 👏👏👏
కారణ జన్మురాలు మీ మాతృ మూర్తి గారికి వందనం 🙏
ఓం నమో వేంకటేశాయ నమః ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా 🙏
మీరు ఎంత అదృష్ట వంధులు మాకు తిలిసిసింది మి అమ్మ గారు ధన్య జీవి
ఎంత పుణ్యం చేసుకుని ఉంటే భగవంతుని సాక్షాత్కారం లభిస్తుంది..అందుకే మీకు అంత మంచి మనసు మంచి కుటుంబం ఉంది మీకు గురువు గారు. 🙏
ధన్యవాదాలండి గురువు గారు..చాలా బాగా చెప్పారు. మా పూర్వ జన్మ సుకృతమండి మీ మాటలు వినడానికి.నిజంగా మీరు చెప్పినట్టు ఆ దేవ దేవుడి పాదాలు వదలమండి. ధన్యోస్మి. మీ పాద పద్మ ములకు శతకోటి వందనాలు
అమ్మ గారిది ఎంత అదృష్టం అండీ ఆ తల్లి ఏ లోకంలో ఉన్న ఆ శ్రీనివాసుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది
మీ అమ్మ గారి జీవితం లో జరిగిన సంఘటన వింటే కళ్ళు వెంట ఆనందం తో నీళ్ళు వచ్చాయండి ఎందుకు అంటే ఇలాంటి అనుభవాలు చిన్నప్పుడు నాకు ఉన్నాయి
ఆ తల్లి ఎంత గొప్పదో,మిమ్మల్ని చూస్తే అర్ధం అవుతుంది గురువుగారు.ఆ తల్లి ఎన్ని పూజలు,పుణ్యాలు చేస్తే మీలాంటి కొడుకును ఆ భగవంతుడు ప్రసాదించాడు స్వామి.మీలాంటి సన్మార్గంలో నడిపించే గురువును ప్రసాధించినందుకు ఆ తల్లికి శతకోటి నమస్కారాలు🙏🙏🙏
🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️
🙏🏻🕉️Jai Jai sitha Rama 🙏🏻🕉️
🙏🏻🕉️Jai Jai Sri Rama 🕉️🙏🏻
🙏🏻🕉️Jai Jai Sri Ramadutha Hanuman🕉️🙏🏻
🙏🏻🕉️Jai Jai Sri jaganatha🕉️🙏🏻
🙏🏻🕉️Arunachala siva🕉️🙏🏻
🙏🏻🕉️Arunachala siva🕉️🙏🏻
🙏🏻🕉️Arunachala siva🕉️🙏🏻
🙏🏻🕉️Aruna siva🕉️🙏🏻
🙏🏻🕉️Jai Jai Sri Sadguru Aadi sankaracharaya 🕉️🙏🏻
🙏🏻🕉️Jai Jai Sri guru Sri Ramana Maharishi 🕉️🙏🏻
స్వామి అనుభవాలు చెప్పడానికి ఈ జన్మ సరిపోదు నమో వేంకేశాయ 🙏🙏🙏
🙏🙏🙏మీ కుటుంబము అంతా ఋషి కుటుంబం,మీ బోధల వలన మేము ధన్యులు ము avuthunnamu
నిజంగా మీరు చాలా అదృష్టవంతులు అంత గొప్ప తల్లి కి పుట్టడం అలాగే అమ్మగారు ఇంకా అదృష్టవంతులు నా తండ్రి నారాయన్నీ చూడడం ఎంత అదృష్టవంతులు మీరు మేము అదృష్టవంతులమే ఎందుకంటే నా నారాయణ తండ్రి మీ రూపంలో మాకు ఎన్నో విషయాలు చెప్తున్నారు మీకు మా లక్ష్మినారాయణ తల్లి తండ్రులకి శతకోటి నమస్కారాలు
Yes sir.. even I have experienced the god in garbhalaya recently.. he came and talked to me indirectly.. most unforgettable moment for me.. blessed to have that experience.. 🙏🏻 om namo narayanaya..!!
మా ఇంట్లో కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దేవీ శరన్నవరాత్రులు చాలా నిష్ట గా చాలా సంతోషంగా ఇష్టంగా చేస్తుంటాము , మేము కూడా ఆ భగవంతుని కాళ్ళు పట్టుకుని ఉన్నాము ఇంకా జన్మలో విడువం కూడా గురువు గారూ ! మీ అమ్మ గారు చాలా ధన్యాత్ములు
1) భగవంతుని పాదాలు వదలకండి. ఎందుకంటే తల్లిదండ్రులు స్వర్గస్థులు అయ్యాక మనల్ని కంటికి రెప్పలా కాపాడే వాళ్ళు లక్ష్మీ- నారాయణులే/శివ-పార్వతులే.
2) నవరాత్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ మానకండి .
మీ అమ్మగారు ఎంత గొప్పవారో...
సాక్షాత్ ఆ శ్రీనివాసునితో కలిసి, నడిచి, తిరిగి, మాట్లాడి, కులశేఖర పడి వద్ద దర్శనంతో తాదాత్మ్యం చెందిన ఈ సంఘటన బహుశా యే భాగవతునికి జరిగి ఉండకపోవచ్చు.
ఆ కరుణా సముద్రుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాలకి నమస్కరిస్తూ 🙏🙏🙏
ఓం నమో నారాయణాయ 😢😢
నమస్కారం గురువుగారు,మా కుటుంబం విపరీతమైన అప్పుల ఊబీలో కూరుకుపోయి ఉన్నాము.మా కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చి ఈ అప్పుల ఊబీలో నుండి బయటకు తీసుకురావాలి.నేను ఏమి జరిగిన కూడా భగవంతుడు కాళ్ళు వదలిపెట్ట కూడదు అనుకుంటున్నాను.
Now we know the reason why nanduringaru is so blessed to guide everyone and us towards god. Because of his mothers Bhakti towards Govinda 🙏🙏🙏❤️
గురువుగారు కి పదాభివందనం 🙏మీరు ఒక్కో సంఘటన చెప్తుంటే ఒంట్లో ఏదో తెలియని పులకింత వచ్చి కళ్ళు వెంట నీళ్ళి వచ్చేసాయి ఇంకా ఈ జన్మలో దేవుడి పాదాలని వదలను🙏🙏
సార్ నేను పిబ్రవరి లో దైవ దర్శనానికి వేళ్లాము లోపలికి వెళ్లే టపటికి రద్దీ గావు0ది అలా దేవుని దగ్గర కు వచ్చేసరికి నాముందర చాలాకాలిగావు0ది దేవుని లీల నా మనస్సు లో అనుకున్న
Avunu memu kuda June lo vellamu.same situation. Naaku chala manchi darshanam jarigindi
వినగానే కల్లవెంబడి నీళ్లు వచ్చాయి గోవింద గోవింద 🙏🙏🙏
ఆనందంతో కళ్ళల్లోనీళ్లు తిరుగుతున్నాయి . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namo Venkatesaya ❤ Om Namo Venkatesaya ❤
, మేము చాలా అదృష్టవంతులం గురువు గారు మి లంటి వారి ద్వారా ఈలాంటి గొప్ప విషయాలు తెలుసుకోవడం ....🙏🙏
ఎంత పుణ్యదంపతులకు జన్మము మీరు అద్రవంతులు. పదాలు దొరకటం లేదు ఆచార్య హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇♀️🙇♀️🙇♀️
I video chustunte makoda annada baspalu ralutunai avida bakthiki pongipoyanu makoda swami darsanem iyynttu anipinchinchindhi🙏🙏
స్వామి చలించిపోతారు అండి. నేను చాలా బాధలో ఉన్నప్పుడు స్వామి ఏవేరెవరినో పరిచయం చేసి రోజుకు మూడు సార్లు దర్శన భాగ్యం కల్పించారు. ఒకసారి ఏకంగా 15 మినిట్స్ స్వామి ముందు నిలబెట్టుకున్నారు. అది ఎలానో చెప్పలేను. ఆయన అపార కారుణామూర్తి.... గోవిందా గోవిందా 🙏🙏🙏
Govinda Govinda
Govind Govind Govind
Pls sir naku okari msglu chyandi pls🙏🙏🙏🙏🙏chala badhalo ఉన్నాను 8 years nudi
Nanduri sir, mee valle nenu ammavari gurinchi telusukunnanu... 4 navaratrulu chesukunnanu... Feeling internal peace.. Common ppl ki ardam ayyela mee seva anirvachaneeyam adbhutham... We are so so so grateful to u n ur family.. What else we can do for u.... Stay blessed sir
Very happy to listening your mother's experience
ఆర్ద్రతగా ఉంది ఆ తల్లికి లభ్యమయిన ధరిశన భాగ్యానికి..మాకు తెలియచేసినందుకు మీకు సర్వ దా కృతజ్ఞతలు.
ఓం శ్రీమాన్ నారాయణ 🙏it's hundred times True. I am a grand of daughter of Shri Venkateshwara swamy thathaya garu and my Amma garu is Sri Alivelu mangama talli. Even my mother taught us Sri narayana mantram from my childhood. I always share happiness and sorrow with my thathaya garu only. His my soul, mind and everything. Jai Shri man narayana 🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ,
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు,
🙏🙏🙏🙏🙏,
శ్రీ మాత్రే నమః.
గురువు గారూ నాకు ఆనందం తో కడుపు నిండి పోయింది. మీరు చెప్పినట్లు గానే భగవంతుడిని, భక్తి తో పూజ చేసుకుని ఆ గోవిందుని పాదాలు, శివయ్య పాదాలు, అమ్మవారి పాదాలు అస్సలు వదలము గురువు గారూ! మా అందరి కోసం మీరు పడే తపన, ఆరాటం మా అందరికీ అర్థం అవుతుంది గురువు గారూ!
మీకు, మీ తల్లి తండ్రులు కి మా పాధాబి వందనములు.
మేము మీ కుటుంబం లో సభ్యులము అయినందుకు మా జన్మ పావనం అయింది తండ్రి
మీరు అదృష్టవంతులు మీ తల్లిగారు మహా అదృష్టం పంతులు మీ సంవత్సరానికి నాలుగు సార్లు దసరా అన్నారు అది ఎలా చేయాలి
🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏 గురు గారి పాదాలకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏
Om namo venkatesaya
తెలియని బాధ అన్ని వదెలాధం అన్ని కానీ మీరు చెప్పిన వీడియో చూసి ఏడుపు ఆగడం లేదు
స్వామి నాకు నిన్న కలలో భూవరాహ స్వామి దర్శనం అయింది చాలా సంతోషంగా ఉంది స్వామి నేను మా అమ్మగారు స్వామి దర్శనం యొక్క లైన్లో ఉన్నామట స్వామి ని చాలా చక్కగా దర్శించుకున్నాము అన్నట్టుగా కల వచ్చింది స్వామి🙏🙏😍😍💞💕😘
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇
శ్రీ మాత్రే నమః 🙇🙇
ఓం నమో వేంకటేశాయ🙇🙇
గురువు గారు నేను ఎవ్వరి నీ ఏమీ అనక పోయిన
నాపై నిందలు వేస్తున్నారు.నన్ను బాధ పెట్టే మాటలు అంటున్నారు.దగ్గరి బంధువులు.
నేను ఏమి అనను.బాధ పడతాను . నాలొనేను
ఏడు స్తాను.ఆ దుర్గమ్మ కు చెప్పు కుంటాను.అమ్మ నువ్వు చూస్తున్నావ్.గా అని
వారాహీ నవరాత్రులు బాగా చేసుకోవాలి.అనుకుంటున్నాను.నాకు శక్తి నీ ఇవ్వు అమ్మ నా బంగారు తల్లి.🙇🙇
ఆమె అంతటి మహా భక్తురాలు కనుకే మీ వంటి మహానుభావుని బిడ్డగా పొంది మాకు గొప్ప మార్గదర్శిగా అందించారు.
మీ అమ్మగారి లాగే మా అమ్మ గారు దేవుని పాదాలు పట్టుకుని ఆయన లీలలు ప్రత్యక్షంగా అనుభూతి పొంది 10 సంవత్సరాలు తిరుమలలో కాపురం చేసి తన కర్మ పలితమో ఏమో ప్రస్తుతం పక్షవాతంతో 5సంవత్సరాలు మంచాన పడి నాన్నగారితో సేవలు చేయించుకుంటూ కాలం వెళ్ళ దీస్తోంది. అయినా కూడా మేము స్వామి పాధాలనే నమ్ముకునే ముందుకు వెళుతున్నాం.ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏🙏🙏 గోవిందా గోవింద గోవిందా గోవిందా
Namaste Sir. Even Brahmasri Chaganti Gaaru also told in a pravachanam that Sri Mahavishnu will be roaming around Tirumala hills to help his devotees and now your video is the proof for the same🙏Om Namo Venkateshshaya🙏 Memo kuda ee video chusaka Swami Anubhuthini poduthuamu🙏
గురువు గారు మిరు చెప్పినట్టే నేను కూడా దశరల్లో అమ్మ వారిని కనక ధార స్తోత్రం తో రెండు పూటలా అర్చిస్తా .అప్పటి నుంచి మా జీవితం లో ఉండే యెన్నో కష్టాలు దూరం అయ్యాయి .అమ్మ దయతో నా సమస్య లు అన్ని దూరం అయ్యాయి . ధన్య వాదాలు గురువు గారు
Guruvugaru, Iam leaving for Thirumala in sometime now.Waiting for bus. Blessed to see this video 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 namo venkatesha vibho Srinivasa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wow...!!!!! 🙏🪔📿 Lord Venkateshwara is highly attached to His Devotees eternally...!!!
గురువు గారు,నేను లాస్ట్ week tirumala lo seva ki వెళ్ళాను,లాస్ట్ Friday aa గోవిందుడు ఎదురుగా జయ ,విజయ ల దగ్గర లైన్ లో నిలబడి సేవ చేశాను,ఎంత సేపు చూసినా తనివి తీరలేదు,మీరు లక్ష్మి చటర్వింశతి నామాలు చడావమన్నరు ,అసలు అవి గుర్తు రావడం లేదు గురువు గారు,ఎంత సేపు గోవిందా అనే నామం తప్ప,లాస్ట్ సేవ రోజు దర్శనమ్ ఇచ్చారు,దేవుడు నీ చూసి వచ్చేస్తుంటే చాలా బాధ వేసింది,మళ్ళీ ఆ గోవిందుడు కి అంత దగ్గరగా సేవ చేసే అదృష్టం వస్తుందో లేదో అని😌😭🙏
నమస్కారం గురువు గారు. నాకు పెళ్ళి జరిగి 3 సంవత్సారాలు అయినది. ఇంతవరకు పిల్లలు లేరు.నా వయసు 32 సంవత్సరాలు. మీరు చెప్పిన విధంగా పిల్లల కోసం రామాయణం మరియు గురుచరిత్ర చేస్తున్నాను. ఇప్పటికీ 3 సార్లు రామాయణం మొదలు చేశాను. కానీ ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఒకసారి 21 రోజులు చేశాను. కానీ మధ్యలో రెండు రోజులు ఉదయం సమయంలో కుదరక సాయంత్రం చేశాను. మళ్ళీ మొదలు పెట్టాను రామాయణం మరియు గురుచరిత్ర. కానీ మధ్యలో బంధువులు చనిపోయారు అని వార్త చెప్పారు. మనసు చాలా కష్టం గా ఉంది. ఎంతో ఇష్టం గా చేసిన ఆ దేవుడు నన్ను కరునించడం లేదు అని చాలా బాధగా ఉంది గురువు గారు. నాకు ఏది అయిన పరిష్కారం తెలుపగలరు
అమ్మా, మా జీవితాల్లోనూ ఇలాగే జరిగింది. అప్పుడు విశ్వాసం కోల్పోకుండా చేస్తే 9 వ సారికి కరుణించాడు. కర్మ కరగాలిగా
మీ ప్రవచనాలకు వల్ల చాలా మంది తెలియని విషయాలు చాలా తెలుసుకుంటున్నారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని కోరుకుంటూ మీకు శతకోటి వందనాలు
Miru tirumala gurinchi cheptune undaali memu vintune undali don't stop it sir❤
మా చిన్నప్పుడు మాకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మా తమ్ముని నన్ను తిరుపతికి పుట్టు వెంట్రుకలు తీయడానికి తీసుకుని వెళ్లారు అప్పుడు మా తమ్ముడు కోనేరు లో మునిగిపోయాడు మునిగిపోతే ఆ వెంకటేశ్వరస్వామి కనిపించిన మా అమ్మకి మా తమ్ముడి పాదము పైకి తేలుతున్నట్టు కనిపిస్తే వెంటనే లాగేసింది ఆ జరిగిన సంఘటనను మా అమ్మ ఇప్పటికీ మా తోటి పంచుకుంటూనే ఉంటుంది
ఓం నమో వేంకటేశాయ