Lyrics & Meaning | Sai Pancharatna Kriti 3 | Charana Sevanam | సాయి పంచరత్న కృతి 3 | చరణ సేవనం

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • #aradhana #sathyasaiaradhana #SriSathyaSai #RadioSaiTelugu #RadioSai #SriSathyaSaiTelugu
    సాయి పంచరత్న కృతులు
    చరణసేవనం పరమపావనం
    రాగం : ఆరభి
    తాళం : ఆది
    చరణ సేవనం పరమపావనం మధురం మధురం సాయిరూప నామం
    సాయి పాదసేవ పరమ పవిత్రము, సాయి రూపము, నామము మధురాతి మధురములు.
    అరిషడ్వర్గ హరణం హరిషడ్వర్గ వరదం అపారజన పరివర్తన దక్షం
    అంతశ్శత్రువులు (కామ, క్రోధ, లోభ, మోహ, మద,మాత్సర్యములు) అను శత్రువర్గాన్ని నశింపజేసి, హరిషడ్వర్గాలను (సత్య, ధర్మ,శాంతి, ప్రేమ, అహింస, త్యాగములు) వరంగా అనుగ్రహించి, అంతులేని జనసమూహములను సన్మార్గములోకి మార్చడానికి సమర్థమైన నీ యొక్క చరణ సేవనం పరమపావనం.
    కారుణ్య లావణ్య కమనీయ గాత్రం
    దయార్ద్ర హృదయుడవు. సుకుమారమైన, నయనాభిరామమైన రూపశోభితుడవు.
    అఖండ విభూతి వైభవ సుందరం
    అఖండమైన దివ్య వైభవముతో తేజరిల్లు మనోహరుడవు.
    సత్యం శివం సుందరం మానవతామూల్య సంభరితం
    సత్యం, శివం, సుందరం అనే మానవత్వపు మూలములతో నిండినవాడు.
    వినయ భాసుర మృదుసుభాషణ సహనశీల త్యాగమయరూప
    వినయంతో ప్రకాశిస్తూ, మృదువైన చక్కని మాటలు, క్షమ, త్యాగభావముతో కూడినవాడు.
    పంచభూతాధార సర్వ జీవనాధార సర్వవ్యాపక సర్వశక్తిమయ సర్వజ్ఞ
    పంచ భూతములకు, ఎల్ల జీవులకు ఆధారమైన సర్వవ్యాపకుడవు, సర్వశక్తిమయుడవు, సర్వజ్ఞుడవు.
    వాత్సల్యాది గుణోజ్జ్వల సాయి సదయ
    ఆనందదాయక మృదుల హృదయ
    భక్తసఖా చిత్తాకాశ జ్ఞాన భాస్కరా
    మాతృప్రేమాది గుణములతో ప్రకాశించే సాయీ! దయ, ఆనందములను అనుగ్రహించు మృదుహృదయా! భక్తులకు ప్రియ సఖుడవు. చిత్తాకాశమున జ్ఞానమనే వెలుగును ప్రసరింపజేసే ఆదిత్యుడవు.
    మాతపితా గురుదైవము మరి సఖుడవు నీవైనావు
    పురాజన్మ పరంపరాగత మోక్షదాయక పుణ్యఫలం
    భక్తాళికి పరమనిధానం అమూల్య మూలధనం
    తల్లి, తండ్రి, గురువు, దైవము, సన్మిత్రుడవు నీవే. పూర్వ జన్మలలోని పుణ్యఫలమైన మోక్షదాయకుడవు నీవే. భక్తులకు పరమనిధి, అమూల్యమైన మూలధనము నీవే.
    అనిమిషులకీశు జనియింపగ అంతేవాసుల దరిశన వేళ పరిపరి నటనల జూపుచు
    కుశలములడుగుచు లేఖల చేకొనుచు అభయమొసగుచు నా హక్కు మీరనుచు మీవాడ నేననుచు
    సత్కీర్తి నొందగ సంతసింతునటంచు సర్వము తానేయై
    బ్రతుకు బాటను పూదోటగ చేసిన హృదయ బృందావన వనమాలి
    దేవతలకు కూడా అసూయ కలిగేలా విద్యార్థులకు, భక్తులకు దరిశన
    మిచ్చేటప్పుడు వివిధ రీతుల ఆనందమునందిస్తూ, క్షేమములడుగుతూ, లేఖలు తీసుకొనుచూ, అభయమిస్తూ, నాపై నీకు హక్కుకలదనుచు, నేను మీవాడననుచు, మీరు సత్కీర్తి పొందితే సంతోషిస్తాననుచు, సర్వము తానుగా, బ్రతుకుబాటను పూదోటగా చేసిన హృదయ బృందావన సంరక్షకుడవు.
    మా తనువు నీది మా తలపు నీది మా హృది వెలుగు రూపు నీది
    ప్రేమ సౌగంధికా భరితమౌ మా జీవన కల్హారమే నీదు చరణయుగళికి నివాళి
    మా తనువు, తలపు, మదిలో వెలిగే రూపు అంతా నీదే. ప్రేమ పరిమళము వెదజల్లు మా జీవన సరోజము నీ పదపద్మములకు సమర్పణము.
    For feedback and any queries, please write to us at listener@sssmediacentre.org or ping to our WhatsApp number +91 9393258258
    Join our Telegram Channel or WhatsApp groups for daily messages/photos/videos of Bhagawan and updates from Prasanthi Nilayam -
    Telegram - t.me/SriSathya... install the Telegram App and click this link to join).
    WhatsApp Group - chat.whatsapp....
    Instagram - @SriSathyaSaiTelugu @SriSathyaSaiOfficial
    Our RUclips Channels -
    / @srisathyasaiofficial (Sri Sathya Sai Official)
    / @srisathyasaispeaksoff... (Discourse Channel)
    / @srisathyasaibhajans (Bhajans Channel)
    / @prasanthimandirlivera... (Daily Mandir Live)
    / @srisathyasaikidsworld (Kids Channel)
    / @srisathyasaitelugu
    / @srisathyasaihindi
    / @srisathyasaitamil
    / @srisathyasaimalayalam
    / @srisathyasaikannada
    ==================================================================
    Our Digital Footprint linktr.ee/sris...
    The Sri Sathya Sai Media Centre is the media arm of Sri Sathya Sai Central Trust which spearheads the Sri Sathya Sai mission and is headquartered in Prasanthi Nilayam, Puttaparthi, India.
    This channel offers you content based on the life, message and mission of Bhagawan Sri Sathya Sai Baba in the form of spiritual discussions, Baba's Divine discourses, bhajans, devotional songs, music videos, insightful documentaries and so on.

Комментарии • 10

  • @NamaPrasad-wp5ei
    @NamaPrasad-wp5ei 10 месяцев назад +3

    🙏👏🚩♿🔱🕉️ ఓం శ్రీ సాయిరాం 🕉️🔱♿🚩👏🙏

  • @lavanyaaitharaju2102
    @lavanyaaitharaju2102 10 месяцев назад +2

    Sairam🙏🙏🙏

  • @mahadevbt51
    @mahadevbt51 10 месяцев назад +2

    Pranams at the divine lotus feet of our Swamy jaisairam

  • @p.sambamurthy148
    @p.sambamurthy148 10 месяцев назад +2

    Sri Sathya Sai baba ki jai

  • @anilsathulury
    @anilsathulury 10 месяцев назад +2

    OM SRI SAI RAM 🙏

  • @sravanthireddy3516
    @sravanthireddy3516 10 месяцев назад +2

    Om Sri Sai Ram

  • @anilsathulury
    @anilsathulury 10 месяцев назад +2

    Jai Sai Ram 🙏

  • @NagaLakshmi-hm5by
    @NagaLakshmi-hm5by 10 месяцев назад +1

    ❤sairam

  • @mahendrabhashyam
    @mahendrabhashyam 10 месяцев назад

    Sathyam Shivam Sundaram... Sristhti, Sthithi, Laya Karthala Moola Roopam.. Sathya Sai Avatharam... 🙏

  • @bokkamanikanta2130
    @bokkamanikanta2130 10 месяцев назад

    ఓం శ్రీ సాయిరామ్ 🌸🌸🙏🙏