ఈ జీవితం విలువైనది నరులార రండని సెలవైనది //Jesussongs

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024
  • ఈ జీవితం విలువైనది
    నరులారా రండని సెలవైనది ||2||
    సిద్ధపడినావా చివరి యాత్రకు
    యుగయుగాలు దేవునితో ఉండుటకు
    నీవుండుటకు ||ఈ జీవితం||
    సంపాదన కోసమే పుట్టలేదు నీవు
    పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు ||2||
    పోతున్నవారిని నువు చుచుటలేదా ||2||
    బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా ||2|| ||ఈ జీవితం||
    మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు
    కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు ||2||
    చిన్న పెద్ద తేడా లేదు మరణానికి ||2||
    కులమతాలు అడ్డం కాదు స్మశానానికి ||2|| ||ఈ జీవితం||
    పాపులకు చోటు లేదు పరలోకమునందు
    అందుకే మార్పుచెందు మరణానికి ముందు ||2||
    యేసు రక్తమే నీ పాపానికి మందు ||2||
    కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు ||2|| ||ఈ జీవితం||

Комментарии • 6