ప్రజ్ఞానం బ్రహ్మ | Episode -138 సూఫీవేదాంతదర్శము_అంతర్జాల సదస్సు | 7th Sep 2024 |

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2024
  • SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM
    షష్ఠ పీఠాథిపతులు బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంతదర్శమే “#ప్రజ్ఞానంబ్రహ్మ”
    #PragnanamBrahma #SufiVedantaDarsamu
    Author: Kavisekhara Dr.Umar Alisha, 6th Head of the institution
    "ప్రజ్ఞానం బ్రహ్మ" ఎపిసోడ్ - 138
    వక్తలు :
    1. శ్రీ వనపర్తి వెంకట రత్నకుమార్, విశాఖపట్నం
    2. శ్రీ అల్లం శివ దుర్గ రాజేంద్ర గోపాల్, ఏలూరు
    ఓం శ్రీ సద్గురుభ్యో నమః
    సూఫీ వేదాంతదర్శము
    285 వ పద్యము
    దేశికుఁడంచు చెప్పి నుపదేశము సేయును గాని నాత్మసం
    దేశమునంచు చీకఁటిని దెల్పెడు మాటలచేత తాత్వికా
    దేశము తెల్లమై నిశల దీర్చెడు వెన్నెలవెల్గు దోఁచు నా
    వేశసమాధి వచ్చునె ప్రదేశములెన్నిటి మార్చి యార్చినన్.
    286 వ పద్యము
    ఏము మహాత్మ్యముల్ కలుగుటే పరమార్థమటంచు చెప్పమీ
    భూమిని పెక్కు వంచకులు మోసము జేయుచు వాదలభ్య వి
    ద్యామహిమన్ మలీముసులునైన మహాత్ములమంచు చెప్పుచున్
    గామితముల్ గడింతురవి కాదని చెప్పుటకై యగత్యముల్
    శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము షష్ఠ పీఠాధిపతులు డా.ఉమర్ ఆలీషా వారు #తత్త్వవేత్త . వీరు రచించిన #సూఫీవేదాంతదర్శము గొప్ప తత్త్వసంహిత. పాఠకుల హృదయంలో మరో #భగవద్గీత రూపంలో చిరస్థాయిగా నిలిచిన ఉద్గ్రంథం. పరమాత్మ స్వరూపమును అంతటా చూడడం కోసం వివిధ సాధనామార్గాలను ఈ గ్రంథం ద్వారా తెలియజేశారు. తన మోక్షము తన చేతుల్లోనే ఉంది, దాన్ని సులువుగా అందేలా చేయడమే ఈ గ్రంథం యొక్క ముఖ్యాశయము. ఈ సృష్టిలో ఏది నిత్యమో ఏది అనిత్యమో అనే వివేకాన్ని కలిగించి మనస్సుకు స్థిరత్వాన్ని కలుగజేస్తుంది ఈ గ్రంథము.
    ప్రస్తుత ఆధునిక జీవన విధానాన్ని గడుపుతున్న మనందరికీ ఈ పద్యాలు చక్కని మార్గనిర్దేశకాలు. ఆనందకరమైన తాత్త్వికజీవనాన్ని గడిపే విధంగా మనలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం సాయంత్రం 7 గం.లకు సూఫీవేదాంతదర్శము పద్యాలను సులువుగా అర్ధం చేసుకొనే విధముగా #ప్రజ్ఞానంబ్రహ్మ అనే ఈ సదస్సును సద్గురువర్యుల దివ్యాశీస్సులతో నిర్వహించుకుంటున్నాము.
    Dr.Umar Alisha, 9th head of the institution.
    Pithapuram, Andhra Pradesh, INDIA
    ---------------------------------------------------------------------------------------
    More information at the following websites,
    www.sriviswaviz...
    www.uardt.org
    ---------------------------------------------------------------------------------------
    Official Social Profiles :
    Facebook :
    / svvvap1472
    / uardt
    / drumaralisha
    Instagram :
    / svvvap1472
    / uardt2000
    / drumaralisha
    Twitter :
    / svvvap1472
    x.com/uardt2000
    / drumaralisha
    Sathguru Tatvam - RUclips Video Channel
    / sathgurutatvam
    / @uardt

Комментарии • 13