మంత్రోపనిషత్ Episode 6 - సాధన - గురువు యొక్క ప్రాధ్యాన్యత
HTML-код
- Опубликовано: 17 янв 2025
- పూజ్యశ్రీ స్వామివారు భారతదేశంలో మాత్రమే కాక యావత్ ప్రపంచంలోను మంత్ర-తంత్ర-యంత్ర శాస్త్రములలో అగ్రగణ్యులు. అతి ప్రాచీనమైన, రహస్యమైన ఈ శాస్త్రములలోని విశేషాలను అందరికీ సరళ రూపంలో అందించాలనే ప్రణాళికను శ్రీ స్వామివారు ఆశీర్వదించారు. ప్రజలకు మంత్రసాధనలపట్ల కలిగే సందేహాలను మాతాజీ రమ్యానందభారతీ స్వామిని వ్యక్తపరచగా పూజ్యశ్రీ స్వామివారు ఉపదేశ రూపంలో "మంత్రోపనిషత్" అనే పేరుతో మంత్రశాస్త్ర విశేషాలను అనుగ్రహించారు.
మంత్రము - గురువు: ఈ భాగంలో
ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం !
మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా !!
మన సనాతన సంప్రదాయంలో గురూపదేశంకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువులు తమ శిష్యులకు విద్యను ఉపదేశించి వారిని ఉద్దరించిడం జరిగింది. సర్వ దేవతలు గురువులోనే ఉంటారు. గురు రూపమే ధ్యానానికి మూలము. గురు చరణములను పూజించాలి. గురు వాక్యమే మంత్రము. కేవలం గురుకృప ద్వారా మాత్రమే మోక్షం లభిస్తుంది. మరి మంత్రసాధనలో గురువులకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి అన్న విషయములను శ్రీ స్వామివారు తమ దివ్య ఉపదేశముల ద్వారా నివృత్తి చేస్తారు.
మంత్రోపనిషత్ పూర్తి డివిడి సెట్ (7 భాగములు) కొరకు, మరిన్ని వివరములకు :
Website : www.siddheswari...
Facebook : / siddheswarananda-bhara...
Phone: +91 9063701687.