రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఇటీవలే ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో హుండీలను ఉదయం 10 గంటలకు దేవస్థాన మండపం నందు లెక్కించగా నోట్లు 4 లక్షలు, చిల్లర డబ్బులు 20000 మొత్తం కలిపి నాలుగు లక్షల ఇరవై వేలు వచ్చినట్లు ఆలయ ఈవో బి. శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా దేవాదుల పైపులైను కాంట్రాక్టర్లు పైపులైను నిర్మాణం కోసం బాంబులు పేల్చడం వలన దేవాలయం కొద్ది మొత్తంలో దెబ్బతిన్నదని తెలిపారు. ఇటీవల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రభుత్వం మరియు దేవాలయ శాఖ వారు వెంటనే స్పందించి దేవాలయ మరమ్మత్తులకై నిధులను కేటాయించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు డి. అనిల్ కుమార్. ఆలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్. ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమా శంకర్, వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ కిష్టయ్య సార్, పోలీస్ సిబ్బంది మరియు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Комментарии •