Ashtami Rojuna (అష్టమి రోజున పుట్టాడంట) Lyrical song - 82 | Krishna ashtami special song
HTML-код
- Опубликовано: 1 янв 2025
- సృష్టినంత ఏలు దేవాదిదేవుడు,
అష్టమందు పుడమి పుట్టినాడు
దృష్టినంత మార్చు దివ్యస్వరూపుడై
ధరణియందు జన్మ దాల్చినాడు
మృతములేని యట్టి జ్ఞానప్లవమ్ములో
మతములోని గ్లాని చెరిపివేసి
శృతులతోడ యతని శాస్త్రప్రవీణతో
గతముజేసినాడు గుణపములను
గీతలోని గుప్త గూఢార్థములనెన్నో
త్రైతాత్మ రాతలో తెరచిజూపి
నన్నుమించి వేరు ఘనుడిలను లేడంచు
మిన్నుదాటు కీర్తినొందినాడు
అట్టి మూర్తిని పొగుడనదిగాద పూజ్యము
అట్టి శక్తిని గొలువనదిగాద యోగము
అట్టి వ్యక్తిని ఎరుగనదిగాద ఆనందమానంద మయము !!!
జై శ్రీ కృష్ణ !!! జై జై శ్రీ కృష్ణ !!!
L I K E | S H A R E | S U B S C R I B E
-------------------------------------------------------
Lyricist - Siva Krishna Kogili
Singer - Surabhi Sravani
Music - N Nagesh
Editing - Varanasi Krishna Kiran
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel
సాకీ:
-----
అష్టమి రోహిణి ప్రొద్దున
అష్టమ గర్భమున బుట్టి యా దేవకికిన్,
దుష్టుల మనసును మార్చవె
శ్రేష్ఠ ప్రబోధనంబు సేయగ కృష్ణా! సేయగ కృష్ణా!
కోరస్:
--------
కృష్ణ శ్రీ కృష్ణ జై జై కృష్ణ శ్రీ కృష్ణ.... కృష్ణ శ్రీ కృష్ణ జై జై కృష్ణ శ్రీ కృష్ణ
కృష్ణ శ్రీ కృష్ణ జై జై కృష్ణ శ్రీ కృష్ణ.... కృష్ణ శ్రీ కృష్ణ జై జై కృష్ణ శ్రీ కృష్ణ
పల్లవి:
--------
అష్టమి రోజున పుట్టాడంట శ్రీ కృష్ణుడు
కష్టము సుఖమును ఒకటిగ చూసే భగవంతుడు
చీకటి రాత్రిన పుట్టాడంట శ్రీ కృష్ణుడు
జగతికి జ్ఞానపు వెలుగును పంచిన సాకారుడు
కారా గృహమున పుట్టాడంట శ్రీ కృష్ణుడు
కారా గృహమున పుట్టాడంట శ్రీ కృష్ణుడు
గుణముల చెరను విడిపించేటి గురుదేవుడు
అష్టమి రోజున పుట్టాడంట శ్రీ కృష్ణుడు
కష్టము సుఖమును ఒకటిగ చూసే భగవంతుడు
చరణం 1 :
-------------
తను ఎవరో ఏంటో యాదున్నోడు గనుకే ... యాదవుడైనాడు తను యాదవుడైనాడు
పురుషార్థాన్నిచ్చె బోధున్నోడు గనుకే ... మాదవుడైనాడు మా మాదవుడైనాడు
ఆకారమే లేని ఆ దేవుడే సాకారమై వున్న గోవిందుడు
లోకాలనేలేటి లోకేశుడే గోవుల్ని కాచిన గోపాలుడు ..
సామాన్యుడైనాడు సర్వేశుడు
వంద మంది గోపికలకు ముక్తిని ఇయ్యంగా .. బృందవనమున చేరినాడు నందకిషోరునిగా
అష్టమంది భార్యలున్న బ్రహ్మచారేగా .. సృష్టికంతా మూలమైన బ్రహ్మతానేగా
అష్టమి రోజున పుట్టాడంట శ్రీ కృష్ణుడు
కష్టము సుఖమును ఒకటిగ చూసే భగవంతుడు
చీకటి రాత్రిన పుట్టాడంట శ్రీ కృష్ణుడు
జగతికి జ్ఞానపు వెలుగును పంచిన సాకారుడు
చరణం 2 :
--------------
తను త్రిగుణాలల్లో లేడని తెలుపుట కొరకే ... పింఛము పెట్టాడు తలపై పింఛము పెట్టాడు
నవద్వారపు దేహమునాడిస్తాడు గనుకే ... వేణువు పట్టాడు కరమున వేణువు పట్టాడు
తలలోని నాడుల్ని తెలిపేందుకే తిలకాన్ని దిద్దాడు నామాలుగా
శ్వాసల్లో భేదాన్ని చూపేందుకే పాదాన్ని మోపాడు ఒక వాలుగ ...
తనువంత జ్ఞానంగ నిలిచాడుగా
మూడు అత్మల బోధచేసి గీతను గీశాడు .. మూడు యోగములంటూ ముక్తికి మార్గము వేసాడు
ధర్మగ్లానిని తీసివేసే బోధని తెచ్చాడు .. కర్మలన్ని కాల్చివేసే జ్ఞానమునిచ్చాడు
అష్టమి రోజున పుట్టాడంట శ్రీ కృష్ణుడు
కష్టము సుఖమును ఒకటిగ చూసే భగవంతుడు
చీకటి రాత్రిన పుట్టాడంట శ్రీ కృష్ణుడు
జగతికి జ్ఞానపు వెలుగును పంచిన సాకారుడు
కారా గృహమున పుట్టాడంట శ్రీ కృష్ణుడు
కారా గృహమున పుట్టాడంట శ్రీ కృష్ణుడు
గుణముల చెరను విడిపించేటి గురుదేవుడు
అష్టమి రోజున పుట్టాడంట శ్రీ కృష్ణుడు
కష్టము సుఖమును ఒకటిగ చూసే భగవంతుడు ...